DMK

14:05 - May 29, 2018
19:22 - April 2, 2018

ఢిల్లీ : అవిశ్వాసం చర్చకు రాకుండా బీజేపీ- కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఏఐడీఎంకే ఎంపీ తంబిదొరై ఆరోపించారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ కావేరీ జలాలపై చర్చ జరగకుండా ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికలున్నాయి కాబట్టే అవిశ్వాసం చర్చకు రావద్దని కాంగ్రెస్‌ బీజేపీ భావిస్తున్నాయన్నారు. కావేరీ బోర్డు ఏర్పాటు పై కేంద్రం ప్రకటన చేసే వరకు తమ ఆంగదోళన కొనసాగిస్తామని తంబిదొరై స్పష్టం చేశారు. 

19:46 - January 27, 2018

చెన్నై : తమిళనాడులో ద్రవిడ పార్టీ నేతలు... జీయర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. హిందూ దేవుళ్లపై డిఎంకె ఎంపి కనిమొళి చేసిన వ్యాఖ్యలను జీయర్లు తీవ్రంగా ఖండించారు. హిందూ మతం, సాంప్రదాయాలపై దాడులు జరుగుతుంటే మౌనం వహించకుండా ఎదురుదాడికి దిగాలని శ్రీవిల్లీపుత్తూరిలోని ఆండాల్‌ సన్నిధికి చెందిన ఓ జీయర్‌ స్వామి పిలుపునిచ్చారు. దీనిపై కనిమొళి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జీయర్లంటే తమకు గౌరవం ఉండేదని...సమాజానికి మంచి సందేశం ఇవ్వాల్సిన వాళ్లే ఇపుడు రాళ్లు, కత్తులు పట్టుకుని హింసకు దిగుతామని హెచ్చరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 

19:44 - January 27, 2018

చెన్నై : తమిళనాడులో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. డిఎంకెతో పాటు వామపక్షాలు, తమిళ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. సామాన్యులకు భారంగా మారిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. డిఎంకె వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్, సిపిఎం కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ కార్యదర్శి ముత్తరన్, ఎండిఎంకె వైగో, విసీకే నేత తిరుమావళవన్, కాంగ్రెస్‌ నేత తిరునావుక్కరసు నేతృత్వంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

19:42 - January 27, 2018

చెన్నై : తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్థానికతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రానివ్వమంటూ దర్శకుడు, తమిళన్‌ పార్టీ నేత సీమన్ హెచ్చరిస్తున్నారు. రజనీకాంత్‌కు నిజంగా దమ్ముంటే కర్ణాటకకు వెళ్లి తాను తమిళుడినని ప్రకటించాలని సవాల్‌ విసిరారు. 44 ఏళ్లపాటు తమిళనాడులో ఉన్నంత మాత్రాన రజనీ తమిళుడు కాదని సీమన్‌ స్పష్టం చేశారు. సినిమాల్లో డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చిన వ్యక్తి ఇపుడు రాజకీయాలంటూ ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

16:41 - December 21, 2017
15:56 - December 21, 2017

ఢిల్లీ : 2జీ స్పెక్ట్రం కేసులో పటియాలా హౌజ్ కోర్టు తీర్పును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వాగతించారు. కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి యూపిఏ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు నిజం కావని కోర్టు ఇచ్చిన తీర్పుతో తేలిందని మన్మోహన్ సింగ్ అన్నారు. యూపిఏ ప్రభుత్వంపై దుష్ప్రచారం జరిగిందని పేర్కొన్నారు.

 

15:54 - December 21, 2017

ఢిల్లీ : సంచలన  2జీ కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న ఏ.రాజా, కనిమొళిలకు ఊరట లభించింది. వారిద్దరిని నిర్దోషులుగా నిర్ధారిస్తూ పటియాలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో డీఎంకే నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కేసులో నిందితులకు ఉన్న అందరినీ నిర్ధోషులుగా తేల్చింది కోర్టు. ఆరు సంవత్సరాల అనంతరం సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించింది. వినోద్‌రాయ్ నేతృత్వంలో 2010లో సీబీఐ తొలి చాటర్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ.రాజాతో పాటు టెలికాం కార్యదర్శి సిద్దార్ధ్ బెహూరా, మరో 12 మందిపై సీబీఐ అభియోగాలు మోపింది. స్పెక్ట్రం ధరలు నిర్ణయించడంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక సమర్పించింది. స్వాన్ టెలీకాంకు అర్హత లేకపోయినప్పటికీ 15 కోట్ల 37 లక్షలకే లైసెన్సులకు అనుమతులిచ్చినట్లు నివేదిక తెలిపింది. బిడ్ దక్కించుకున్న 9 కంపెనీలు ప్రభుత్వానికి రూ.10 వేల 772 కోట్లు మాత్రమే చెల్లించాయి. తప్పుడు పత్రాలతో ఆ కంపెనీలు లైసెన్సులు పొందినట్లు విచారణలో వెల్లడైనట్లు కాగ్ నివేదిక తెలిపింది. అయితే ఈ నేరాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం అయినందుకు అందరినీ నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.  

 

22:01 - December 19, 2017

తమిళనాడు : చెన్నైలోని ఆర్కే నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21న జరుగనున్న ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌కు ఉప ఎన్నిక జరుగుతోంది. అధికార అన్నా డీఎంకే, ప్రతిపక్ష డీఎంకే సహా అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టాయి. 17 నెలల అన్నా డీఎంకే పాలనకు ఈ ఎన్నిక ప్రోగ్రెస్‌ రిపోర్టుగా భావిస్తున్నారు. జయలలిత మరణం తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 
 

21:32 - November 24, 2017

చెన్నై : తమిళనాడు, ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ని విడుదల చేసింది. డిసెంబర్‌ 21న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 24న ఎన్నికల ఫలితాలు వస్తాయి. జయలలిత మరణంతో ఆర్కే నగర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయ్యింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - DMK