DGP anurag Sharma

20:46 - April 16, 2018

హైదరాబాద్ : మక్కామసీదు కేసులో తీర్పు ఇచ్చిన జడ్జి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపారు. 

 

18:43 - November 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ పోలీస్‌ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చామని డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ ద ప్రెస్‌లో పాల్గొన్న డీజీపీ...కానిస్టేబుళ్ల ఎంపిక కేవలం ఫిట్‌నెస్‌పైనే గాక తెలివితేటలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. పోలీస్‌ ట్రైనింగ్‌లో ప్రతి కానిస్టేబుల్‌కు ల్యాబ్‌ట్యాప్‌ ఇస్తున్నట్లు చెప్పారు. 
 

 

17:28 - November 8, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త టెక్నాలజీతో నేరాలను అదుపులోకి తీసుకొచ్చామని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఈ నెలలో ఆయన రిటైర్ కానున్నారు ఈ సందర్భంగా ఆయన '10టివి'తో మాట్లాడుతూ... పదవీ విరమణ తరువాత పోలీస్ శాఖకు నా వంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ లో మావోయిస్టుల ప్రాబల్యం లేదని పేర్కొన్నారు. సీఎం చాలా సహాయసహకారాలు అందించారని... విజయంలో పోలీసు శాఖ లో అందరి కృషి ఉందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

12:34 - November 5, 2017

హైదరాబాద్ : తెలంగాణకు కొత్త పోలీస్‌ బాస్‌ నియామకంపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ ఈనెల 12న పదవీ విరమణ చేయనుండడంతో నూతన డీజీపీ నియామకంపై సర్కార్ దృష్టి సారించింది.  పలువురు సీనియర్‌ అధికారుల పేర్లు తెరమీదకు వచ్చినా... అందరూ ఊహించినట్టే హైదరాబాద్‌ సీపీ మహేందర్‌రెడ్డివైపే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
కొత్త డీజీపీగా మహేందర్‌రెడ్డి!
తెలంగాణకు కొత్త పోలీస్‌ బాస్‌ ఎవరన్న దానికి ప్రభుత్వం తెరదింపినట్టు తెలుసతోంది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ ఈనెల 12న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో 1986 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేందర్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. ఈమేరకు సీఎం కేసీఆర్‌ సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. 
యూపీఎస్సీకి పంపే జాబితా కసరత్తు పూర్తి
యూపీఎస్సీకి అర్హులైన ఆరుగురు సీనియర్‌ అధికారుల పేర్లను పంపాల్సి ఉండగా... అందుకు కసరత్తు పూర్తి అయ్యింది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆరుగురు అధికారులు డీజీపీ రేసులో నిలిచారు. 1983 నుంచి 86 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన పలువురు ఐపీఎస్‌లు డీజీపీ పదవికి పోటీలో ఉన్నారు.  ఇందులో అత్యంత సీనియర్‌గా తేజ్‌దీప్‌కౌర్‌, ఆమె తర్వాతి స్థానంలో 1984 బ్యాచ్‌కు చెందిన సుదీప్‌ లక్టాకియా, డాక్టర్‌ ఈష్‌కుమార్‌, తెలంగాణ హోంసెక్రెటరీ రాజీవ్‌ త్రివేది, నగర కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, ప్రభాకర్‌ అలోక, కృష్ణ ప్రసాద్‌లు రేస్‌లో ఉన్నారు. ఇందులో ముగ్గురి పేర్లను యూపీఎస్సీ తిరిగి రాష్ట్రానికి అందజేస్తుంది. అందులో ఒక్కరిని డీజీపీగా నియమిస్తారు. అయితే గతంలో ఎప్పుడు ఇలాంటి నియమనిబంధనలు ప్రభుత్వాలు పాటించలేదు. ముందుగా సీనియర్‌ అధికారిని ఇంచార్జీ డీజీపీగా నియమించి.. ఆ తర్వాత పదవి విరమణ అయిపోయాక రెగ్యులర్‌ డీజీపీని నియమిస్తారు.  తెలంగాణ ప్రభుత్వం మాత్రం మొదటి పోలీస్‌ బాస్‌ నియామకం ఇందుకు పూర్తిగా భిన్నంగా జరిగింది. హైదరాబాద్‌ సీపీగా ఉన్న అనురాగ్‌శర్మను డీజీపీగా నియమించి.. ఆ తర్వాత అతడినే పూర్తిస్థాయి డీజీపీగా కొనసాగించింది. ఈసారి కూడా అదే పంథాను తెలంగాణ ప్రభుత్వం పాటించనుంది. ప్రస్తుత హైదరాబాద్‌ సీపీగా మహేందర్‌రెడ్డినే ఇంచార్జీ డీజీపీగా నియమించి.. తర్వాత ఆయనే పూర్తి స్థాయి డీజీపీగా కొనసాగించే యోచనలో ఉంది. ఈనెల 10న ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీచేయనుంది.
మహేందర్‌రెడ్డికి లైన్‌ క్లియర్‌!
డీజీపీ రేసులో ప్రధాన పోటీ దారుడిగా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి క్రిష్ణప్రసాద్‌ ఎన్నిక ఖరారు అయినట్టు సామాజిక మాధ్యమాల్లో మొదట ప్రచారం సాగింది. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని క్రిష్టప్రసాద్‌ ట్విట్టర్‌లో ఖండించారు. తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేశారు. దీంతో మహేందర్‌రెడ్డి నియామకం దాదాపు ఖరారైనట్టేనని తెలుస్తోంది.

 

07:28 - November 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్‌ డీజీపీగా మహేందర్‌రెడ్డిని నియమించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈమేరకు  ప్రభుత్వం  నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మాహేందర్‌రెడ్డి నియామకానికి సీఎం కేసీర్‌కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. 1986 బ్యాచ్‌కు చెందిన మహేందర్‌రెడ్డికి 2022 వరకు పదవీకాలం ఉంది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ  ఈనెల 11న ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో ఇన్‌చార్జ్‌ డీజీపీగా మహేందర్‌రెడ్డిని నియమించాలని  ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌,  గుంటూరు, కర్నూలు జిల్లాల్లో సేవలందించిన మహేందర్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌గా ఉన్నారు. 

 

07:26 - November 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కొత్త పోలీస్‌ బాస్‌ నియామకంపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌ శర్మ ఈ నెల 12న పదవీ విరమణ చేయనున్నారు. యూపీఎస్సీకి పంపించాల్సిన జాబితాపై కసరత్తు కొలిక్కి వచ్చినట్టు సీనియర్ ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కొత్త డీజీపీ ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. 

తెలంగాణ నెక్ట్స్‌ డీజీపీ ఎవరనేది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్‌ సీపీ మహేందర్‌ రెడ్డి అని ఫిక్స్‌ అయిపోయినా.. అంత ఈజీ కాదనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరెవరు డీజీపీ రేసులో ముందున్నారు. సీఎం కేసీఆర్ ఎత్తుగడలు ఏంటి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ మహేందర్‌ రెడ్డి కాబోయే డీజీపీ అని అంతా అనుకుంటున్నారు. గతంలో సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి రెండవ డీజీపీగా ఎవరు వస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆరుగురు అధికారులు డీజీపీ రేసులో ఉన్నారు. ఇందులో 6 పేర్లను అధికారులు యూపీపీఎస్సీకి పంపించారు. అందులో ముగ్గురి పేర్లను యూపీపీఎస్సీ రాష్ట్రానికి అందజేస్తుంది. అందులో ఒకరిని డీజీపీగా నియమిస్తారు. అయితే గతంలో ఎప్పుడూ ఇలాంటి నియమ నిబంధనలు ప్రభుత్వాలు పాటించలేదు. ముందుగా ఇంచార్జ్‌ డీజీపీని నియమించి ఆ తర్వాత సీనియర్స్ పదవీ విరమణ అయిపోయాక.. రెగ్యులర్‌ డీజీపీగా నియమించేవారు. 

1983 నుండి 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌లు డీజీపీ పదవికి పోటీలో ఉన్నారు. సీనియర్‌ అయిన తేజ్‌దీప్‌ కౌర్‌కి రెండున్నరేళ్ల సర్వీస్‌ ఉంది. స్పెషల్ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె తర్వాత 1984 బ్యాచ్‌కి చెందిన సుదీప్ లక్టాకియా రెండో సీనియర్‌ అధికారి.. ఈయన కేంద్ర సర్వీస్‌లో ఉన్నారు. ఈయనకు 20 నెలల సర్వీస్‌ మాత్రమే ఉంది. ఈయన తర్వాత 1985 బ్యాచ్‌కి చెందిన డాక్టర్‌ ఈష్‌ కుమార్‌ ఉన్నారు. ఈయన కేంద్ర సర్వీస్‌లోనే ఉన్నారు. ఇంకా 13 నెలల సర్వీస్ ఉంది. 1986 బ్యాచ్‌కి చెందిన తెలంగాణ హోం సెక్రటరీ రాజీవ్‌ త్రివేదికి నాలుగేళ్ల సర్వీస్‌, మహేందర్‌ రెడ్డికి ఐదేళ్ల సర్వీస్‌, ప్రభాకర్ అలోకాకు రెండున్నరేళ్లు ఉంది. దీంతో మొదట ఆరుగురి పేర్లను పంపించినట్టు తెలుస్తోంది. తేజ్‌దీప్‌ కౌర్‌పై అభియోగాలు ఉండటంతో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేంద్ర సర్వీస్‌లో ఉన్న లక్టాకియా, ఈష్‌కుమార్‌లకు నిబంధనల ప్రకారం రెండేళ్ల సర్వీస్‌ లేదు. 

ఇక ప్రధాన పోటీదారులు కృష్ణప్రసాద్, రాజీవ్‌ త్రివేది, నగర కమిషనర్ మహేందర్‌ రెడ్డి. రాజీవ్‌ త్రివేదిని డీజీపీగా చేయాలని ఓ వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే అందుకు మాజీ సీఎస్‌ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత డీజీపీ అయితేనే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారని నివేదికలు, వారి అభిప్రాయాలు సీఎంకు అందజేసినట్లు తెలుస్తోంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహేందర్‌ రెడ్డిని డీజీపీగా చేస్తే రాబోయే ఎలక్షన్‌ రోజుల్లో ఎలా ఉండబోతోంది. మహేందర్‌ రెడ్డికి డీజీపీ పదవి అంత ఈజీగా లభించకూడదనే పోటీతత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ఐపీఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

డీజీపీగా కృష్ణప్రసాద్‌ ఎన్నిక ఖరారైనట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కృష్ణప్రసాద్‌ తన ట్విట్టర్‌లో ఖండించారు. తనకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేశారు. మరి డీజీపీ ఎవరనే ఉత్కంఠకు తెరపడాలంటే నవంబర్‌ 12 వరకు ఆగాల్సిందే. 

07:45 - November 2, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో చిన్నారులకు సురక్షితమైన బాల్యాన్ని అందించేందుకు తెలంగాణ పోలీస్‌శాఖ విశిష్ట సేవలందిస్తోందని డీజీపీ అనురాగ్‌ శర్మ అన్నారు. 50 శాతం మంది చిన్నారులు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆయన అన్నారు. చిన్నారులపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో అబ్యూజింగ్‌ చైల్డ్‌ క్యాంపెయిన్‌ లోగోను, ఓ గేయాన్ని డీజీపీ ఆవిష్కరించారు.  చైల్డ్ అబ్యూజింగ్‌ క్యాంపెయిన్‌ ఏడాది పాటు జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో 3వ తేదీన ప్రారంభిస్తామని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. 

17:57 - September 6, 2017

హైదరాబాద్ : ప్రశాంత వాతావరణంలో అన్ని శాఖల సమన్వయంతో గణేశ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగామంటున్నారు జీహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి. మరోవైపు భాగ్యనగరంలో భారీ వర్షాలు కురిసినపుడు సహాయక చర్యల కోసం ఎప్పటికప్పుడు రెస్క్యూ టీంలను అందుబాటులో ఉంచుతున్నామ జీహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

21:58 - September 5, 2017
21:32 - September 5, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - DGP anurag Sharma