farmers suicides

18:41 - January 21, 2018

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ తన స్ధాయికి దిగజారి కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తడం ఎంతవరకూ సమంజసమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఈమేరకు ఆయనతో 10 టివితో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. కేసీఆర్‌ను పొగడుతూ భజన చేస్తున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్‌ తెలంగాణలో ఒక టూరిస్టుగా పర్యటించవచ్చని.. పొలిటీషయిన్‌గా వస్తే ఊరుకోమని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల సమస్యల పట్ల ఏ మాత్రం స్పందించని పవన్ తెలంగాణలో ఎలా అడుగుపెడతారని ప్రశ్నించారు.

 

13:30 - November 29, 2017
19:58 - November 19, 2017

అనంతపురం : దేశంలో బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న దాడులకు చంద్రబాబు మౌనంగా మద్దతు ఇస్తున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై పోరాటాలు చేయాలన్నారు. అనంతపురంలో 10 నెలల్లో 73 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. వేరుశనగ రైతులకు మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైందని బృందాకరత్ మండిపడ్డారు. 

18:16 - November 17, 2017

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాల వల్లే దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని జస్టిస్‌ చంద్రకుమార్‌ ఆరోపించారు. ప్రభుత్వాలు మారకపోతే ప్రజలే ప్రభుత్వాలను గద్దెదింపుతారని హెచ్చరించారు. కార్పొరేట్ల చేతిలో ప్రభుత్వాలు కీలుబొమ్మలుగా మారాయని జస్టిస్‌ చంద్రకుమార్‌ ఆరోపించారు. నవంబర్‌ 20న అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటి ఆధ్వర్యంలో.. పార్లమెంట్‌ ముందు చేపట్టే కిసాన్‌ ముక్తి సంసద్‌లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

13:26 - November 6, 2017

వరంగల్‌ : జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌లో పత్తి రైతులు నిలువు దోపిడికి గురవుతున్నారు. సిసిఐ కేంద్రాల్లో దళారులు రాజ్యమేలుతున్నారు. మార్కెట్‌ ధర చూసి తెల్లబోతున్నారు పత్తి రైతులు. రైతుల ఆవేదనపై ప్రభుత్వం స్పందించడం లేదంటున్న పత్తి రైతులు టెన్ టివితో మాట్లాడారు. 

 

07:19 - June 24, 2017

హైదరాబాద్ : రుణమాఫీ విషయంలో రైతుల్ని అడ్డంగా పెట్టుకుని కొన్ని పార్టీలు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు జరిగిన బ్యాంకర్ల సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కరీఫ్‌లో రైతులు ఇబ్బందులు పడకుండా ఎరువులు, విత్తనాలు సిద్ధం చేశామని పోచారం అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

15:27 - May 15, 2017

కర్నూల్‌ : కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. బండి ఆత్మకూరు మండలం ఈర్నపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు తనకున్న ఎకరా పొలాన్ని కబ్జా చేశారని వాపోయాడు. తహశీల్దార్‌ శేశుబాబు అండతోనే లింగయ్య అనే వ్యక్తి తన పొలాన్ని దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించారని రైతు శ్రీనివాసులు ఆరోపించారు. కలెక్టరేట్‌లో ప్రజాదర్బార్‌ సందర్భంగా రైతు శ్రీనివాసులు పురుగుల మందు తాగడంతో వెంటనే స్పందించిన కలెక్టర్‌ ఆఫీసు సిబ్బంది రైతును ఆస్పత్రికి తరలించారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ సత్యనారాయణ బాధితుడికి న్యాయం చేయాలని నంద్యాల ఆర్డీఓను ఆదేశించారు.

21:33 - April 25, 2017

హైదరాబాద్ : వ్యవసాయం పండుగలా మారిన రోజే బంగారు తెలంగాణ అన్నారు సీఎం కేసీఆర్‌. భవిష్యత్‌లో తెలంగాణ రైతు దేశానికి ఆదర్శంగా నిలుస్తాడన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో చేపట్టబోతున్న సంస్కరణలపై వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఎరువుల కోసం రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో ఇస్తామన్నారు. చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు కేసీఆర్‌. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో రైతుహిత సదస్సులో సీఎం, వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు. రైతులకు సమాజంలో గౌరవం తగ్గడం బాధాకరమన్నారు కేసీఆర్‌. గతంలో ఎరువులు పోలీస్‌స్టేషన్‌లో పెట్టి పంపిణీ చేశారని.. ఇప్పుడు ఎరువులు, విద్యుత్‌ కొరత లేకుండా చేయగలిగామన్నారు. వచ్చే ఏడాది నుండి రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఎరువులు కొనుగోలు చేసేందుకు ఉచితంగా ఇస్తామన్నారు. ఈ మొత్తాన్ని మే 15లోపు ఒకసారి, అక్టోబర్‌ 15లోపు మరో విడత చెల్లిస్తామన్నారు.

రైతు సంఘాల్లో అవినీతి లేకుండా చూడాలి
రానున్న రోజుల్లో వ్యవసాయరంగంలో తీసుకోవాల్సిన ప్రణాళికలను సీఎం వివరించారు. అధికారులు తమ పని తీరు మార్చుకోవాలని సూచించారు. రైతు సంఘాల్లో అవినీతి లేకుండా చూడాల్సిన బాధ్యత ఏఈవోలపై ఉందన్నారు. వచ్చే జూన్‌ నాటికి రాష్ట్రంలోని సాగు భూమి వివరాలను రికార్డులో పొందుపర్చాలని సూచించారు. భూసార పరీక్షలకు రాష్ట్రంలో 2 వేల పరిశోధక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్థిక ప్రగతిలో నెంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ.. వ్యవసాయం రంగంలో పండుగ జరుపుకునే రోజు రావాలన్నారు. దీనిని నెరవేర్చే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

త్వరలో 500 ఏఈవోల రిక్రూట్ మెంట్
పండించిన పంట మార్కెట్‌ చేసే విధానంపై అధ్యయనం చేయాల్సిన అవసరముందన్నారు కేసీఆర్‌. ప్రధాని మోదీతో కూడా తాను వ్యవసాయ రంగంపై చర్చించానన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు పండించేలా ప్రోత్సహించేలా చూడాలని తెలిపానన్నారు. దీంతో దేశం మొత్తం క్రాప్‌ కాలనీగా మార్చవచ్చన్నారు. వ్యవసాయశాఖలో 500 మంది ఏఈవోల రిక్రూట్‌మెంట్‌కు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. వ్యవసాయ అధికారులకు ల్యాప్‌టాప్‌లు, గ్రామాలలో పర్యటించేందుకు వాహనాల కోసం వడ్డీలేని రుణాలు ఇప్పిస్తామని ప్రకటించారు. అనుకున్న ఫలితాలు రావాలంటే అధికారులు ప్రజల భాషలో మాట్లాడి వారితో మమేకం కావాలన్నారు. 

14:49 - April 25, 2017

హైదరాబాద్ : వ్యవసాయ పథకల్లో అమలులో అధికారులదే కీలక పాత్ర పొషించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసే వ్యవసాయ పెట్టుబడుల పంపణీ పథకంలో దళారులకు ప్రమేయం లేకుండా చూడాలని వ్యవసాయ అధికారులను ఆయన కోరారు. నకిలీ పాసు పుస్తకాలతో తహసీల్దార్లు, బ్యాంకు మేనేజర్లు పంట రుణమాఫీని దోచుకుతిన్న విధంగా వ్యవసాయ పెట్టుబడుల పంపిణీ పథకాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు.

 

14:41 - April 25, 2017

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 500 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నెల రోజుల్లోగా నియామక ప్రక్రియ పూర్తి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్‌లో జరిగిన వ్యవసాయాధికారుల సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. అలాగే వ్యవసాయ సమాచారం భద్రపరిచేందుకు వ్యవసాయాధికారులందరికీ పన్నెండు రోజుల్లో కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు కొనివ్వాలని కోరారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - farmers suicides