Director Teja

11:14 - October 12, 2017

టాలీవుడ్ లో రీమెక్ ల హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు వెంకటేష్. ఇతర భాషల్లో వచ్చిన సినిమాలపై వెంకీ ఆసక్తి కనబరుస్తుంటాడు. తెలుగులో తీసినా మంచి విజయాన్నే నమోదు చేస్తుంటాయి. ఇటీవలే వచ్చిన 'గురు' కూడా ఆ కోవకి చెందిందే. ఈ చిత్రం అనంతరం 'వెంకటేష్' ఏ చిత్రాలను ఒప్పుకోలేదు. తాజాగా 'తేజ' దర్శకత్వంలో 'వెంకీ' నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

వెంకీ – తేజ‌ కాంబినేషన్ ఓకే అయిపోయింద‌ని, ఈ సినిమా కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లోనే ఉంటుంద‌ని టాక్‌. ఇదివరకే వీరి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాల్సింది. కానీ తేజ ఫామ్ లో లేకపోవడంతో వెంకీ ధైర్యం చేయలేదని తెలుస్తోంది. తాజాగా తేజ దర్శకత్వంలో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా మంచి టాక్ నే తెచ్చుకుంది. దీనితో మళ్లీ ఫాంలోకి వచ్చిన 'తేజ'తో సినిమా చేయాలని వెంకటేష్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో వెంకీ ప్రొఫెసర్‌గా కనిపించబోతున్నాడని, రెండు భిన్న భావాలున్న పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో హీరోయిన్ ఎవరనేది తెలియడం లేదు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

10:33 - October 12, 2017

ఎన్టీఆర్ బయోపిక్..ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయి కూర్చొంది. ఎన్టీఆర్ బయోపిక్ ను తీయాలని ఆయన కుమారుడు 'బాలకృష్ణ' ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ వివాదంలో ఉండే 'రాంగోపాల్ వర్మ' కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే 'ఎన్టీఆర్' బయోపిక్ నిర్మించే దర్శకుడి కోసం 'బాలయ్య' వెయిట్ చేశారని తెలుస్తోంది.

తొలుత 'క్రిష్'..లేదా 'తేజ'కు ఈ సినిమా బాధ్యతలను అప్పగించాలని 'బాలయ్య' యోచించారని టాక్. కానీ 'క్రిష్' మణికర్ణిక ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో 'ఎన్టీఆర్' బయోపిక్ పై దృష్టి పెట్టే టైం లేదని ప్రచారం జరిగింది. ఆ బాధ్యతలను తాజాగా 'తేజ' స్వీకరించినట్లు టాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆయన దర్శకత్వంలో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రారంభించేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో బాలకృష్ణ నిర్మాతగా మారనున్నారని మరో టాక్. ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

20:31 - September 11, 2015

'చిత్రం' తో సెన్సేషనల్ డైరెక్టర్ గా నువ్వు నేను, జయం సినిమాల తర్వాత ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ గా అనతికాలం లోనే ఎంతో ఎత్తుకు ఎదిగిన తేజ, ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులతో అంతే తక్కువ టైం లో కిందకు వచ్చేశారు. మరి ఇన్ని రోజుల తర్వాత తేజా హోరా హోరీగా కస్టపడి తీసిన హోరా హోరీ చిత్రం హిట్టా ఫట్టా ఇప్పుడు చూద్దాం.
కథ:
పట్ట పగలు నడి రోడ్డుమీద అందరు చూస్తుండగా హత్య చేసిన బసవ అనే రౌడి కేసు మాఫీ నిమిత్తం ఏసిపి తో పాతిక లక్షలకు బేరం కుదుర్చుకుంటాడు. తన చెల్లెలికి కట్నం గా ఇవ్వడం కోసమే బసవతో బేరం కుదుర్చుకున్న ఏసిపి, డబ్బు ని పెళ్లి సమయంలో ఇవ్వమంటాడు. ఒప్పందం ప్రకారం డబ్బు తీసుకుని ఏసిపి ఇంటికి వెళ్ళిన బసవకి కాబోయే పెళ్ళికూతురు ఏసిపి చెల్లెలు అయిన మైథిలి ఎదురౌతుంది. దీంతో మీ చెల్లెలు నాకు నచ్చేసింది నాకిచ్చి పెళ్లి చెయ్యి లేదంటే ఎవరితోనూ పెళ్లి కాకుండా చేస్తాను అనడంతో ఏసిపి కి బసవకి గొడవ అవుతుంది.అన్నట్లుగానే మైథిలి కి పెళ్లి జరుగుతున్నప్పుడే బసవ మనుషులు పెళ్ళికొడుకుని చంపేస్తారు.ఆ తర్వాత మైథిలికి ఎవరికి సంబంధం కుదిర్చినా వారిని చంపేస్తుంటాడు బసవ. బసవను ఏమి చేయలేక పోయిన ఏసిపి మైథిలి ని తన ఫ్యామిలీతో పాటు రహస్య ప్రదేశానికి పంపిచ్చేస్తాడు. ఆ తర్వాత బసవ మైథిలి కోసం వెతకడం, మైథిలి స్కంద అనే కుర్రాడి ప్రేమలో పడడం, చివరకు స్కంద మైథిలి ని బసవ నుంచి ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
ఈ మధ్య కాలంలో తేజ ఏ ఇంటర్వ్యూ లో చూసినా టాలీవుడ్ లో కొత్త కథలు రావడంలేదు, రెండే కథలు నడుస్తున్నాయి కావాలంటే మీరే చెక్ చేసుకోండి అని కాస్త ఘాటుగానే మాట్లాడాడు. దీంతో హోరా హోరీ చిత్రం మాములుగా ఉండదేమో, అదిరిపోద్దేమో, బ్లాక్ బస్టర్ హిట్టేమో అనుకున్న ప్రేక్షకులకు తేజ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. సూపర్ డూపర్ బ్లాక్ బస్తర్ ఫ్లాప్ తో ప్రేక్షకుల బుర్రలను బద్దలు కొట్టాడు. ఫ్లాపుల్లో అయన రికార్డులను ఆయనే బ్రేక్ చేసిపడేసాడు. దీంతో తేజ కెరీర్లోనే హోరా హోరీ చిత్రం బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిపోయే పరిస్థితులు వచ్చేసాయి. కొత్త కథలతో సినిమాలు తీయలేరా అని అందర్నీ విమర్శించిన తేజ తన పాత సినిమాలన్నింటిని కలిపేసి, తనకు అచ్చొచ్చిన తనకు మాత్రమే తెలిసిన తను మాత్రమే తీయగలిగిన ఓ పాత చింతకాయ పచ్చడి కథ తో హోరా హోరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథ పాతదే అయినా కనీసం కథనం తో ఆకట్టుకునే ప్రయత్నం కాస్త కుడా చేయలేదు. కనీసం తన పాత సినిమాల్లో అయితే కాస్త ఎమోషన్లు, బలమైన పాత్రలు, ప్రేక్షకులను మెప్పించాయి. కానీ ఈ హోరా హోరీ చిత్రం లో మాత్రం కథ కథనాల దగ్గర్నుంచి పాత్రలు వాటి తీరు తెన్నుల వరకు ఒక గమ్యం లేకుండా బ్రేకులు ఫెయిల్ అయిన ఆయిల్ లారీలా ప్రేక్షకుల మీద సవారి చేసాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే ఒక్క హీరొయిన్ దీక్ష తప్ప మిగిలిన పాత్రలన్నీ తమ ఓవర్ యాక్షన్ తో ప్రేక్షకుల నెత్తిమీద సుత్తి తీసుకుని టపీ టపీ మని ఒకటే బాదుడు. ముఖ్యంగా హాస్యం పేరుతో జబర్దస్త్ గ్యాంగ్ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఆల్రెడీ పెనం మీద మాడిన కోడిని తీసుకెళ్ళి తండూరిలో వేసినట్టు వీళ్ళ పంచులు, కుళ్ళు కామెడీ తో ప్రేక్షకులకు చుక్కలు చూపించారు.ఇక హీరో దిలీప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు ఏడుస్తూనే ఉంటాడు. ఇలా అయిన దానికి కానీ దానికి హీరో ఏడవడం అనేది దర్శకుడి సరికొత్త క్రియేటివిటీ అనుకోవాలో లేక హీరోకి అది మాత్రమే తెలుసనుకొవాలొ ప్రేక్షకులకే వదిలేస్తున్నాము. తేజ హీరోలందరిలో ఇతను మాత్రమే వీక్ అండ్ పూర్ పెర్ఫార్మన్స్ కలిగిన హీరో. ఒక్క హీరోయిన్ దక్ష మాత్రమే తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఇక మిగిలిన టెక్నికల్ అంశాల్లోకి వెళ్తే దీపక్ భగవంత్ అందించిన సినిమాటోగ్రఫి అధ్బుతం. సరికొత్త లొకేషన్లను వర్షం పడే సన్నివేశాలను దీపక్ చాల చక్కగా చూపించాడు. అలాగే కళ్యాణి కోడూరి అందించిన సంగీతం కానీ, దామోదర్ ప్రసాద్ నిర్మాణ విలువలు కానీ పర్వలేదనిపిస్తాయి. కానీ ఇవి ఎంత బాగున్నా సరైన కథ కథనం లేనప్పుడు హోరా హోరిన పడిన కష్టమంతా వృధా ప్రయాస అవుతుంది. తన పాత సినిమానే తీసుకుని రెండున్నర గంట సేపు నత్త నడకన సాగిస్తూ.. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్తూ.. తీసిందే మళ్లీ మళ్లీ చూపిస్తూ ఉంటె ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించండి.సో ఫైనల్ గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రోజుల తర్వాత తేజ హోరా హోరిన చాల కస్టపడి ఓ దిసాస్తర్ ఫ్లాప్ ని ప్రేక్షకులకు అందించాడు.
ప్లస్ పాయింట్స్
సినిమాటోగ్రఫి
లొకేషన్స్
మైనస్ పాయింట్స్
కథ
కథనం
దర్శకత్వం
హీరో
కామెడీ
ఎమోషన్స్
పాత్రల చిత్రీకరణ
టెన్ టివి రేటింగ్... 0.5/5

14:58 - September 11, 2015

విజయవాడ : తాత, నాన్న, మనవళ్లే కాదు.. ఇండస్ట్రీకి కొత్తవాళ్లు కావాలని సినీ దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ కనకదుర్గమ్మను తేజ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు కొత్తవారిని పరిచయం చేసిన ఘనత తనదేనన్నారు. దాదాపు వెయ్యిమంది తాను పరిచయం చేసినవాళ్లు ఇండస్ట్రీలో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 'హోరాహోరీ' చిత్రం వస్తుందన్న తేజ ఇందులోనూ అంతా కొత్త నటీనటులే ఉన్నారని పేర్కొన్నారు.

 

08:30 - September 10, 2015

తేజ దర్శకత్వంలో దీపక్‌, దక్ష జంటగా శ్రీ రంజిత్‌ మూవీస్‌ పతాకంపై దామోదర ప్రసాద్‌ నిర్మించిన 'హోరాహోరి' చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం తేజ మీడియాతో ఎమోషనల్ గా మాట్లాడారు. ''జయం' సినిమా తర్వాత నా మీద ప్రేమ కథలు తీస్తాడనే ముద్ర పడింది. నేను ఎలాంటి ప్రేమ కథలు తీసినా 'తేజ మళ్ళీ 'జయం' సినిమానే తీస్తున్నాడు' అని అంటున్నారు. అయితే ఈ సినిమాని కూడా మళ్ళీ 'జయం' సినిమాలాగే తీశా. కాని నేను అన్ని రకాల చిత్రాలు చేస్తాను. కథ పరంగా ఈ సినిమాకు ఎక్కువగా వర్షం అవసరం కావడంతో కర్నాటకలోని ఆగుంబే ప్రాంతంలో చిత్రీకరించాం. కాని అక్కడ కూడా వర్షం సరిగా పడలేదు. దీంతో ప్రత్యేకంగా రెయిన్‌ మిషన్‌ని తయారు చేయించి, కేవలం 54రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశాం. అంతేకాదు ఈ చిత్రాన్ని అతి తక్కువగా 20 మందితోనే షూటింగ్‌ చేశాం. అలాగే సినిమా ఫోర్త్‌ వాల్‌ స్టైల్‌లో విడ్త్‌ ఎక్కువగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు రియల్‌ లైఫ్‌ డ్రామాలా అనిపిస్తుంది. దీంతోపాటు ఈ చిత్రంలో చాలా ప్రయోగాలు చేశాం.
పెద్ద పెద్ద సినిమాలన్నీ, హాలీవుడ్‌ భారీ హిట్‌ చిత్రాలన్నీ ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలే. కాని ఇక్కడ ఎగ్జిబ్యూటర్లు, డిస్టిబ్యూటర్లు కలిసి సినిమా ఎంత ఉండాలో నిర్ణయిస్తున్నారు. సినిమా మేకర్స్‌ కూడా అదే మాయలో పడి అసలు సినిమాను చంపేస్తున్నారు. మనం తీసే కథలో దమ్ముంటే, సరైన ఏమోషన్స్‌ క్యారీ చేయగలిగితే, ప్రేక్షకుడు ఎంత నిడివి ఉన్నా చూస్తాడు. ప్రస్తుతమంతా సినిమాలతో మనీ మేకింగ్‌ ఎక్స్‌ర్‌సైజులు చేస్తున్నారు. నేను ఎక్కువగా సమాజంలో జరిగే సంఘటనల నుంచే ఇన్‌స్పైర్‌ అవుతాను. ఇకపై వరుసగా సినిమాలు తీసేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నాను. ఇందులో భాగంగా ఓ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా తీయ బోతున్నాను. కమల్‌ హాసన్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. దానికింకా సమయం పడుతుంది. ఈ చిత్రంలో కథ పరంగా ప్రేమ కోసం పోరాటం చేస్తే, నేను మాత్రం దర్శకుడిగా సక్సెస్‌ కోసం పోరాటం చేస్తున్నాను'' అని తెలిపారు. 

07:54 - July 28, 2015

'చిత్రం', 'నువ్వు నేను', 'జయం' అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు రూప కల్పన చేసిన దర్శకుడు 'తేజ' మరో ప్రేమ కథా చిత్రంతో ముందుకొస్తున్నాడు. 'అలా మొదలైంది', 'అంతకుముందు ఆ తరువాత' చిత్రాలు హిట్ సాధించిన నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్' ఈసినిమాను రూపొందిస్తోంది. సినిమా టైటిల్ 'హోరా హోరీ'గా నిర్ణయించారు. ఈ చిత్రంలో కూడా తేజ నూతన, నటీ నటులతో రూపొందిస్తున్నారు. దిలీప్ - దీక్షలు హీరో హీరోయిన్స్ నటించనున్నారు. జులై 29వ తేదీన ఈ సినిమా ఆడియోను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కొత్త హీరోలతో సూపర్ హిట్ కొట్టిన తేజ 'హోరా హోరీ' సినిమాతో ప్రేక్షక్షులను ఆకట్టుకుంటాడా ?లేదా ? అనేది చూడాలి. 

Don't Miss

Subscribe to RSS - Director Teja