defence minister

21:10 - February 12, 2018

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని సంజ్వాన్‌లో ఆర్మీ ఆపరేషన్‌ ముగిసిందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆర్మీ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని మంత్రి వెల్లడించారు. ఉగ్రవాద దాడుల వెనక పాకిస్తాన్‌కు చెందిన జైష్‌ -ఎ-మహ్మద్‌ హస్తం ఉందని మంత్రి పేర్కొన్నారు. పాకిస్తాన్‌ ప్రోత్సాహంతోనే ఉగ్రదాడులు జరుగుతున్నాయని... ఉగ్రవాద నేత మసూద్‌ అజహర్‌ కశ్మీర్‌కు టెర్రరిస్టులను స్పాన్సర్‌ చేస్తున్నారని సీతారామన్‌ స్పష్టం చేశారు. త్వరలో ఎన్‌ఐఏ ఆధారాలను సేకరిస్తోందని మంత్రి చెప్పారు. ఉగ్రవాదుల దాడులను భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పి కొడుతున్నాయన్నారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో రక్షణమంత్రి జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. 

21:31 - October 31, 2017

ముంబై : ఎల్ఫిన్‌స్టన్‌ రైల్వేస్టేషన్‌ను కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయెల్‌, నిర్మలా సీతారామన్‌ ఘటనా స్థలాన్ని సందర్శించారు. సెప్టెంబర్‌ 29న పాదాచారుల వంతెనపై తొక్కిసలాట జరిగి 23 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ హృదయ విదారక ఘటన జరిగిన నెల రోజులకు కేంద్ర మంత్రులు బ్రిడ్జిని సందర్శించారు. వీరివెంట మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ కూడా ఉన్నారు. ఈ వంతెన పునర్నిర్మాణం చేపడుతున్నట్లు సిఎం ప్రకటించారు. ఇందుకోసం సైన్యం సాయం తీసుకుంటున్నట్లు ఫడ్నవిస్ వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 31 నాటికి వంతెన నిర్మాణం పూర్తవుతుందని సిఎం చెప్పారు. సివిల్‌ పనులను ఆర్మీ చేపట్టడం ఇదే తొలిసారని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆర్మీ పాత్ర సరిహద్దులోనే ఉంటుంది కానీ ఈ ఘటన పెను విషాదమని.. బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి చెప్పారు. బ్రిడ్జి పనుల్లో కూడా ఆర్మీని వినియోగించడంపై పంజాబ్‌ సిఎం అమరిందర్‌సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

08:48 - September 27, 2017

ఢిల్లీ : ఆప్గనిస్తాన్‌కు భారత సైనికులను పంపే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. అభివృద్ధి, వైద్య సేవలకు తదితర రంగాల్లో ఆఫ్గనిస్తాన్‌కు భారత్‌ సహాయం చేస్తుందని తెలిపారు. మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్‌ మ్యాటీస్- రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటి అయ్యారు. ఉగ్రవాదం తదితర అంశాలపై చర్చించారు. అనంతం సంయుక్త మీడియా సమావేశంలో ఇరువురు నేతలు మాట్లాడారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్వర్గధామాలు సహించరాదని ఇరుదేశాలు అంగీకారానికి వచ్చినట్లు సీతారామన్‌ తెలిపారు. ఒకవేళ జేమ్స్‌ మటిస్‌ పాకిస్థాన్‌లో పర్యటిస్తే, ఆ దేశంలో ఉగ్రవాద సురక్షిత స్థావరాలు, సరిహద్దుల ఆవలి నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద సమస్యలను లేవనెత్తాలని కోరినట్లు ఆమె తెలిపారు. ఉగ్రవాదంతో భారత్‌, అమెరికాలు నష్టపోయాయని, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని జేమ్స్‌ చెప్పారు. ఉగ్రవాదం ప్రపంచానికి ముప్పుగా పరిణమించిందని జేమ్స్‌ అన్నారు.

22:30 - September 7, 2017
13:32 - April 5, 2017

ఢిల్లీ : పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. భారత్‌ వైపు నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే కాల్పులకు తెగబడింది. జమ్ములోని పూంచ్‌ సెక్టార్‌లో దేగ్వార్‌ ప్రాంతంలో కాల్పులు ప్రారంభించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.

08:17 - April 4, 2017

మాస్కో : రష్యాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. మాస్కోలోని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ మెట్రోస్టేషన్‌లో బాంబు పేల్చారు. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు. మరో 50మందికిపైగా గాయపడ్డారు.  బాంబు పేలుడుతో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. 
సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌లో పేలుళ్లు
రష్యాలో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. మాస్కోలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌లో బాంబులు పేల్చారు. ఒక్కసారిగా పేలుళ్లు సంభవించడంతో ఎక్కడివారు అక్కడ భయంతో పరుగులు తీశారు. బాంబు పేలుళ్లతో  మాస్కో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.   రద్దీగా ఉన్న మెట్రోస్టేషన్లను టార్గెట్‌ చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.  రెండు మెట్రోస్టేషన్లలో పేలుళ్లు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
పేలుళ్లలో 10మంది మృతి
ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లతో మొత్తం 10మంది రష్యన్‌లు చనిపోయారు. మరో 50మంది వరకు గాయపడ్డారు.  బాంబు పేలుడు జరిగిన బోగీ దగ్గర మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి.  రక్తపు మరకలు కూడా కనిపిస్తున్నాయి.  అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. గాయపడిన వారిలో చిన్నారులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
పేలుళ్లతో రష్యా ప్రభుత్వం అలర్ట్‌
సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుళ్లతో ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. సమీపంలోని  8 స్టేషన్లనూ మూసివేశారు.  మాస్కోలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. రష్యన్‌ భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.  రైలులోని అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.  ఐఈడీ బాంబుతో బోగీని పేల్చివేసినట్టు అంచనా వేశారు. మరోవైపు పేలుళ్ల నేపథ్యంలో భద్రతా అధికారులతో పుతిన్‌ సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.  ఘటనపై అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నామన్నారు. పేలుడు బాధితులకు పుతిన్‌ సంతాపం తెలిపారు. 
 

 

21:21 - March 12, 2017

గోవా : ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. బీజేపీయే మళ్లీ అధికారం చేపట్టనుంది. బీజేపీకే గోవా ఫార్వర్డ్‌ పార్టీ, ఎంజీపీతోపాటు ఇండిపెండెంట్లు మద్దతు ప్రకటించారు. అయితే కేంద్రమంత్రి పారికర్‌ మరోసారి గోవా సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. ఈనెల 14న ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలందరితో కలిసి గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. తమకు మద్దతిస్తోన్న గోవా ఫార్వర్డ్‌ పార్టీకి 3మంత్రి పదవులు కట్టబెట్టే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది.

12:34 - December 18, 2016

ముంబై : దేశంలో కీలక పదవులకు అధిపతులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. భారత సైనికదళాల కొత్త ప్రధానాధికారిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌గా రాజీవ్‌ జైన్‌ను నియమించగా, రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ అధిపతిగా అనిల్‌ దస్మన పేరును ప్రకటించింది. ఎయిర్ చీఫ్ మార్షల్‌గా అరూప్ రాహ బిఎస్ ధనోవా బాధ్యతలు స్వీకరించనున్నారు. దేశంలో కీలకమైన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఐబీ, రా అధిపతుల నియామకాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుత ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ తదుపరి ఆర్మీ చీఫ్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ అరుప్ రాహా డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో సైనిక పునర్వ్యవస్థీకరణ, ఈశాన్య భారతంలో నెలకొన్న పరిస్థితులు, పశ్చిమ భారతంలో పరోక్ష యుద్ధం, కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు వంటి సవాళ్లను రావత్ సమర్థవంతంగా ఎదుర్కోగలరని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

రెండేళ్ల పాటు..
ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా జార్ఖండ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రాజీవ్‌జైన్ ఎంపికయ్యారు. అలాగే రిసెర్చ్ అండ్ అనాల్సిస్ వింగ్ అధిపతిగా మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అనిల్ దస్‌మనా నియమితులయ్యారు. వీరివురు రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. రాజీవ్‌జైన్ ప్రస్తుతం ఐబీ ప్రత్యేక డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. జనవరి 1న ప్రస్తుత ఐబీ చీఫ్ దినేశ్వర్‌శర్మ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. 1980వ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ జైన్ ఐబీలోని పలు విభాగాలలో పని చేశారు. రాష్ట్రపతి పోలీసు పతాకం సైతం అందుకున్నారు. 1981వ బ్యాచ్‌కు చెందిన అనిల్‌ దస్‌మనా రాలో గత 23ఏండ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత రా అధిపతి రాజిందర్ ఖన్నా పదవీకాలం ఈ ఏడాది ఆఖరుతో ముగియనుంది. జనవరి 1న అనిల్ దస్‌మనా బాధ్యతలు స్వీకరించనున్నారు.  భారత వైమానిక దళ(ఐఏఎఫ్) నూతన చీఫ్‌గా ఎయిర్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవాను నియమించారు. 2013 డిసెంబర్ 31న బాధ్యతలు స్వీకరించిన అరుప్ రహా మూడేళ్లపాటు సేవలందించారు. ఈ డిసెంబర్ చివర్లో అరుప్ రహా రిటైర్ కానున్నారు. మూడేళ్లపాటు సేవలందించిన అరుప్ రహా అనంతరం 22వ ఐఏఎఫ్ చీఫ్ గా బీఎస్ ధనోవా ఈనెల 31న బాధ్యతలు స్వీకరిస్తారు.

21:51 - November 9, 2016

హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్... ఇవాళ కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన  ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ భేటీలో పాల్గొంది. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న రెండు స్కై వేల‌కు స్థలం కేటాయింపు, కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల మూసివేత అంశాలను ప‌రిష్కరించాల‌ని పారిక‌ర్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పారికర్ హామీ ఇచ్చినట్టు కేటీఆర్ తెలిపారు. రేపు మరికొంత మంది కేంద్రమంత్రులతో కేటీఆర్ భేటీ కానున్నారు. 

 

12:25 - October 30, 2016

జమ్మూకాశ్మీర్ : సరిహద్దులో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుప్వారాలో భారత భద్రతా దళాలపై టెర్రరిస్టులు మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. టెర్రరిస్టులకు ధీటుగా భారత జవాన్లు సమాధమిస్తున్నారు. టెర్రరిస్టుల కాల్పుల్లో బీఎస్ ఎఫ్ జవానుకు గాయాలయ్యాయి. భద్రతా దళాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎల్ వోసీ పరిహద్దు ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సరిహద్దులోని 40 గ్రామాల ప్రజలు వారి బంధువుల గ్రామాలకు తరలివెళ్లారు. అయితే కొంతమంది తమ నివాస ప్రాంతాలు, వ్యవసాయ పొలాలను విడిచి వెళ్లడం లేదు. మరోవైపు పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు పాల్పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Pages

Don't Miss

Subscribe to RSS - defence minister