Elephant

18:45 - October 25, 2017

శ్రీకాకుళం : జిల్లాలోని సోంపేట మండలం, లక్కవరం గ్రామంలో చిరుత మృతి చెందింది. బాతుపురం రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుండి రహదారి పైకి వచ్చిన చిరుతను గుర్తు తెలియని వాహనం ఢి కొనడంతో చిరుత అక్కడికక్కడే చనిపోయింది. 

 

12:15 - September 4, 2017

ఒడిశా : ఏనుగుతో సెల్ఫీ దిగాలన్న సరదా ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. ఓ ఆడ ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మండియాకుడ్‌ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయని తెలుసుకున్న కటక్‌ వాసి అశోక్‌ భారతి అక్కడకు చేరుకున్నాడు. గ్రామస్థుల సహకారంతో అటవీశాఖ అధికారులు ఏనుగును తరుముతుండా అశోక్‌ భారతి ఫోటోలు తీశాడు. ఆ తర్వాత ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుండా ఆగ్రహించిన ఏనుగు.. అశోక్‌ను అశోక్‌ భారతిని వెంటాడి కాళ్లతో, తొండంతో నలిపేసింది. ఏనుగుబారి నుంచి తప్పించుకునే పారిపోయేందుకు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఏనుగు తొక్కేడంతో తీవ్రంగా గాయపడ్డ అశోక్‌ భారతిని అస్పత్రికి తరలించిగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. 

11:12 - July 17, 2017

హైదరాబాద్: గజరాజు ఆనందంగా నీటిలోకి వచ్చి... తొండంతో పాటు కాళ్లతో నీటిని కొడుతూ ఈదింది. కొన్ని స్టంట్స్‌ కూడా చేసింది. అమెరికాలోని ఆరిజోనా జూ వారు ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. వాళ్ల జూలో ఉండే సముద్ర అనే ఏనుగు స్విమ్మింగ్‌ చేస్తున్న వీడియో అది. జంతుప్రదర్శనశాలలో ఓ జంతు ప్రేమికుడు వాటర్‌ మెలన్‌ను విసిరేశాడు. వెంటనే ఏనుగు అందుకుని తిన్నది. మొత్తానికి ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే దాదాపు 14 లక్షల 98 వేల మందికి పైగా ఈ వీడియోను చూశారు.

16:44 - February 26, 2017

హైదరాబాద్: అసోంలో ఓ ఏనుగు తన చర్యతో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. జల్‌పాయ్‌ గురి జిల్లాలోని చంప్రమరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో... రైల్వే లెవల్ క్రాసింగ్‌ గేట్‌ను తనదైన శైలిలో దాటేసింది. మొదటి గేటును మెడవరకు ఎత్తి పట్టాల మీదకు వచ్చిన ఏనుగు.. రెండో గేటును దాటి వెళ్లింది. ఈ క్రమంలో ఏనుగు ధాటికి గేటు విరిగిపోయింది. దాదాపు 15 నిమిషాల పాటు అక్కడే తచ్చాడిన ఏనుగు.. తరువాత అడవిలోకి వెళ్లిపోయింది.

18:58 - September 26, 2016

చిత్తూరు : జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. రామసముద్రం మండలం గొల్లపల్లి గ్రామంలోకి ఏనుగు చొరబడి పంటపొలాలను నాశనం చేసింది. ఏనుగుదాడిలో రామప్ప అనే వృద్ధుడు మృతిచెందాడు. ఆపరేషన్ గజా పేరుతో ఏనుగును పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. కుప్పం నుంచి వినాయక, జయంతి అనే రెండు శిక్షణా ఏనుగులను తెప్పించి ఒంటరి ఏనుగును దారిమళ్లించేందుకు యత్నిస్తున్నారు. మత్తు ఇంజన్లతో అడవిలోకి వెళ్లారు. మరిన్ని వివరాలకు వీడియోలో చూద్దాం....

 

 

14:40 - April 25, 2016

బిలాస్ పూర్: ఎండవేడికి ఓ ఏనుగు తట్టుకోలేకపోయింది.. గొలుసుల్ని తెంపుకొని పైప్‌ను పగలగొట్టి వేసవితాపాన్ని తీర్చుకుంది.. చాలాసేపు నీటికింద స్నానం చేస్తూ సేద తీరింది.. చత్తీస్‌గఢ్‌ బిలాస్‌పూర్‌లోని నేషనల్‌ పార్కులో ఎండలు మండిపోతున్నాయి.. ఈ వేడిని భరించలేని ఏనుగు.. గొలుసుల్ని లాగేసింది... పరుగు పరుగున పైప్‌ దగ్గరకు చేరింది.. ఆ పైప్‌ను తన్నేసి నీళ్లు బయటకు వచ్చేలా చేసింది.. ఈ నీటిలో శరీరమంతా తడుపుకుంటూ స్నానం చేసింది.. 

14:58 - February 10, 2016

హైదరాబాద్ : పశ్చిమబంగ రాష్ట్రంలోని సిలిగురిలో ఏనుగు బీభత్సం సృష్టించింది.... జనావాసాల్లోకి ప్రవేశించిన ప్రజలను బెంబేలెత్తించింది.. బైకుంతపూర్‌ అటవీ ప్రాంతం నుంచి వచ్చి వీధుల్లో తిరుగుతూ ఇళ్లపై దాడి చేసింది.. ఏనుగు దాడిలో సుమారు 150 ఇళ్లు, ఆరు భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఏనుగును పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు... 

20:31 - January 15, 2016

ఏనుగు పాటలు పాడడం ఏందీ ? అసలు మాటలే రావు ఇంకా పాటలు పాడేదేంది అంటారా ? ఈ వీడయో చూస్తే మీకే తెలుస్తది. తమిళనాడులో ఉన్న ఓ ఏనుగు పాటలు పాడుతోంది. ఓ గుళ్లో ఇది ఇలా చేస్తుందంట. ఇక మరో ఏనుగైతే స్టెప్పులేస్తోందంట. మనుషులకే కాకుండా జంతువులకు కూడా సంగీతంపై మక్కువ ఉందని తెలుస్తోంది. మరి ఈ ఏనుగులు ఎలా చేస్తున్నాయో వీడియో చూడుండ్రి.

08:24 - December 17, 2015

చిత్తూరు : పంట పొలాలు నాశనమౌతున్నాయని..ఏనుగులు అడ్డుకొనేందుకు రైతులు వేస్తున్న విద్యుత్ కంచెలు విషాదాన్ని సృష్టిస్తున్నాయి. షాక్ లతో కొన్ని ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి. మూగజీవాలు మృతి చెందుతుండడం పట్ల విచారం వ్యక్తమౌతోంది. పల్లెకుప్పంలో ఏనుగులు దాడులు చేస్తుండడంతో పంట పొలాలకు రైతులు అనధికారికంగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. ఒక మూడేళ్ల మగ ఏనుగు పంట పొలాల్లోకి ప్రవేశించింది. ఒక్కసారిగా విద్యుద్ఘాతం కలుగడంతో ఆ ఏనుగు అక్కడికక్కడనే మృత్యువాత పడింది. దీనితో అక్కడ విషాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. నారాయణ రెడ్డి అనే రైతుకు చెందిన పొలంగా భావిస్తున్నారు. ఈ అంశంపై అటవీ అధికారులు కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి కంచెలు ఏర్పాటు చేయడం వల్ల ఎనిమిది ఏనుగులు మృత్యువాత పడ్డాయి. లక్షలు పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తున్నామని, ఏనుగులు దాడులు చేయడంతో పంట పొలాలు నాశనమౌతున్నాయని రైతులు వాదిస్తున్నారు.

11:57 - September 14, 2015

పశ్చిమ బెంగాల్ : జల్ఫాయ్ గురి జిల్లాలోని గొరుమార అడవి ప్రాంతం..31వ నెంబర్ జాతీయ రహదారి..ఆ రోడ్డుపై ఎక్కడి నుండో ఏనుగు వచ్చింది.. ఆ రహదారిపై వెళుతున్న వారందరూ ఆగిపోయారు..తరువాత అదే సమయంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు ఆ రోడ్డు గుండా వచ్చారు. ఏనుగును దాటి పోవాలని ప్రయత్నించారు. ఇంకేముంది వీరిని ఏనుగు చూసేసింది. వేగంగా అడుగులు వేస్తూ వారి సమీపానికి వచ్చింది. బైకును కిందపడేసింది. భయకంపితులైన ఆ వ్యక్తుల్లో ఒకరు పొదల్లోకి దూకాడు. ఇంకోతను పారిపోయే క్రమంలో కింద పడ్డాడు. కానీ ఏనుగు దృష్టి మాత్రం బైక్ పైనే పడింది. దీనిని గమనించిన పడిపోయిన వ్యక్తి కాళ్లకు పని చెప్పాడు. బైక్ ను ఏనుగు ధ్వంసం చేసింది. ఈ ఘటనంతా ఓ ప్రయాణీకుడు వీడియో తీసి సామాజిక సైట్ లో పెట్టాడు.

Pages

Don't Miss

Subscribe to RSS - Elephant