fight

20:25 - November 14, 2017

బాలల దినోత్సవం సందర్భంగా బాలల చలన చిత్రోత్సవాల్లో 'ఎగిసే తారాజువ్వల' చిత్రం ప్రదర్శనకు ఎంపిక చేశారు. నవంబర్ 14 బాలల దినోత్సవాల సందర్భగా చిత్ర యూనిట్ తో ముచ్చటించింది. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వ పాఠాశాలలను, అక్కడి బోధనాభ్యసన పద్ధతులను, వాస్తవ విధానములను చక్కగా ప్రతిబింబించిన చిత్రమని చెప్పచ్చు. ఈ సినిమాలో సమస్య గురించి బాధ పడడం కన్నా చక్కని సులభపరిష్కారాలు చూపడం జరిగిందని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. విద్యార్థులు పాఠ్యాంశాలు పుస్తకాలలో వున్నట్లు మక్కీకి మక్కీ కాకుండా ప్రయోగాత్మకంగా, అనుభవ పూర్వకంగా అవగాహన చేసుకొనే ప్రయత్నాలను చూపినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:51 - October 16, 2017

సంగారెడ్డి : జిల్లా, రామచంద్రపురం మండలంలోని భీరంగుడా కమాన్‌ వద్ద.. స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. మల్లికార్జుననగర్‌ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన మంజీరా వైన్స్‌ను.. వెంటనే తొలగించాలని ధర్నాకు దిగారు. వైన్స్‌ షాపు ముందు బైటాయించారు. కాలనీ ఎంట్రెన్స్‌లో వైన్స్‌ షాపు ఉండటంతో మహిళలు, విద్యార్థినులకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. 

21:36 - October 8, 2017

హైదరాబాద్ : దేశంలో స్వాముల రాజ్యం నడుస్తుందని ఐద్వా నేత పుణ్యవతి అన్నారు. ప్రగతి నగర్‌లో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర రెండవ ఐద్వా మహాసభల్లో ఆమె ప్రసంగించారు. మూడు రోజుల పాటు ఈ మహాసభలు జరగుతాయని తెలిపారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పుణ్యవతి పిలుపు నిచ్చారు. దేశ భవిశ్యత్తు కోసం ఐద్వా ఉద్యమాన్ని బలపరచుకోవాలన్నారు. 

15:41 - October 8, 2017
19:21 - July 4, 2017

కర్నూలు : జిల్లాలోని కోడుమూరులో మందుబాబులు వీరంగం సృష్టించారు. 2 రోజులుగా మద్యం షాపులు మూసివుండటం..ఇవాళ షాపులు తెరవడంతో బహిరంగంగా మద్యం సేవించారు. పోలీసులు అడ్డుకోవడంతో మందుబాబులు వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

20:00 - June 13, 2017

యాదాద్రి భువనగిరి : తుర్కపల్లి మండలంలో భూమి కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో నలుగురుకు గాయాలయ్యాయి. వారంతా భువనగిరి ఏరియా ఆస్పత్రిలో చిరిత్స పొందుతున్నారు. తమ భూమిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో...కావాలనే దాడి చేశారని భూ యజమాని నర్సయ్య అన్నారు. 1990లో ఆ భూమిని కొనుగోలు చేశామని.. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు.   

08:25 - January 1, 2017

హైదరాబాద్ : పెద్ద నోట్ల ర‌ద్దుపై కాంగ్రెస్ సమ‌ర శంఖం పూరించింది. మోదీ చెప్పిన యాబై రోజుల గ‌డువు ముగియ‌డంతో.. ఇక పూర్తి స్థాయిలో గ్రౌండ్ లోకి దిగాలని హస్తం పార్టీ నిర్ణయించింది. తెలంగాణ అంతటా నిర‌స‌న‌ల‌తో ఊరు-వాడ‌ను ఏకం చేసేందుకు యాక్షన్‌ ప్లాన్ ప్రకటించిన కాంగ్రెస్‌.. ఈ పోరులో రాహుల్‌ను రంగంలోకి దించేందుకు వ్యూహం రూపొందిస్తోంది.  
దేశవ్యాప్తంగా నిరసనలు
మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌.. కేంద్ర ప్రభుత్వ తీరునే తీవ్రంగా తప్పుపడుతోంది. ఇప్పటికే దీనిపై మోదీ తీరును రాహుల్‌గాంధీ ఎండగడుతూ వస్తున్నారు. దీనిపై ఇప్పటికే పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్‌.. మోదీ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ వస్తోంది. అంతేకాదు.. కాంగ్రెస్‌ ఆక్రోష్‌ పేరుతో దేశవ్యాప్తంగా నిరసనలు కూడా కొనసాగిస్తూ వస్తోంది.  
పోరు ఉధృతం 
నోట్ల ర‌ద్దుపై మోదీ చెప్పిన 50 రోజుల గడువు ముగిసింది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతూనే ఉన్నారు. చిల్లర కోసం ఇంకా సామాన్యులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వీటన్నింటిని గమనిస్తున్న కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా పోరును ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు కాంగ్రెస్‌ రెఢీ అయింది. గాంధీభవన్‌లో పీసీసీ ఛీప్‌ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అయి విస్తృత సమావేశం జరిగింది. పెద్ద నోట్ల రద్దుపై మోదీ తీరుకు నిరసనగా సమర శంఖం పూరించింది. జనవరిలో నిరసనలతో హోరెత్తించేందుకు కార్యాచరణను ప్రకటించింది. జనవరి 6,7 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ఆందోళనలు, 9న మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో  ధర్నాలు నిర్వహించనున్నట్లు పీసీసీ ప్రకటించింది. పనిలో పనిగా ఈ నిరసనల్లో రాహుల్‌ గాంధీ కూడా పాల్గొనేలా తెలంగాణ కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేస్తోంది.  
కాంగ్రెస్‌ డిమాండ్లు
నిరసన కార్యక్రమాలతో గ్రామ స్థాయిలో ప్రజలతో మమేకం కావాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మోదీ నిర్ణయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఏకం చేసి.. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందు కాంగ్రెస్‌ కొన్ని డిమాండ్లను ఉంచింది. తక్షణమే క్యాష్‌ విత్‌ డ్రా ఆంక్షలను ఎత్తివేయాలని, ప్రతి సామాన్యుడి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న మోదీ...కనీసం 25 వేలు అయినా డిపాజిట్‌ చేయాలని  డిమాండ్ చేసింది. అదే సమయంలో చిరు వ్యాపారులకు టాక్స్‌ మినహాయింపు ఇవ్వాలని, రబీలో పంట నష్ట పోయిన రైతులకు మద్దతు దరపై 25  శాతం బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. మొత్తానికి ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులకు అండగా ఆక్రోష్‌ను వినిపించిన కాంగ్రెస్‌.. మోదీ పెట్టిన యాభై రోజుల గడువు దాటిపోవడంతో.. ఇక పూర్తి స్థాయి పోరుకు కాలు దువ్వేందుకు సన్నద్ధమవుతోంది.  

 

09:56 - December 7, 2016

రంగారెడ్డి: జిల్లాలోని మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అక్క చెల్లెలు గొడవ పడిన ఘటనలో చెల్లెలు మమత సూపర్ వస్మొల హేర్ ఆయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. చెల్లెలు మరణవార్త తెలిసిన అక్క అశ్విని ఫినాయిల్ తాగింది. పరిస్థితి విషమించటంతో ఆమెను కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతురాలు తుక్కుగూడాలోని విజ్ఞాన్ కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. అక్క ప్రగతి పేపర్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్లుగా సమాచారం. 

18:40 - November 8, 2016

హైదరాబాద్ : ఆస్తుల ముందు రక్త సంబంధాలు కానరాకుండా పోతున్నాయి...సికింద్రాబాద్‌లో ఇంటి విషయంలో గొడవ అక్కాతమ్ముళ్ల మధ్య వైరాన్ని పెంచింది.. ఏళ్లుగా వారిద్దరి ఘర్షణలు చివరకు ఒకరి హత్యకు దారి తీసింది... అక్క కుటుంబంతో సహా వచ్చి తమ్ముడితో పాటు మరదలిని బిల్డింగ్‌పై నుంచి తోసేశారు..ఈ దారుణం సికింద్రాబాద్‌లో కలకలం రేపింది..
సికింద్రాబాద్‌లో దారుణం
ఆస్తి...దీని కోసం జరిగిన ఘర్షణ చివరకు హత్యకు దారి తీసింది...కొన్నాళ్లుగా జరుగుతున్న గొడవలు అక్కాతమ్ముళ్ల మధ్య వైరంగా మారింది...చివరకు దుర్మార్గులుగా మారినవారే దంపతులను హత్య చేసేందుకు వెనుకాడలేదు..అందరూ చూస్తుండగానే బిల్డింగ్‌పై నుంచి తోసేశారు...సికింద్రాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీలో జరిగిన ఘోరం ఆత్మీయాభిమానాలను ప్రశ్నిస్తుంది.
వాటా కోసం అక్కాతమ్ముళ్ల మధ్య గొడవ
సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేటలోని ఐడీహెచ్‌ కాలనీలో ఏడాది క్రితం చంద్రప్రకాష్ దంపతులకు సెకండ్ ఫ్లోర్ లోని 23వ నెంబర్ ఇంటిని ప్రభుత్వం మంజూరు చేయడంతో ఇక్కడే భార్యాపిల్లతో ఉంటున్నారు...చంద్రప్రకాష్ వెల్డింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భర్త సంపాదనకు తోడు .. ఇతని భార్య జయశ్రీ సెక్యూరిటీగార్డుగా పనిచేసేది..ఈ దంపతులకు పదో తరగతి చదివే సుదీప్, ఏడో తరగతి చదివే పదమూడేళ్ల మాధురిలు ఉన్నారు...చీకటి పడుతున్న సమయంలో దంపతులు ఇంటికి చేరారు. పిల్లలు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు.
దంపతులను ఈడ్చుకెళ్లి తోసివేత..
కాలనీలోని ఈ ఇల్లు అక్క మీరాబాయి,తమ్ముడు చంద్రప్రకాశ్‌ల ఉమ్మడి ఆస్తిగా ఉంది..దీని విషయంలో ఇద్దరి మధ్య కొన్నాళ్గుగా గొడవలు జరుగుతున్నాయి..గతంలో కూడా దాడులు జరిగగా...కోర్టువరకు వెళ్లింది వీరి పంచాయితీ... మళ్లీ తమ్ముడి ఇంటిమీదకు వచ్చిన మీరాబాయి ఆమె కుమారుడు చింటూ,కూతురు కీర్తి, అల్లుడు బబ్లూ  ఇంట్లోకి జొరబడ్డారు. వచ్చీ రావడంతోనే గొడవపడసాగారు. ఆవేశంలో చంద్రప్రకాష్ ను, అతని భార్య జయశ్రీలను ఇంట్లోంచి బయటికి లాగి.. రెండో అంతస్తుపైనుంచి కిందకు ఎత్తిపడేశారు...జయశ్రీ అక్కడికక్కడే మృతి చెందగా...చంద్రప్రకాష్ తీవ్రంగా గాయపడ్డాడు...వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమంగానే ఉంది.
రక్తపు మడుగులో దంపతులు 
జరిగిన ఘటనతో ఉలిక్కిపడ్డ కాలనీవాసులు వచ్చి చూడగా రక్తపు మడుగులో దంపతులు కన్పించారు. వారిని తోసేసిన రాక్షసులు మాత్రం పారిపోయారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. వివరాలు తెలుసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
భయంతో వణుకుతున్న పిల్లలు 
ఈ ఇంటిలో తనకు వాటా ఉందని గొడవపడుతున్న మీరాబాయ్‌తో వేగలేక కోర్టు నుంచి ఇన్ జెక్షన్ ఆర్డర్ తీసుకుని చంద్రప్రకాష్ ఉంటున్నాడు. ఇప్పుడు న్యాయస్థానంలో ఈకేసు విచారణలో ఉంది. ఈ లోపే ఇంతటి ఘోరానికి పాల్పడింది మీరాబాయి. తల్లి చనిపోయి.. తండ్రి ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో వారి పిల్లలు భయంతో వణుకుతున్నారు.

 

11:49 - August 5, 2016

చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ప్రతి విషయంలోనూ ముఖ్యమంత్రి జయలలితను ఇరకాటంలో పెట్టేందుకు విపక్షనేత స్ఠాలిన్‌ ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా జయలలితకు ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురువుతున్న ముఖ్యమంత్రి జయ... దూషణల పర్వానికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో ఈసారి గతంలో కంటే భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అధికార అన్నా డీఎంకే, ప్రతిపక్ష డీఎంకే నువ్వా... నేనా..అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. గత అసెంబ్లీలో డీఎంకేకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో... జయలలితకు ఎదురులేకుండా పోయింది. మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే బాగా బలపడంతో అటు అసెంబ్లీలో, ఇటు బయటా కూడా జయలలితకు ఇబ్బందులు తప్పడంలేదు.

పచ్చగడ్డి వేస్తే భగ్గు..
ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష నేత స్టాలిన్‌ ప్రయత్నిస్తుండటంతో... అసెంబ్లీ వేదికగా జయలలిత తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ప్రతిపక్ష లేవనెత్తే అంశాలకు సమాధానం చెప్పలేకోపోవడమో.. లేక మరో కారణమో కానీ... ముఖ్యమంత్రి జయలలిత డీఎంకే అధినేత కరుణానిధిని ఉద్దేశించి పరోక్షంగా చేస్తున్న విమర్శలు ఆమె మెడకే చుట్టుకుంటున్నాయి. రాజకీయమంటే వృద్ధాప్యంలో ఇంట్లో కూర్చుని ప్రకటనలు చేయడం కాదంటూ కరుణానిధిని దెప్పిపొడిచేలా జయలలిత చేస్తున్న పరోక్ష వ్యాఖ్యలు, విమర్శలు ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టేలా చేస్తున్నాయి. దీంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది.

కావేరి ఆయకట్టుకు నీరు విడుదలలో జాప్యం..
తమిళనాడు-కర్నాటక, తమిళనాడు-కేరళ మధ్య ప్రాజెక్టులు, సాగునీటి సమస్యల, కావేరి ఆయకట్టుకు సాగునీరు విడుదలతో జాప్యం. రాష్ట్రానికి చెందిన జాలర్లను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేయడం వంటి అంశాలపై ప్రతిపక్ష డీఎంకే సభ్యులు నిలదీస్తున్నారు. దీంతో సమాధానం చెప్పలేక అధికార అన్నాడీఎంకే నీళ్లు నమిలే పరిస్థితులు ఎదురవుతున్నారు. ఇది అధికార పార్టీకి ఇబ్బందికర పరిణామంగా మారింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి.

అన్నా డీఎంకేని ఇరకాటంలోకి నెడుతున్న డీఎంకే ప్రశ్నలు..
దీనికి తోడు అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలపై తమినాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రతిపక్ష డీఎంకే నుంచి ఎదురవుతున్న ఈటెలు, బల్లాలాంటి ప్రశ్నలు చాలా సందర్భాల్లో అధికార పక్షాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. దీంతోనే ప్రత్యక్ష ప్రసారాలపై ఆంక్షలు విధించారన్నది డీఎంకే నేతల వాదన. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పలేకపోతే... ప్రజల్లో పలుచనవుతామన్న భయంతో అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలపై ఆంక్షలు విధించారని డీఎంకే నేతలు చేస్తున్న విరమర్శలను తిప్పికొట్టలేక అధికార అన్నా డీఎంకే ఆత్మరక్షణలో పడిందని విశ్లేషకులంటున్నారు. మొత్తంమీద ఐదేళ్ల తర్వాత తమిళనాడు అసెంబ్లీలో జయలలితకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వడం ఇప్పడు రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - fight