firing

18:19 - November 8, 2018

కాలిఫోర్నియా: అమెరికాలో కాలిఫోర్నియాలోని ధౌజండ్ ఓక్స్ ప్రాంతంలోని బార్ లో గురువారం తెల్లవారు ఝూమున ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 13మంది మరణించారు. పలువురికి  గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక దళాలు, అంబులెన్స్లు ఘటనాస్దలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలిఫోర్నియాలోని బోర్డర్ లైన్ బార్ అండ్ గ్రిల్ అనే పబ్ లో ఓకళాశాలకు చెందిన సుమారు 200 మందికి పైగా విద్యార్ధులు పార్టీ చేసుకుంటుండగా ఆగంతకుడు పబ్ లోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. పబ్ లోకి వస్తూనే పొగ వచ్చే గ్రెనేడ్లు విసిరి కాల్పులుకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సుమారు 30 రౌండ్లు కాల్పులు జరిపిన ఆంగతకుడు కూడా బార్ లోనే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  ఇటీవల అమెరికాలో  స్కూళ్లు, ప్రార్ధనా మందిరాలు, పబ్ లు రెస్టారెంట్లుతో సహా బహిరంగప్రదేశాలలో ఇటీవల  దుండగులుకాల్పులు జరిపే ఘటనలు ఎక్కువయ్యాయి. 

08:23 - November 4, 2018

వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. పిట్స్‌బర్గ్‌ కాల్పుల ఘటన మరిచిపోకముందే ఫ్లోరిడా రాష్ట్ర రాజధాని టల్లహసీలోని ఓ యోగా స్టూడియోలో ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు కూడా తనను తాను కాల్చుకున్నాడు. యోగా స్టూడియోలోకి తుపాకీతో ఒంటరిగా ప్రవేశించిన స్కట్‌ పాల్‌ బీర్లె ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు ప్రారంభించాడు. దీంతో నాన్సీ వాన్‌ వెస్సెమ్‌ అనే వైద్యురాలు, మౌరా బింక్లీ అనే విద్యార్థి మృతి చెందారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి ఆగంతకుడి నుంచి పిస్టల్‌ను లాక్కునేందుకు ప్రయత్నించారు. మరికొందరు అక్కడి జనాలు తప్పించుకునేందుకు సహకరించారు. లేకుంటే మరింత ప్రాణనష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

 

07:28 - November 4, 2018

నెల్లూరు : నగరంలో కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఫతేఖాన్‌పేట, ,రైతు బజార్ వద్ద వ్యాపారి మహేంద్రసింగ్‌పై ఇద్దరు దుండగులు వెనుక నుంచి వచ్చి కాల్పులు జరిపి, పరారయ్యారు. ముసుగు ధరించి వచ్చిన దుండగులు మహేంద్రసింగ్‌పై మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మహేంద్రసింగ్ శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకుపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతనికి తీవ్ర రక్త స్రావం కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అస్పత్రిలో చికిత్స పొందుతూ మహేంద్రసింగ్ మృతి చెందాడు. దీంతో నెల్లూరు జిల్లా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

21:00 - October 13, 2018

ఛత్తీస్‌గడ్‌ : రాష్ట్రంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పలు జరిగాయి. జీజాపూర్ వీక్లీ మార్కెట్‌లో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. దీందో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. పోలీసులు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో ఓ జవాన్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. అతన్ని పరిస్థితి విషమంగా ఉందని ఎస్పీ మోహిత్ గార్గ్ ధృవీకరించారు. 

అంతకముందు ఆంధ్రప్రదేశ్, ఒడిషా సరిహద్దులో మావోయిస్టులు కలకలం సృష్టించారు. ఏవోబీలో ల్యాండ్‌మైన్ పేల్చారు. కోరాపుట్ జిల్లా పనసపుట్ట అటవీప్రాంలో కూంబింగ్ దళాలే లక్ష్యంగా మావోయిస్టులు ల్యాండ్‌మైన్ పేల్చారు. అయితే భద్రతా బలగాలు తృటిలో తప్పించుకున్నాయి. పోలీసు బలగాలు సురక్షితంగా ఉన్నారని ఓఎస్డీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు.  

 

 

17:29 - October 12, 2018

విశాఖ : పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కిడారి సర్వేశ్వరరావు, సివేరు పోమ హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య శుక్రవారం హోరా హోరీ కాల్పులు జరిగాయి. విశాఖ ఏజెన్సీ బెజ్జంగిలోని పనసపుట్టి సమీపంలో పోలీసుల ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందారు. మృతురాలు గాజర్ల రవి భార్య జిలానీ బేగం అలియాస్‌ మీనాగా తెలుస్తోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలో మీనా పాల్గొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలానికి చెందిన మీనా.. గత 20 ఏళ్లుగా మావోయిస్టుగా ఉంటున్నారు. మీనా మృతి చెందినట్టు వార్తలు రావడంతో ఖానాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో మీనా మృతి చెందగా, జయంతి, గీత, రాధిక, రాజశేఖర్ అనే మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

 

14:20 - September 23, 2018

విశాఖ : మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. విశాఖ జిల్లాలో ఘాతుకానికి పాల్పడ్డారు. అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలపై మావోయిస్టులు కాల్పలు జరిపారు. ఈ ఘటనలో కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ అక్కడికక్కడే మృతి చెందారు. కిడ్నాప్ చేసి హత్య చేశారు. కిడారిని పలుమార్లు మావోయిస్టలు హెచ్చరించారు. ఈమధ్యకాలంలో మావోయిస్టులు ప్రజాప్రతినిధులపై కాల్పులు జరపడం ఇదే ప్రథమం. ఇటీవలే కిడారి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.

గ్రామ దర్శిని కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా విశాఖలోని మన్యం ప్రాంతంలో డుంబ్రిగూడ మండలం తుటంగి దగ్గర అరకు ఎమ్మేల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మేల్యే సోమపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఘటనాస్థలంలోనే మృతి చెందారు. స్పెషల్ జోనల్ కమాండర్ చలపతి ఆద్వర్యంలో కాల్పలు జరిగినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఏవోబీ పరిసరాల్లో చలపతి ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం. పక్కా సమాచారంతో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది మహిళా నక్సలైట్లున్నట్లు సమాచారం. 

 

17:07 - March 4, 2018

కృష్ణా : జిల్లాలోని పెనుగంచిప్రోలులో అగ్ని ప్రమాదం జరిగింది. మునేటి ఒడ్డున తిరుపతమ్మ తిరునాళ్లకు వేసిన పాకలకు నిప్పంటుకుని నాలుగు పాకలు కాలిపోయాయి. స్థానికులు మంటలు ఆర్పివేశారు. 

 

21:21 - October 18, 2017

గుంటూరు : అగ్నిప్రమాదం స్థానికులను భయపెట్టింది. శ్రీనగర్‌కాలనీలోని 3వలైన్లో ఉన్న పాతపేపర్ల దుకాణంలో మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు ఎగిసి పడటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 

08:20 - September 20, 2017
20:19 - September 8, 2017

సూర్యపేట : జిల్లా కోదాడ మార్కెట్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో వెంటనే మార్కెట్‌, ఫైర్‌ సిబ్బంది మంటలార్పివేశారు. మార్కెట్‌ గోడౌన్‌లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరగడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - firing