Dalits protest

17:45 - July 11, 2018

సంగారెడ్డి : జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో దళితులు పాదయాత్ర చేపట్టారు. నాలుగు దశాబ్ధాల క్రితం దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వం.. వేరే నిర్మాణాలకు కేటాయించడంతో దళితులు ఆందోళన చేపట్టారు. మొగుడంపల్లి మండల కేంద్రం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటామని దళితులంటున్నారు. వారి ఆందోళనపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:15 - September 23, 2017

నిజామాబాద్ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు, బాల్కొండ, మోర్తాడ్‌, భీంగల్‌ మండలాల్లో పెత్తందార్ల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. తాము చెప్పిందే వేదంగా అనుసరించాలని దళితులకు హుకుం జారీ చేస్తున్నారు. ఇలా వారి ఆదేశాలు ధిక్కరించినందుకు భీంగల్‌ మండలం 110 దళిత కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ విధించడంతో దళితులు నానా ఇబ్బందులు పడ్డారు. దీనిపై సీపీఎం, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. ఈ మేరకు గ్రామంలో సీపీఎం నాయకులు గ్రామంలో పర్యటించారు.

గత ఏడాది కూలీ డబ్బులు పెంచాలని
బెజ్జొర గ్రామంలో దళితులు మొదటి నుంచి డప్పులు కొట్టి కూలీ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గత ఏడాది కూలీ డబ్బులు పెంచాలని దళితులు గ్రామాభివృద్ధి కమిటీలో విన్నవించారు. ఎన్నిసార్లు చెప్పినా పెద్దలు పట్టించుకోక పోవడంతో.. కూలీ డబ్బులు పెంచాల్సిందేనని మరో సమావేశంలో పట్టుబట్టారు. దీనిపై కోపగించుకున్న పెత్తందారులు గ్రామంలో దళితులు డప్పు కొట్టరాదని తీర్మానించారు. ఈ నేపథ్యంలో ఇటీవల గ్రామ మాజీ సర్పంచ్‌ పోసాని మృతి చెందారు. ఆమె దహన సంస్కారాల సందర్భంగా డప్పులు కొట్టారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు డప్పుకొట్టినందుకు 5వేల రూపాయల జరిమానా చెల్లించాలని హుకుం జారీ చేశారు. అంతేకాదు కృష్ణాష్టమి పండుగ సందర్భంలోనూ దళితులపై పెత్తందారులు వివక్ష ప్రదర్శించారు. దళితులు ఉట్లు కొట్టవద్దంటూ అడ్డుకున్నారు. మరో సందర్భంలో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసుకున్నందుకు కూడా పెత్తందారులు పలు ఆంక్షలు పెట్టారు. రాజరాజేశ్వర ఆలయంలోకి దళితులకు ప్రవేశంలేదంటూ నిషేదం విధించారు. ఈ నేపథ్యంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీని దళితులు కోరారు. ఈ విన్నపాన్ని కూడా పెత్తందార్లు ఒప్పుకోలేదు. పైగా గత 15 రోజుల నుంచి గ్రామంలో ఎవరూ తమతో మాట్లాడకుండా ఆంక్షలు విధించారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్యాయం ఏంటని ప్రశ్నించారు
ఇంత అన్యాయం ఏంటని ప్రశ్నించారు దళితులు. దీంతో మరింత ఊగిపోయారు పెత్తందారులు. తమమాటే ధిక్కరిస్తారా అంటూ 25వేల జరిమానా చెల్లించాలని హుకుం జారీ చేశారు. అంతేకాదు ఇక నుంచి గ్రామంలో చావులకు, పెళ్లిళ్లకు డప్పులు కొడితే 50వేల రూపాయల ఫైన్‌ కట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి ఒప్పుకోని దళితుకుటుంబాలన్నీ కదిలాయి. ఆర్మూరు ఆర్డీవో ఆఫీసు ముందు నిరసనకు దిగాయి. ఘటనపై ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామానికి వెళ్లి.. విచారణ నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి కమిటీ, గ్రామ పెద్దలు, దళితులతో అధికారులు చర్చించారు. గ్రామం నుంచి దళితులను బహిష్కరించి... వారి పట్ల ఎటువంటి వివక్షతను చూపినా.. కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. దీంతో అగ్రకుల పెద్దలు దారికొచ్చారు. ఇకపై సామరస్యంగా మెలగుతామని వీడీసీ సభ్యులు హామీ ఇచ్చారు. 

15:10 - September 23, 2017

నిజామాబాద్ : జిల్లాలోని బీంగల్ మండలం బెజ్జొరలో అగ్రకులవారు 110 దళిత కుటుంబాలపై సాంఘిక బహిష్కరించారు. దీని పై టెన్ టివి ప్రసారం చేసిన కథనాలకు ఎట్టకేలకు అధికారులు స్పందించారు. బెజ్జొర గ్రామాన్ని పోలీసు, రెవిన్యూ అధికారులు సందర్శించి గ్రామీణాభివృద్ది కమిటీ, గ్రామ పెద్దల, దళితులతో వారు చర్చలు జరిపారు. దళితులను బహిష్కరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు గ్రామ పెద్దలను హెచ్చరించారు. అధికారుల హెచ్చరికలతో అగ్రకుల పెద్దలు దారికొచ్చి సామరస్యంగా మెలగుతామని హామీ ఇచ్చారు. మరింత సమాచారం కోసంవ వీడియో చూడండి.

12:55 - September 23, 2017

నిజామాబాద్ : కుల దురంహకారం మరోసారి పడగ విప్పింది. తెలంగాణ రాష్ట్రంలో దళితులు సాంఘీక బహిష్కరణకు గురవుతున్నారు. ఇటీవలే పలు ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బెజ్జొరలో అగ్రకులాలు 110 దళిత కుటుంబాలను సాంఘీక బహిష్కరణ చేశారు. డప్పులు కొట్టవద్దంటూ, ఆలయ ప్రవేశం లేదంటూ.. కుల పెద్దలు, పెత్తందారులు హుకుం జారీ చేశారు. నవతరాత్రి ఉత్సవాలను జరుపవద్దంటూ ఆంక్షలు విధించారు. గతంలో కృష్ణాష్టమి, వినాయక చవితి పండుగుల సందర్భంగా కూడా దళితులపై అగ్రకులాలు ఆంక్షలు విధించారు. దీంతో ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా నిర్వహించారు. ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. తమను వెలివేసినవారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:49 - September 23, 2017

నిజామాబాద్ : కుల దురంహకారం మరోసారి పడగలు విప్పింది. తెలంగాణ రాష్ట్రంలో దళితులను సాంఘీకంగా బహిష్కరించేస్తున్నారు. ఇటీవలే పలు ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బెజ్జొరలో 110 దళిత కుటుంబాలను దళితులను అగ్రకులాలు సాంఘీకంగా బహిష్కరణ చేసిన ఘటన కలకలం రేపుతోంది. డప్పులు కొట్టవద్దంటూ..ఆలయ ప్రవేశం లేదంటూ కుల పెద్దలు..పెత్తందారులు హుకుం జారీ చేశారు. నవతరాత్రి ఉత్సవాలను జరుపవద్దంటూ ఆంక్షలు విధించారు. గతంలో కృష్ణాష్టమి, వినాయక చవితి పండుగుల సందర్భంగా కూడా వీరు ఆంక్షలు విధించారు. దీనితో ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా నిర్వహించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:57 - July 29, 2017

రంగారెడ్డి : జిల్లాలోని నందిగామ మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన దళితులు రస్తారోకో నిర్వహించారు.  మామిడిపల్లి, మొదళ్లగూడలోని తమ భూములను పాలమూరు జిల్లా జెడ్పీ వైస్‌చైర్మన్‌ నవీన్‌రెడ్డి ఆక్రమించారంటూ ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై  బైఠాయించి నిరసన తెలిపారు. తమ భూములను కాజేసిన నవీన్‌రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

 

Don't Miss

Subscribe to RSS - Dalits protest