DJ Movie

16:57 - July 13, 2017

ఎంతో కస్టపడి డైరెక్టర్ గా మరి మాస్ పల్స్ పట్టుకున్నాడు డైరెక్టర్ 'హరీష్ శంకర్’. బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఆడియన్స్ కి ఎం కావాలో అది తన సినిమాల్లో ప్రెసెంట్ చేసిన ఈ డైరెక్టర్ ఈ మధ్య తరుచు సహనం కోల్పోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. 'డీజే- దువ్వాడ జగన్నాథం' విషయంలో హరీష్ శంకర్ ప్రతీ విషయానికి ఊగిపోతూనే ఉన్నాడు. ఈ సినిమాలోని 'అస్మైక యోగ.. తస్మైక భోగ' సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసినపుడు విమర్శలు వస్తే.. తాను ఓ బ్రాహ్మణుడినే అంటూ బోలెడంత ఆక్రోశంతో హరీష్ శంకర్ సమాధానం ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది.
బన్నీ కెరీర్ లో ఇప్పటివరకూ వినిపించని మాట ఫేక్ కలెక్షన్స్. ఆ మచ్చ కూడా ఈ ఆవేశం కారణంగానే అల్లు అర్జున్ కు అంటుకుంది అంటున్నారు అతని జెన్యూన్ అభిమానులు. ఇప్పటికీ చెప్పను బ్రదర్ కామెంట్ కారణంగా ఇబ్బంది పడుతున్న బన్నీకి.. హరీశ్ వాటం మరో తలనొప్పిగా తయారవుతోందని టాక్. ఏది ఏమైనా శంకర్ కొంచెం కంట్రోల్ గా ఉంటే మరిన్ని మంచి సినిమాలు వస్తాయని విశ్లేషకుల అభిప్రాయం.

16:05 - June 28, 2017

సామజిక మాధ్యమాలు రోజుకో విధంగా అప్డేట్ అవుతున్నాయి. అందులో ఒక పోస్ట్ చేస్తే నిముషాల్లో వైరల్ అవుతుంటయ్.ప్రధానంగా ఇది సినిమాలకు పాకింది. సినిమా రిలీజ్ అయినా రెండు..మూడు రోజులకే నెట్ లో ప్రత్యక్షం అవుటున్న సంగతి తెల్సిందే. కంటెంట్ బాగా ఉన్న సినిమాలు..కంటెంట్ బాగా లేని సినిమాలు కూడా ఆన్లైన్ లో ప్రత్యక్షం కావడం దర్శక, నిర్మాతలను నష్టాలపాల్జేస్తోంది. పైరసీని ప్రోత్సహించవద్దని..అరికట్టాలని హీరో, దర్శక, నిర్మాతలు కోరుతూనే ఉంటున్నారు. కానీ తాజాగా ప్రముఖ సినిమాలు ఆన్లైన్ లో దర్శనం కావడం సంచలం కలిగిస్తోంది. డీజే..దువ్వాడ జగన్నాథం..రీలిజ్ కానీ జై లవ కుశ టీజర్ దృశ్యాలు లీక్ కావడం...ట్యూబ్ లైట్ ఫిలిం ఆన్లైన్ లో దర్శనమిచ్చాయి. దీనితో డీజే టీమ్ సీసీ ఎస్ పోలీస్ లను ఆశ్రయించింది. తమ సినిమా పైరసీ అయ్యిందని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ పోలీస్ లకు పిర్యాదు చేశారు. వెబ్సైట్ లో సినిమా పైరేటెడ్ కాపీ లు, లింక్స్ దర్శనమిచ్చాయి. ఇంటర్నెట్ లో సినిమాను అప్లోడ్ చేసినా, లింక్స్ షేర్ చేసినా నేరమని..కఠిన చర్యలు తీసుకొంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ ఈ హెచ్చరికలు ఏ మాత్రం పని చెయ్యడం లేదని తాజా ఘటన చూపిస్తోంది.

పెనుభూతం...
తెలుగు సినిమా పరిశ్రమకు పైరసీ అనేది పెనుభూతం ల మారిపోయింది. చిన్నా..పెద్ద సినిమాలు..అంటూ ఏ మాత్రం సంబంధం ఉండడం లేదు. సినిమా అనేది ఒక్కరోజులో పూర్తయేది కాదు. నెలలు..సంవస్తరాలు కాస్త పడితే ఒక సినిమా పూర్తవుతుంది. ఇలా రిలీస్ అయినా ఫిలిం కొన్ని నిమిషాల్లో పైరసీ ని చేసేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పైరసీ భూతాని అరికట్టలేక పోతున్నారు. ప్రముఖ హీరోల ఫిలిమ్స్ కూడా ఆన్లైన్ లో ప్రత్యక్షం కావడం ఆ హీరో అభిమానులని కలవర పెడుతోంది. ఈ నేపత్యంలో పైరసీ అరికట్టేందుకు మినిస్టర్ కేటీఆర్ తో సినీ ప్రముఖులు భేటీ అయినా విషయం తెల్సిందే. సినిమాల కోసం 200 వెబ్సైటు లు పనిచేస్తున్నాయని నిర్మాత సురేష్ బాబు పేరొన్నారు. కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని టాక్. ఒకవైపు పరిశ్రమల్లో సరైన హిట్లు లేక సతమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన బాహుబలి సినిమా సత్తాని చాటింది. ఒకటి..రెండు..సినిమాలు హిట్స్ ఉన్నా నిర్మాణ వ్యయం భారీగా పెరగడం..రెమ్యూనరేషన్ కూడా అధికం కావడం తో నిర్మాతలు చాల కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లో ఉండే కొంత మంది పెద్దలు కూడా పైరసీ లో భాగం ఉందని పుకార్లు షికారు చేసాయి కూడా. ఇందులో చిన్న..పెద్ద నటులు తేడా లేదు. ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా..రాజమౌళి ఫిలిం బాహుబలి సినిమా కూడా పైరసీ బారిన పడింది. 

టెక్నాలజీ..
ఇంతకూ ముందు కేవలం కొన్ని రూపాల్లో ఉన్న ఈ భూతం కొత్త కొత్త వేషాలతో ముందుకు వెళుతోంది. మొన్నటి వరకు కేవలం వీడియో ఆధారంగా చేసేవాళ్ళు. ప్రస్తుతం టెక్నాలజీ రోజురోజుకు అందనంత ఎత్తులో ఎదుగుతోంది. స్మార్ట్ ఫోన్..లు అందుబాటులో రావడం క్షణంలో సమాచారాన్ని ఇతరులకు షేర్ చేస్తున్నారు. అత్యాధునిక 4k వీడియో రికార్డింగ్ కలిగిన స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఉన్నాయ్. కొన్ని ఫోన్స్ చీకటి లో కూడా స్పష్టంగా తీయగలిగే అల్ట్రా మోడరన్ లైన్స్ వాడి కస్టమర్ తమ ఉత్పత్తులను అందిస్తున్నాయి. 

నివారించలేమా ?
మరి దీనిని నివారించలేమా. ప్రతి ప్రాబ్లెమ్ కు ఒక సొల్యూషన్ ఉంటుంది. సెల్ ఫోన్ లేకుండా సినిమా కు రావద్దని చెప్పలేము. ప్రభుత్వాలు..సినీ రంగం సమన్వయము తో పనిచేయడం..చట్టాలను కఠినంగా అమలు చేస్తే కొంత వరకు సాధ్యమేనని కొంత మంది పేరుకొంటున్నారు. ప్రదానంగ పైరసీ ని ప్రోత్సహించడం వాళ్ళ జరిగే నష్టం..ఇతర విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి సూచనలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో కూడా అవగానే వస్తే పైరసీని నిర్ములిస్తే సాధ్యమేనని మరికొందరు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా పైరసీని అరికట్టాలని సూచిస్తున్నారు. 

15:02 - June 26, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' నటించిన 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' చిత్రం అభిమానులను అలరిస్తోంది. అంతేగాకుండా బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. ‘హరీశ్ శంకర్' దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ‘బన్నీ’కి జోడిగా ‘పూజా హేగ్డే’ నటించింది. ఈ సినిమాలో ‘అల్లు అర్జున్’ బ్రాహ్మణ యువకుడిగా కనిపించి తనదైన స్టైల్ లో నటించారు. అంతేగాకుండా ఆయన డ్యాన్స్..ఫైట్లకు అభిమానులు ఫిదా అయిపోయారు. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 65 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు రమేశ్ బాలా ట్వీట్ చేశారు. తొలి రోజు వసూళ్లలో బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్'..’ట్యూబ్ లైట్' ను అధిగమించిన సంగతి తెలిసిందే. రంజాన్ పండుగ సందర్భంగా సినిమాకు కలెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

21:22 - June 23, 2017

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా.. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం డిజె...దువ్వాడ జగన్నాథమ్..ఈ సినిమా ఇవాల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ చిత్రం ఎలా ఉంది. రేటింగ్ విశేషాలను వీడియోలో చూద్దాం... 

10:38 - June 23, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' తాజా చిత్రం 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' ప్రేక్షకులు ముందుకొచ్చేసింది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ చిత్రం గురించి అభిమానులు ఎంతో ఉత్కంగా ఎదురు చూశారు. ‘హరీశ్ శంకర్' దర్శకత్వంలో 'పూజా హేగ్డే' హీరోయిన్ గా నటించారు. 'దిల్' రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో బ్రాహ్మణుడిగా...మాస్ గా రెండు పాత్రల్లో 'బన్నీ' నటించడం విశేషం. బ్రాహ్మణ పాత్రలో ఉన్న 'బన్నీ' వంటవాడిగా చేస్తుంటాడు. ఈవెంట్స్ అన్ని ఇతనే నిర్వహిస్తుంటాడు. ఇతనికి స్నేహితుడు 'వెన్నెల కిశోర్' ద్వారా 'పూజా హేగ్డే' పరిచయం అవుతుంది. ఈ మధ్యలో ‘అల్లు అర్జున్’ ప్రేమిస్తుంటాడు. కానీ పూజ తండ్రి హోం మినిస్టర్ పోసాని కృష్ణ మురళి..రొయ్యల నాయుడు (రావు రమేష్) కుమారుడు సుబ్బరాజుతో వివాహం నిశ్చయించుకుంటారు. కానీ ‘పూజా’ మాత్రం ‘శాస్త్రీ’నే పెళ్లి చేసుకుంటానని అంటుంది. ఇదిలా ఉండగా డీజే.. తెరపై వస్తాడు. రియల్ ఎస్టేట్ ..తదితర స్కాంలపై పోరాటం చేస్తుంటాడు. న్యాయం కోరుతున్న వారికి ఇతను అండగా నిలుస్తుంటాడు. మరి అసలు డీజే....దువ్వాడ జగన్నాథమ్ కు సంబంధం ఏంటీ ? చిత్రంలో డ్యూయల్ రోల్ ఉందా ? లేక ఒక్కడేనా అనేది చిత్రం చూస్తే తెలిసిపోతుంది. కామెడీ మాత్రం బాగుందని టాక్ వినిపిస్తోంది. డ్యాన్స్ లో మరోసారి 'బన్నీ' విరగదీశాడని అభిమానులు అనుకుంటున్నారు. ఫైట్స్ కూడా బన్నీ తనదైన శైలిలో చేశాడని తెలుస్తోంది.

17:29 - June 20, 2017

'డీజే...’ సెన్సార్ పూర్తయ్యింది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' దర్శకుడు 'హరీశ్ శంకర్' దర్శకత్వంలో 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' తెరకెక్కిన సంగతి తెలిసిందే. కానీ సినిమాలో ఓ పాట తీవ్ర వివాదం సృష్టించింది. ‘గుడిలో బడిలో ఒడిలో మడిలో' అంటూ సాగే పాటపై ఉపయోగించిన 'అగ్రహారం..తమలపాకు..నమకం..చమకం' వంటి పదాలపై బ్రాహ్మణ సంఘాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా సన్నివేశాలు..పాటలున్నాయని సభ్యులు ఆరోపణలు గుప్పించారు. పాటలోని పదాలను తొలగిస్తామని దర్శకుడు హరీశ్ శంకర్ ఇదివరకే ప్రకటించారు. జూన్ 23వ తేదీన సినిమా విడుదల కానుందని చిత్ర యూనిట్ పేర్కొంది. కానీ వివాదం నడుస్తుంటే సినిమా విడుదలవుతుందా ? లేదా ? అనే ఆందోళన అభిమానుల్లో ఏర్పడింది. తాజాగా పాటలోని పదాలను తొలగిస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. 'డీజే...దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలోని పాటల పదాలను మార్పు చేశారు. నమకం..చమకం..అనే పదాల చోట ' నాగమకం..నీ సుముఖం' పదాలను చిత్ర బృందం పొందుపరిచింది. సెన్సార్ అనమతిని దర్శక..నిర్మాతలు పొందినట్లు తెలుస్తోంది.

13:19 - June 19, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. ‘సరైనోడు' చిత్రానికి గాను ఈ అవార్డు ఆయనను వరించింది. ఈ సందర్భంగా అవార్డును ప్రముఖ దివంగత దర్శకుడు 'దాసరి నారాయణ రావు'కు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డు ప్రధానోత్సవం ఇంటర్నేషనల్ కన్వన్షన్ సెంటర్ లో జరిగింది. పలువురు తారలు విచ్చేయడంతో సందడిగా మారిపోయింది. ఈ సందర్భంగా 'అల్లు అర్జున్' ట్విటర్‌ ద్వారా ఫిల్మ్‌ఫేర్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఈ అవార్డును దర్శకరత్న దాసరి నారాయణ రావుకు అంకితం చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ చేతుల మీదుగా అవార్డును 'అల్లు అర్జున్' అందుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘అల్లు అర్జున్’ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఇందులో 'బన్నీ' సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. జూన్‌ 23న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

14:53 - June 13, 2017

హైదరాబాద్: దువ్వాడ జగన్నాథం (డీజే) సినిమాపై సినిమాపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సినిమాలో అభ్యంతర సన్నివేశాలు, పాటలు తొలగించాలని డిమాండ్‌ చేశారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ అధికారులను కలిసి బ్రాహ్మన్‌ యూనిటి ఫర్‌ ఎవర్‌ సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. దర్శకుడు, నిర్మాత దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. సినిమాలో అభ్యంతరకర పదాలు తొలగించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని బ్రాహ్మణ సంఘాల నేతలు హెచ్చరించారు. 

12:13 - June 11, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'..మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. వీరి కాంబినేషన్ లో గతంలో 'జల్సా'..’అత్తారింటికి దారేది' సినిమాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో 'పవన్' నటించిన చిత్రాలు 'సర్దార్ గబ్బర్ సింగ్', ‘కాటమరాయుడు' చిత్రాలు ఆశించినంతగా రాణించలేదు. తొలుత శరవేగంగా షూటింగ్ కొనసాగిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం కావటంతో పాటు రాజకీయ కారణాలతో నెల రోజులు పాటు 'పవన్' షూటింగ్ కు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

11:29 - June 11, 2017

'సరైనోడు' చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని తన ఖాతాలో వేసుకుని ముందుకెళుతున్న స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ తన తాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్..పోస్టర్స్..విశేషంగా అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా పాటలు కూడా సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేశారు. శనివారం సాయంత్రం ఆడియో ట్రాక్ లిస్ట్ రిలీజ్ చేసిన యూనిట్ తాజాగా చిత్రానికి సంబంధించిన అన్ని సాంగ్స్ నెట్ లో విడుద‌ల చేశారు. దేవి శ్రీ అందించిన సంగీతం ఉర్రుతలూగిస్తోంది. ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుక‌ని అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌పాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ వేడుకకు మెగాస్టార్ ‘చిరంజీవి’ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన గ్లామ‌ర్ బ్యూటీ పూజా హెగ్డే నటించింది. 'దిల్' రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీని జూన్ 23న విడుద‌ల చేస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - DJ Movie