dalit students

13:34 - April 12, 2018

న్యూఢిల్లీ : ఏపీ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ఘోరంగా అమలు చేస్తున్నారని సీపీఎం కేంద్రకార్యదర్శివర్గ సభ్యులు, దళిత్ శోషణ్ మంచ్ కన్వీనర్ వి.శ్రీనివాస్ రావు విమర్శించారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ రాష్ట్రంలో చట్టం ఘోరంగా అమలవుతోందని, 2017లో 785 కేసులు కొట్టిపడేశారని, 49 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయన్నారు. ఇంకా 5వేల కేసులు పెండింగ్ లో ఉండడడం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మొత్తంగా కేసులు నత్తనడకన సాగుతున్నాయని, మానిటరింగ్ కమిటీ ఆరు నెలలకొకసారి సమీక్ష నిర్వహించాల్సి ఉంటుందని కానీ అలాంటిది ఏమీ చేయలేదన్నారు. ఏప్రిల్ 2వ తేదీ అనంతరం పలువురు దళిత యువకులను అరెస్టులు చేస్తున్నారని, ఉమ్మడి జాతీయ ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక తెలంగాణలో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్ 14వ తేదీన రాజ్యాంగ పరిరక్షణ దినంగా పరిగణిస్తామన్నారు. 

21:12 - February 12, 2018

ఢిల్లీ : దళిత విద్యార్థి హత్యపై అలహాబాద్‌ అట్టుడికింది. దళిత విద్యార్థి మృతిని నిరసిస్తూ ఆందోళనకారులు ఓ బస్సును తగలబెట్టారు. దళిత విద్యార్థి హత్య కేసులో సిసిటివి ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. దళిత విద్యార్థి హత్యను సిపిఎం, బిఎస్‌పి ఖండించాయి. బిజెపి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశాయి. విద్యార్థి హత్యను నిరసిస్తూ ఆందోళనకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు.....ఓ బస్సును తగలబెట్టారు. హింసను నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

లా చదువుతున్న 26 ఏళ్ల దిలీప్‌ శుక్రవారం రాత్రి తన ఇద్దరు స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు కర్నాల్‌గంజ్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఇంతలోనే లగ్జరి కారులో అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులకు దిలీప్‌కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంతే...వారు దిలీప్‌ను రాళ్లు, కర్రలు, హాకీ స్టిక్‌తో చితకబాదారు.

తీవ్ర గాయాలపాలైన దిలీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం కన్నుమూశాడు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెస్టారెంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దాడిలో ప్రధాన ఆరోపితుడు రైల్వే ఉద్యోగి విజయ్ శంకర్ సింగ్‌ పరారీలో ఉన్నాడు. విజయ్‌ శంకర్‌సింగ్‌ డ్రైవర్‌తో దిలీప్‌పై హాకీ స్టిక్‌తో దాడి చేసిన రెస్టారెంట్ వెయిటర్‌ మున్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిలీప్‌ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దిలీప్‌ను దుండగులు కొట్టిన సమయంలో పోలీసులకు తక్షణమే సమాచారం ఇవ్వనందుకు.. రెస్టారెంట్ యజమానిపై కూడా కేసు నమోదైంది.

దళిత విద్యార్థి హత్యపై బిఎస్‌పి చీఫ్‌ మాయావతి దుఃఖాన్ని ప్రకటించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. కుల విద్వేషాలు రెచ్చగొడుతున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని దోషిగా నిలపాలని మాయావతి అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో దళిత విద్యార్థి హత్యను సిపిఎం ఖండించింది. దిలీప్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. యూపిలో యోగి సర్కార్‌ పగ్గాలు చేపట్టాక మతతత్వ శక్తుల మనోబలం మరింత పెరిగిందని...భవిష్యత్తులో దళితులపై మరిన్ని దాడులు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది.

20:57 - January 10, 2018

సంక్షుభిత సమయాలు పరిష్కారాలకోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తాయి. అణచివేత ఆకాశాన్నంటితే పాతాళాన్ని చీల్చుకుంటూ కత్తుల చేతులు, నిప్పుల స్వరాలూ దూసుకొస్తాయి. వివక్షను బోధించిన విలువలతో దేశాన్ని అధోగతి పాల్జేస్తామంటే నిజమైన దేశభక్తి అంటే ఏంటో కొత్త పాఠాలు మొదలవుతాయి. పరిష్కారాల దిశగా దూసుకెళ్లే పావన నవజీవన బృందావన నిర్మాతలుగా కొందరు నవయువకులు తెరపైకివస్తారు.. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాయా లేక మనుస్మృతిని నెత్తిన పెట్టుకున్నాయా అనే సందేహం వచ్చినపుడు యువ హుంకార్ అంటూ ఏకమవుతారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం గురించి ప్రత్యేక కథనం..ఓ చేతిలో రాజ్యాంగం.. మరో చేతిలో మనుస్మృతి..ఏది కావాలి? ఏది అనుసరిస్తారు..?

హక్కులను, రక్షణలను, సమానత్వాన్ని ప్రసాదించిన రాజ్యాంగాన్నా లేక వివక్షను, అణచివేతను బోధించిన సమాజాన్ని పీడనతో నింపిన మనుస్మృతినా? ఏది కావాలి మీకు? ఇదే యువ హుంకార్ వేసిన ప్రశ్న..హస్తినలో యువ హుంకార్‌ ర్యాలీ గర్జించింది. మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసింది. అవినీతి, పేదరికం, నిరుద్యోగం లాంట ప్రధాన సమస్యలను పక్కన బెట్టి.. ఘర్‌ వాప్‌సి, లవ్‌ జిహాద్‌ లాంటి అంశాలకు ప్రాధ్యనత నిస్తోందని మండిపడింది. దేశానికి మనువాదం ముప్పు పొంచి ఉందని యువతను హెచ్చరించింది. సామాజిక న్యాయం కోసం తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

అడుగడుగునా పోలీసుల నిర్బంధం.. వాటర్ కెనాన్లు, బారికేడ్లు, లాఠీలు...భాష్పవాయుగోళాలు.. వీటన్నిటి మధ్య పార్లమెట్ స్ట్రీట్ లో పెద్ద సంఖ్యలో యువత ఏకమయింది. దళిత, మైనార్టీ వర్గాలపై వివక్ష ఆపాలని, యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని, విద్యార్థి హక్కులను కాపాడాలని, లింగ సమానత్వం కావాలని..., భీమ్‌ కొరెగావ్‌లోని దళితులపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాజధానిలో యువత ఏకస్వరమయింది.

మాకు స్వాతంత్ర్యం కావాలి. విముక్తి కావాలి. దేశంలోపల కోట్లాది ప్రజలను పట్టి పీడిస్తున్న సకల సమస్యలనుండి మాకు విముక్తి కావాలి. ప్రజలంతా సమానమనే వ్యవస్థ సిద్ధించాలి. దానికి అడ్డుగా ఉన్న విలువలు, నమ్మకాలు వాటి మూల సిద్ధాంతాలపై పోరాటం చేస్తూనే ఉంటాం.. గెలుపు దక్కేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ క్రమంలో సకల రోగాలకు కారణమైన మనుస్మృతిని వ్యతిరేకిస్తాం.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం.. ఇదీ యువ హుంకార్ ర్యాలీ ఇస్తున్న సందేశం.. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

16:22 - October 9, 2017

కరీంనగర్/సిరిసిల్ల : నేరెళ్ల ఘటనలో ఎస్పై రవీందర్ పై తంగాళ్లపల్లి పీఎస్ లో కేసు నమోదు అయింది. నేరెళ్ల ఇసుక లారీల దహనం తరువాత అకారణంగా తమను అదుపులోకి తీసుకొని కొట్టారని బాధితుడు గణేష్ ఫిర్యాదు చేశారు. ఎస్సైపై ఐపీసీ సెక్షన్ 324 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. నేరెళ్ల ఘటనలో ఇప్పటికే ఎస్సై రవీందర్ సస్పెన్షన్ లో ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:03 - September 2, 2017

చెన్నై: నేషనల్‌ ఎలిజిబుల్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌- తమిళనాడులో ఓ దళిత విద్యార్థిని ఉసురు తీసింది. నీట్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడిన 17 ఏళ్ల దళిత విద్యార్థిని ఎస్‌.అనిత తానిక మెడిసన్‌ చదవలేనని ఆత్మహత్యకు పాల్పడింది. నీట్‌ నుంచి మినహాయించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో... తనకిక మెడికల్‌ సీటు రాదనుకున్న అనిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుజుమూరు గ్రామానికి చెందిన అనితకు ఇంటర్‌లో 1200 మార్కులకు గాను 1176 మార్కులు వచ్చాయి. నీట్‌ పరీక్షలో కేవలం 86 మార్కులే రావడంతో ఎంబిబిఎస్‌ సీటు పొందలేకపోయింది. నీట్‌ పరీక్షను ప్రామాణికంగా తీసుకోవద్దని, ఇంటర్‌ మార్కులను బేస్‌గా తీసుకుంటే తనకు మెడిసిన్‌లో సీటు వస్తుందని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. నీట్‌ ఆధారంగానే మెడికల్ అడ్మిషన్స్‌ తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగస్టు 22న తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అనిత కలలు ఆవిరైపోయాయి.

13:34 - July 31, 2017

కడప : స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్న దేశంలో దళితులుపై దాడులు, వివక్ష, గ్రామ బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. దళితులు అడుగడుగునా వివక్షకు, అవమానాలకు గురవుతున్నారు. అగ్రవర్ణాల కులదురహంకారం రోజురోజుకు పెచ్చుమీరుతుంది. దళితులను అసలు మనుషులుగా చూడడం లేదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ  యాక్టు ఉన్నా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ చట్టం సక్రమంగా అమలు కావడం లేదు. ఏపీలో గరగపర్రు ఘటన, తెలంగాణలోని నేరెళ్ల ఘటనలు మరువకముందే తాజాగా కడప జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. దళితులపై అగ్రవర్ణాలు కులవివక్షకు పాల్పడ్డారు. జిల్లాలోని కాశినాయన మండలం రెడ్డికొట్టాలలో దళితులపై అగ్రవర్ణాల కులవివక్ష బయటపడింది. తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లొద్దంటూ దళిత విద్యార్థులను అగ్రవర్ణాలవాళ్లు అడ్డుకున్నారు. ఇళ్ల ఎదుట రోడ్డుకు అడ్డంగా ముళ్లకంపలు, రాళ్లు పెట్టారు. స్కూళ్లలో కూడా దళిత విద్యార్థులపై వివక్ష చూపుతున్నారు.  దళిత, అగ్రవర్ణాల విద్యార్థులకు వేర్వేరుగా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:40 - April 3, 2017

విశాఖ : జిల్లా కేంద్రంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రానికి సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు శంకుస్థాపన చేశారు. ప్రగతివాద శక్తులు, బలహీన వర్గాలకు విజ్ఞానాన్ని అందించడాకి ఈ కేంద్రం ఉపయోగపడాలని ఆయన అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధుతో పాటు జిల్లాకు చెందిన మేధావులు పాల్గొన్నారు.  హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ణాన కేంద్రం ఎన్నో గొంతుకులకు వేదిక అవుతుందని.. అలాగే ఈ సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కూడా వేదిక అవ్వాలని మధు అభిప్రాయపడ్డారు. 

 

13:33 - February 21, 2017

హైదరాబాద్ : ‘బుద్ధం శరణం గచ్చామి' సినిమా విడుదల చేయాలని చేపడుతున్న ఆందోళన తీవ్రతరమవుతోంది. ఈ చిత్రం పూర్తయి రోజులు గడుస్తున్నాయి. కానీ కేంద్ర సెన్సార్ బోర్డు మాత్రం అనుమతినివ్వలేదు. దీనితో చిత్రం విడుదల కావడం లేదు. దీనితో వివిధ సంఘాల నేతలు సెన్సార్ బోర్డు తీరును గర్హిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పలు సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఉందని సెన్సార్ బోర్డు పేర్కొంది. కానీ ఒక వర్గం వారి వత్తిడి మేరకు సెన్సార్ బోర్డు ఇలా చేస్తోందని, దీనిపై ఇతర నిబంధనలు పెట్టే అవకాశం ఉన్నా చిత్రాన్ని మొత్తాన్ని నిషేధించడం సబబు కాదన్నారు. తాజాగా దళిత, గిరిజన సంఘాల నేతలు కవాడిగూడలో ఉన్న కేంద్ర సెన్సార్ బోర్డు కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్..అద్దాలను ధ్వంసం చేశారు. బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న 30 మంది విద్యార్థులను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. ఓయూ దళిత, గిరిజన విద్యార్థి సంఘాలు పాల్గొన్నట్లు సమాచారం.

22:12 - February 14, 2017

హైదరాబాద్‌ : హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న పరిశోధక విద్యార్ధి రోహిత్‌ వేముల కుల వివాదం కొత్త మలుపు తిరిగింది. రోహిత్‌ వేముల దళితుడు కాదని ప్రభుత్వం నియమించిన  జిల్లా స్థాయి కమిటీ నివేదించింది. రోహిత్‌ది వడ్డెర కులమని నిర్ధరించింది. ఇదే విషయాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే ధ్రువీకరించారు. రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్న 13 నెలల  తర్వాత కమిటీ నివేదిక సమర్పించింది. 
కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నం : మధు 
రోహిత్‌ వేముల కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. రోహిత్‌ వేముల దళితుడని సర్టిఫికెట్ ఇచ్చిన గుంటూరు జిల్లా కలెక్టర్.. ఇప్పుడు దళితుడు కాదు... అతను బీసీ అని సర్టిఫికెట్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని మధు ప్రశ్నించారు. తక్షణం రోహిత్ చట్టం తీసుకురావాలని, దళితుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.
రోహిత్ వేముల ముమ్మాటికి ఎస్సీనే : రాములు  
రోహిత్‌ వేముల  బీసీ సామాజిక వర్గానికి చెందినవాడంటూ... గుంటూరు కలెక్టర్‌ నివేదిక ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని సీపీఎం నాయకులు రాములు అన్నారు. రోహిత్ వేముల ముమ్మాటికి ఎస్సీ కులానికి చెందినవాడేనని, కేంద్రమంత్రులను కేసు నుంచి తప్పించడానికే రోహిత్‌ కులం విషయంలో కేంద్రం కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. అలాగే రోహిత్ వేముల కుల ధ్రువీకరణపై సిట్టింగ్‌ జ్జడితో విచారణ చేయించాలని న్యూ డెమోక్రసీ నాయకులు వెంకట్రామయ్య డిమాండ్ చేశారు. రోహిత్ వేముల దళితుడనే విషయం అందరికీ తెలుసని..ఇప్పుడు ఆయన కులాన్ని బీసీగా ప్రకటించడం అన్యాయమని న్యూడెమోక్రసీ చంద్రన్న పార్టీ నేత గోవర్ధన్‌ అన్నారు. 
గతేడాది జనవరిలో రోహిత్ ఆత్మహత్య 
హెచ్‌సీయూలో రీసెర్చ్‌ స్కాలర్‌ అయిన రోహిత్‌ వేముల గత ఏడాది జనవరిలో తన హాస్టల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యునివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నారని, వారికో తాడు ఇస్తే ఉరి వేసుకుంటారని ఆత్మహత్యకు ముందు రోహిత్‌ వీసీకి లేఖ రాశారు. 
రోహిత్ మృతి తర్వాత కులంపై వివాదం 
రోహిత్ మృతి తర్వాత అతని కులంపై వివాదం తలెత్తింది. అనంతరం రోహిత్‌ వేముల దళితుడని  గుంటూరు తహసీల్దార్‌ నిర్ధారించిన కుల ధృవీకరణ పత్రాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్‌ అప్పట్లో జాతీయ ఎస్సీ కమిషన్‌కు పంపారు.  అదే సమయంలో నా పేరు రోహిత్‌ వేముల...నేను గుంటూరుకు చెందిన దళితుడినని అప్పట్లో రోహిత్‌ స్వయంగా మాట్లాడిన వీడియో ఒకటి బయటకొచ్చింది. రోహిత్‌ స్నేహితులు కూడా ఆ వీడియోను బహిర్గతం చేశారు. రోహిత్‌ వేముల బీసీ అంటూ తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించడాన్ని వామపక్షాలు, దళిత సంఘాలు ఖండించాయి. 

 

20:37 - February 14, 2017

హైదరాబాద్‌ : హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న పరిశోధక విద్యార్ధి రోహిత్‌ వేముల కుల వివాదం కొత్త మలుపు తిరిగింది. రోహిత్‌ వేముల దళితుడు కాదని ప్రభుత్వం నియమించిన  జిల్లా స్థాయి కమిటీ నివేదించింది. రోహిత్‌ది వడ్డెర కులమని నిర్ధారించింది. ఇదే విషయాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే ధృవీకరించారు. రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్న 13 నెలల  తర్వాత కమిటీ నివేదిక సమర్పించింది. రోహిత్ దళితుడు కాదని నిర్ధారించిడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. 
రోహిత్‌ వేముల కేసును పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం : సీపీఎం నేత మధు
హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కులవివక్షత కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్‌ వేముల కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రోహిత్‌ వేముల దళితుడని సర్టిఫికెట్ ఇచ్చిన గుంటూరు జిల్లా కలెక్టర్.. ఇప్పుడు దళితుడు బీసీ అని సర్టిఫికెట్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని మధు ప్రశ్నించారు. తక్షణం రోహిత్ చట్టం తీసుకురావాలని, దళితుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. కేసును కులం చుట్టూ తిప్పుతున్నారని పేర్కొన్నారు. తల్లి ఏం కులం, ఇతరులు ఏం కులం అనే దానిపై తిప్పుతున్నారని.. ఇది సరికాన్నారు. అసలు సమస్యను పక్కదారి పట్టించి దీన్ని వివాదం చేసేందుకు పూనుకుంటున్నారు. అందరూ వ్యతిరేకించాలని అన్నారు.
రోహిత్‌ వేముల కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం: సీపీఎం నేత రాములు
రోహిత్‌ వేముల  బీసీ సామాజిక వర్గానికి చెందినవాడంటూ... గుంటూరు కలెక్టర్‌ నివేదిక ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని సీపీఎం నాయకులు రాములు అన్నారు. రోహిత్ వేముల ముమ్మాటికి ఎస్సీ కులానికి చెందినవాడేనని అన్నారు. కేంద్రమంత్రులను కేసు నుంచి తప్పించడానికే రోహిత్‌ కులం విషయంలో కేంద్రం కుట్ర చేస్తుందని ఆయన అన్నారు. 
కుల ధ్రువీకరణపై సిట్టింగ్‌ జ్జడితో విచారణ చేయించాలి : వెంకట్రామయ్య  
అలాగే రోహిత్ వేముల కుల ధ్రువీకరణపై సిట్టింగ్‌ జ్జడితో విచారణ చేయించాలని న్యూ డెమోక్రసీ నాయకులు వెంకట్రామయ్య డిమాండ్ చేశారు. 
రోహిత్ కులాన్ని బీసీగా ప్రకటించడం అన్యాయం : గోవర్ధన్  
రోహిత్ వేముల దళితుడనే విషయం అందరికీ తెలుసునని..ఇప్పుడు ఆయనకు కులాన్ని బీసీగా ప్రకటించడం అన్యాయమని న్యూడెమోక్రసీ చంద్రన్న పార్టీ నేత గోవర్దన్‌ అన్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - dalit students