fire accident

13:50 - October 7, 2018

హైదరాబాద్ : నగర శివారులోని అల్వాల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ టెంట్ హౌస్ లో శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. ఘటనలో భారీగా ఆస్తినష్టం కలిగినట్లు తెలుస్తోంది. ఎవరో కావాలని చేశారని యజమానురాలు వాపోయింది. పంచాశిలా హిల్్సలో ఉంటున్న ఓ టెంట్ హౌస్ గోడౌన్ లో ప్రమాదం జరిగిందని, విషయం తెలుసుకుని తాము ఇక్కడకు చేరుకోవడం జరిగిందని ఫైర్ సిబ్బంది తెలిపారు. టెంట్ హౌస్ లో బట్టలు ఉండడంతో మంటలు చెలరేగాయని, మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. గౌడోన్ లో షార్ట్ సర్యూట్ కారణమని తెలుస్తోంది. మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 
తాము ఇటీవలే దుకాణం ఏర్పాటు చేయడం జరిగిందని, సుమారు 25 లక్షలు వెచ్చించడం జరిగిందని టెంట్ యజమానురాలు మీడియాకు తెలిపారు. ఈ బిజినెస్ లో పార్ట్నర్ కూడా చేరాడని, కానీ కేవలం 15 రోజుల్లోనే వెళ్లిపోయాడని తెలిపారు. ఆ సమయంలో తాము డబ్బు కూడా చెల్లించడం జరిగిందని తెలిపారు. 

10:31 - September 27, 2018

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్‌ అవ్వడంతో ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో మంటలు చెలరేగాయి. ఆ గదంతా పొగతో నిండిపోయింది. మంటలు ఎగిసిపడుతుండడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు. మిగతా రోగులను సైతం ఆసుపత్రి సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

14:55 - September 26, 2018

పెద్దపల్లి : రామగుండం సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో తరచుగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా  ఇవాళా ఆర్జీ ఓసెన్ కాస్ట్ 3వ ప్రాజెక్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో షావెల్ యంత్రం కాలిపోయింది. దీంతో సింగరేణికి రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది. 

08:24 - September 1, 2018

కర్నూలు : శ్రీశైలం కొండపై భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అర్థరాత్రి 12గంటల తరువాత తాత్కాలిక దుకాణ సముదాయంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 13 షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న శ్రీశైలం దేవస్థానం సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసారు. కానీ అప్పటికే పలు షాపుల్లోని వస్తు సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. శ్రావణ మాసం సందర్భంగా దుకాణదారులు భారీగా వస్తు సామగ్రి స్టోర్ చేసుకున్నారు. ఈ ప్రమాదంలో వస్తు సామగ్రి అంతా కాలి బూడిద అయిపోవటంతో దుకాణదారులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. తమకు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.  

08:11 - August 14, 2018
11:29 - August 10, 2018

ఛత్తీస్ ఘడ్ : దంతేవాడలో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. లారీ అసోసియేషన్ కార్యాలయంలో నిలిపిన లారీలకు నిప్పుపెట్టారు. 5 లారీలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు.

10:43 - July 28, 2018

హైదరాబాద్ : నగరంలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. ఛత్నిఆక పీఎస్ పరిధిలోని ఫ్లై ఓవర్ పక్కనే వున్న టింబర్ డిపోలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. 

08:11 - July 23, 2018

హైదరాబాద్‌ : జీడిమెట్లలోని సుభాష్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అట్టల ప్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దీంతో రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేసింది. మొదట అట్టల ఫ్యాక్టరీలో అంటుకున్న మంటలు ఫ్యాన్ల కంపెనీకి వ్యాపించాయి. అనంతరం కంపెనీ పక్కన ఉన్న అపార్ట్‌మెంట్‌కు మంటలు వ్యాపించాయి.  షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

 

13:23 - July 14, 2018

అనంతపురం : నగరంలోని శ్రీరాములు టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి రెండు గంటలకు చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.  మంటలను ఆర్పేందుకు 12 ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. ఆకతాయిలు సిగరెట్‌ తాగి టింబర్‌ డిపోలో పారేసినందునే మంటలు చెలరేగాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

10:38 - July 11, 2018

కర్నూలు : నగరంలోని అమీలియా కార్పొరేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో రోగులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Pages

Don't Miss

Subscribe to RSS - fire accident