cpi

16:34 - November 16, 2018

హైదరాబాద్ : కొత్తగూడెం నియోజకవర్గం టికెట్ మహాకూటమికి తలనొప్పిగా మారింది. ఇక్కడి నియోజకవర్గం టికెట్ కాంగ్రెస్ కు వెళ్లిపోవడాన్ని సీపీఐ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా సీపీఐలో కోల్డ్ వార్ నెలకొందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా సీపీఐ నిర్వహించిన సమావేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సమావేశంలో కూనమనేని అనుచరులు వచ్చి కాంగ్రెస్‌కు టికెట్ ఎలా టికెట్ కేటాయించారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కూనమనేనికి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు అక్కడున్న కుర్చీలు పగులగొట్టారు. 
కొత్తగూడెం నియోజకవర్గం నుండి సీపీఐ నేత కూనమనేని శ్రీనివాసరావు పోటీ చేయాలని భావించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కూనమనేని గెలుపొందారు. ప్రస్తుతం ఆయన బరిలో నిలవాలని ఆశించగా..ఆయన కోరిక నెరవేరలేదు. ఖమ్మం జిల్లాలో సీపీఐ బలంగా ఉందని..గతంలో తమ పార్టీ పొత్తుతో కాంగ్రెస్ నాలుగు సీట్లు గెలిచిన విషయం మరిచిపోవద్దని ఇటీవలే  కూనమనేని వ్యాఖ్యానించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన అనుచరులు వత్తడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఎర్రదండులో నెలకొన్న అంతర్గత అసంతృప్తులు ఎక్కడకు దారి తీస్తాయో చూడాలి. 

19:48 - November 14, 2018

హైదరాబాద్: టీఆర్ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కలిసి ఏర్పడిన మహాకూటమిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు. మహాకూటమిని బేస్‌లెస్ ఆలోచనగా కొట్టిపారేశారు. మహాకూటమిలో సీపీఎం చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై తమ్మినేని వీరభద్రం మాట్లాడుతు..కేసీఆర్ స్వలాభం కోసమే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని..ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న తరుణంలో మళ్లీ కాంగ్రెస్‌కు వంత పలకటం మూర్ఖత్వం అని వ్యాఖ్యానించారు. దేశంలో కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలను తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ అని.. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌తో కలవటానికి తాము సిద్ధంగా లేమన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్)ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయం, చట్టసభల్లో బలహీనులకు అవకాశం కల్పించటమే తమ లక్ష్యమన్నారు. బీఎల్ఎఫ్‌తోనే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. జనసేన, ఆమ్‌ ఆద్మీ పార్టీ సహా.. కలిసి వచ్చే వారితో బీఎల్ఎఫ్‌ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తమది మొదటిది లేదా మూడో ఫ్రంట్ అనికూడా  అనుకోవచ్చునని తమ్మినేని తెలిపారు.

16:58 - November 14, 2018

హైదరాబాద్ : మహాకూటమిలో సీపీఐ పోటీ చేసే స్థానాలు ఖరారయ్యాయి. ఆ పార్టీ నవంబర్ 14వ తేదీ (బుధవారం) అభ్యర్థులను ప్రకటించింది. 119 నియోజకవర్గాలున్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం 3 స్థానాల్లో సీపీఐ పోటీ చేయనుంది. ఇప్పటికే టీకాంగ్రెస్ రెండు జాబితాలు (75 స్థానాలు) ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి నుండి ఐదు సీట్లలో పోటీ చేస్తామని..కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలని సీపీఐ కోరుతూ వస్తోంది. చివరకు మూడు సీట్లలతో సర్దుబాటు చేసుకొంది. 

 • బెల్లంపల్లిలో అసమ్మతి ఎదురైనా గుండా మల్లేశ్ టికెట్ దక్కించుకున్నారు. 
 • హుస్నాబాద్ బరిలో చాడ వెంకట్ రెడ్డి.
 • వైరా నియోజకవర్గం నుండి బానోత్ విజయబాయి.

18-19వ తేదీల్లో నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ నేత పల్లా వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లలో దేవరకొండ మిగిలిందని ఇది కూడా కోరుకుంటున్నామని..ఇస్తారనే భావన ఉందన్నారు. ఆయా నియోజవకర్గాల్లో రెబల్‌ అభ్యర్థులను బుజ్జగించేందుకు అక్కడున్న పార్టీ నాయకత్వం చూసుకుంటుందన్నారు. 

16:06 - November 13, 2018

హైదరాబాద్: టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో భాగస్వామ్యంగా వున్న సీపీఐ సీట్ల కేటాయింపు విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు అసెంబ్లీ, రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. కాంగ్రెస్, సీపీఐ  నాయకత్వాల మధ్య కుదిరిన ఒప్పందాల నేపథ్యంలో మూడు సీట్లలోనే  పోటీతో సీపీఐ రాష్ట్ర నాయకత్వం సంతృప్తి పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయమై సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గం మంగళవారం నాడు అనగా నవంబర్ 13న  హైద్రాబాద్‌లో సమావేశమైంది.  కాంగ్రెస్ పార్టీ  ప్రతిపాదనపై చర్చించిన మీద దేశంలో నెలకొన్న రాజకీయపరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో మహాకూటమి విచ్ఛిన్నం కాకుండా ఉండాలనే  ఉద్దేశ్యంతో  సీపీఐ నేతలు కూడ కొంత దిగి రావాల్సి వచ్చింది.

Image result for సీపీఐ చాడకాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న మూడు స్థానాల్లో పోటీకి సీపీఐ రెడీ చెప్పింది. బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ స్థానాల్లో సీపీఐ పోటీ చేయనుంది. 10 సీట్లు అడిగిన  కామ్రెడ్స్ కనీసం 8 సీట్లన్నా ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. కానీ సర్ధుబాటు కాకపోవటంతో కొత్తగూడెం సీట్ పై మాత్రం పట్టు వీడనిసీపీఐ పార్టీ తమకు పట్టున్న కొత్తగూడెం సీటుకు కాంగ్రెస్ అభ్యర్థినే ప్రకటించటంతో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేసింది. కొత్తగూడెం సీటు ఇవ్వకుంటే స్వతంత్ర్యంగా బరిలో దిగుతామని అల్టిమేటం కూడా జారీ చేసింది. కానీ ఎట్టకేలకు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా  సీపీఐ దిగి వచ్చిన ఇచ్చిన సీట్లతోను కేటాయించిన స్థానాలతోను సరిపెట్టుకుని కూటమిలో కొనసాగేందుకు సానుకూలను వ్యక్తంచేసింది. 

Image result for సీపీఐ చాడహుస్నాబాద్ నుండి చాడ బరిలోకి..
హుస్నాబాద్‌ నుండి  సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పోటీ చేస్తారు. బెల్లంపల్లిలో  సీపీఐ నేతల మధ్య పోటీ నెలకొంది. గుండా మల్లేష్‌ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంతో ఆయనకు వ్యతిరేకంగా సీపీఐ జిల్లా కార్యవర్గం తీర్మానం చేసింది.  సీపీఐ జిల్లా నేతలు మల్లేష్ పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు.  ఈ పరిస్థితుల నేపథ్యంలో  బెల్లంపల్లి నుండి  ఎవరిని బరిలోకి దింపుతారనేది ఆసక్తిగా మారింది. వైరా నుండి విజయను బరిలోకి దింపే అవకాశం లేకపోలేదు.
కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య స్నేహాపూర్వక పోటీ, రెబెల్స్ బెడద ఉండకూడదని  సీపీఐ కోరుకొంటుంది. నల్గొండ జిల్లాలోని  దేవరకొండ లేదా మునుగోడు స్థానాల్లో ఏదో ఒకటి కాంగ్రెస్ పార్టీ తమకు కేటాయిస్తోందోననే ఆశతో సీపీఐ రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఈ మూడు స్థానాల్లో  పోటీ చేసే అభ్యర్థుల జాబితాను  నవంబర్ 14వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నట్టు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు.
 

13:21 - November 13, 2018

హైదరాబాద్‌ : నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో రాజకీయ పార్టీల్లో సందడి నెలకొంది. నిన్నటి నుంచి  నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. కూటమికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ నిన్న అర్ధరాత్రి 65 మందితో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత టీడీపీ కూడా 9 మందితో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. 

కూటమి పక్షాలకు కాంగ్రెస్ మొండి చేయి చూపింది. సీపీఐ కోరిన స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. రామగుండం, ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. కాంగ్రెస్ జాబితాపై సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీట్ల సంఖ్యపై పార్టీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని హామీ రావడంతో పొత్తుకు సీపీఐ కేంద్ర కమిటీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో మూడు స్థానాల్లో పోటీ చేసేందుకు సీపీఐ అంగీకారం తెలిపింది. దీనిపై ఈరోజు పార్టీ అధికారికంగా ప్రకటన చేయనుంది. హుస్నాబాద్ నుంచి సీపీఐ రాష్ట్ర చాడ వెంకట్‌రెడ్డి, వైరా నుంచి విజయ పోటీ ఖరారు కాగా, బెల్లంపల్లి అభ్యర్థిపై పార్టీలో సమాలోచనలు చేస్తున్నారు.

 

11:47 - November 12, 2018

హైదరాబాద్ : ప్రజాకూటమి సీట్ల సర్దుబాటు హస్తినకు చేరింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. కాంగ్రెస్ అధినేతలతో చర్చలు జరుపుతున్నారు. సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుందని తెలుస్తోంది. ఇప్పటికే 74సీట్ల విషయంలో స్పష్టత వచ్చిందని సమాచారం. 
ఢిల్లీకి సీపీఐ నేతలు...
మరోవైపు సీట్ల విషయంలో తేల్చుకొనేందుకు సీపీఐ నేతలు కూడా హస్తినకు వెళ్లారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం..కోరుకున్న సీట్లను కాంగ్రెస్ కేటాయించకపోవడంతో సీపీఐ తీవ్ర అసంతృప్తితో రగులుతోంది. వెంటనే సీట్ల సర్దుబాటు చేయాలని...లేనిపక్షంలో తమ దారి తాము చూసుకుంటామని సీపీఐ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. మూడు సీట్లే ఇచ్చి అవమానపరిచారని సీపీఐ భావిస్తోంది. కోరుకున్న సీట్లు ఇవ్వకపోతే సీపీఐ మహాకూటమి నుండి బయటకొచ్చి ఒంటరిగా పోటీ చేస్తుందా ? లేదా ? అనేది వేచి చూడాలి. 

17:14 - November 9, 2018

హైదరాబాద్: మాకే తెలియని సమాచారం మీకెలా తెలుసు.. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ ఇంకా క్లారిటీనే ఇవ్వలేదు.. 8 సీట్లను తేల్చనూలేదు అంటూ క్లయిమాక్స్‌లో షాక్ ఇచ్చారు టీజేఎస్ నేత కోదండరాం. ఢిల్లీలో కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ నుంచి ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదని వివరించారు మాస్టారు. వారి చర్చలే కొలిక్కిరాలేదని.. మా సంగతి ఇప్పుడే పట్టించుకుంటారా అన్నట్లు కాంగ్రెస్ తీరుపై చురకలు అంటించారు. కోదండరాం వ్యాఖ్యలతో మరోసారి కూటమిలో కలకలం రేగింది. ఇప్పటికీ కూటమిని నిలబెట్టేందుకు చర్చలు జరుపుతున్నాం అంటూ తూటాలు పేల్చారు. సార్.. వ్యాఖ్యలు చూస్తుంటే కూటమిలో సీట్ల సర్దుబాటుపై అవగాహనే లేదని స్పష్టం అవుతుంది. 

టీజేఎస్ లో పరిస్థితి ఇలా ఉంటే.. సీపీఐలో ఇంత కంటే దారుణంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీపీఐ ఎంత డిమాండ్ చేసినా.. 3 సీట్లకు మించి ఇచ్చేదిలేదని తెగేసి చెబుతోంది కాంగ్రెస్. దీనికి ససేమిరా అంటున్నారు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి. అడిగినన్ని సీట్లు, కోరిన నియోజకవర్గాలు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సీట్లు మాత్రమే తీసుకోవటానికి సిద్ధంగా లేమంటూ వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు చాడ. సమస్యను పరిష్కరించటంలో కాంగ్రెస్ ఎందుకు తాత్సారం చేస్తుందని నిలదీశారాయన. సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించటాన్ని తప్పుబడుతూనే.. టైం లేదు.. ఏదో ఒకటి తేల్చకుంటే మా దారి మేం చూసుకుంటాం అని వార్నింగ్ బెల్ మోగించారు. కోదండరాంతో కలిసి కాంగ్రెస్ తో చర్చలు జరుపుతామని స్పష్టం చేస్తూనే.. ఇవే తుది చర్చలు అన్నట్లు డెడ్ లైవ్ విధించారు కామ్రేడ్ చాడ.

12:01 - November 9, 2018

హైదరాబాద్ :  మొత్తం 119 స్థానాలకు గాను టీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో ఎట్టకేలకు సీట్ల పంపకాలు తేలాయి. 93 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న కాంగ్రెస్ పార్టీ..26 స్థానాలను కూటమి పార్టీలకు కేటాయించింది. 
కాంగ్రెస్ : 93
టీడీపీ : 14
టీ.జనసమితి: 8
సీపీఐ : 3
ఇంటిపార్టీ :1

కేటాయించింది. ఈ నేపథ్యంలో  ఇంటి పార్టీకి నకిరేకల్, లేదా మహబూబ్ నగర్ స్థానాన్ని కేటాయించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో 74 కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈనెల 10న హైదరాబాద్ లో ఈ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.

కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..

 1. గోషామహల్ - ముఖేశ్ గౌడ్
 2. ఎల్ బి నగర్ -సుధీర్ రెడ్డి
 3. నాంపల్లి -ఫిరోజ్ ఖాన్
 4. సనత్ నగర్ - మర్రి శశిధర్ రెడ్డి
 5. కంటోన్మెంట్ -సర్వే సత్యనారాయణ
 6. కోదాడ  - పద్మావతి
 7. హుజూర్ నగర్ -ఉత్తమ్ కుమార్ రెడ్డి
 8. నల్లగొండ - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
 9. తుంగతుర్తి - అద్దంకి దయాకర్ 
 10. నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య
 11.  నాగార్జున సాగర్ - జానారెడ్డి
 12. ఆలేరు - భిక్షమయ్య
 13. భువన గిరి - అనిల్ కుమార్ రెడ్డి
 14. నాగర్ కర్నూల్ - నాగం జనార్థన్ రెడ్డి
 15. కొడంగల్ - రేవంత్ రెడ్డి
 16. మెదక్ - విజయశాంతి
 17. వనపర్తి -చిన్నారెడ్డి
 18. గద్వాల్ -డీకే. అరుణ
 19. అచ్చంపేట - వంశీకృష్ణ
 20. కల్వకుర్తి - వంశీచంద్ రెడ్డి
 21. జడ్చర్ల - మల్లు రవి
 22. మానకొండూరు - అరెపల్లి మోహన్ 
 23. మేముల వాడ -ఆది శ్రీనివాస్
 24. పెద్దపల్లి - విజయరమణారావు
 25. మంథని -శ్రీధర్ బాబు
 26. సిరిసిల్ల - కె.కె. మహేందర్ రెడ్డి
 27. కరీంనగర్ - పొన్నం ప్రభాకర్ 
 28. చొప్పదండి - మేడిపల్లి సత్యం
 29. జగిత్యాల - జీవన్ రెడ్డి
 30. నర్సాపూర్ - సునీతా లక్ష్మారెడ్డి
 31. ఆందోల్  - రామదర రాజనరసింహ 
 32. జహీరాబాద్ - గీతారెడ్డి
 33. సంగారెడ్డి - జగ్గారెడ్డి
 34. వికారాబాద్ - గాదం ప్రసాద్ కుమార్
 35. కుత్బుల్లా పూర్ - కూన శ్రీశైలం గౌడ్
 36. పరిగి - రామ్మోహన్ రెడ్డి
 37. మహేశ్వరం -సబితా ఇంద్రారెడ్డి
 38. తాండూరు - రోహిత్ రెడ్డి
 39. షాద్ నగర్ - ప్రతాప్ రెడ్డి
 40. ఆసిఫా బాద్ - ఆత్రం సక్కు
 41. నిర్మల్ -మహేశ్ రెడ్డి
 42. ఖానాపూర్ - రమేశ్ రాథోడ్
 43. బోథ్ - సాయం బాబూరావు 
 44. బాల్కొండ - ఎరవత్రి అనిల్ 
 45. బోథన్ - సుదర్శన్ రెడ్డి
 46. నిజామాబాద్ అర్బన్ - మహేశ్  కుమార్ గౌడ్
 47. కామారెడ్డి -షబ్బీర్ అలీ
 48. పరకాల - కొండా సురేఖ
 49. పాలకుర్తి - జంగా రాఘవరెడ్డి
 50. డోర్నకల్ - రామ్ చంద్రనాయక్
 51. భూపాలపల్లి - గండ్ర వెంకటరమణా రెడ్డి
 52. జనగాం  - పొన్నాల లక్ష్మయ్య
 53. ములుగు - సీతక్క
 54. మధిర - భట్టి విక్రమార్క
 55. గజ్వేల్ - ఒంటేరు ప్రతాప్ రెడ్డి
 56. అలంపూర్ - సంపత్ కుమార్ 
 57. ఖైరతాబాద్ - విష్ణువర్థన్ రెడ్డి 

టీడీపీ అభ్యర్థులు వీరే..

టీడీపీ అభ్యర్థులు వీరే..
అశ్వారావు పేట -ఎం.నాగేశ్వరరావు
ఖమ్మం - నామా నాగేశ్వరావు 
సత్తుపల్లి - సండ్ర వీరయ్య
మక్తల్ - కొత్తకోట దయాకర్ రెడ్డి
వరంగల్ ఈస్ట్ - రేవూరి ప్రకాశ్ రెడ్డి
ఉప్పల్ - వీరేందర్ గౌడ్

 

07:13 - November 9, 2018

ఢిల్లీ : మహాకూటమి సీట్ల కేటాయింపు ఎట్టకేలకు తుది అంకం పూర్తయ్యింది. టీఆర్ఎస్ పార్టీని ఓడించే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంకం పూర్తయింది. మొత్తం 119 స్థానాలకు గాను 93 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుండగా... మిత్రపక్షాలైన టీడీపీకి 14, టీజేఎస్ కు 8, సీపీఐకి 3 స్థానాల చొప్పున కేటాయించారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక్క సీటును కేటాయించే అవకాశం ఉంది. సీపీఐకి వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్ సీట్లను కేటాయించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయాలని భావిస్తున్న పార్టీల మధ్య సీట్ల కేటాయింపు దాదాపు ఖరారయింది. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు కుంతియా గురువారం దిల్లీలో వెల్లడించారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానాన్ని కేటాయించే అవకాశం ఉందని తెలిపారు. మిత్రపక్షాలకు పోగా కాంగ్రెస్‌కు మిగిలే 93 స్థానాల్లో 74 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఈ జాబితాకు పార్టీ అధిష్ఠానం గురువారం ఆమోదముద్ర వేసింది. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానం కేటాయిస్తే కాంగ్రెస్‌ ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చిన స్థానాల్లో ఒక స్థానాన్ని తగ్గించుకొని 73 స్థానాలకే అభ్యర్థులను ప్రకటిస్తుంది. మొత్తంగా 93 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. అయితే తమకు కనీసం నాలుగు సీట్లైనా కేటాయించాలని సీపీఐ పట్టుబడుతోంది.

కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ నివాసంలో గురువారం సాయంత్రం భేటీ అయింది. ఈ నెల ఒకటో తేదీన 57 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన కాంగ్రెస్‌ సీఈసీ తాజాగా మరో 17 స్థానాలకు పేర్లను ఖరారు చేసింది. దీంతో మొత్తంగా 74 స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు పూర్తయ్యింది. వీరందరితో కూడిన తొలి జాబితాను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు. కాంగ్రెస్‌ సీఈసీ సమావేశంలో సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీఈసీ సభ్యులు అశోక్‌ గెహ్లోత్‌, ఏ.కె.ఆంటోని, అహ్మద్‌ పటేల్‌, గిరిజా వ్యాస్‌, జనార్దన్‌ ద్వివేది, వీరప్ప మొయిలీ, ముకుల్‌ వాస్నిక్‌, ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌, స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌, కమిటీ సభ్యులు శర్మిష్ఠ ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలై, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్‌.సి.కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం కుంతియా మాట్లాడుతూ కూటమిలోని మిత్రపక్షాలకు 25 స్థానాలు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానం ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

టీజేఎస్ కు కేటాయించిన స్థానాలు, పోటీ చేయబోయే అభ్యర్థులు వీరే...
మెదక్ - జనార్దన్ రెడ్డి
సిద్ధిపేట - భవానీరెడ్డి
దుబ్బాక - రాజ్ కుమార్
వరంగల్ ఈస్ట్ - ఇన్నయ్య
మల్కాజ్ గిరి - దిలీప్
మహబూబ్ నగర్ - రాజేందర్ రెడ్డి.

చెన్నూరు, మిర్యాలగూడల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. పార్టీ అధినేత కోదండరామ్ పోటీకి దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

19:57 - November 8, 2018

ఢిల్లీ: కాంగ్రెస్ కేంద్ర ఎన్నికలకమిటీ సమావేశం ముగిసింది. తీవ్ర వడపోతల మధ్య 74 సీట్లలో పోటీచేసే అభ్యర్ధుల పేర్లు ఖరారు చేశారు. మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలకు ఇచ్చే స్ధానాలను కేటాయించారు. యూపీఏ ఛైర్ పర్సన్  సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికలకమిటీ సమావేశం అనంతరం తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఆర్సీ కుంతియా విలేకరులతో మాట్లాడుతూ మహాకూటమిలో మిత్ర పక్షాలకు 25 సీట్లు కేటాయించామని చెప్పారు. టీడీపీ 14, టీజేఎస్ 8, సీపీఐకి 3  కేటాయించామని, ఈనెల 10న తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - cpi