December 12

16:22 - December 15, 2018

సూరత్ : ఆ చిన్నారి పుట్టి రెండు గంటలే అయ్యింది..
బర్త్ సర్టిఫికెట్ వచ్చేసింది..
రేషన్ కార్డ్ వచ్చేసింది..
రేషన్ కార్డ్ వచ్చేసింది..
ఆధార్ కార్డ్ వచ్చేసింది..
ఆఖరికి పాస్ పోర్ట్ కూడా వచ్చేసింది...

అప్పుడే పుట్టిన ఓ శిశువు అమ్మ పొత్తిళ్లలోని వెచ్చదనం  ఇంకా అలవాటు కాలేదు..కానీ ఈ చిన్నారికి అన్ని రకాల గుర్తింపు కార్డులు వచ్చేశాయి. పుట్టిన రెండు గంటలకే తన తల్లిదండ్రుల దగ్గరి నుంచి ప్రత్యేకమైన బహుమతుల్ని గెలిచేసుకుంది. పుట్టిన రెండు గంటలకే ఆధార్‌, రేషన్‌కార్డు, పాస్‌పోర్టును సంపాదించి దేశంలో మొదటి డిజిటల్ బేబీ అయిపోయింది. పుట్టిన వెంటనే అన్ని గుర్తింపు పత్రాలు ఉండాలన్న ఆ తల్లిదండ్రుల కల నెరవేరింది. 
గుజరాత్‌కు చెందిన అంకిత్‌ దంపతుల కలలకు చిన్నారి రూపంలో అమ్మ ఒడికి చేరుకుంది ఓ శిశువు. ఆ దంపతుల కలల రూపానికి రమైయా  అని పేరు కూడా పెట్టేసుకున్నారు. డిసెంబరు 12 పుట్టిన ఈ చిన్నారి  రమైయా తండ్రి  తన కూతురిని ప్రధాని మోదీ తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా కార్యక్రమంతో అనుసంధానం చేయాలనుకున్నాడు. తన బిడ్డ పుట్టిన వెంటనే అన్ని రకాల గుర్తింపు పత్రాలున్న చిన్నారిగా గుర్తింపు పొందాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే రెండు గంటల్లోనే అన్ని ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసేశాడు.
ఈ సందర్భంగా అంకిత్ మాట్లాడుతు..అధికారులు సాయంతో నేను అనుకున్నది చేయగలిగాననీ..నా కూతురు పుట్టినప్పటి నుంచే డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగమైన మొదటి వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలని భావించానని తెలిపాడు. బిడ్డపుట్టకుముందు నుంచే దానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టామని..మొదట జన్మధ్రువీకరణ పత్రం తీసుకొని తరవాత మిగతావాటికి దరఖాస్తు చేసుకొని వెంటనే పొందామని అంకిత్ దంపతులు ఆనందంగా తెలిపారు. 
కాగా గత  ఏప్రిల్‌లో కూడా మహారాష్ట్రకు చెందిన తల్లిదండ్రులు తమ బిడ్డకు జన్మనిచ్చిన 1.48 నిమిషాల్లోనే ఆధార్‌ కార్డుకోసం పేరు నమోదు చేయించిన తల్లిదండ్రులుగా గుర్తింపు పొందారు. ఇలా ఎవరి కోరికలు వారివి. తమ కలల పంట కళ్లముందుకొచ్చిన సమయాన్ని ఇలా శాశ్వతంగా గుర్తుండిపోవటానికి..అందరిలో గుర్తింపు దక్కించుకోవటానికి కొంతమంది ఆశపడతుంటారు. ఆరాటపడుతుంటారు. దీనికి ఇటువంటి సంఘటనలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
 

11:30 - December 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ పోలింగ్ ప్రశాతంగా పూర్తయింది. దీంతో ఫలితాల కోసం నేతలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారే ధీమాగా వున్న క్రమంలో సీఎం పదవి ప్రమాణస్వీకారం కోసం ముహూర్తాలను కూడా ఖరారు చేసేసుకుంటున్నారు. పంచమి తిథి, బుధవారం మంచి రోజు కావటంతో ప్రమాణస్వీకారం కోసం బుధవారం డిసెంబర్ 12న ముహూర్తం పెట్టేసుకుంటున్నారు. 
ఫలితాల అనంతరం ఏం చేయాలన్న దానిపై ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసేసుకుంటున్నారు.టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ మరోమారు సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తారు. ప్రజాఫ్రంట్ గెలిస్తే కనుక కూటమిలోని ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌నే ముఖ్యమంత్రి పదవి వరిస్తుంది. మరి ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇప్పటివరకూ క్లారిటీ లేకపోయినా వారు కూడా బుధవారం రోజునే ప్రమాణస్వీకారం ముహూర్తం పెట్టకున్నట్లుగా రాజకీయ వర్గాల సమాచారం. 
బుధవారం పంచమి కావడమే ఇందుకు కారణం. ఆ తర్వాత మంచి రోజులు లేకపోవడంతో బుధవారమే ప్రమాణ స్వీకారం కానిచ్చేందుకు ఇరు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. కూటమి కనుక విజయం సాధిస్తే మంగళవారమే కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సీఎల్పీ నేతను ఎన్నుకుంటారు. 12న ఆ నేత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి సంకేతాలు అందినట్టు చెబుతున్నారు.  కూటమిలోని పార్టీలు గెలిచిన సీట్లను బట్టి మంత్రి పదవుల పంపకం ఉంటుందని సమాచారం.  
 

16:20 - December 6, 2018

ముంబై  (మహారాష్ట్ర) : శ్రీమంతుల ఇంట్లో పెళ్లి అంటే అంతా హడావిడే. ఎక్కడ చూసినా రిచ్ లుక్సే. ఏది చేసినా ఘనంగా వుండాలి. అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇటువంటి వివాహాలు ఎక్కడా జరగలేదబ్బా అనుకునేంత గొప్పగా..రిచ్ గా వుండాలి. దాని కోసం ఫుడ్, కాస్ట్యూమ్స్, ఎకామిడేషన్,  నుండి అన్ని అరేంజ్ మెంట్స్ అన్నీ అంటే అన్నీ ఘనంగా వుండాలి.అటువంటిది అంబానీవారింటో పెళ్లి అంటే మాటలా? ఎంతటి రిచ్ గా వుంటుందో ఊహించటానికి కూడా సాధ్యంకానంత రిచ్ గా వుండబోతోంది అంబానీగారి గారాల పట్టి ఇషా అంబాని వివాహం. 
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా వివాహం డిసెంబర్ 12న జరగనుంది. ముంబైలోని ‘ఆంటిల్లా’లో వీరి పెళ్లిని అంగరవైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు భారీ నుండి అతి భారీగా జరుగుతున్నాయి. అంబానీల ఇంట పెళ్లంటే.. ఎంత గ్రాండ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందే కుటుంబ సభ్యులు, సన్నిహితులకు అంబానీ, పిరమాళ్ కుటుంబాలు ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం అతిథులను తీసుకెళ్లడానికి అంబానీ ఫ్యామిలీ 30 నుంచి 50 చార్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్‌లను ఉపయోగించనున్నట్టు సమాచారం. సాధారణ రోజుల్లో మహారాణా ప్రతాప్ విమానాశ్రయంలో రోజుకు 19 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఎన్నికల ఎఫెక్ట్, అంబానీ కూతురి ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కారణంగా ఆ విమానాశ్రయానికి రద్దీ భారీగా పెరగనుంది. ఉదయ్‌పూర్‌లో భారీ సంఖ్యలో ఫైవ్ స్టార్ హోటళ్లను కూడా అంబానీ కుటుంబం బుక్ చేసిసేసారు. ఇషా పెళ్లి వేడుకలను సెలబ్రిటీ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తన కెమెరాలో బంధించనున్నారు. ప్రియాంక-నిక్, అనుష్క-విరాట్‌ల పెళ్లికి కూడా ఆయనే ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఉదయ్‌పూర్‌లో ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తర్వాత ముంబైలో నాలుగు రోజులపాటు అంబానీ కూతురి పెళ్లి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. గతంలో కర్ణాటక మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కుమార్తె వివాహం పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగినా ఎంత ఘనంగా చేశాడో తెలిసిన విషయమే. 

 

Don't Miss

Subscribe to RSS - December 12