doctors

19:21 - July 18, 2018
12:19 - June 4, 2018

ప్రకాశం : జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడులో అతిసారం ప్రబలింది. అతిసారం వ్యాధి బారిన పడిన నాగమ్మ అనే వృద్ధురాలు వాంతులు, విరేచనాలు ఎక్కువ అవడంతో మరణించింది. ఈ వ్యాధితో గ్రామంలో మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరికి వైద్యాశాఖాధికారులు చికిత్స అందిస్తున్నారు. గ్రామానికి వచ్చే తాగునీటి పైప్‌లైన్‌లో నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల అతిసారం ప్రబలినట్లు వైద్యులు గుర్తించారు. 

 

16:08 - January 4, 2018

రంగారెడ్డి : జిల్లా హస్తినాపురంలోని అమ్మా ఆసుపత్రిలో విషాదం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బుచ్చమ్మ (35) మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

19:46 - December 21, 2017

నాగర్ కర్నూలు : జిల్లాలోని కల్వకుర్తి సీబీఎం ఆస్పత్రిలో మహిళకు డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ చేసి యువతి కడుపులో నుంచి 8 కిలోల కణితిని వైద్యులు తొలగించారు. జిల్లాలోని ఉప్పునుంతల మండలం తిర్మలాపూర్ కు చెందిన సైదమ్మ (22) అనే యువతి కడుపు నొప్పితో కల్వకుర్తిలోని సీబీఎం ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో కడుపులో కణితి ఉందని తేలడంతో ఆమెకు ఆపరేషన్ చేశారు. డా.వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. వైద్య పరిభాషలో ఈ కణితిని ఒబేరియన్ ట్యూమర్ గా పిలుస్తారని డాక్టర్లు చెప్పారు. కణితి తొలగించి ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు బాధిత మహిళ సైదమ్మ కృతజ్ఞతలు తెలిపారు. 

 

14:00 - November 1, 2017

కర్నూలు : ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో  రోగి మృతి చెందాడు. అనంతపురానికి చెందిన వడ్డె ములగప్ప కడుపునొప్పితో 18వ తేదీ ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్లు శుక్రవారం రోజున ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్‌ తరువాత డాక్టర్లు పట్టించుకోలేదని మృతుడి బంధువులు అంటున్నారు.  రోగి పరిస్థితి విషమంగా ఉందని చెప్పినా డాక్టర్లు పట్టించుకోలేదని.. డాక్టర్లు నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని మృతదేహంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు.  

19:56 - October 31, 2017

నెల్లూరు : పేషంట్‌ కడుపులో కత్తెర ఉంచి కుట్లేసిన నెల్లూరు ప్రభుత్వాసపత్రి వైద్యుల నిర్వాకంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్‌ రాధాకృష్ణరాజు వెల్లడించారు. మరోపక్క ఆపరేషన్‌ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమంటూ వెంటనే తన భర్తకు సర్జరీ చేశారని బాధుతుని భార్య వాపోయింది. 

17:45 - October 30, 2017
16:55 - October 30, 2017

నెల్లూరు : ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. చలపతిరావు అనే రోగికి ఆపరేషన్‌ చేసి కడుపులో కత్తెరను మరిచిపోయి కుట్లు వేశారు వైద్యురాలు పద్మశ్రీ. వారం రోజులుగా కడుపునొప్పితో బాధపడిన చలపతిరావు.. మళ్లీ ఆస్పత్రికి వెళ్తే విషయాన్ని గోప్యంగా ఉంచి రెండవసారి ఆపరేషన్‌ చేశారు. డాక్టర్‌ పద్మశ్రీ గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేయారనే ఆరోపణలు ఉన్నాయి. 

 

18:44 - October 20, 2017

ప్రకాశం : పొట్టకూటికోసం వెళ్లిన గొర్రెల కాపర్లకు కడగండ్లు మిగిలాయి. ఇప్పటికి నాలుగు వందల గొర్రెలు అంతుపట్టని రీతిలో మృత్యువాత పడ్డాయి. వైద్యులు శ్రమించినా మరణాలు మాత్రం ఆగడంలేదు. మేతకోసం వెళితే ఆహారం రూపంలో దొరికిన వయ్యారిభామ ఆకు ఈ మూగజీవాల ఉసురు తీశాయి. దీంతో గొర్ల కాపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాల బారినుంచి గెట్టెక్కించాలంటూ వేడుకుంటున్నారు కాపరులు.

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఉలిచి, చవటవారిపాలెం తదితర గ్రామాల సమీపంలో బీడుభూముల్లోకి గొర్రెలను తోలుకెళ్లారు కాపరులు. కావలసినంత పచ్చిక అక్కడ ఉండటంతో గొర్రెలను అటు వైపు తీసుకెళ్లారు. ఇక్కడ గొర్రెల కాపర్లకు ఊహించని అనుభవం ఎదురైంది. నిమిషాల వ్యవధిలో మూగజీవాల గమనం మందగించింది. గొర్రెలు కిందపడి కొట్టుకుంటూ చనిపోతుండటంతో కాపర్లకు అర్థం కాలేదు. తమ జీవనాధారమైన గొర్రెలు పిట్టల్లా రాలిపోతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు.

12మంది కాపరులకు చెందిన మొత్తం రెండు వేలకు పైగా గొర్రెల్ని మేత కోసం తోలుకుపోయారు. వీటిలో ఇప్పటికే దాదాపు 400గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో ఆరువందల గొర్రెలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. అస్వస్థతకు గురైన గొర్రెలను ఎనిమిది లారీల్లో అప్పటికప్పుడే వైద్యం కోసం చీరాల మండలం గవినివారిపాలెం తరలించారు. నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నా మూగజీవాల మరణాలు మాత్రం ఆగడంలేదు. విషపూరితమైన ఈ ఆకు ప్రభావంతో జననావయవాలు, కాలేయం, కళ్లు, జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ఉంటుందని వైద్యులు చెప్పారు. విషపూరిత వయ్యారిభామ మొక్కలను తినకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. అయితే అవగాహన లేకపోవడంతో కాపరులు గొర్రెలకు భీమా చేయించుకోలేదు. దీంతో ఇప్పుడు పరిహారం వచ్చేది కష్టమేనని అధికారులు అంటున్నారు. తమను ఏవిధంగానైనా ఆదుకోవాలని రైతులు వేడుకుంటుకున్నారు.

19:49 - October 19, 2017

ప్రకాశం : జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఉలిచి, చవటవారిపాలెం తదితర గ్రామాల సమీపంలో బీడుభూముల్లోకి గొర్రెలను తోలుకెళ్లారు కాపరులు. కావలసినంత పచ్చిక అక్కడ ఉండటంతో గొర్రెలను అటు వైపు తీసుకెళ్లారు. ఇక్కడ గొర్రెల కాపర్లకు ఊహించని అనుభవం ఎదురైంది. నిమిషాల వ్యవధిలో మూగజీవాల గమనం మందగించింది. గొర్రెలు కిందపడి కొట్టుకుంటూ చనిపోతుండటంతో కాపర్లకు అర్థం కాలేదు. తమ జీవనాధారమైన గొర్రెలు పిట్టల్లా రాలిపోతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు.

400గొర్రెలు మృత్యువాత
12మంది కాపరులకు చెందిన మొత్తం రెండు వేలకు పైగా గొర్రెల్ని మేత కోసం తోలుకుపోయారు. వీటిలో ఇప్పటికే దాదాపు 400గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో ఆరువందల గొర్రెలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. అస్వస్థతకు గురైన గొర్రెలను ఎనిమిది లారీల్లో అప్పటికప్పుడే వైద్యం కోసం చీరాల మండలం గవినివారిపాలెం తరలించారు. నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నా మూగజీవాల మరణాలు మాత్రం ఆగడంలేదు. విషపూరితమైన ఈ ఆకు ప్రభావంతో జననావయవాలు, కాలేయం, కళ్లు, జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ఉంటుందని వైద్యులు చెప్పారు. విషపూరిత వయ్యారిభామ మొక్కలను తినకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు.అయితే అవగాహన లేకపోవడంతో కాపరులు గొర్రెలకు భీమా చేయించుకోలేదు. దీంతో ఇప్పుడు పరిహారం వచ్చేది కష్టమేనని అధికారులు అంటున్నారు. తమను ఏవిధంగానైనా ఆదుకోవాలని రైతులు వేడుకుంటుకున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - doctors