cpim telangana

16:25 - January 20, 2017

హైదరాబాద్ : స్కీం వర్కర్లు అయిన అంగనవాడీ, ఆశావర్కర్లు , సెకండ్‌ ఏఎన్‌ఎంలు , సర్వశిక్షా అభియాన్‌, మధ్యాహ్నభోజన పథకంలో పనిచేస్తున్న వారు దేశవ్యాప్తంగా పోరుబాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిపారు. ఆ సంఘం నేత జె.వెంకటేష్ మాట్లాడుతూ స్కీం వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. వారికి 18 వేలు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధమైన ఈఎస్ ఐ, పీఎఫ్ ఇవ్వాలన్నారు. బడ్జెట్ లో స్కీం వర్కర్లకు 5 శాతం వాటా కేటాయించాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:34 - January 20, 2017

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యది వన్‌మ్యాన్‌ షోనే అని.. అలాగే మహాజనపాదయాత్రలోనూ తమ్మినేని వీరభద్రంది వన్‌మ్యాన్ షోనే అని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఆయన టీఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన శూన్యమన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పనితీరు గురించి మాట్లాడుతూ సీపీఎంపై తీవ్రస్థాయిలో హరీష్‌ విరుచుకుపడ్డారు. ప్రజలను రెచ్చగొడుతూ సీపీఎం రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. పేదల పార్టీ అని చెప్పుకునే సీపీఎం ఎన్నడూ పేదల కోసం పాటుపడింది లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ్మినేని సొంత నియోజకవర్గంలో ఆ పార్టీకి కనీసం డిపాజిట్స్ కూడా దక్కలేదన్నారు.

20:13 - January 18, 2017

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఎం రాష్ట్ర సమితి సమావేశాల్లో ఆందోళన వ్యక్తం అయింది. హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లోజరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు. జి.నాగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక , రాజకీయ పరిస్థితులపై చర్చించారు. 

17:50 - January 11, 2017

ఖమ్మం : భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించాలి సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేనివీరభద్రం డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో జరుగుతున్న మహాజన పాద యాత్ర ఖమ్మం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ... పార్టీ బలహీనంగా ఉన్న గ్రామాల్లో కూడా ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరధం పడుతున్నారని తెలిపారు. రీ డిజైన్లు అనేవి కాంట్రాక్టర్లకు డబ్బు చేకూర్చే విధంగా ఉంది తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. చట్టాల పట్ల, ప్రజలకు వ్యతిరేఖంగా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు మదం తో కూడుకున్నవి తెలిపారు. భక్తరామదాసు ప్రాజెక్టు ఎత్తుపోతల పథకం డిజైన్‌ను మారిస్తే 9 గ్రామాలకు, 8వేల 600 ఎకరాలు సాగులోకి వస్తాయని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. సీపీఎం మహాజన పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. తిరుమాలయపాలెం మండలం ఇస్లావత్ తండా వద్ద ఎస్ఆర్‌ఎస్‌పీ ప్రధాన కాలువ, భక్తరామదాసు ఎత్తుపోతల పథకం స్టోరేజీ కేంద్రాన్ని మహాజన పాదయాత్ర బృంద సభ్యులు సందర్శించారు.

09:28 - January 4, 2017

ఎర్రజెండా చేతబట్టి.. పల్లెపల్లెనూ పలకరిస్తూ సీపీఎం మహాజన పాదయాత్ర ప్రజల్లో చైతన్యాన్ని నింపుతోంది. 79వ రోజు వరంగల్‌ అర్బన్‌ ప్రాంతాల్లో పర్యటించిన పాదయాత్ర ఇప్పటివరకు మొత్తం 2100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను వంచించడంలో అన్ని పార్టీలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర వరంగల్‌ అర్బన్‌ ప్రాంతాల్లో పర్యటిస్తోంది. 79వ రోజు తమ్మినేని బృందం కరీమాబాద్‌, శాయంపేట, అదాలత్, ఆర్‌ఈసీ, ఖాజిపేట, రాంపూర్‌, మండికొండ, పెదపెండ్యాల వరకు కొనసాగింది.

2100 కి.మీటర్లు..
ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఎస్సీల వాస్తవ పరిస్థితిపై నిర్మాణాత్మక చర్చ జరగాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. దళితుల సబ్‌ప్లాన్‌ నిధులను ఇతర రంగాలకు మళ్లించడం దారుణమని తమ్మినేని విమర్శించారు. తెలంగాణ రెండున్నరేళ్లు గడిచినా ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని తమ్మినేని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను వంచించడంలో టీడీపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ఒకటే తాను ముక్కలుగా వ్యవహరిస్తున్నాయని తమ్మినేని దుయ్యబట్టారు. పెదపెండ్యాల వద్ద పాదయాత్ర 2100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాదయాత్ర బృందం కేక్‌ కట్‌ చేసింది. పాదయాత్రకు వివిధ పార్టీల స్థానిక నేతలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. వరంగల్‌ ఎన్‌ఐటీ వద్ద పాదయాత్ర బృందానికి బీసీ సబ్‌ప్లాన్‌ సాధన సమితి రాష్ట్ర ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ మురళీమనోహర్‌తో పాటు ఎన్‌ఐటీ కార్మికులు, రైల్వే కార్మికులు అపూర్వ స్వాగతం పలికారు.

13:50 - December 30, 2016

కరీంగనర్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌రావు విమర్శించారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. పాదయాత్ర 75వ రోజుకు చేరుకుంది. కరీంగనర్ జిల్లాలోని అలుగునూరు, ఎస్‌ఎస్‌పల్లి ఎక్స్‌రోడ్‌, మాలకొండూరు, అన్నారం, లలితాపూర్‌, దేవంపల్లి, ఎర్దపల్లిలో పాదయాత్ర కొనపాగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూడండి. 

 

13:56 - December 24, 2016

పెద్దపల్లి : ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి..గిరిజనుల పరిస్థితి కడు దయనీయంగా వుందని గిరిజన నేత నైతం రాజు పేర్కొన్నారు.వారికి కనీసం రోడ్ల సదుపాయం కూడా సరైనరీతిలో లేదన్నారు. వైద్య సేవల పరిస్థితి చెప్పనే అక్కరలేదన్నారు. మూడు నాలుగు కిలో మీటర్ల నుండి త్రాగునీరు తెచ్చుకుంటారనీ అదికూడా కలుషితమై వారు అనారోగ్యానికి గురవుతున్నాని తెలిపారు. వున్న ఇళ్ళను కూల్చి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించే కంటే పూరి గుడెల్లో కడు దయనీయమైన స్థితుల్లో బతుకులు వెళ్ళదీస్తున్న ఆదివాసీలకు..గిరిజనులకు ఇండ్లు కట్టించాలని ఈ సందర్భంగా గిరిజన నేత నైతం రాజు డిమాండ్ చేశారు.

69వరోజు సీపీఎం పాదయాత్ర
సీపీఎం మహాజన పాదయాత్ర 69వరోజు కొనసాగుతోంది..15 జిల్లా పెద్దపల్లి జిల్లాలో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది.. పలు గ్రామాల్లో పాదయాత్రచేస్తున్న సభ్యులు... స్థానికులను అడిగి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.. 1800 కిమీ పూర్తి చేసుకున్న మహాజన పాదయాత్ర కొనసాగుతోంది..

13:50 - December 23, 2016

పెద్దపల్లి : తెలంగాణవచ్చి రెండున్నరేళ్లయినా పేదల జీవితాల్లో ఎలాంటి మార్పూ రాలేదని... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.. ఎన్నికలకుముందు ఇచ్చిన ఒక్క హామీనికూడా టీఆర్‌ఎస్‌ అమలు చేయలేదని విమర్శించారు.. పెద్దపల్లి జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్రలోభాగంగా తమ్మినేని పర్యటిస్తున్నారు.. స్థానిక సమస్యల్ని పాదయాత్ర బృందం అడిగి తెలుసుకుంటోంది..

ఓపెన్‌ కాస్ట్‌ గ్రామాల ప్రజలను ఆదుకోవాలి : నగేశ్
పెద్దపల్లి జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది.. పలు గ్రామాల ప్రజలు పాదయాత్ర బృందానికి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు.. ఓపెన్‌ కాస్ట్‌ గ్రామాల ప్రజలను ఆదుకోవాలని పాదయాత్ర బృందం సభ్యులు నగేశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.. మరింత సమాచారానికి వీడియో చూడండి..

19:45 - December 20, 2016

ఆదిలాబాద్ : సీపీఎం నాయకులు చేపట్టిన మహాజన పాదయాత్ర 65వ రోజుకు చేరుకుంది. నేడు 14వ జిల్లాలోకి ప్రవేశించనున్నది. ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి ప్రవేశించనున్న ఈ పాదయాత్ర.. రెబ్బెన, గోలేటి ఎక్స్‌రోడ్, పులికుంట, తక్కెళ్లపల్లిరోడ్డు.. రేపల్లివాడ, ఐబీ చౌరస్తా, బోయపల్లి, బెల్లంపల్లిలో పర్యటించనున్నారు. కోమరంభీం జిల్లాలో చాలా సమస్యలున్నాయని... వాటిని ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చారని సీపీఎం నేత తమ్మినేని అన్నారు. ప్రభుత్వం గిరిజనుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు.    

 

18:59 - December 14, 2016

ఆదిలాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్రకు స్వాగతం పలికేందుకు వచ్చిన గిరిజనులతో తమ్మినేని పాదయాత్ర బృందం స్టెప్పులేశారు. గిరిజనుల సాంప్రదాయ నెమలి కిరీటం ధరించి.. గిరిజనులతో గుస్సాడీ నృత్యం వేశారు తమ్మినేని బృందం.తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 60వ రోజు కొనసాగుతోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రవేశించిన తమ్మినేని బృందానికి గిరిజనులు.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. తమ్మినేని బృందాన్ని వికలాంగులు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు తమ్మినేని. 

Pages

Don't Miss

Subscribe to RSS - cpim telangana