Drugs Case

07:38 - July 21, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఏ సమస్య తెరపైకి వచ్చినా అధికార టీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎప్పుడూ చకోరపక్షిలా ఎదురు చూస్తూనే ఉంటుంది. గతంలో రైతుల ఆత్మహత్యలు, సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, మిర్చిరైతుల గిట్టుబాటు ధరల సమస్యలపై ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికేలా చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు డ్రగ్స్‌ మాఫియాను అస్త్రంగా చేసుకుని అధికార టీఆర్‌ఎస్‌పై వాగ్బాణాలు సంధిస్తోంది. కాంగ్రెస్, టీఆర్ ఎస్ల మధ్య డ్రగ్ మాఫియా ఆజ్యం పోస్తోంది. కాంగ్రెస్‌ నేతలు ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని గులాబీ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మాదకద్రవ్యాల మాఫియాపై అధికార టీఆర్‌ఎస్‌పై మూకుమ్మడి దాడి చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు, అవసరమైనప్పుడు జాతీయ నేతలను రంగంలోకి దింపుతున్నారు.

నకిలీ వెబ్‌సైట్లు
తెలంగాణ పోలీసులు ఐసిస్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టించారని రెండు నెలల క్రితం ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్... ఇప్పుడు మరో సారి డ్రగ్స్‌ మాఫియాపై తనదైన శైలిలో స్పందించారు. జంటనగరాల్లో వెలుగు చూసిన డ్రగ్స్ మాఫియా అంశంపై ఇప్పటి వరకు సినీ ప్రముఖులు, విద్యాసంస్థల చుట్టూనే తిరిగింది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ కీలక నేతల సన్నిహితులకు సంబంధాలున్నాయని ఆరోపిస్తూ, దిగ్విజయ్‌సింగ్‌ చేసిన ట్వీట్‌ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ ప్రముఖులను విచారిస్తున్న సిట్‌... మాఫియాతో టీఆర్‌ఎస్‌ నేతల సన్నిహితులకు ఉన్న సంబంధాలపై విచారణ జరుపుతుందో... లేదో.. అంటూ ట్విట్టర్‌లో అనుమానాలు వ్యక్తం చేశారు. దిగ్విజయ్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పెద్ద మనిషిలా వయసుకు తగిన విధంగా వ్యవహరించాల్సిన దిగ్విజయ్... రాజకీయాల నుంచి గౌరవప్రదంగా వైదొలగాల్సిన సమయం వచ్చిందని ట్వీట్‌ చేసి, కాంగ్రెపై విరుచుకు పడ్డారు. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రాజకీయంగా అనుమానాలకు తావిస్తుండటంతో అధికార పార్టీ నేతలను కూడా కొంత అయోమయానికి గురిచేస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ ఎస్ నేతల మధ్య ట్వీట్స్‌ వార్‌కు కారణమైన డ్రగ్స్ వ్యవహారం కొత్త కిక్ ఇచ్చేలా కనిపిస్తోంది.

16:32 - July 17, 2017

హైదరాబాద్ : 'రవితేజ నిప్పులాంటి వాడు..నిప్పుతో చెలగాటమాడుతున్నారు..శత్రుత్వం తమకు లేదు..ఎవరో కావాలని చేశారని అనుకోవడం లేదు..తన కష్టం మీద పైకి వచ్చాడు'..అంటూ రవితేజ తల్లి పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా డ్రగ్స్ రాకెట్ కేసు సినీ ఇండస్ట్రీని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సినీ నటుడు రవితేజ..ఇతరులు కూడా ఉన్నారనే వార్త సంచలనం అయ్యింది. దీనితో ఆమె తల్లి 'రవితేజ' తల్లి సోమవారం స్పందించారు.

మత్తు ఏంటో తెలియదు..
డ్రగ్స్ వ్యవహారంలో తన కొడుకు పేరు రావడంపై హీరో రవితేజ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రవితేజకు మత్తు పదార్థాలు సేవించే అలవాటు లేదని, కష్టపడి ఇంత స్థాయికి ఎదిగిన తన కుమారుడికి ఈ కేసుతో సంబంధం ఉందని అనడం తమకు బాధ కలిగిందన్నారు. ప్రస్తుతం అతను విదేశాల్లో ఉన్నందున స్పందించడానికి అందుబాటులో లేడని, పోలీసుల నుండి నోటీసు వచ్చిందన్నారు. 22వ తేదీన విచారణకు రవితేజ హాజరౌతాడని తెలిపారు.

కెల్విన్..ఎవడో తెలియదు..
నిజాయితీ ఎప్పటికైనా బయటపడుతుందని..ఏ టెస్టులకైనా తన కొడుకు రెడీ అని తెలిపారు. ఆరు నెలలకొకసారి ఆరోగ్య వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాడని, గతంలో భరత్..రవితేజను డ్రగ్స్ కేసులో ఇరిక్కించారని తెలిపారు. భరత్ అలాంటి సర్కిల్ కు అలవాటు పడ్డాడని..మంచితనం కుర్రాడైన భరత్ మద్యానికి అలవాటు పడ్డాడని తెలిపారు. కెల్విన్..గెల్విన్ ఎవడో తెలియదని 'రవితేజ' తల్లి కుండబద్ధలు కొట్టారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

22:06 - July 15, 2017

దగపడ్డ ఓ చెల్లి వనుకుతుంది...ప్రతి రోజు మారుతున్న డేట్ ను చూసుకొని బయపడింది...రోజలు గడుస్తున్నాయి..కానీ తనకు దారిలేదు..వారాలు దొర్లిపోతున్నాయి..కానీ తనకు తప్పించుకునే మార్గం లేదు. నెలలు గడుస్తున్నాయి విధి అడుకుంటుంది..చావు దగ్గరై చూసింది.. మరణం దగ్గర నుంచి చూసింది. ఆమె 90 రోజులు నరకం అనుభవించింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:44 - July 13, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో అరెస్టుల సంఖ్య 12కు చేరింది. నిందితులు అనీశ్, రితు అగర్వాల్‌నుంచి మరింత పోలీసులు మరింత సమాచారం రాబడుతున్నారు. సినీ ఇండస్ట్రీలో పలువురికి ఇప్పటికే నోటీసులుఇచ్చిన పోలీసులు.. డ్రగ్స్‌తో సంబంధంఉన్న మరికొంతమంది సమాచారం సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

17:25 - July 12, 2017
16:17 - July 12, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సినీ ఇండస్ట్రీకి చెందిన 10 మందికి సిట్‌ నోటీసులు జారీ చేసింది. ముగ్గురు యువ హీరోలు, నలుగురు డైరెక్టర్లు, ఇద్దరు నిర్మాతలకు నోటీసులు అందజేసింది. 6 రోజుల్లోగా హాజరుకావాలని సిట్‌ ఆదేశించింది. ఆలోగా హాజరుకానిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss

Subscribe to RSS - Drugs Case