dhoom dhaam news

21:20 - September 13, 2017

గవర్నర్ నరసింహన్ మీద వీహెచ్ గరం... గల్లీలల్లతిరుగుకుంట జనానికిజెప్తున్నడు, చంద్రబాబు జీవితం మీద సీన్మొస్తుంది....ఓటుకు నోటు సీన్లు మాత్రం పెట్టకుండ్రి, రాత్రి 11 దాకా వైన్సులు ఓపెన్.. తాగుబోతులకు టీర్కార్ బంపర్ హాపర్, సైకిండ్లకు కూడా గులాలద్దిన ప్రభుత్వం... వైన్స్ లకు, బార్లకు కూడా అద్దితే బాగుంటది కదా, సబ్బిడీ గొర్లు అమ్ముకున్న ఇద్దరు అరెస్టు.... అపతొచ్చిన అవిట్నికాసుకోవల్సిందే ... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:41 - September 12, 2017

సోషల్ నెట్ వర్క్... ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్లపై ఇవాళ్టి మల్లన్నముచ్చట్లు. ఆవు నిరసన, రైలు పట్టాలపై పడుకున్న కుక్క, పిల్లగాని ఆలనాపాలన చూస్తున్న రామచిలుక, బీరు తాగిన కోతి, ఈతగొట్టిన ఏనుగు, ప్రత్యేక మిషన్ తో నీటిలోకెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్, కల్లు తాగిన విదేశీ మహిళ, సౌదీలో తెలుగు బిడ్డల గోస.. వంటి సంఘటనలు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేశాయి. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

 

20:30 - September 6, 2017

హురక చెన్నమనేని రమేష్ సారు ఉన్నడుగదా..? అదే వేములవాడ ఎమ్మెల్యే ఆయన దొంగకాయిదాలు వెట్టి ఎమ్మెల్యేగ గెల్చిండట.. సుప్రీంకోర్టుల తీర్పొచ్చింది నిన్న.. ఆయన ఇండియా మన్షేగాదు.. ఎప్పుడో జర్మనీకి వొయ్యి బత్కుతున్నడు.. ఆయన ఆదేశ పౌరుడే మనదేశంల ఎట్ల పోటీ జేశి గెలుస్తడు..? అని స్వయంగ కోర్టే తీర్పు జెప్పిందట.. అమ్మ చెన్నమనేని..?

రాయలసీమ కంకర రత్నం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సారు షెట్టర్ కిందికి గుంజిండుగదా..? చల్ నీయక ఈ ప్రత్యేక రాయలసీమ..? సీమహక్కులు.. బండమీద నక్కులు అంటె ఎవ్వడింటలేడు.. ఇగ ప్రత్యేక రాయలసీమ దుక్నంల ఉద్దెర గిరాకి ఎక్వైంది.. నగదు ఆసాములు తక్వైండ్రని.. రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ జెండా అవనతం జేశిండు..

రాజుల సొమ్ము రాళ్ల పాలైతె ఓకేగని.. జనం సొమ్ము దేవుండ్ల పాలైతెనే వస్తది పరేషాన్.. ఇద్వర్ దాక తెలంగాణ ముఖ్యమంత్రిగారు.. సమర్పించిన మొక్కులు సరిపోనట్టున్నయ్.. ఈనెల ఇర్వైఏడు తారీఖు నాడు బెజవాడకు వొయ్యి ముక్కు పుడక ముట్టజెప్పొస్తడట.. ఇప్పటికే కోట్ల రూపాల జనం సొమ్ము దేవుండ్ల మొక్కులకు వెట్టిండు.. మరి ఇది ఏ తరీఖ యవ్వారం ఏం కథ అనేది జనం గూడ ఆలోచన జేయాలే..

మామూల్గ భజన జేయాల్నంటే.. తబలా మద్దెల తాళాలుంటే సరిపోతుండే ఎన్కట.. కని ఇప్పుడు ఏ వాయిద్య పరికరం లేకున్నా భజన జేస్తున్నరు కొంతమంది.. అట్ల జేస్తున్నోళ్ల దాంట్లె టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు ఒకరు.. పుసుక్కున కేసీఆర్ సారు కుటుంబాన్ని ఎవ్వలన్న విమర్శిస్తె సాలు.. సారుకు శాతిమీద ఎంటికెలు వొడ్సుకొచ్చి.. మైకందుకుంటనే ఉంటడు.. మొన్నటి ఒక పంచాది మీద మైకందుకున్నడు..

అయ్యా గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గారి ధర్మపత్ని గారికి తెలంగాణ మహిళాలోకం చేసుకుంటున్న విన్నపం.. అమ్మా ఇంటాయినకు తాగుడు అల్వాటైతె ఆ సంసారం ఎట్లుంటదో మీకు తెల్సు.. మీ సారేమో ఒంటరి మహిళలకు పించిని అంటున్నడు.. మద్యం అమ్మి మమ్ములను ఒంటరి జేస్తున్నడు.. జర్ర మీరే ఆయన మన్సు మార్చాలే మేడం అంటున్నరు మహిళలు..

ఎమ్మెల్యేలు గానీ.. ఎంపీలుగానీ.. మంత్రులు గానీ..? ఒక్కనెల జీతం ఆల్చమైతె ఊకుంటరా..? లక్షలకు లక్షలు జీతగాళ్లే నెలగాదు.. ఒక్కరోజు లేటైనా పరేషాన్ అయితరు.. మరి అసొంటిది మున్సిపాల్టీలళ్ల పనిజేశే సఫాయోళ్లకు మూడు నెలల సంది జీతాలు ఇయ్యకపోతె..? వాళ్ల పెండ్లాం పిల్లలు ఎట్ల బత్కుతరు చెప్పుండ్రి..? వీళ్లది కడ్పుగాదా..?

గణపతిని ఓన్లీ పెద్దకులపోళ్లే వెట్టుకోవాల్నా..? దళితులు కింది వర్గాలోళ్లు వెట్టుకోవద్దా..? అట్ల వెట్టుకుంటె ఊరికేమన్న అరిష్టమైతదా..? లేకపోతె ఊరికి గత్తర దల్గుతదా..? అరే ఏం మన్షులురానాయన.. పాపం దళితులు గూడ గణపతి పండుగ జేస్కుంటె ఓరుస్తలేరంటే..? మరి దళితులు ఏం జేయాల్నో మీరే జెప్పుండ్రిగ అంబేద్కర్ విగ్రహం బెట్టుకుంటె ఓర్వరాయే.. ఆళ్ల కులవృత్తులు జేస్కుంటె ఓర్వరాయే.. ఏం కథ ఇది..?

అయ్యో పాడుగాను.. చివరి సూపు కన్న నోచుకోకపోతిమి.. ఎంతపనైపాయెనుల్లా.. శీన్మలు జూశెటోళ్లకు ఏ కష్టం రాకుంట కాపాడుతుండే.. నిన్న ఆత్మహత్య జేస్కోని సచ్చిపోయిందట.. పాపం మొగదిక్కు లేక ఆంధ్రా ఆడిబిడ్డెలు పాడె మోశిండ్రు తలగోరి వట్టిండ్రు.. డప్పుల సప్పుళ్లు లేక సైలెంటుగ పీన్గె వోతుంటే.. సూశినోళ్లంత నవ్విండ్రు.. అగో ఏడ్వాలేగని.. నవ్విండ్రేందంటరా..? సూడుండ్రి తెలుస్తది.. 

20:24 - September 5, 2017

ఏస్ ముమ్మాటికి తెలంగాణల దళితుల పరిస్థితి ఆగమున్నది.. ప్రభుత్వం దళితుల జీవితాలతోని ఆటాడుకుంటున్నది.. ఇది నేను గమనించి చెప్తున్న ముచ్చట.. మంథని మధుకర్ కాడికెళ్లి.. నిన్న మానకొండూరు ఆత్మహత్యాయత్నాల దాక.. దళితుని హక్కులను బొందవెట్టింది తెలంగాణ ప్రభుత్వం.. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినంక.. దళితులను ఈ తరీఖల మోసం జేశిన ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమేగావొచ్చు..

అవునయ్యా తెలంగాణ రాష్ట్రం వచ్చి మూడేండ్లై.. నాల్గో యాడాది నడుస్తున్నది.. ఇన్నిరోజులళ్ల.. ఎన్నడన్న పువ్వుగుర్తోళ్లు సెప్టంబర్ 17 ను అధికారికంగ నిర్వహించాలే అని యాత్రలు జేశిండ్రా..? ఏదో పార్టీ ఆఫీసుల ప్రెస్ మీటింగు వెట్టి.. తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం సద్విపోయిండ్రు.. ఇగ ఏమంట తెలంగాణల ఎన్నికలు దగ్గరవడ్తున్నయో.. ఇగ సెప్టంబర్ 17 మీద చిన్నగావురం గారుస్తున్నరా..? సూడుండ్రి..

గాలొచ్చినప్పుడే తూర్పాల వట్టుకోవాలె.. అధికారం ఉన్నప్పుడే నాల్గు రాళ్లు ఎన్కేసు కోవాలె..? అంతేనా..? అధికార పార్టీ ఎంపీ అయి ఉండి గూడ.. ఏం సంపాయించుకోకపోతె.. ఏడ గుంటెడు భూమి కబ్జా వెట్టుకోకపోతె నల్గురు ఎక్కిరియ్యరా..? ఏహే తెల్వి తక్వ ఎంపీ తెల్వితక్వ ఎంపీ అంటే.. ఎంత నామూషుంటది..? అందుకే ఆ మాట నాకు రావొద్దని బీబీ పాటిల్ సారు ఎంత తాపత్రయపడ్డడో సూడుండ్రి..

మామూల్గ ప్రభుత్వ సభలు సమావేశాలకు.. అప్పట్ల మందిని తోల్కొస్తుండే.. ఇప్పుడు గొర్లను గొట్కొస్తున్నరు.. ఎందుకంటె గొర్ల మీదనే సభ గావట్టి అవ్వి తెస్తున్నట్టున్నరు.. అయితే కండియం శ్రీహరి సారు చిన్నప్పుడు ఈ జీవాలు గూడ గాశిండో ఏమో..? అవ్విటిని సూశి ముర్శిపోతున్నడు.. మందులేస్తున్నడు.? సూడుండ్రి సారు ముచ్చట ముర్పెం..

తెలంగాణ ప్రజలారా..? మీకు రోగమొచ్చినా నొప్పొచ్చినా..? ప్రైవేటు దావఖాండ్ల పొంట వోకుండ్రి.. సర్కారు దావఖాండ్లను వాడుకోండ్రి... పుణ్యానికే వైద్యం జేపిచ్చుకోండ్రి అని పిల్పునిస్తున్నడు మంత్రి.. మంత్రంటే వైద్యారోగ్యశాఖా మంత్రిగాదు.. నీటి పారుదల శాఖామంత్రి హరీష్ రావుగారూ.. శాఖలు వేరైతేంది.. సారం ఒక్కటేగదా..? ఏమంటరు..?

అమెరికా అధ్యక్షునితోని పంచాది వెట్టుకున్నా నడుస్తదిగని.. ఊర్లె సాప్ సపాయోళ్లతోని వెట్టుకుంటె ఎట్లుంటదో తెల్సా..? పోకిరి సీన్మల బ్రహ్మానందానికి ఏ గతి వడ్తది..? అగో అదే గతి వడ్తది ఎవ్వలికైనా..? కాకపోతె క్యారెక్టర్లు మాత్రమే మార్తయ్..? సాఫ్ సఫాయోళ్ల తెర్వువొయ్యిన ఒకాయిన ఇంటి మీద ఎసొంటి దండ యాత్ర జేశిండ్రో సూడుండ్రి..

ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారూ.. మా ఖమ్మం పట్నానికొచ్చినప్పుడు ఐదువేల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నమన్నడు.. ఇద్వర్ దాక ఒక్కటి గూడ ఇయ్యలేదంటే..? అప్పుడు కార్పొరేషన్ ఎన్నికలున్నయ్ గావట్టి అన్నడేమో.? ఇప్పుడేమున్నయ్.. అయినా ఏ నాయకుడైనా.. ఏ పార్టైనా..? మేము ఇస్తమనే అంటది గని.. ఇయ్యమంటదా..? న్యూ డెమోక్రసీ అన్నలు..?

అయ్యో పాడుగాను.. చివరి సూపు కన్న నోచుకోకపోతిమి.. ఎంతపనైపాయెనుల్లా.. శీన్మలు జూశెటోళ్లకు ఏ కష్టం రాకుంట కాపాడుతుండే.. నిన్న ఆత్మహత్య జేస్కోని సచ్చిపోయిందట.. పాపం మొగదిక్కు లేక ఆంధ్రా ఆడిబిడ్డెలు పాడె మోశిండ్రు తలగోరి వట్టిండ్రు.. డప్పుల సప్పుళ్లు లేక సైలెంటుగ పీన్గె వోతుంటే.. సూశినోళ్లంత నవ్విండ్రు.. అగో ఏడ్వాలేగని.. నవ్విండ్రేందంటరా..? సూడుండ్రి తెలుస్తది..

 

Don't Miss

Subscribe to RSS - dhoom dhaam news