cricket match

13:57 - January 13, 2018

హైదరాబాద్ : హైదరాబాద్‌ క్రికిట్‌ అసోసియేషన్‌పై  టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ ఫైర్‌ అయ్యారు. తనను హెచ్‌సీఏ ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తేలిందన్నారు. ఈమేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. లోధాకమిటీ సిఫార్స్‌లను పరిగణలోనికి తీసుకోలేదని అజహార్‌ విమర్శించారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని దీనిపై తాను  న్యాయపోరాటానికి రెడీ అవుతున్నట్టు అజారుద్దీన్‌ స్పష్టం చేశారు. 

 

11:19 - January 13, 2018

ఢిల్లీ : సఫారీ గడ్డపై... బ్యాటింగ్‌లో ఆపసోపాలు పడుతున్న భారత్‌కు నేటి నుంచి రెండో గండం ప్రారంభమవుతుంది. తొలిటెస్టులో విజయానికి దగ్గరైనట్లే కనిపించి... చివర్లో ఓటమితో సరిపెట్టుకున్న కోహ్లీ సేన.. రెండో టెస్టుపై.. నమ్మకంతో ఉంది. సెంచూరియన్ పార్క్ వేదికగా... సౌతాఫ్రికాతో కోహ్లీ సేన సై అంటోంది. రెండో టెస్ట్‌లోఅన్ని విభాగాల్లో బలంగా  ఉన్న దక్షిణాఫ్రికా మరోసారి పేస్‌ బౌలింగ్‌తోనే భారత్‌ను  చిత్తు చేయాలని ప్లాన్‌లో ఉంది. 
సౌతాఫ్రికాతో అమీతుమీకి సిద్ధమైన టీమిండియా
భారత్‌, దక్షిణాఫ్రికా రెండో టెస్ట్‌కు సెంచూరియన్‌ పార్క్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. టెస్టు టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా 2వ ర్యాంకర్‌ సౌతాఫ్రికాతో అమీతుమీకి సిద్ధమైంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండో టెస్ట్‌కు కేప్‌టౌన్‌లో రంగం సిద్ధమైంది. తొలి టెస్ట్‌లో తేలిపోయిన కొహ్లీ అండ్‌ కో సెకండ్‌ టెస్ట్‌ నెగ్గాలని పట్టుదలతో ఉండగా....సిరీస్‌ విజయం సాధించాలని సఫారీ టీమ్‌ తహతహలాడుతోంది. 
బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన భారత్‌ 
తొలి టెస్ట్‌లో బౌలింగ్‌లో అంచనాలకు మించి రాణించిన భారత్‌ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది.  విరాట్‌,పుజారా,విజయ్‌,ధావన్‌ ,రోహిత్‌ శర్మ వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌ ఉన్నా స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక చేతులెత్తేసింది. రెండో టెస్ట్‌లో రహానే, రాహుల్‌ ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రా, మహమ్మద్‌ షమీ తొలి టెస్ట్‌లో సఫారీ బ్యాట్స్‌మెన్‌కు చెక్‌ పెట్టారు. ఈ ముగ్గురిపై భారత జట్టు రెండో టెస్ట్‌లోనూ భారీ అంచనాలే పెట్టుకుంది. అశ్విన్‌ సైతం స్థాయికి తగ్గట్టుగా స్పిన్‌ మ్యాజిక్‌ చేస్తే భారత జట్టుకు బౌలింగ్‌లో తిరుగుండదు. 
భారత్‌ కంటే ధీటుగా సౌతాఫ్రికా  
మరోవైపు సౌతాఫ్రికా జట్టు భారత్‌ కంటే ధీటుగా ఉంది. కేప్‌టౌన్‌ టెస్ట్‌లో బ్యాట్స్‌మెన్‌  విఫలమైనా....పేస్‌ బౌలర్లే సఫారీ టీమ్‌కు సంచలన విజయాన్నందించారు. టెస్ట్‌ ఫేస్‌ టు ఫేస్ రికార్డ్‌లోనూ భారత్‌పై సౌతాఫ్రికా జట్టుదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 34 టెస్టుల్లో పోటీ పడగా.....దక్షిణాఫ్రికా జట్టు 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.భారత్‌ 10 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మరి ఈ డూ ఆర్‌ డై టెస్ట్‌లో టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి. 

 

21:54 - October 12, 2017

హైదరాబాద్ : ఉప్పల్‌లో జరిగే భారత్‌, ఆస్ట్రేలియా టీ ట్వంటీ మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. 18 వందల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నామన్నారు. 56 అధునాతన సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని విజిలెన్స్, అక్టోపస్‌, షీ టీమ్స్‌, మఫ్టీ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. స్టేడియంలో ప్రేక్షకులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు హెచ్‌సీఎ కార్యదర్శి శంకర్‌ నారాయణ తెలిపారు. 

 

08:45 - August 27, 2017

పల్లెకెలె : చప్పగా సాగుతున్న శ్రీలంక-భారత్‌ వన్డే సిరీస్‌... రెండో వన్డే రసవత్తరంగా మార్చింది. భారత్‌కు పోటీ లేదనుకుంటున్న తరుణంలో శ్రీలంకలో ఒక యువ స్పిన్నర్‌ ధనుంజయ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తన బౌలింగ్‌ మాయాజాలంతో రెండో వన్డేలో శ్రీలంకను గెలుపు వరకు తీసుకువచ్చి... కోహ్లీ సేనకు గట్టి పోటీనిచ్చాడు. మ్యాచ్‌ ఓడిపోయినా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కించుకున్నాడు. ఇక ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్‌... ఇవాళ శ్రీలంకతో మూడో వన్డే ఆడనుంది. ఈ వన్డే కూడా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని కోహ్లీ సేన తహతహలాడుతోంది. అయితే.. సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే శ్రీలంక చావోరేవో తేల్చుకోక తప్పదు. ఇక శ్రీలంక ఆశలన్నీ ధనుంజయపైనే ఉన్నాయి. ఇదిలావుంటే భారత్‌ బ్యాటింగ్‌లో ప్రయోగాలు చేయనుంది. ఇది శ్రీలంకకు కలిసివచ్చే అవకాశం ఉంది. రెండో వన్డేలోనూ మార్పులు చేర్పులు చేసిన టీమిండియా... ఈరోజు కేదార్‌జాదవ్‌, లోకేష్‌ రాహుల్‌లను ముందు వరుసలో బ్యాటింగ్‌కు దింపనుంది. విరాట్‌కోహ్లీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇక ఫిట్‌నెస్‌ సాధించిన హార్దిక్‌ పాండ్యా తుదిజట్టులోకి రానున్నాడు. పల్లెకెలెలో నేడు జరగనున్న మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో వన్డేలో సుమారు రెండు గంటల పాటు అంతరాయం కలిగించిన వరణుడు... మూడో వన్డేలోనూ వదిలేలా లేడు. ఈరోజు కూడా వర్షం పడే సూచనలు కనిపించడంతో.. మ్యాచ్‌ జరుగుతుందా ! లేదా అనే టెన్షన్‌ నెలకొంది. 

10:40 - March 14, 2017

క్రికెట్ మ్యాచ్ లు..ఇతర క్రీడల్లో అన్నదమ్ములు..సోదరీమణులు పాల్గొంటు ఉంటుంటారు. యాదృచ్చికంగా వీరు తలపడాల్సి వస్తుంది కూడా. ఇలాగే క్రికెట్ పోటీలో అన్నదమ్ముల్లు ఒకే టీమ్ కు ఆడడం చూశాం. కానీ తండ్రికొడుకులు కలిసి ఆడడం చూశారా. అంతేగాకుండా వీరిద్దరూ చెరో హాఫ్ సెంచరీలు కూడా చేయడం విశేషం. వెస్టిండీస్ దిగ్గ‌జ బ్యాట్స్‌మ‌న్ శివ‌నారాయ‌ణ్ చంద్ర‌పాల్, అత‌ని కొడుకు తాగెనారాయ‌ణ్ చంద్ర‌పాల్ గయానా టీమ్ కు ఆడుతున్నారు. ఆదివారం సబీనా పార్కులో జమైకా టీమ్ తో మ్యాచ్ జరిగింది. జమైకా తొలి ఇన్నింగ్స్ లో 255 పరుగులు చేసింది. అనంతరం గయానా ఆటను ఆరంభించింది. తాగె నారాయణ్ ఓపెనర్ గా వచ్చాడు. శివనారాయణ్ చంద్రపాల్ మూడో వికెట్ పడిన అనంతరం క్రీజులోకి వచ్చాడు. వీరిద్దరూ 12.2 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్‌కు 38 ప‌రుగులు జోడించారు. 2012లో గాంధీ యూత్ ఆర్గ‌నైజేష‌న్ త‌ర‌ఫున ఆడుతూ ఇద్దరూ క‌లిసి 256 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేయ‌డం విశేషం. త‌న తండ్రిలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మ‌న్ అయిన తాగెనారాయ‌ణ్‌.. అత‌నిలాగే క్రీజులోకి రాగానే బెయిల్‌తో గార్డ్ మార్క్ చేస్తాడు. టెస్టుల్లో లారా త‌ర్వాత వెస్టిండీస్ త‌ర‌ఫున అత్య‌ధిక టెస్టు ప‌రుగులు (11867) చేసిన బ్యాట్స్‌మ‌న్‌గా శివ‌నారాయ‌ణ్ చంద్ర‌పాల్ నిలిచాడు. 

13:54 - October 19, 2016

ఢిల్లీ : ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో తిరుగులేని ఇండియా....సంచలనాలకు మారుపేరైన న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో వన్డేకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియం వేదికగా జరుగనున్న రెండో వన్డేలోనూ నెగ్గి సిరీస్‌పై పట్టు బిగించాలని  ధోనీ సేన  తహతహలాడుతుండగా....తొలి వన్డే ఓటమికి బదులు తీర్చుకోవాలని న్యూజిలాండ్‌ టీమ్‌ పట్టుదలతో ఉంది.  
రెండో వన్డేకు కౌంట్‌డౌన్‌ 
భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో వన్డేకు  కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. 5 వన్డేల సిరీస్‌లోని రెండో వన్డేకు ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియంలో రంగం సిద్ధమైంది.  ఇటు ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో తిరుగులేని ధోనీ అండ్‌ కో....అటు సంచలనాలకు మారుపేరైన కివీస్‌ టీమ్‌....ఇరు జట్ల మధ్య తొలి వన్డేలో హోరాహోరీ పోరు ఖాయమనుకున్నారంతా. కానీ ధర్మశాల వన్డేలో భారత బౌలర్ల ధాటికి కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంతో పోటీ ఏకపక్షంగా ముగిసింది. 
జట్టులో మ్యాచ్‌ విన్నర్లకు కొదువే లేదు
ధోనీ నాయకత్వంలోని వన్డే  జట్టులో మ్యాచ్‌ విన్నర్లకు కొదువే లేదు.  విరాట్‌కొహ్లీ, రోహిత్‌ శర్మ,అజింక్య రహానే,మనీష్‌ పాండే,ధోనీ  వంటి టాప్‌ క్లాస్ బ్యాట్స్‌మెన్‌తో బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎప్పటిలానే పటిష్టంగా ఉంది. తొలి వన్డేలో హార్దిక్‌ పాండ్య, ఉమేష్‌ యాదవ్‌, కేదార్‌ జాదవ్‌,అమిత్‌ మిశ్రా న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఎలా కట్టడి చేశారో అందరికీ తెలిసిందే. 
రెండో వన్డేలో ఆడనున్న సురేష్‌ రైనా..?  
తొలి వన్డేకు దూరమైన సురేష్‌ రైనా రెండో వన్డేలో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. రైనా రాకతో భారత బ్యాటింగ్‌ మరింత  బలోపేతమవుతుందనడంలో డౌటే లేదు. సురేష్‌ రైనా మినహా తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే భారత జట్టు 
బరిలోకి దిగే  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
అనూహ్యంగా తేలిపోయిన న్యూజిలాండ్‌ జట్టు  
మరోవైపు తొలి వన్డేకు ముందు అన్ని విభాగాల్లో భారత్‌ కంటే మెరుగ్గా కనిపించిన న్యూజిలాండ్‌ జట్టు అనూహ్యంగా తేలిపోయింది. విలియమ్‌సన్‌, రాస్‌ టేలర్‌,మార్టిన్‌ గప్తిల్‌, ల్యూక్ రాంకీ, కోరీ యాండర్సన్‌, లాథమ్‌ వంటి అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌తో కివీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ టీమిండియాకు ధీటుగానే  ఉన్నా.....అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో దారుణంగా విఫలమయ్యారు.  ట్రెంట్‌ బౌల్ట్‌,టిమ్‌ సౌథీ, బ్రేస్‌వెల్‌ ,మిషెల్‌ శాంట్నర్‌ ,ఇష్ సోధీ వంటి బౌలర్లతో కివీస్‌ బౌలింగ్ ఎటాక్‌ పదునుగా ఉంది. ఒంటి చేత్తో జట్టుకు విజయాన్నందించగల  కోరీ యాండర్సన్‌, జిమ్మీ నీషమ్‌ వంటి ఆల్‌రౌండర్లతో సమతూకంగానే ఉంది.కానీ సమిష్టిగా రాణించకపోతే న్యూజిలాండ్‌ జట్టుకు కష్టాలు తప్పవు.
ఫిరోజ్‌ షో కోట్లా స్టేడియంలో భారత్‌కు తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌
ఢిల్లీ ఫిరోజ్‌ షో కోట్లా స్టేడియంలో భారత్‌కు తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. స్పిన్నర్లకు పూర్తిగా అనుకూలించే కోట్లా పిచ్‌పై  భారత జట్టును ఓడించడం ప్రస్తుత న్యూజిలాండ్‌ జట్టుకు పెద్ద సవాలే. ఫేస్‌ టు ఫేస్‌  రికార్డ్‌లో భారత్‌దే పై చేయిగా ఉన్నా....న్యూజిలాండ్‌ జట్టును అసలే మాత్రం తక్కువ అంచనా వేయలేం.  
ధోనీసేన దూకుడు కొనసాగుతుందా..?  
సొంతగడ్డపై తిరుగులేని ట్రాక్ రికార్డ్‌తో పాటు జోరు మీదున్న భారత్‌ను ఓడించాలంటే మాత్రం విలియమ్‌సన్‌ అండ్‌ కో అంచనాలకు మించి రాణించాల్సిందే. ఫిరోజ్‌ షో కోట్లా  స్టేడియం వేదికగా జరుగనున్న సెకండ్‌ వన్డేలోనూ ధోనీసేన దూకుడు కొనసాగుతుందో లేదో చూడాలి.

 

12:31 - October 15, 2016

మాజీ వరల్డ్ చాంపియన్‌ టీమిండియా న్యూజిలాండ్‌తో కీలక వన్డే సిరీస్‌కు సన్నద్ధమైంది. సొంతగడ్డపై వన్డే 3వ ర్యాంకర్‌ న్యూజిలాండ్‌ను ఓడించేందుకు 4వ ర్యాంకర్‌ భారత్‌ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. వన్డేల్లో ఈ రెండు జట్ల ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్. స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సమరానికి ముందు భారత్‌కు ఇవి కలిసొచ్చే అంశాలే. కానీ ప్రస్తుతం ప్రత్యర్ధి కూడా పటిష్టమైనదే...న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ అంటే ఏ జట్టుకైనా పెద్ద చాలెంజ్‌. ఎందుకంటే ఆల్‌రౌండర్లు, మ్యాచ్‌ విన్నర్లతో సమిష్టిగా రాణించే కివీస్‌ టీమ్‌ను ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం. ప్రస్తుతం న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ కోసం ప్రకటించిన భారత జట్టు అన్ని విభాగాల్లో బలంగా లేదు. బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగానే ఉన్నా అనుభవం లేని బౌలర్లతో కూడిన బౌలింగ్‌ ఎటాక్‌ తేలిపోయే అవకాశాలు లేకపోలేదు. ఎటువంటి జట్టుతో అయినా అద్భుతాలు సృష్టించగల టీమిండియా వన్డే కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ పెద్ద సవాల్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

హోరాహోరీ..
ఇరు జట్లు వన్డేల్లో పోటీపడుతున్నాయంటే హోరాహోరీ పోరు ఖాయమనే చెప్పాలి. కానీ న్యూజిలాండ్‌తో వన్డే ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లో మాత్రం భారత్‌దే కాస్త పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 91 మ్యాచ్‌ల్లో పోటీపడగా...భారత్‌ 46 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. న్యూజిలాండ్‌ 41 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మొత్తం మీద టీమిండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య వన్డే సిరీస్‌ భారత అభిమానులకు మాత్రమే కాదు క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పెద్ద పండుగే. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో వరుసగా 3,4 స్థానాల్లో ఉన్న న్యూజిలాండ్‌,భారత జట్ల మధ్య 5 వన్డేల సిరీస్‌ హోరాహోరీగా సాగుతుందో లేక ఏకపక్షంగా ముగుస్తుందో చూడాలి.

17:59 - November 7, 2015

మొహాలి : టెస్ట్ క్రికెట్ నెంబర్ వన్ సౌతాఫ్రికా తో జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ తొలిటెస్ట్ లో టీమిండియా బోణీ కొట్టింది. మొహాలీ పిసిఎ స్టేడియంలో జరిగిన ఈ ఐదురోజుల టెస్ట్ మూడోరోజుఆటలోనే టీమిండియా 108 పరుగులతో విజేతగా నిలిచింది. స్పిన్ బౌలర్ల హవాతో సాగిన ఈమ్యాచ్ లో...218 పరుగుల విజయలక్ష్యాన్ని చేదించడంలో సఫారీటీమ్ విఫలమయ్యింది. స్పిన్నర్ల త్రయం రవీంద్ర జడేజా, అశ్విన్, అమిత్ మిశ్రాల ముప్పేటదాడితో..109 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్పిన్నర్లలో జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు, ఆరోన్, అమిత్ మిశ్రా చెరో వికెట్ పడగొట్టారు. సిరీస్ లోని రెండోటెస్ట్ నవంబర్ 14 నుంచి 18 వరకూ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది.

 

Don't Miss

Subscribe to RSS - cricket match