Fee Reimbursement

17:58 - March 17, 2018
08:10 - February 19, 2018

పెండింగ్‌లో ఉన్న వేలకోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇవ్వకపోతే పరీక్షలను బాయ్‌కాట్‌ చేస్తామని ప్రైవేటు విద్యాసంస్థలు తేల్చి చెప్పిన ప్రస్తుత తరుణంలో ఈ డిమాండ్‌ తన చర్చ పరిధిని పెంచుకుంది. అసలు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విడుదలపై ప్రభుత్వం మొండిగా ఎందుకు వ్యవహరిస్తుంది అన్న విషయాలపై టెన్ టివి జనపథంలో భారత విద్యార్థి ఫెడరేషన్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటారమేశ్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:21 - November 15, 2017

సంగారెడ్డి : నియోజకవర్గ ప్రజలను టి.కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని..ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగ్గారెడ్డిపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో రూ. 1100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని..ఇవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధిని జగ్గారెడ్డి అథోగతి పాలు చేశారని విమర్శించారు. ఈ విమర్శలపై జగ్గారెడ్డి ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి. 

21:17 - November 14, 2017

హైదరాబాద్ : నిరుద్యోగ సమస్యపై తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ఉద్యోగాల భర్తీ చేపట్టాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనిపై స్పందించిన మంత్రి ఈటల రాజేందర్‌ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మిగిలిన ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం... తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై హాట్‌హాట్‌ డిస్కషన్ జరిగింది. అప్పుల్లో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి.. ఆరోపించారు. కార్పొరేషన్లు, కో ఆపరేటివ్‌ ఫెడరేషన్స్‌ కోసం ఎంత అప్పుతీసుకున్నారో ఆర్థికశాఖ దగ్గర లెక్క ఉందా అని ప్రశ్నించారు. వచ్చే బడ్జెట్‌ నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పు 2 లక్షల 20 వేల కోట్లు అవుతుందని కాంగ్రెస్ శాసనసభ పక్షనేత జానారెడ్డి ఆరోపించారు. రాష్ట్రం సర్‌ప్లస్‌లో ఉందని గొప్పలు చెప్పుకోవడం కాదు...లెక్కలతో సహా చూపించాలన్నారు. అయితే ఈ ఆరోపణలను ఆర్థిక మంత్రి ఈటల ఖండించారు. రాష్ట్రం రెవెన్యూలో సర్‌ప్లస్‌లో ఉన్న మాట వాస్తవమే అని మంత్రి ఈటల అన్నారు. ఏ అప్పులు చేసినా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడే చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

మధ్యాహ్నం నుంచి నిరుద్యోగ సమస్య, నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంపై చర్చ మొదలైంది. ప్రభుత్వం ఎన్నికల నాటి హామీలను మర్చిపోయిందని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగులు రోడ్ల మీదకొచ్చి ఉద్యోగాలు ఇమ్మని అడిగే పరిస్థితి కల్పించకూడదన్నారు.

విపక్ష పార్టీల నేతలను మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. లక్షా 12 వేల ఉద్యోగాల నియామకాలన్నీ వచ్చే 20 నెలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తమ మేనిఫేస్టోలో ఉన్న అంశాలు 90 శాతం అమలు చేశామని తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 27, 744 ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి ఈటల రాజేందర్ సభకు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా 5,932 ఉద్యోగాలు, సింగరేణిలో 7, 266 పోస్టులు విద్యుత్‌ శాఖలో 1, 427, పోలీస్‌ శాఖలో 12, 157 పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. మిగతా ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల 20 వేల మంది కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతభత్యాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అనంతరం సభ బుధవారానికి వాయిదాపడింది.

06:37 - November 9, 2017

ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం ఇది పేద విద్యార్ధుల పట్ల ఒక వరం అనుకుంటాం.. కానీ ప్రస్తుతం ఇది మా పాలిట శాపంగా మారిందని విమర్శలు చాలా మంది నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవటం, వందల కోట్లలో బకాయిలు పేరుకుపొవటం ఈ పరిస్థితికి కారణమని వారు వాదిస్తున్నారు. ఇదే అంశంపై మన జనపధంలో చర్చించడానికి మనతో ఉన్నారు ప్రవేటు జూనియర్‌ కాలేజి యాజమాన్యాల సంఘం నాయకులు సతీష్‌, ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కోట రమేష్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:30 - August 10, 2017

ఆంధ్రప్రదేశ్ లో విద్యా సంస్థల బంద్ కి పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలతో పాటు యూనివర్సిటీ విద్యార్థులు కూడా బంద్ లో పాల్గొనబోతున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫ్ ఫైనాన్స్ స్కూలు ఇండిపెండెంట్ యాక్ట్ ను విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవాళ్టి విద్యా సంస్థల బంద్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు విద్యార్థి సంఘాలు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రాము విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:50 - June 28, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేటు స్కూల్స్‌లో ఫీజులు తగ్గించాలని తెలంగాణ పేరెంట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. లేకపోతే  అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించింది. ఫీజులు నియంత్రించాలని కోరుతూ టీపీఏ ఆధ్వర్యంలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు. స్కూల్స్ ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం నుంచి స్పదన లేకపోవడాన్ని అసోసియేషన్‌ తప్పుపట్టింది. ఫీజులు మొత్తం ముక్కుపిండి  వసూలు చేసిన తర్వాత సర్కారు నిర్ణయం తీసుకున్నా ప్రయోజనం వుండదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రైవేటు స్కూల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలని అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. 

 

16:41 - May 17, 2017

హైదరాబాద్: తెలంగాణలో మెడికల్ పీజి అడ్మిషన్లను ప్రైవేటు మెడికల్ కాలేజీలు నిరాకరించడం వివాదాస్పదమవుతోంది. కౌన్సెలింగ్‌లో కేటాయించిన కాలేజీలో చేరేందుకు యాజమాన్యాలు అంగీకరించకపోవడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్ధులకు పీజి మెడికల్ విద్య అందని ద్రాక్షలా మారింది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:36 - March 18, 2017

ఖమ్మం : ఇంటికో బిడ్డ...ఊరుకో బండి అనే నినాదంతో ప్రజలు కదం తోక్కనున్నారు. ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ, సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 'సర్వసమ్మేళన సభ'కు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలి రానున్నారు. 
పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన మహాజన పాదయాత్ర
పల్లెపల్లెను పలకరించింది.. కార్మిక, కర్షక, దళితుల, మహిళల సమస్యలను తెలుసుకుంది.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపింది.. పాలకుల గుండెల్లో గుబులు పుట్టించింది సీపీఎం మహాజన పాదయాత్ర. ఆటంకాలను, అడ్డంకులను అధిగమించి... విజయవంతంగా ముందుకు సాగింది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నెల రోజుల పాటు సాగిన యాత్ర
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సుమారు నెల రోజులు సాగిన సీపీఎం మహాజన పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభించింది. స్వచ్ఛందంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు సంఘీభావం తెలపటంతో పాటు సమస్యలతో బాధపడుతున్న ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని తమ్మినేనికి వినతులు అందజేశారు. 
సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు  
సీపీఎం మహాజన పాదయాత్ర విజయోత్సవ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో పాటు జనం హాజరుకానున్నారు. ఖమ్మం జిల్లాలోని 22 మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 22 మండలాలకు సంబంధించి రెండు జిల్లాలో 776 గ్రామ పంచాయతీల నుండి ప్రజలు పెద్ద ఎత్తున కదం తొక్కుతున్నారు. ఇప్పటికే కొంతమంది బస్సులు, లారీలు, డీసీఎంలు, రైలు మార్గాల ద్వారా వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మం జిల్లా నుండి 25 వేల మంది, భద్రాద్రి కొత్తగూడెం నుండి 10 వేల మంది కార్యకర్తలు కదలి వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 
పినరయ్ విజయ్‌కు రెడ్ షర్ట్ వాలంటీర్స్‌తో కవాతు 
ఎర్ర చీరలు, ఎర్ర చొక్కలు ధరించి ప్రతి ఒక్కరి చేతిలో ఎర్ర జెండా పట్టుకుని హైదరాబాద్ వెళ్లేందుకు అంతా సిద్ధమయ్యారు. సభకు వస్తున్న కేరళ సీఎం పినరయ్ విజయ్‌కు రెడ్ షర్ట్ వాలంటీర్స్‌తో కవాతు నిర్వహించనున్నారు. ప్రత్యేక క్యాడర్‌గా ఖమ్మం జిల్లా నుంచి ప్రతినిధులను ఇప్పటికే సభా స్థలానికి చేరుకున్నారు. ప్రజాసంఘాల బాధ్యులు కూడా కదం తొక్కనున్నారు. మొత్తంగా 19వ తేదీన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సర్వ సమ్మేళన సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో పాటు జనం హాజరుకానున్నారు.

18:36 - March 18, 2017

వరంగల్ : సామాజిక తెలంగాణ, సమగ్ర అభివృద్ధి నినాదంతో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆధ్వర్యంలో చేపట్టిన సుదీర్ఘ మహాజన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 19న హైదరాబాద్‌లో జరగనున్న 'సర్వసమ్మేళన సభ'ను జయప్రదం చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. 
ముగింపు దశకు సీపీఎం మహాజన పాదయాత్ర  
తెలంగాణ వ్యాప్తంగా సీపీఎం నిర్వహించిన మహాజన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 19న హైదరాబాద్‌లో జరగనున్న ముగింపు సభను జయప్రదం చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పాదయాత్రలో భాగంగా జనవరి ఒకటివ తేదీన పాదయాత్ర వరంగల్ అర్బన్ జిల్లాకు చేరుకుంది. నెల రోజుల పాటు జనగాం, వరంగల్ రూరల్, మహబూబా బాద్, జయశంకర్ జిల్లాలో ఈ పాదయాత్ర కొనసాగింది. 
నెరవేరని ప్రభుత్వ హామీలు : ప్రజలు 
ప్రభుత్వం ఇచ్చిన చాలా హామీలు నేరవేరలేదని పాదయాత్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు జిల్లా ప్రజలు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సీయం కేసీఆర్ కు లేఖలు రాశారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. 
సమస్యలను పట్టించుకోలేని ప్రభుత్వం : రత్నమాల 
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశవర్కర్లు, డ్వాక్రా మహిళాల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రత్నమాల తెలిపారు. ఈ సమస్యలను పాదయాత్ర ముగింపు సభలో మరోమారు లేవనెత్తుతామన్నారు. పాదయాత్ర జరిగినన్ని రోజులు సంఘటిత, అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున వారి సమస్యలను సీపీఎం నాయకులకు వినిపించారు. మహాజన పాదయాత్ర ముగింపు సభకు ఈ రంగాల నుంచి 5 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. 
వరంగల్ ను నిర్లక్ష్యం చేస్తున్నారన్న వాసుదేవారెడ్డి          
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం అంటూనే వరంగల్ ను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు సీపీఎం వరంగల్ జిల్లా కార్యదర్శి వాసుదేవారెడ్డి. మొత్తమ్మీద ఈ సమస్యలన్నింటిని పాదయాత్ర ముగింపు సభలో లేవనెత్తుతామంటున్నారు సీపీఎం నాయకులు. ఈ నెల 19న జరిగే మహాజన పాదయాత్రను అన్ని వర్గాల ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరుతున్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - Fee Reimbursement