CPM Leader BV Raghavulu

07:04 - April 16, 2018

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలకు ఎర్రదండు సిద్ధం అవుతోంది. ఊరూవాడా అరుణపతాకాలు కవాతు తొక్కుతున్నాయి. హైదరాబాద్ బహిరంసభకు ప్రజలు తరలిరావాలని ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగురాష్ట్రాల్లో సీపీఎం శ్రేణులు ర్యాలీలు హోరెత్తుతున్నాయి. ఇటు హైదరాబాద్‌లో మహాసభల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సీపీఎం జాతీయ మహాసభలకు తెలుగు రాష్ట్రాల్లో పార్టీశ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. ఈనెల 22న భారీ బహిరంగసభకు తరలి రావాలని తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం హోరెత్తుతోంది. ఎర్రజెండాలు చేతబూనిన పార్టీ శ్రేణులు వాడవాలా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి.

ఈనెల 18 నుంచి 22వరకు హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ మహాసభలకు సర్వం సన్నద్ధం అవుతోంది. జాతీయ మహాసభలకు ఆర్టీసీ కల్యాణమండపంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 18న ఉదయం 10 గంటలకు సీపీఎం సీనియర్‌ నేత కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం అరుణపాతకను ఆవిష్కరించనున్నారు. మహాసభల వేదికకు కామ్రేడ్‌ మహ్మద్‌ అమీన్‌ పేరును పెట్టామన్నారు.. పార్టీ పొలిటిట్‌బ్యూరో సభ్యులు బి.విరాఘవులు.

ఐదు రోజుల పాటు జరగనున్న జాతీయ మహాసభలకు 764 మంది ప్రతినిధులు, 74 మంది పరిశీలకులు, మరో 8 మంది సీనియర్‌ నేతలు కూడా హాజరవనున్నారు. వీరితోపాటు ఐదు వామపక్షాల నుంచి జాతీయ నేతలు ప్రారంభసభలో పాల్గొంటారని బి.వి.రాఘవులు తెలిపారు. జాతీయస్థాయిలో వామపక్ష రాజకీయ వేదిక ఏర్పాటు, రైతులు, కార్మికులు, మహిళల సమస్యలపై మహాసభల్లో చర్చలు జరుగుతాయన్నారు. దాంతోపాటు 15వ ఆర్థిక సంఘం నిధులు..రాష్ట్రాలకు దక్కాల్సిన నిధుల లాంటి అంశాలపై కూడా చర్చిస్తామన్నారు. ప్రస్తుతం అన్నిపార్టీలు సామాజిక న్యాయం గురించే మాట్లాడుతున్నాయంటే అది వామపక్షాల ఘనతే అన్నారు. సీపీఎం నేతృత్వంలో జరిగిన మహాజన పాదయత్ర ఫలితంగా ప్రజల్లో సామాజిక న్యాయంపై అవగాహన వచ్చిందన్నారు.

మహాసభల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సీపీఎం శ్రేణులు కదం తొదక్కుతున్నాయి. ఊరూవాడా ప్రదర్శనలు జోరుగా సాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా మునగాలలో జరిగిన సెమినార్‌లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భవించిందన్నారు. బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధ్యం అవుతుందన్నారు. పార్టీ మహాసభలకు తరలి రావాల్సిందిగా సీపీఎం శ్రేణులకు పిలుపు నిచ్చారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో అతిపెద్ద అరుణపతాకాన్ని ప్రదర్శించారు. 22వ జాతీయ మహాసభల సందర్భంగా 22మీటర్ల ఎర్రజెండాతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అటు మేడ్చల్‌జిల్లా ఘట్‌కేసర్‌లో బైక్‌ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగే బహిరంగసభకు తరలి రావాలని ప్రజలకు సూచించారు.

రైతు ఆత్మహత్యలు, కార్మికుల సమస్యలు, దళితులు, మైనార్టీలపై దాడులు, మహిళలపై అకృత్యాలతో దేశంలో అరాచకం రాజ్యంమేలుతోందని సీపీఎం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింతగా దిగజారాయంటున్నారు. ఈపరిస్థితిని ఎదుర్కోడానికి దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ఆపార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న జాతీయ మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సిద్ధం అయ్యామని మార్క్సిస్టుపార్టీ నాయకత్వం అంటోంది. 

16:23 - February 18, 2018

కృష్ణా : దేశంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్‌లలో విజయవాడ రైల్వే స్టేషన్‌ ఒకటి. ఏడాదికి 175 కోట్ల రూపాయలకుపైగా ఆదాయం, 70 ప్యాసింజర్‌ రైళ్లు, 250 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, మొత్తం 370కుపైగా రైళ్లలో నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎన్నో పేరు ప్రఖ్యాతులు సాధించిన విజయవాడ రైల్వే జంక్షన్‌ ప్రైవేట్‌పరం కాబోతోంది. ఇందుకోసం చర్యలు ఊపందుకున్నాయి. ఇప్పటికే రైల్వేస్టేషన్‌ బేరానికి ప్రైవేట్‌ కంపెనీలు టెండర్‌కు సిద్ధమయ్యాయి. ఒకటికాదు.. రెండుకాదు... ఏకంగా 45 నుంచి 99 ఏళ్లపాటు లీజుకివ్వాలంటూ దక్షిణ మధ్య రైల్వేకు డెడ్‌లైన్‌ విధించాయి. బెజవాడ రైల్వే జంక్షన్‌ను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టడం వెనుక పెద్ద వ్యూహమే అమలు చేస్తున్నారు.

దాదాపు 22 ఎకరాలకుపైగా స్థలం
విజయవాడ రైల్వేస్టేషన్‌కు పరిసరాలు, ఫ్లాట్‌ఫామ్‌లు అన్నీ కలిపి దాదాపు 22 ఎకరాలకుపైగా స్థలం ఉంది. దీని అంచనా విలువ దాదాపు 200 కోట్ల రూపాయలు. ఇందులో ప్రపంచస్థాయిలో సదుపాయాలు కల్పిస్తామంటూ రైల్వేశాఖ చెబుతోంది. మరోవైపు ప్రైవేట్‌పరం చేసేందుకు చర్యలు ముమ్మరం అయ్యాయి. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి రైల్వేస్టేషన్‌ వెళితే ఆజమాయిషీ ఉండదు. గతంలోనే ఆయా ప్రైవేట్‌ కంపెనీలకు 45 ఏళ్లపాటు లీజుకు అప్పగించాలని 2017లోనే ప్రతిపాదించారు. కానీ 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తేనే టెండర్లు ఆహ్వానిస్తామని కంపెనీలు రైల్వేకు అల్టిమేటం ఇచ్చాయి.

వాస్తవానికి రైల్వేల్లో ప్రైవేట్‌ పెట్టుబడులు ఆహ్వానించేందుకు రైల్వే మంత్రిత్వశాఖ 2017 ప్రారంభంలోనే రీ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. రైల్వేస్టేషన్లను ప్రైవేట్‌కు అప్పగించడం ద్వారా నాన్‌టిక్కెట్‌ రెవెన్యూ కింద లక్ష కోట్లు ఆర్జించాలని చూస్తోంది. ఇందుకోసం దేశంలో మొత్తం 23 స్టేషన్లు ఎంపిక చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లు తొలి ప్రాతిపదికన ఎంచుకున్నారు. ఈ రెండు స్టేషన్లను రీ డెవలప్‌మెంట్‌ కింద ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు నిర్ణయించారు. రైల్వేస్టేషన్‌లోని కమర్షియల్‌ స్థలంతోపాటు రైల్వేకు చెందిన ఖాళీ స్థలాలను 45 ఏళ్లపాటు ప్రైవేట్‌కు లీజుకు అప్పగిస్తారు.

ప్రభుత్వ ఆధీనంలోనే రైల్వేశాఖను అభివృద్ధి చేయాలి
విజయవాడ రైల్వేస్టేషన్ ను ప్రైవేట్ కు అప్పగించడాన్ని రైల్వేయూనియన్ నేతలు, సిబ్బంది, కార్మికులు, విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో రైల్వేస్టేషన్లను ప్రైవేట్‌కు ఇవ్వడమంటే అందులోపనిచేస్తున్న వారిని దగా చేయడమేనని నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలోనే రైల్వేశాఖను అభివృద్ధి చేయాలని సీపీఎం నేతలు కోరుతున్నారు.మొత్తానికి విజయవాడ రైల్వేస్టేషన్‌ ప్రైవేట్‌పరం చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై రైల్వేశాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

Don't Miss

Subscribe to RSS - CPM Leader BV Raghavulu