dead body

12:28 - July 10, 2017

సూర్యాపేట : మానవత్వం మంట గలిసిపోతోంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని మరోసారి రుజువైంది. డబ్బు ముందు అన్నదమ్ముల అనుబంధానికి విలువ లేకుండా పోయింది. అన్న మృతదేహం ముందే ఆస్తి కోసం కొట్టుకున్న ఘటన.. సూర్యాపేట జిల్లా, చింతలపాలెం మండలంలోని కొత్తగూడెంతండాలో జరిగింది. దహన సంస్కారాలు నిర్వహించాల్సినవాళ్లు నిస్సిగ్గుగా ప్రవర్తించారు. రెండు రోజులుగా శవాన్ని ఇంట్లోనే పెట్టుకొని రక్తం కారేలా కొట్టుకొని.. చివరకు ఆసుపత్రి పాలయ్యారు. బాణోతు వెంకటేశ్వర్లు పెళ్లి చేసుకోలేదు. గతంలో వెంకటేశ్వర్లు ఆలనాపాలనా అతని అన్న కుమారుడు నరసింహ చూసుకునేవాడు. ఆ సమయంలో వెంకటేశ్వర్లు తనకున్న 4 ఎకరాలను.. నరసింహకు రిజిస్ట్రేషన్‌ చేసిచ్చాడు. ఇప్పుడు ఆ భూమిలో తమకూ వాటా ఇవ్వాలంటూ నరసింహ అతని కుటుంబ సభ్యులతో బాణోజి, హనుమంతరావు ఘర్షణకు దిగారు. లేదంటే అంత్యక్రియలు జరగనిచ్చేది లేదంటూ గొడవకు దిగారు. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

09:58 - July 10, 2017

నిజామాబాద్ :వర్ని మండలం సిద్ధాపూర్‌లో విషాదం నెలకొంది. 4వ తరగతి చదువుతున్న శ్రీకాంత్‌ అనే బాలుడు అనుమానాస్పదస్థితిలో చనిపోయాడు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన శ్రీకాంత్‌ ఇవాళ పొలం దగ్గర శవమైతేలాడు. మృతదేహాన్ని గుర్తుతెలియని దుండగులు పడేసి పోతుండగా స్థానికులు గుర్తించారు. దుండగుల వాహనాన్ని గ్రామస్తులు వెంబడించగా తప్పించుకుని పారిపోయారు. శ్రీకాంత్‌ మృతితో అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. రెండు రోజుల కిందట శ్రీకాంత్‌ కనిపించకుండాపోయారు. తల్లిదండ్రులు తెలిసిన చోటల్లా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తుండగా ఇంతలోనే శవమై కనిపించాడు. బాలుడి మృతితో సిద్ధాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

13:55 - June 23, 2017

వికారాబాద్ : శంషాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డుపై అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్‌ను మంటలు చుట్టుముట్టాయి. హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి అంబులెన్స్‌లో మృతదేహం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌లో మంటలు చెలరేగడంతో మృతదేహం సగానికి పైగా కాలిపోయింది. అయితే డ్రైవర్‌ అప్రమత్తతో.. అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న వారు వాహనం నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కొత్వాల్‌ గూడ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 

17:39 - June 3, 2017

హైదరాబాద్ : నగరంలోని హైలార్ దేవులపల్లిలో దారుణం జరిగింది. కూతురు అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో మృతదేహాన్ని తండ్రి పెంటయ్య డ్రైనేజీలో పడేశాడు. లక్ష్మిగూడకు చెందిన పెంటయ్య కూతురు భవాని ఆత్మహత్య చేసుకుంది. పక్క ఇంట్లో దొంగతనం చేసిందని ఆమెను మందలించడంతో ఆత్మహత్య చేసుకునట్టు తెలుస్తోంది. చేతిలో చిల్లిగవ్వలేని పెంటయ్య కూతురు మృతదేహాన్ని డ్రైనేజీలో పడేశాడు. మూడు రోజుల తర్వాత స్థానికులు డ్రైనేజీలో మృతదేహాన్నిన గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేపట్టి పెంటయ్య కూతురుగా గుర్తించారు. పెంటయ్య పై ఐపిసి 176 సెక్షన్ కింద కేసు పెట్టారు. గత సంవత్సరం పెంటయ్య కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుడు అప్పు చేసి అంత్యకియలు నిర్వహించారు. ప్రస్తుతం పైసాలు లేక ఈ పని చేశానని పెంటయ్య చెప్పారు. 

15:23 - April 21, 2017

దక్షిణాఫ్రికా : ఓ చిన్నారిని సజీవంగా పూడ్చిపెట్టినా ప్రాణాలతో బయటపడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని ప్రావిన్స్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...క్వాజులు - నాటల్ ప్రావిన్స్ లో ఓ 25 ఏళ్ల మహిళ టింబర్ డిపోలో పనిచేస్తోంది. ఇటీవలే పండటి మగబిడ్డ జన్మించాడు. కానీ ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలియవద్దని ఆ పసికందును పనిచేస్తున్న చోటే పూడ్చేసింది. కానీ మూడు రోజులకు ఆ చిన్నారి ఏడుపులు అక్కడి వారికి వినిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. వెంటనే పోలీసులు శిశువును కాపాడారు. ప్రస్తుతం పోర్ట్ పెష్ స్టోన్ రీజనల్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వెంటనే తల్లిపై పోలీసులకు కేసు నమోదు చేశారు.

10:15 - April 20, 2017

దేశంలో అమానవీయ దృశ్యాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒకచోట విషాదమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవలే పలువురు తమ సభ్యుల మృతదేహాలను మోసుకెళ్లిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో మరో విషాదం వెలుగు చూసింది. దంతేవడాలోని ఒక గిరిజన యువకుడు బిజ్జీ (37) మృతి చెందాడు. అడవి పంది దాడి చేయడంతో అతను కన్నుమూశాడు. ఈ ప్రమాదంపై గ్రామస్తులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని చెప్పారు. మృతదేహాన్ని తీసుకరావాలని ఆదేశించారు. కానీ పోస్టుమార్టం కోసం ప్రభుత్వ వాహనాలనే ఉపయోగించాల్సి ఉంటుంది. మృతదేహాన్ని తీసుకరావడానికి మృతుడి కుటుంబసభ్యుల్లో ఎవరికీ వాహనం లేదు. చేసేది ఏమీ లేక మృతదేహాన్ని మంచానికి కట్టేసి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. బంధువుల రోదనల మధ్య మృతదేహాన్ని తీసుకెళుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమ్యంలో వైరల్ అయిపోయాయి. దీనిపై పోలీసులు స్పందిచంఆరు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం..వారి కుట్రలో భాగమని ఆరోపణలు గుప్పించడం గమనార్హం.

06:45 - April 13, 2017

యాదాద్రి భువనగిరి : కొన్ని గంటల క్రితం జరిగిన ఘటకు సంబంధించిన బాధితురాలు స్వాతి పెదవి విప్పారు... ఎన్నారై మధుకర్‌రెడ్డి మరణం అనుమానాస్పదమంటూ...అందుకు కారణం భార్య స్వాతి అని ఆమెపై అంత్యక్రియల సమయంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే...తన భర్తను హింసించిందని...రకరకాలుగా వేధించిందని... చివరకు ఆమెనే చంపిందంటూ మెట్టినింటివారు.. బంధువులు స్వాతిపై దాడికి దిగారు...

మధుకర్‌రెడ్డి అంత్యక్రియల్లో జరిగిన దాడితో ...

మధుకర్‌రెడ్డి అంత్యక్రియల్లో జరిగిన దాడితో ఒక్కసారి ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది..ఊహించని విధమైన దాడితో స్వాతి..ఆమె కుటుంబీకులు భయభ్రాంతులకు గురయ్యారు..అప్పటికే బంధువులు దాడిని అడ్డుకోగా... పోలీసులు రావడంతో కాస్త సద్దుమణిగింది..వెంటనే స్వాతి పేరెంట్స్‌తో కలిసి పోలీసు స్టేషన్ వెళ్లి తనకు ప్రాణహానీ ఉందంటూ...రక్షణ కల్పించాలంటూ వేడుకుంది...

తనకు సంబంధం లేదు..

కాలిఫోర్నియాలో ఉంటున్న మధుకర్‌రెడ్డి కొంతకాలంగా ఉద్యోగానికి సంబంధించిన డిప్రెషన్‌లో ఉన్నారని...అదే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతుంది భార్య స్వాతి....తన భర్త అంత్యక్రియలకు వెళ్లినప్పుడు తనపై దారుణంగా దాడి చేశారని.. ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన పాప ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతుంది స్వాతి..

మా మధ్య చిన్న గొడవలే..

మధుకర్‌ తనపై చేయి చేసుకున్నాడని...అయినా భరిస్తూ కాలం వెళ్లదీస్తున్నానంటోంది స్వాతి... భార్యాభర్తల మధ్య గొడవలున్నాయని..అయితే అవి చంపుకునేంత..చచ్చిపోయేంత పెద్దవి కావంటోంది స్వాతి...

అత్తమామలకు చెప్పినా శూన్యం..

అయితే తమ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలున్నా..భర్త డిప్రెషన్‌లో ఉంటున్న విషయాన్ని ఎప్పటికప్పుడు అత్తమామలతో చెప్పానని..వారు మాత్రం పట్టించుకోలేదంటోంది స్వాతి...బంధువులు..ఇంట్లోవారు చెప్పిన మాటల ప్రభావంతో మధుకర్‌లో చాలా మార్పు వచ్చిందని..ఆ మార్పుకు నిదర్శనమే తనపై చేయి చేసుకోవడమని చెబుతోంది..ఏదీ ఏమైనా తన జీవితం అగమ్య గోచరమైందని...ఇప్పుడు జరిగిన దాడితో భయం కూడా పట్టుందంటోంది...

13:34 - April 11, 2017

నల్లగొండ : అమెరికాలోని కాలిఫోర్నియా లో వారం రోజుల క్రితం ఆత్మహత్యా చేసుకున్న మధుకర్ మృతదేహం నల్లగొండ జిల్లా స్వగ్రామానికి చేరుకుంది. మధకర్ తల్లిదండ్రులు తమ కొడుకుది ఆత్మహత్యా కాదని తమ కోడలు స్వాతి హత్య చేసి ఉరి వేసుకున్నట్టు చెబుతోందని వారు ఆరోపించారు. మధుకర్ భార్య స్వాతిపై మధుకర్ తరుపు వారు వారు దాడి చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనకు ప్రాణా హాని ఉందని రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరింది. మధుకర్, స్వాతి దంపతులకు 7 సంవత్సరాలుగా కాలిఫోర్నియాలో నివాసిస్తున్నారు. వారికి 3 సంవత్సరల కుతూరు ఉంది.

 

10:15 - February 27, 2017

అమెరికా : ఉన్మాది చేతిలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం ఈ రోజు హైదరాబాద్‌కు రానుంది. రాత్రి 8:45 గంటలకు శ్రీనివాస్ మృతదేహం శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటుంది. బొల్లారం ఖాజీపల్లిలోని శ్రీనివాస్ స్వగృహానికి మృతదేహం తరలిస్తారు. మంగళవారం ఉదయం 11గంటలకు మహాప్రస్తానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
జాతివివక్ష తలకెక్కిన తెల్లజాతీయుడు ఆడం పురింటన్‌ విచక్షణ రహిత చర్యకు.. తెలంగాణ వాసి శ్రీనివాస్‌ కూచిభొట్ల బలయ్యాడు. మరొకరు గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. హైదరాబాద్‌ జెఎన్‌టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్‌, అమెరికాలోని టెక్సాస్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశాడు. కాన్సాస్‌ రాష్ట్రంలోని ఒలాతేలో ఉన్న గార్మిన్‌ కంపెనీలో ఏవియేషన్‌ ఇంజనీర్‌గా చేరాడు.

13:37 - February 13, 2017

హైదరాబాద్ : గతవారం అనారోగ్యంతో పోలెండ్‌లో మృతిచెందిన విద్యార్థిని నాగశైలజ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించకుండా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సిబ్బంది నిలిపివేసింది. నాగశైలజకు పాస్‌పోర్టు లేదంటూ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో పోలెండ్‌ నుంచి వచ్చిన గిరిజన విద్యార్థిని మృతదేహం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే నిలచిపోయింది. తమ కూతూరు మృతదేహాన్ని ఇవ్వాలని నాగ శైలజ కుటుంబ సభ్యులు కోరినా... పాస్‌పోర్టు లేనందున మృతదేహాన్ని ఇవ్వమని కార్గో అధికారులు తేల్చి చెబుతున్నారు.

మచిలీపట్నం..
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ జిల్లా మచిలీపట్నంకు చెందిన వెంకటేశ్వర్లు, విజయలక్ష్మీ కూతురు నాగ శైలజ. కొన్నాళ్ల క్రితం మచిలీపట్నం నుంచి హైదరాబాద్‌లోని చందానగర్‌కు వచ్చి.. అక్కడే ఉంటున్నారు. 2012లో మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో నాగ శైలజ బీటెక్‌ పూర్తి చేసింది. 2013లో మిథానిలో ఒక ఏడాది పాటు అప్రెంటీస్‌ చేసిన నాగశైలజ.. ఎంఎస్‌ చదవడం కోసం 2014లో పోలెండ్‌ దేశానికి వెళ్లింది. వచ్చే జూన్‌లో చదువు పూర్తి చేసుకుని.. హైదరాబాద్‌ రావాల్సిన ఉన్న నాగ శైలజ.. 10 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ వారం క్రితం నాగ శైలజ చనిపోయింది. కుటుంబ సభ్యులు, పోలెండ్‌లో ఉన్న స్నేహితుల సహాయంతో నాగ శైలజ మృతదేహాన్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తెప్పించుకోగలిగారు. అయితే.. నాగ శైలజ మృతదేహం తీసుకొచ్చిన ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది కారణంగా ఇప్పుడు మృతదేహం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే ఉంది. నాగ శైలజకు సంబంధించిన పాస్‌పోర్టు, ఇతర డాక్యుమెంట్లను అందజేయకపోవడంతో కార్గో అధికారులు మృతదేహాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో నాగ శైలజ కుటుంబ సభ్యులో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - dead body