farmers union

16:27 - September 15, 2017

అమరావతి భవనాల నిర్మాణంపై ప్రభుత్వం జాప్యం చేస్తోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత సీహెచ్ బాబూరావు, టీడీపీ నాయకులు పట్టాభిరామ్, పాండు రంగారావు పాల్గొని, మాట్లాడారు. భవనాల రీ డిజైన్లతో ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆశలకు తగినట్లుగా రాజధాని అమరావతి నిర్మాణం లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:01 - September 13, 2017
21:49 - September 13, 2017

గుంటూరు : రాజధాని పరిపాలన, నగర నిర్మాణ ప్రణాళిక, ఆకృతులపై సీఎం చంద్రబాబు నాయుడుకు నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.. కోహినూరు వజ్రాకృతిలో రూపొందించిన శాసన సభ భవంతి, హైకోర్టు భవంతి ఆకృతులను కూడా వివరించారు.. హైకోర్టు బాహ్య ఆకృతి అద్భుతంగా... ప్రపంచానికి తలమానికంగా ఉండాలని సీఎం నార్మన్‌ ప్రతినిధులకు సూచించారు.. లోపల ఎలాంటి సౌకర్యాలు ఉండాలో... అంతర్గత భవంతి నిర్మాణ శైలి ఎలా ఉండాలో న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.. 

 

16:45 - September 13, 2017
15:47 - September 13, 2017

గుంటూరు : అమరావతిలో వరల్డ్ బ్యాంక్ పరిశీలన బృందం పర్యటిస్తోంది. నేలపాడు  రైతులతో భారీ ఎత్తున సభ నిర్వహించిన బృంద సభ్యులు  రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు అంశంపై  రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. వరల్డ్ బ్యాంకు నుంచి రుణం విషయంలో కొందరు రైతులు లేఖలు రాసిన నేపథ్యంలో  ప్రతినిధుల బృందం క్షేత్రస్ధాయిలో పరిశీలన ప్రారంభించింది. మరోవైపు రాజధాని నిర్మాణానికి స్వచ్చందంగా భూములు ఇచ్చామని.. తమను ఎవరూ బలవంత పెట్టలేదని రైతులు చెప్పారు. 

15:28 - August 24, 2017

నెల్లూరు : జిల్లాలో రొయ్యల ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, స్థానికులు ఆందోళనకు దిగారు. డేవిస్ పేట వద్ద రొయ్యల ఫ్యాక్టరీల ముట్టడికి వారు యత్నించారు. స్థానికులు ఫ్యాక్టరీల పైప్ లైన్లు ధ్వంసం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రైతు సంఘం నేతలు వాగ్వాదానికి దిగారు. రైతు సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

17:15 - August 10, 2017

విజయవాడ : రైతాంగ సమస్యలపై విజయవాడలోని ప్రెస్‌ క్లబ్‌ రైతు సంఘం నేతలు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. 2013 భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని ఆరోపించారు. భూములపై ప్రశ్నించిన రైతులను పోలీసులు అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. రైతాంగ సమస్యలపై వచ్చే నెల విజయవాడలో భారీ సభను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని రైతు సంఘం నేతలు తెలిపారు. 

08:12 - February 24, 2016

కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు వుండవచ్చునేమో కానీ, మన దేశంలో వ్యవసాయ రంగంలో సంక్షోభానికీ, అన్నదాతల ఆత్మహత్యలకీ ఒకే ఒక్క కారణం వుంది. అదే బడ్జెట్ సపోర్టు లేకపోవడం. మరి ఈ సారైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తాయా?
58శాతం మందికి వ్యవసాయం జీవనాధారం
మన దేశంలో 58శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. వీరిలో 27శాతం మంది వ్యవసాయ కూలీలే. వ్యవసాయ యోగ్యమైన భూమిలో 35శాతం భూమికే నీటి పారుదల సౌకర్యం వుంది. 60శాతం భూమి బావులు, బోర్ల కిందనే సాగవుతోంది. దేశం మొత్తం మీద దాదాపు 96 లక్ష ల పంపు సెట్లున్నాయి. విద్యుత్ కోతలు వీరిని వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికీ రుతుపవనాలను నమ్ముకుని, ప్రక్రుతి దయాదాక్షిణ్యాల మీదనే వ్యవసాయం చేయాల్సి వస్తోంది. బడ్జెట్ రూపకల్పనలో ఈ వాస్తవాలను ఏ ప్రభుత్వమూ విస్మరించకూడదు.
ప్రాణాలను ఫణంగా పెడుతున్న రైతులు
ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా వ్యవసాయాన్ని బతికించుకోవడానికీ, భూమిని కాపాడుకోవడానికి మన రైతులు ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు. మన రైతుల్లో అత్యధికులకు వున్నది ఎకరంన్నర లోపు భూమి మాత్రమే. తమకున్న ఆస్తికి మించి అప్పులున్నవారెందరో. మనకు కడుపునిండా తిండి, వంటి నిండా బట్టలు, నిగనిగలాడే పండ్లు, తాజా కూరగాయలు, పొద్దున్నే మనం సేవించే తేనీరులో కలుపుకునే పంచదార, పాలు ఇలాంటి వన్నీ అందిస్తూనే వీరంతా అప్పుల పాలవుతున్నారనీ, తమ ప్రాణాలను బలితీసుకుంటున్నారన్న బడ్జెట్ రూపకర్తలు మరచిపోకూడదు. కానీ దురద్రుష్టవశాత్తు మన ప్రభుత్వాలు అన్నదాతకిచ్చే సబ్సిడీలను భారంగా భావిస్తున్నారు.
పాల ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానం
వరి, గోధుమ, పప్పుధాన్యాలు, పత్తి, వేరుసెనగ, వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, పత్తి, వేరుసెనగ, పండ్లు, కూరగాయలు, పాలు ఉత్పత్తిలో మన దేశానిది ప్రపంచంలోనే ప్రథమ స్థానం. పంచదార ఉత్పత్తిలో రెండవ స్థానం. సుగంద ద్రవ్యాల ఉత్పత్తిలో మనమే నెంబర్ 1. దాదాపు 40వేల కోట్ల రూపాయల విలువైన సుగంధ ద్రవ్యాలను మన రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. మన వ్యవసాయ ఉత్పత్తుల విలువ దాదాపు లక్ష కోట్లు. భారతదేశ ఎగుమతుల్లో వ్యవసాయరంగం వాటా పది శాతం పై మాటే. కానీ , ఏం లాభం? దేశ ఆర్థికాభివ్రుద్ధిలో ఇంతగా శ్రమిస్తున్న అన్నదాత కష్టాల్లో , నష్టాల్లో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించేవారుండరు. రైతుల ఆత్మహత్యలకు వక్రభాష్యాలు చెబుతున్న మంత్రులుండడం మన కర్మ.
రైతులు ఎదుర్కొంటున్న మరో సమస్య విత్తనాలు
నీటి సదుపాయాలతో పాటు రైతులు ఎదుర్కొంటున్న మరో సమస్య విత్తనాలు. విత్తును బట్టే మొలక వస్తుంది. కానీ మనదేశంలో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయి. విదేశీ వంగడాలు రైతులను రుణగ్రస్తులుగా, శాపగ్రస్తులుగా మారుస్తున్నాయి. మన దేశ వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగే విత్తనాల స్రుష్టించే పరిశోధనలకు ప్రభుత్వాలు ప్రాధాన్యతనివ్వడం లేదు. దీంతో విదేశీ విత్తనాలు నిలువునా ముంచుతున్నాయి.
అందని బ్యాంక్ రుణాలు
ఇక రైతులు ఎదుర్కొంటున్న మరో సమస్య అవసరాలకు తగ్గట్టుగా బ్యాంక్ రుణాలు లభించకపోవడం. సాగు భూమిలో అత్యధికశాతం కౌలు రైతుల చేతుల్లో వుంది. కానీ, వీరికి బ్యాంక్ అప్పులు పుట్టడం లేదు. వ్యవసాయాన్ని బతికిస్తున్నవారికి రుణాలివ్వాలంటే మనసొప్పదు కానీ, కార్పొరేట్ సంస్థలకు, కేటుగాళ్లకు, మాయగాళ్లకు లక్ష కోట్ల రూపాయల అప్పులిస్తున్నారు. మనదేశంలో వివిధ బ్యాంక్ ల్లో మొండిబకాయిల విలువ 4 లక్షల కోట్ల రూపాయల దాకా వుందంటున్నారు. కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నాయకులు, వారి అనుచరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎగ్గొట్టినట్టుగా ఈ దేశంలో అసలైన రైతులెప్పుడూ రుణాలు ఎగ్గొట్టడం లేదు.
అనూహ్యంగా పడిపోతున్న ధరలు
ఇక రైతులు ఎదుర్కొంటున్న మరో సమస్య తాము ఉత్పత్తిచేసినవాటిని మార్కెట్ లో అమ్ముకోవడం. పంట చేతికొచ్చే సమయంలో ధరలు అనూహ్యంగా పడిపోతుంటాయి. పోనీ వాటిని నిల్వ చేసుకుందామంటే వసతులుండవు. కోల్డ్ స్టోరీ జీలు అందుబాటులో వుండవు. ధర వచ్చేంత వరకు దాచుకుందామన్నా అప్పిచ్చినవారు ఊరుకోరు. మార్కెట్ ఎగుడుదిగుడుల నుంచి రైతులను కాపాడేందుకు ధరల స్థిరీకరణ నిధిని వినియోగిస్తామంటూ ప్రభుత్వాలు చెబుతున్న మాటలు ఎప్పుడూ ఆచరణ రూపం దాల్చడం లేదు. అందుకే బడ్జెట్ రూపకల్పనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ అవలోకించాలి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి రకరకాల రాయితీలు, ఆఫర్ లు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు మనల్ని బతికిస్తున్న అన్నదాతను బతికించడమే ఇకనైనా మొదటి ప్రాధాన్యతాంశంగా చేర్చాలి. వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వడమంటే విదేశీ విత్తన కంపెనీలకు, ఎరువుల కంపెనీలకు , ఇన్స్యూరెన్స్ కంపెనీలకు లాభాలు చేకూర్చిపెట్టే విధానాలకు రూపకల్పన చేయడం కాదు. అన్నదాత కళ్లలో ఆనందం నింపే విధానాలకు శ్రీకారం చుట్టడం.

 

 
08:02 - February 24, 2016

రైతుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం నేత చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామంటూ ప్రధాని నరేంద్రమోడీతో పాటు ముఖ్యమంత్రులు  కేసీఆర్, చంద్రబాబులు కూడా చెబుతున్నారు. మరికొద్దిరోజుల్లోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లు ప్రవేశపెట్టబోతున్నాయి. ఈ బడ్జెట్ లలో వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రాధాన్యత లివ్వాలి? వ్యవసాయ రంగంలో సంక్షోభం నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమవుతున్న వేళ రైతుల, రైతు సంఘాల కోరికలేమిటి? మార్కెట్ శక్తుల మాయాజాలం నుంచి కాపాడాలంటే ఏం చేయాలి? ఇలాంటి అంశాలపై చంద్రారెడ్డి మాట్లాడారు. 
 

19:16 - January 12, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెరకు సలహా ధరను వెంటనే ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. చెరకు కొనుగోలు పన్నును రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని.. కేవలం పన్ను తొలగిస్తే రైతులకు లాభాలు రావని... సలహాధరను అమలు చేయాలని రైతుసంఘాల నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2వేల 300 రూపాయల సలహాధర ప్రకటించినప్పటకీ అది గిట్టుబాటు కావడం లేదన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. చెరకు పంట వేసేందుకు రైతులు సిద్ధంగా లేరని, రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుందని హెచ్చరించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - farmers union