daughter

15:46 - December 10, 2018

హైదరాబాద్ : అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ, నీతా దంపతుల గారాల పట్టి ఈషా అంబానీ వివాహం ఈ నెల 12న అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుక దేశీయ ప్రముఖులే కాకుండా విదేశాల నుండి వ్యాపార దిగ్గజాలు కూడా వేంచేయనున్నారు. అంబానీవారి ఇంట పెండ్లి సందడికి ప్రముఖ రాజకీయ ప్రముఖులతో పాటు బాలీవుడ్ తారలు..క్రీడా ప్రముఖులు ఇలా ఒకరేంటి అన్ని వర్గాల ప్రముఖులు సందడి చేయనున్నారు.పెళ్లి వేడుకల్లో భాగంగా ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఆదివారం నిర్వహించిన సంగీత్‌లో బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. షారుక్‌ ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, కత్రినాకైఫ్‌, కరీనా కపూర్‌, ఐశ్వర్యరాయ్‌ వేసిన స్టెప్పులతో ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ హోరెత్తిపోయింది. హాలీవుడ్‌ పాప్‌ గాయని బియాన్స్‌, బాలీవుడ్‌ నటీమణి రేఖతో పాటు సచిన్‌ టెండూల్కర్‌, ఆయన భార్య అంజలి కూడా పాల్గొన్నారు. 
ఐదురోజుల పాటు జరగనున్న అజయ్‌ పిరమాల్‌- స్వాతి పిరమాల్‌ల కుమారుడు ఆనంద్‌ పిరమాల్‌..అంబానీ, నీతా దంపతుల గారాలపట్టి ఇషా వివాహం ఆహ్వానం అందుకోవాలంటే కూడా ఓ రేంజ్ వుండాలి.  అంబానీ ఇంట వివాహ వేడుకల్లో బాలీవుడ్ తారలే ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి టాలీవుడ్ నుంచి ఎవరెవరు వెళ్తారు? అన్న ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది. అయితే దీనికి సంబంధించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈషా అంబానీ పెళ్లికి ‘బాహుబలి’ ప్రభాస్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ప్రభాస్ ఒక్కడికే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాఫీ విత్ కరణ్ కార్యక్రమం షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రభాస్ 12వ తేదీన ఈషా అంబానీ-ఆనంద్ పిరమాల్ వివాహానికి హాజరుకానున్నట్లు సమాచారం. 
 

 

16:20 - December 6, 2018

ముంబై  (మహారాష్ట్ర) : శ్రీమంతుల ఇంట్లో పెళ్లి అంటే అంతా హడావిడే. ఎక్కడ చూసినా రిచ్ లుక్సే. ఏది చేసినా ఘనంగా వుండాలి. అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇటువంటి వివాహాలు ఎక్కడా జరగలేదబ్బా అనుకునేంత గొప్పగా..రిచ్ గా వుండాలి. దాని కోసం ఫుడ్, కాస్ట్యూమ్స్, ఎకామిడేషన్,  నుండి అన్ని అరేంజ్ మెంట్స్ అన్నీ అంటే అన్నీ ఘనంగా వుండాలి.అటువంటిది అంబానీవారింటో పెళ్లి అంటే మాటలా? ఎంతటి రిచ్ గా వుంటుందో ఊహించటానికి కూడా సాధ్యంకానంత రిచ్ గా వుండబోతోంది అంబానీగారి గారాల పట్టి ఇషా అంబాని వివాహం. 
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా వివాహం డిసెంబర్ 12న జరగనుంది. ముంబైలోని ‘ఆంటిల్లా’లో వీరి పెళ్లిని అంగరవైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు భారీ నుండి అతి భారీగా జరుగుతున్నాయి. అంబానీల ఇంట పెళ్లంటే.. ఎంత గ్రాండ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందే కుటుంబ సభ్యులు, సన్నిహితులకు అంబానీ, పిరమాళ్ కుటుంబాలు ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం అతిథులను తీసుకెళ్లడానికి అంబానీ ఫ్యామిలీ 30 నుంచి 50 చార్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్‌లను ఉపయోగించనున్నట్టు సమాచారం. సాధారణ రోజుల్లో మహారాణా ప్రతాప్ విమానాశ్రయంలో రోజుకు 19 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఎన్నికల ఎఫెక్ట్, అంబానీ కూతురి ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కారణంగా ఆ విమానాశ్రయానికి రద్దీ భారీగా పెరగనుంది. ఉదయ్‌పూర్‌లో భారీ సంఖ్యలో ఫైవ్ స్టార్ హోటళ్లను కూడా అంబానీ కుటుంబం బుక్ చేసిసేసారు. ఇషా పెళ్లి వేడుకలను సెలబ్రిటీ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తన కెమెరాలో బంధించనున్నారు. ప్రియాంక-నిక్, అనుష్క-విరాట్‌ల పెళ్లికి కూడా ఆయనే ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఉదయ్‌పూర్‌లో ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తర్వాత ముంబైలో నాలుగు రోజులపాటు అంబానీ కూతురి పెళ్లి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. గతంలో కర్ణాటక మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కుమార్తె వివాహం పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగినా ఎంత ఘనంగా చేశాడో తెలిసిన విషయమే. 

 

20:08 - November 25, 2018

హైదరాబాద్ : కన్నతండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి కన్న కూతురినే కాటేయాలనుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచి, ఆలానాపాలనా చూడాల్సిన తండ్రి ఆమెను భక్షించాలనుకున్నాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కూతురిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. అమీర్‌పేటలో ఓ వ్యక్తి భార్యా, ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. రెండో కూతూరు(13) ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై పలుమార్లు అత్యాచారానికి యత్నించాడు. మూడు రోజుల కిందట తండ్రి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ బాలిక భయంతో పారిపోయింది. మరుసటి రోజు పాఠశాలకు వెళ్లిన బాలిక ఎవరితో మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నది. అయితే ఉపాధ్యాయినికి  అనుమానం వచ్చి.. బాలికను ప్రశ్నించడంతో రోదిస్తూ తండ్రి వికృత చేష్టలను తెలిపింది. బాధితురాలి తల్లిని పిలిపించిన ఉపాధ్యాయులు విషయాన్ని తెలిపారు. తల్లి, కూతురితో కలసి ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పొక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

16:32 - November 16, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు రోజురోజుకు  రసవత్తరంగా మారుతున్నాయి. ఆయా పార్టీలు..నేతలు, సీట్లు, కేటాయింపులు, జంపింగ్ జిలానీలు వంటి పలు అంశాలపై వేడి వేడిగా కొనసాగుతు ఎన్నికల స్టంట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరో అంశం హాట్ టాపింగ్ గా మారింది. రాజకీయ వ్యూహాలలో కేసీఆర్ దిట్ట. అతనికంటే  ఇంకో పైమెట్టుగానే వుండే ఏపీ సీఎం చంద్రబాబు చాణక్య వ్యూహాలకు కేరాఫ్ అడ్రస్ గా వుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు రాత్రికి రాత్రే ఓ నిర్ణయం తీసుకుని రాజకీయాలలో మరింత వేడిని రాజేశారు. అదే! దివంగత నేత, చంద్రబాబు బావమరిది, టీడీపీ మాజీ ఎంపీ అయిన హరికృష్ణ కుమార్తెకు కుకట్ పల్లి సీటును కేటాయించటం. ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ సీటును ఆశించిన టీడీపీ నేతలకు కూడా మారు మాట్లాడలేని పరిస్థితి. బాబు వ్యూహం అటు సెంటిమెంట్ ను ఇటు రాజకీయ లబ్ది రెండు నెరవేర్చేలా వుండటం గమనించాల్సిన విషయం. 
Image result for kcr and chandrababuఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల్లో ఏర్పడిన మహాకూటమిలో భాగస్వామిగా వున్న టీడీపీపై టీఆర్ఎస్ పార్టీ ఏకధాటిగా విమర్శిస్తూ వస్తోంది.. చంద్రబాబు తెలంగాణను అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నాడంటూ చెప్పుకొస్తోంది.. తెరాస  విమర్శలకు బలం చేకూరేలా కూటమిలో బాబు పావులు కదుపుతున్నాడేందుకు కూకట్ పల్లి సీటే నిదర్శనం.. అమరావతిలో కూర్చుని చర్చల మీద చర్చలు జరిపి.. నయానో - భయానో అందరినీ ఒప్పించి మరీ కూకట్ పల్లి టిక్కెట్ హరికృష్ణ కూతురు సుహాసినికి దక్కేట్టు చేసుకున్నాడు..కానీ అసలు కథ ఇక్కడే ఉంది..

Image result for harikrishna death kcr talasaniహరికృష్ణ దుర్మరణం పాలైనప్పుడు తెరాస  ప్రభుత్వం చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. హరికృష్ణ మృతి నుండి అంత్యక్రియలవరకూ అంతా తానే అయి కార్యక్రమాలను దగ్గరుండి మరీ జరిపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాదు ఇప్పుడు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా వున్న కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో హరికృష్ణ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. స్మారక స్థూపానికి కూడా ప్రామిస్ చేశారు..టీడీపీ అంటేనే గిట్టని టీఆర్ఎస్ ఇదంతా ఎందుకు చేసినట్లు? టీఆర్ఎస్ మంత్రులే కాదు సాక్షాత్తు సీఎం కేసీఆరే స్వయంగా వెళ్లి చంద్రబాబును, ఎన్టీఆర్, కళ్యాణ రామ్ లను పరామర్శించారు. అప్పట్లో చర్చనీయాంశం కూడా అయ్యింది. జనం మరిచిపోయింటారులే అని అంత తేలిగ్గా తీసేయటానికి కూడా లేదు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల్లో సరిగ్గా ఇప్పుడే చంద్రబాబు చాణక్య వ్యూహాన్ని అమలు చేశారు. అదే హరికృష్ణ కుమార్తె సుహాసినికి కుకట్ పల్లి సీటు ఖరారు చేయటం!!.ఈ అంశం టీఆర్ఎస్ ను కూడా ఇరుకున పెట్టేలా వుండటం మరో విశేషంగా చెప్పుకోకతప్పదు. అదెలాగో చూద్దాం...

హరికృష్ణకు అంత చేసిన టీఆర్ఎస్ పౌ టీడీపీ నేతలకు కాస్తో కూస్తో అభిమానం ఏర్పడకపోదు. ఒక వేళ అది కనుక జరిగి వుంటే టీడీపీ  ఓట్లు చేజారతాయనే నేపథ్యం..హరికృష్ణ గౌరవం ఇచ్చినట్లుగాను వుంటుంది..మరోపక్క అతనికి సరై గుర్తింపు ఇచ్చినట్లుగాను వుంటుంది. అలాగే వారి కుటుంబాల పరంగా చూస్తే అందరినీ ఒకతాటిపైకి తెచ్చినట్లుగా వుంటుంది. అంతేకాదు..హరికృష్ణ కుటుంబంలో పురుషులు వున్నాగానీ..అటు కుటుంబంలోను..ఇటు సమాజంలోను మహిళ సెంటిమెంట్ ను గౌరవించినట్లుగా..ఇలా చెప్పుకుంటు పోతే చంద్రబాబు ఒక దెబ్బకు అంటే ఒకే ఒక్క ఆలోచనకు...సముచిత నిర్ణయానికి ఒకే దెబ్బకు ఎన్ని ప్రయోజనాలో లెక్క వేసుకోవాలంటే ఎన్నైనా వుంటాయి..

Image result for chandrababi suhasiniహఠాత్తుగా వెలుగులోకొచ్చిన సుహాసిని..ఎమ్మెల్యే అభ్యర్థి..
నిన్నటి దాకా ఆమె ఎవరో కూడా ఎవరికీ తెలీదు.. ఇంకా చెప్పాలంటే హరికృష్ణకు కూతురున్న సంగతి కూడా చాలా మందికి తెలీదు.. ఇప్పుడామె ఎమ్మెల్యే అభ్యర్థి.. అదీ టీడీపి తరుపున.. గెలుపు కోసం ఆమె ఈ ఎన్నికల్లో ఏమని ప్రచారం చేస్తుంది.. అధికార పార్టీని విమర్శిస్తూ ప్రచారం చేయగలదా..? చేసి ఓట్లు రాబట్టగలదా? ఒక వేళ అదే చేస్తుందనుకుంటే.. మరి తెరాస  వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? హరికృష్ణ అవటానికి చంద్రబాబుకు బామ్మర్ది అయినా.. తమ సొంత బామ్మర్ది అయినంతగా స్పందించిన తెరాసను నందమూరి సుహాసిని ఘాటుగా విమర్శించగలదా? కోరి స్నేహ హస్తం చాచిన గులాబీతో తెగదెంపులకు సిద్ధ పడగలదా? ఇప్పుడు సిటీ జనాలందరినీ ఇదే ప్రశ్న తొలుస్తోంది.. నామినేషన్ ఇంకా వేయలేదు కానీ.. వేశాక ఏంటి పరిస్థితి? అనేదే హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి పెద్ద చిక్కొచ్చి పడిందే అని అటు టిడిపి క్యాడరు - ఇటు గులాబీ క్యాడరు పైకి చెప్పలేక..మనస్సులో దాచుకోలేని లోలోపలే ఆందోళన పడుతున్నట్లుగా తెలుస్తోంది.

-మైలవరపు నాగమణి

 
 
 
 
06:43 - November 9, 2018

హైదరాబాద్ : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు మారే నేతల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే జంపింగ్ జిలానీలు తమ గూడుకు చేరుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్య సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె ఏపీ సీఎం చంద్రబాబును కలిసి టీడీపీలో చేరే అంశాన్ని ప్రతిపాదించారు.
గతంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రమ్య ఆ పార్టీ నేతల వైఖరితో మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. దీంతోనే ఆమె సైకిల్ జర్నీకి సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని టీటీడీపీ నేతలతో చర్చించిన చంద్రబాబు ఈ సమయంలో రమ్యను పార్టీలోకి తీసుకుంటే రెచ్చగొట్టినట్టవుతుందేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలతో టీటీడీపీ నేతలు కూడా ఏకీభవించినట్టు తెలుస్తోంది.
 

11:20 - October 17, 2018

అనంతపురం : తెలుగు రాష్ట్రాల్లో వరుసుగా కుల దురహంకార హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాణాల కన్నా కులానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారని కన్నబిడ్డలనే కడతేర్చుతున్నారు. తెలంగాణలో మిర్యాలగూడలో ప్రణయ్ హత్య, హైదరాబాద్‌లో ప్రేమజంటపై దాడి ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలోనూ కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో మరో కుల దురహంకార హత్య జరిగింది. తమకు ఇష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు బాలికను దారుణంగా హత్య చేశారు. హెచ్ఎల్‌సీ కాలువలో ఆదివారం ఓ బాలిక మృతదేహం కనిపించింది.

అనంతపురం జిల్లా చెన్నంపల్లికి చెందిన హేమశ్రీ(16), మోహన్‌రాజు(20) పది రోజుల కిందట తిరుమలకు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవలే ఆమె యువకుడితో కలిసి గ్రామానికి వచ్చింది. వివాహం చేసుకుని గ్రామానికి వచ్చారని తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు యువకుడి ఇంటికి వచ్చారు. ఇంటికి రావాలని తల్లిదండ్రులు బాలికను కోరారు. ఆమె ససేమిరా అనటంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై కొందరు యువకులు 100కు ఫోన్‌ చేసి సమాచారమిచ్చారని, పోలీసులు స్పందించలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 

అయితే ఆగ్రహం పట్టలేని తల్లిదండ్రులు నాలుగురోజుల కిందట బాలికను వీధుల్లో కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. అదేరోజు రాత్రి నుంచి బాలిక, తల్లిదండ్రులు గ్రామంలో కనిపించలేదు. ఈ క్రమంలో గ్రామస్థులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బాలిక తండ్రి, బాబాయ పథకం ప్రకారం హేమశ్రీని బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని హెచ్ఎల్‌సీ కాలువలో పడేశారు. 

ఆదివారం హెచ్ఎల్‌సీ కాలువలో బాలిక మృతదేహం కనిపించింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ మృతదేహం చెన్నంపల్లికి చెందిన బాలిక హేమశ్రీ(16)దిగా నిర్ధారించారు. దీనిపై మంగళవారం బాలిక తల్లిదండ్రులు ఎర్రమ్మ, నారాయణస్వామితోపాటు బాలిక బాబాయిని అదుపులోకి తీసుకుని విచారించారు. వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందనే ఆగ్రహంతో కుటుంబసభ్యులే హత్య చేసి హెచ్ఎల్‌సీ కాలువలో పడేసి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది.

 

20:12 - March 2, 2018

గుంటూరు : జిల్లాలోని బాపట్ల పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కూతుళ్ళు మృతి చెందారు. బాపట్ల పట్టణంలోని భీమునిగుంట వాగు వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. కోట్రావారి విధికి చెందిన కోట్రా శ్రీనివాస్‌రావు తన పెద్ద కూతురు లక్ష్మీ ప్రియాంకను కళాశాల నుంచి స్కూటీ పై ఇంటికి తీసుకెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.  ఈ ప్రమాదంలో లక్ష్మీ ప్రియాంక అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రావు మృతి చెందాడు. 

 

11:53 - September 19, 2017

నల్లగొండ : జిల్లాలోని చింతపల్లి మండలం టీదేడులో దారుణం జరిగింది. పలువురు యువకులతో సన్నిహితంగా ఉంటుందని కూతురు రాధికను తల్లిదండ్రులు హత్య చేశారు. నర్సింహ, లింగమ్మ అనే దంపుతులు టీదేడులో నివాసముంటున్నారు. వీరి కూతురు రాధిక (13) ఏడో తరగతి చదువుతోంది. రాధిక పలువురు యువకులతో సన్నిహితంగా ఉంటోందని ఆరోపణ ఉంది. పరువు పోతోందని కుమార్తెపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా అమె అలాగే యువకులతో సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. కుమార్తె రాధికను తండ్రి నర్సింహ మందలించారు. రాధిక తంద్రికి ఎదురుదిరిగింది. దీంతో ఎదురు తిరిగిన కుమార్తెను తండ్రి గొంతు నులిమి చంపాడు. అయితే విషయం బయటకు పొక్కకుండా ఇంట్లోనే శవాన్ని తగులబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ నెల 15న పోలీసుల విచారణలో ఈఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులు నర్సింహ, లింగమ్మలను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:22 - July 5, 2017

అనంతపురం : జిల్లా తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. రామసుబ్బారెడ్డి పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో పురుగుల మందు తాగారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి ఆయన మృతి చెందాడు. తాడిపత్రిలోని టీటీడీ కల్యాణ మండపం వెనుక పురుగుల మందు తాగి పడిపోవడంతో గుర్తించిన స్థానికులు ఆసుపత్రి కి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:44 - June 7, 2017

మహబూబ్ నగర్ : జిల్లా నారాయణ పేట మండలం జజాపూర్ లో విషాదం జరిగింది. ఇంటి బయట పెన్సింగ్ పై కరెంట్ వైర్లు బడ్డాయి అది గమనించని తల్లి పెన్సింగ్ తగలడంతో షాక్ కొట్టింది. వెంటనే ఆమె కూతురు తల్లిని రక్షించబోయి ఆమె కూడా కంరెట్ షాక్ తో మృతి చెందింది. ఒకే కుటుంబంలో తల్లి కూతురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Pages

Don't Miss

Subscribe to RSS - daughter