CPM Madhu

13:45 - August 7, 2018

నెల్లూరు : జిల్లా రావూరు పోలీస్‌ స్టేషన్‌ దాడి ఘటన ఎస్‌ఐ దురుసు ప్రవర్తన వల్లే జరిగిందని, ఎస్‌ఐను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు ఏపీ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు. రావూరు హరిజనవాడలో పర్యటించిన మధు అక్కడి స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన దళితులను 15 రోజుల్లోగా విడుదలచేయకుంటే అన్ని దళిత, ప్రజాసంఘాలను కలుపుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామంటున్న మధుతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

06:48 - August 3, 2018

హైదరాబాద్ : సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో కలిశారు. విభజన హామీలపై మరోసారి పోరు చేయటానికి సిద్ధమయ్యామని మధు తెలిపారు. రాష్ట్ర ప్రజల్లో టీడీపీ బలం తగ్గుతుందని.. ప్రజల్లో టీడీపీపై అసంతృప్తి పెరుగుతుందని మధు అన్నారు. సీపీఎం, సీపీఐ, జనసేనలు కలిసి పోరాడుతుంటే టీడీపీ తట్టుకోలేకపోతుందని.. అందుకే పవన్‌ కల్యాణ్‌పై చంద్రబాబు విమర్శలకు దిగుతున్నారని రామకృష్ణ అన్నారు. 

09:38 - July 22, 2018

కృష్ణా : విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజారక్షణ యాత్ర చేపట్టారు. విజయవాడ నుంచి మధురానగర్ వరకు యాత్ర కొనసాగనుంది. మంచినీరు, డ్రైనేజీ, చార్జీలు, పన్నుల పెంపుకు వ్యతిరేకంగా యాత్రను తలపెట్టారు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలు, భూకబ్జాల నుంచి విజయవాడను కాపాడాలని డిమాండ్ చేశారు. గెలిపించిన ప్రజలనే పాలకులు శిక్షిస్తున్నారని సీపీఎం నేతలు మండిపడ్డారు. నగరపాలక సంస్థను అధోగతి పాల్జేస్తున్నారని ఆరోపిస్తున్నారు.  
సీపీఎం నేత సీహెచ్ బాబురావు
'రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేస్తే, టీడీపీ మోసం చేసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు విడుదల కావడం లేదు. విజయవాడకు విఐపీల రద్దీ పెరిగింది...ట్రాఫిక్ సమస్యల తీవ్రమైంది. నగరంలోని సమస్యలు పరిష్కారం కావడం లేదు. విజయవాడ నగర పాలక సంస్థను టీడీపీ నేతలు భ్రష్టుపట్టించారని, అవినీతిమయం చేశారని మండిపడ్డారు.స్వాతంత్య్ర సమరయోధుని భూమిని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులు పేర రాయించుకున్నారు. విజయవాడను కాపాడుకోవాలి' అని అన్నారు.
పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వర్‌రావ్..
'సీపీఎం ప్రజా సమస్యలపై పోరాడుతోంది. టీడీపీ ప్రజలపై పన్నుల భారం మోపుతోంది. ప్రభుత్వ భూములను రక్షించాలి. ప్రజారక్షణ యాత్ర జయప్రదం కావాలి. విజయవాడ సమస్యలపై శాసనమండలిలో పోరాడుతాం. 
సీపీఎం నేత కాశీనాథ్
నగరానికి జరగుతున్న అన్యాయంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతాం.  పాలకపక్షానికి వ‌్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి ప్రజలు మద్దతివ్వాలి అని అన్నారు.

 

16:38 - July 13, 2018

విశాఖపట్టణం : ప్రత్యామ్నాయ రాజకీయాలకు కలిసొచ్చే అన్ని పార్టీలతో ఒక వేదిక ఏర్పాటు చేస్తామన్నారు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన రాజకీయ ప్రత్యామ్నాయ కార్మిక గర్జనలో మధు, రామకృష్ణలు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని మధు విమర్శించారు. ప్రభుత్వం సెప్టెంబర్ 15లోగా కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేయాలని.. చేయకపోతే ఆందోళనకు దిగుతామని మధు హెచ్చరించారు. రేపు వామపక్షాలు ఆధ్వర్యంలో రాజమండ్రిలో దళిత సదస్సు.. 15న విజయవాడ సమస్యలపై సదస్సు ఉంటుందన్నారు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ, బీజేపీలు విస్మరించాయన్నారు. వామపక్షాలు మినహా ఇతర అన్ని పక్షాలు కార్పొరేట్ పక్షాలనే ఆయన ఆరోపించారు. 

17:01 - July 8, 2018

అనంతపురం : పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండా మోదీ సర్కార్‌ రైతులను మోసం చేస్తుందన్నారు. రైతుల సమస్యలపై ఈనెల 10న విజయవాడలో సమావేశమమై... భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రజాసమస్యలపై సదస్సులు, బస్సుయాత్రలు చేపడతామని.. ఉభయ కమ్యూనిస్టులు కలిసి పోరాటాలు చేస్తాయన్నారు. 

 

16:36 - June 30, 2018

పశ్చిమగోదావరి : నకిలీ పత్రాలతో పేదల భూములు కాజేయాలని చూస్తే సహించేది లేదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. జంగారెడ్డి గూడెం మండలంలోని పంగిడిగూడెంలో ల్యాండ్ సీలింగ్ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన పోరాటం చేస్తున్న 15 రోజులుగా సీపీఎం కార్యకర్తలకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం పంగడిగూడెంకు నేతలు, మధు చేరుకుని గతంలో పేదలకు పంచిన భూముల్లో నాగలితో దున్నారు. అర్హులైన పేదలకు సీలింగ్ భూములిచ్చేంతవరకు పోరాటం చేస్తామని, జంగారెడ్డి గూడెంలో బహిరంగసభ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మధు ప్రకటించారు. 

16:38 - June 27, 2018

నెల్లూరు : బర్మశాల గుంట రైల్వే పట్టాల సమీపంలోని ఇళ్లను ప్రభుత్వం తొలగించాలని చూస్తోందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ఆయన ఆ ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడ నివాసం ఉంటున్న వారితో మధు, ఇతర నేతలు మాట్లాడారు. ఇక్కడ 800 ఇళ్లలో నివాసం ఉంటున్నారని, ప్రత్యామ్నాయం చూపెట్టకుండా ఇళ్లు తొలగించాలని చూడడం అన్యాయమన్నారు. ప్రభుత్వం బాధితులకు ఇళ్లను కేటాయించాలని కోరారు. 

07:17 - June 20, 2018

విజయవాడ : కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఈనెల 29న కడప బంద్‌ పాటిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందన్నారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై మూడు నెలల పాటు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. 'కడప ఉక్కు-ఆంధ్రుల హక్కు' నినాదంతో ఆందోళనలు ఉధృతం చేసేందుకు నిర్ణయించినట్లు మధు తెలిపారు.

 

16:54 - June 11, 2018

గుంటూరు : దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రధాని నరేంద్రమోదీ తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, జగన్‌లతో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. చంద్రబాబుతో ఎవరు పొత్తు పెట్టుకున్నా మట్టికరవక తప్పదని మధు జోస్యం చెప్పారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో సీపీఎం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన మధు.. రాబోయే రోజుల్లో ప్రజాస్వామికవాదులను కలుపుకొని వెళ్లనున్నట్లు తెలిపారు. 

17:05 - June 10, 2018

అనంతపురం : విత్తనాల కోనుగోలుకు రైతుల వద్ద డబ్బు లేదని ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేస్తే ప్రతి రైతుకు 75వేల రూపాయలు అందుతాయన్నారు. రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. రేపు, ఎల్లుండి జిల్లా కలెక్టరేట్‌ వద్ద రైతు సత్యాగ్రహం చేపట్టనున్నట్లు రాంభూపాల్ తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - CPM Madhu