District collectors

16:07 - January 18, 2018

గుంటూరు : ప్రతి జిల్లా కలెక్టర్ జిల్లా స్ధాయిలో జవాబుదారీగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబునాయుడు. యునైటెడ్ నేషన్స్ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలని సూచించారు. అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్టేట్‌గా ఎదగాలన్నారు చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన తరువాత ఎదురైన ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నట్లు ఆయన చెప్పారు. 2014-15తో పోలిస్తే వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్లలో వృద్ధి రేటు గణనీయంగా పెరిగిందన్నారు.

12:16 - October 12, 2017

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరాలు ఎందుకు ప్రకటించేస్తున్నారు. మూడేండ్ల అనంతరం ఇప్పుడే ఎందుకు వరుసగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారు ? రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా ఉన్న భూములను ఎందుకు రెగ్యులరైజ్ చేస్తున్నారు ? మధ్యతరగతి ప్రజల కోసం కొత్త పథకం తెస్తున్నారా ? కొత్త కొత్త పథకాలు..వరాలు దేని కోసం? అనే చర్చ జరుగుతోంది.      బాబు ప్రస్తుతం దూకుడు పెంచేశారు..వరుసగా పథకాలు..సంక్షేమ పథకాలు ప్రకటించేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భాగంగా బాబు ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారని పొలిటికల్ అనలిస్టుల టాక్. 2018-2019 లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమేనని బాబు ఇదివరకే ప్రకటించేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇటీలవలే నంద్యా..కాకినాడలో జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడంతో బాబు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరోసారి మెజార్టీ సాధించాలని బాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచే విధంగా ఇప్పటి నుండే ప్రయత్నాలు చేయాలని కింది కార్యకర్తలకు దిశా..నిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నేతలు..కార్యకర్తలతో అప్పుడప్పుడు భేటీ అవుతూ పలు సూచనలు..సలహాలు అందచేస్తున్నారు. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలు..ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బాబు పేర్కొంటున్నారు. ఇంటింటికి టిడిపి పేరిట ఓ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల మధ్యలోకి వెళుతున్నారు.

అన్ని శాఖలపై రివ్యూ నిర్వహించిన బాబు ప్రస్తుతం..పోలవరం..అమరావతిపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఎలాగైనా 2019 ఎన్నికల్లో వీటిని పూర్తి చేయాలని..రాష్ట్రంలోని 28 ప్రాజెక్టులను ఓ కొలిక్కి తీసుకరావాలని బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెన్షన్లు..ఇంటి నిర్మాణాలు..చంద్రన్న పెళ్లికానుక..ఎన్టీఆర్ సృజల స్రవంతి..తదితర పథకాలను ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే నూతన గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. చంద్రన్న బీమా కింద ప్రమాదవశాత్తు కింద ఎవరైనా మరణిస్తే రూ. 5లక్షలు ఇచ్చే వారు. ఇప్పుడు సహజ మరణానికి రూ. 2లక్షలు అందిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ప్రత్యర్థి అయిన వైసీపీని కూడా టార్గెట్ చేశారు. ఆ పార్టీలో ఉన్న కొంతమందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. బలహీనపరిచేలా ప్లాన్స్ రూపొందిస్తున్నట్లు, రాయలసీమలో పార్టీ బలహీనంగా ఉందనే కారణంతో రెడ్డీ సామాజిక వర్గానికి చెందిన కీలకనేతలను పార్టీలో చేర్చుకొనేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

కానీ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై బాబు దృష్టి సారించడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని రైతులు..ఇతరులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేయలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేవలం ఎన్నికల కోసమే బాబు పలు స్కీంలు ప్రవేశ పెడుతున్నారని ఆరోపణలున్నాయి. మరి బాబు చేస్తున్న ప్లాన్స్ వర్కవుట్ అవుతాయా ? లేదా ? అనేది చూడాలి. 

07:30 - October 12, 2017

 

గుంటూరు : జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ శాఖాధిపతులు, మంత్రులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సుదీర్ఘంగా జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్వచ్ఛత, ప్రజా సమస్యల పరిష్కారంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అధికారులకు సీఎం చంద్రబాబు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. జనవరి నాటికి 2.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. జూన్‌ నాటికి మరో 5లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మించాలనీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే వివిధ సమస్యలను వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక , ఆర్థికేతర అంశాలుగా స్పష్టంగా వర్గీకరించుకోవాలన్నారు. వాటిని పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక మీదట స్వచ్ఛత, ప్రజాసమస్యల విషయంలో ప్రతి 15 రోజులకోసారి తాను వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

వందశాతం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా
వందశాతం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా ఏపీ రూపొందాలని సీఎం ఆకాంక్షించారు. ఇందుకోసం అధికారులంతా కష్టపడాలన్నారు. జిల్లాలను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దేందుకు శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాలు వందశాతం ఓడీఎఫ్‌ సాధించాయని.. మిగతా 10 జిల్లాలు కూడా మరో 6నెలలు లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలన్నారు. మొత్తం 12, 854 గ్రామ పంచాయతీలకుగాను.. ఇప్పటికి 4,600 గ్రామపంచాయతీలు పూర్తి ఓడీఎఫ్‌ను ప్రకటించాయని గుర్తుచేశారు. అధికారులు, మంత్రులు జిల్లాల పర్యటన చేస్తున్నప్పుడు టాయిలెట్లు, ఆయా పరిసరాలు పరిశీలించి స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ఇక రాష్ట్రంలోని జలాశయాల్లో నీటిమట్టం వివరాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. 4గంటలపాటు సాగిన వీడియో కాన్ఫరెన్స్‌ చివరి వరకు ఉత్సాహంగా సాగింది. అయితే కొంతమంది అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

11:54 - February 6, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలోని మానవవనరుల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల అభివృద్ధికి పదేళ్ల కాలానికి ప్రణాళికలు రూపొందిచాలని కోరారు. పదేళ్ల తర్వాత జిల్లాలు ఎలా ఉండాలో రోడ్‌ మ్యాప్‌ రూపొందిస్తే ఆ ప్రకారం పని చేద్దామని జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు. 
సక్సెస్ మంత్ర..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికార నివాసం ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. సుమారు ఎనిమిది గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. జిల్లా అభివృద్ధికీ తీసుకోవాల్సిన చర్యలపై దిశా, నిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్లు అంకితభావంతో పని చేయడంతోపాటు, అందరు సిబ్బంది ఇదే విధంగా విధులు నిర్వహించేలా చూస్తే అన్ని రంగాల్లో సత్ఫలితాలు సాధించవచ్చని కేసీఆర్‌ సూచించారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర సాధన, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథం కార్యక్రమాలను ఉదహరించారు. ప్రజలను భాగస్వామనులు చేస్తే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని కలెక్టర్లకు వివరించారు. 

75 శాతం వృధా..
రాష్ట్రంలోని మానవవనరుల సద్వినియోగం అంశాన్ని కేసీఆర్‌ ప్రధానంగా ప్రస్తావించారు. జనాభాలో 50 శాతంపైగా  ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎస్సీలు గ్రామాల బయట, గిరిజనులు తండాలు, గూడేళ్లో ఉంటుంటే, మహిళలు వంటింటికే పరిమితమైన అంశాలను కలెక్టర్ల దృష్టికి తెచ్చారు. దీంతో 75 శాతంపైగా మానవ వనరలు వృధా అవుతున్న విషయాన్ని కేసీఆర్‌ ప్రస్తావించారు. విలువైన మానవవనరులను సద్వినియోగం చేసుకోని దేశం భారత్‌ ఒక్కటేనని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసారన్ని నొక్కి చెప్పారు. రాష్ట్రంలోని మావన, సహజ వనరులు సద్వినియోగానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. 

స్వయం ఉపాధి దిశగా యువతను ప్రోత్సహించాలి 
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కేసీఆర్‌ ఆదేశించారు. స్థానికంగా ఇళ్లు నిర్మించుకునేవారికి పనులు అప్పగించాలని సూచించారు. బీడీ కార్మికులు, చేనేత కార్మికుల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని కోరారు. ప్రభుత్వ హాస్టళ్లు, ఆస్పత్రుల్లో కనీస వసతుల కల్పనకు ప్రాధాన్య ఇవ్వాలని సూచించారు. అలాగే రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించేలా చూడాలని కోరారు. యువత స్వయం ఉపాధి పథకాలు చేపట్టేడంతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రములు స్థాపించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉన్న విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపితే బడ్జెట్‌లో చేరుస్తామని వివరించారు. 
జీవన ప్రమాణాల స్థాయిపై స్టడీ ..
జిల్లాల్లో పాలన వికేంద్రీకరణ జరిగిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కేసీఆర్‌... ఆదేశించారు. ప్రజానుకూలంగా పాలన ఉండాలని సూచించారు. ప్రతి కుటుంబంలోని ప్రజల జీవన స్థితిగతులను అధ్యయనం చేయాలని కోరారు. పేదల అభ్యన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసేందుకు వీరి జీవనప్రమాణాలు ఎలా ఉన్నాయో స్టడీ చేయాలని ఆదేశించారు. కొత్త జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న కలెక్టర్లను ప్రశంసించిన కేసీఆర్‌... పాలనలో ఇంకా వేగంగా స్థిరత్వం రావాలని కోరారు. 

12:40 - January 21, 2017

కడప :జిల్లాలో చౌటుపల్లి గ్రామంలోకి గండికోట జలాశయం నీరు పోటెత్తింది. గండికోట జలాశయం నీరు గ్రామంలోకి రాకుండా నిర్మించిన తాత్కాలిక కరకట్ట తెగడంతో గ్రామంలోకి భారీగా నీరు చేరింది. దీంతో 100కు పైగా ఇళ్లు నీటమునిగాయి. ఇళ్లు నీటమునగడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి ఉధృతి దాటికి గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. తక్షణమే సహాయచర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

 

09:37 - November 7, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల రాకతో నియోజకవర్గాల నిధుల కేటాయింపుపై అయోమయ పరిస్థితి నెలకొంది. కొత్త జిల్లాల అమలుతో ఒక్కో నియోజకవర్గం రెండుకు పైగా జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. దీంతో వీటికి నిధులను ఏ ప్రాతిపదికన విడుదల చేయాలన్న సందిగ్ధత నెలకొంది. దీనిపై దృష్టిసారించిన అధికారులు తీవ్ర కసరత్తుల తర్వాత ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు.

కొత్త జిల్లాల రాకతో నియోజక వర్గ నిధుల కేటాయింపై సందిగ్ధత
కొత్త జిల్లాల రాకతో నియోజక వర్గాల్లో కన్‌ఫ్యూజన్ మొదలైంది. ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులపై సమస్యలు నెలకొన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలోని దాదాపు 30 కంటే ఎక్కువ నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల్లోకి వెళ్లాయి. దీంతో సీడీపీ నిధులను ఏవిధంగా ఖర్చు చేయాలన్న అంశంపై కలెక్టర్లలో సందేహం చోటుచేసుకుంది. ఈ అంశంపై సుదీర్ఘ కసరత్తులు చేసిన ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. సీడీపీ అభివృద్ధి నిధులు..నియోజక వర్గ కేంద్రం ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా కలెక్టర్‌ ద్వారా ఖర్చు చెయ్యాలని నిర్ణయించింది.
ఎమ్మెల్యే ప్రతిపాదన మేరకు నియోజకవర్గ నిధుల కేటాయింపు
ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారం నియోజక వర్గ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న జిల్లా కలెక్టర్ సీడీపీ నిధులను విడుదల చేస్తారు. ఒక నియోజక వర్గం రెండు, మూడు జిల్లాల్లో ఉంటే ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే ప్రతిపాదనల మేరకు అభివృద్ధి పనులను కలెక్టర్ మంజూరు చేయాలి. ఇప్పటికే నిధులు విడుదలై పనులు పూర్తికానిచోట కొత్తగా ఏర్పడిన జిల్లా కలెక్టర్ పీడీ అకౌంట్‌లో ఆ నిధులను జమ చేస్తారు. ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీలలో విడుదల చేసిన నిధుల వినియోగం తరువాత ఏవైనా మిగిలితే అవికూడా కొత్త జిల్లా కలెక్టర్ పీడీ అకౌంట్‌కు పంపించాలి. నిధులతోపాటు యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇప్పటికే పనులకు అనుమతి ఇచ్చి వివిధ దశలలో ఉంటే ..ఆ నిధులు ఏ జిల్లా పరిధిలో ఉంటే ఆ జిల్లా పరిధిలోకి బదిలీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సీనియర్ ఐఏఎస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
కొత్త జిల్లాల్లో పరిపాలనాపరంగా వస్తున్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. దీంతో ఇందుకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

 

Don't Miss

Subscribe to RSS - District collectors