forest department

15:56 - December 6, 2018

పుదుచ్చేరి : మన ఇంటిలోకి పాము వచ్చిందంటే కొట్టి చంపేస్తాం. అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తాం. అంతే తప్ప ఏకంగా ముఖ్యమంత్రిగారికి ఫోన్ చేసి రక్షించండి అని అడగం కదా? ఏం ఎందుకు సీఎంను అడగకూడదు అనుకున్నాడో పాము బాధితుడు. పాము నుండి రక్షించండి సీఎంగారూ అంటు ఏకంగా ఫోన్ కొట్టాడు. 
పుదుచ్చేరి రాష్ట్రం, అరియాంకుప్పవలో రాజా అనే వ్యాపారి ఇంట్లోకి ఓ త్రాచుపాము వచ్చింది. భయపడిన రాజా ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశాడు. స్పందించకపోవటంతో టెలిఫోన్ డైరెక్టరీ తీసుకుని ఏకంగా పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి ఫోన్ కొట్టాడు. ‘సార్.. మా ఇంట్లో పాము దూరింది. అధికారులకు ఫోన్ చేస్తే ఎవ్వరూ ఎత్తడం లేదు. దయచేసి సాయం చేయండి’ అని విజ్ఞప్తి చేశాడు. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా విసుక్కోకుండా సీఎం నారాయణ స్వామి ఆయన అడ్రస్ తెలుసుకోవటమే కాకుండా రాజాకు ధైర్యం చెప్పారు. 
అంతేకాదు వ్యాపారి రాజా ఇంటికి వెంటనే వెళ్లాల్సిందిగా అధికారులను ఆదేశించి రాజా అడ్రస్ ను అటవీశాఖా అధికారులను తెలిపారు సీఎం నారాయణ స్వామి. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో డిసెంబర్ 5వ తేదీన రాత్రి జరిగింది. సీఎంగారి ఆదేశాలతో రాజా ఇంటికి వెళ్లిన వారు పామును పట్టుకోవడంతో రాజా కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

12:13 - March 22, 2018

తెలంగాణలో... తునికాకు చాలామంది గిరిజనులకు మంచి ఆదాయ వనరు. కానీ తునికాకు కోయవద్దంటూ.. ప్రభుత్వం ఆర్డర్ వేయడంపై చాలామంది గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పోడుభూములు సాగుచేయడంపై ప్రభుత్వం కన్నెర్ర చేయడం, తాజాగా తునికాకు కోయవద్దనడం.. ఇలా నిబంధనలతో... అడవిపై తమ హక్కులను కాలరాస్తున్నారని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పుడీ అంశంపై 10టీవీ జనపథం ప్రత్యేక చర్చను చేపట్టింది...ఇదే అంశంపై గిరిజన సంఘం నాయకులు శోభానాయక్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

21:58 - September 16, 2017

భూపాలపల్లి : జిల్లాలో గుత్తికోయలపై జరిగిన దాడిని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. గిరిజనులకు భూములపై హక్కులను కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదివాసీలపై పాశవికంగా దాడి చేసిన ఫారెస్ట్‌ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:53 - September 16, 2017

భూపాలపల్లి : గుత్తికోయ గూడెంలపై ఫారెస్ట్‌ అధికారులు జులుం ప్రదర్శించారు. పోడు వ్యవసాయం చేస్తున్నారనే నెపంతో వారిపై దాడి చేశారు. గిరిజనుల ఆవాసాలను కూల్చి వేశారు. పంటపొలాలను నాశనం చేశారు. ఆడవాళ్లని కూడా చూడకుండా లాగి పడేసి.. చెట్లకు కట్టేశారు. భూపాలపల్లి జిల్లాలో ఫారెస్ట్‌ అధికారుల దౌర్జన్యంపై టెన్‌ టీవీ స్పెషల్‌ స్టోరీ. 
గిరిజనులపై ఫారెస్ట్‌ అధికారులు దౌర్జన్యం
పోడు వ్యవసాయంతో అడవిని నాశనం చేస్తున్నారనే నెపంతో ఫారెస్ట్‌ అధికారులు, సిబ్బంది గిరిజనులపై దౌర్జన్యం చేశారు. పిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా దాడి చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలం పసర రేంజ్‌ పరిధిలోని జలగలంచ అటవీ ప్రాంతంలో కొంత కాలంగా గుత్తికోయలు ఆవాసాలు ఏర్పరుచుకుని బతుకుతున్నారు. అయితే వీరు పోడు వ్యవసాయం చేసి అడవిలోని చెట్లను నరికివేస్తున్నారనే నెపంతో.. ఫారెస్ట్‌ సిబ్బంది దాడులు నిర్వహించారు. గుత్తికోయల గుడిసెలను కూల్చివేశారు. పంట పొలాలను ధ్వంసం చేశారు. అడ్డుకున్న వారిపై లాఠీచార్జ్‌ చేశారు. మహిళలందరినీ చెట్టుకు కట్టేసి తమ ప్రతాపం చూపించారు. గిరిజనులు కష్టపడి తెచ్చుకున్న వంట పాత్రలను, సరుకులను ట్రాక్టర్‌లో వేసి ఇతర ప్రాంతానికి తరలించారు. అడ్డుకున్న మహిళలను లాగి పడేశారు.
ఎన్నో ఏళ్లుగా గిరిజనులు ఆవాసాలు
గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఆవాసాలు ఏర్పరుచుకుని బతుకుతుంటే వారికి కనీస వసతులైన వసతి, మంచినీరు, విద్య, వైద్యం, విద్యుత్‌ వంటి సదుపాయాలు కల్పించకుండా.. వారిపై దౌర్జన్యానికి దిగారు. బంగారు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే ఇలా ఆదివాసీలపై దాడులు జరగడం అన్ని వర్గాల ప్రజలను కలచివేస్తోంది.  

 

21:40 - September 16, 2017

సింగరేణిల డీలావడ్డ అధికార పార్టీ సంఘం..కవితమ్మ మాటలమీద కార్మికుల కండ్లెర్ర, రైతు సమన్వయ సంఘాలకు కాంగ్రెస్ చెక్..తెరమీదికొచ్చిన రైతు పరిరక్షణ సంఘాలు, వరంగల్ అడవులల గుత్తికోయల గోస...ఒసేయ్ రాములమ్మను తలపిచ్చిన సీన్లు, న్యాయం కోసం రోడ్డెక్కిన న్యాయవాది...నీకే దొరకకపోతే ఇక సమాన్యులకేది, లెక్కలు జెప్పి పరువు తీస్కున్న మంత్రి...చదువురాని సన్నాసి విద్యాశాఖ మంత్రి, రెండు తల్కాయలతో పుట్టిన మేక....బ్రహ్మంగారినే తలచుకుంటున్నరు జనం...ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

19:28 - September 16, 2017

భూపాలపల్లి : జిల్లాలో గుత్తికోయలపై అటవీ అధికారులు దాడులు చేశారు. గోవిందరావు పేట మండలం పసర రేంజ్ పరిధిలో పోడు వ్యవసాయం చేస్తున్నారనే నెపంతో... దాడి చేశారు. గిరిజనుల ఆవాసాలు కూల్చివేసి పంటపొలాలు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన గిరిజనులపై లాఠీఛార్జ్ చేశారు. మహిళలను కూడా చూడకుండా... తీవ్రంగా కొట్టారు.  గిరిజనులను చెట్లకు కట్టేసి వారి సామాన్లను వేరే చోటుకు తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:17 - September 16, 2017

భూపాలపల్లి : జిల్లాలోని గుత్తికోయలపై అటవీఅధికారులు దాష్టీకానికి పాల్పడ్డారు. గిరిజనులపై పోలీసులు కండకావరం ప్రదర్శించారు. గిరిజనులు కూడా మనుషులు అనే విషయాన్ని మర్చి అమానవీయంగా ప్రవర్తించారు. గుత్తికోయలపై అటవీ అధికారులు దాడులు చేశారు. గోవిందరావు పేట మండలం పసర రేంజ్ పరిధిలో పోడు వ్యవసాయం చేస్తున్నారనే నెపంతో... దాడి చేశారు. పోడు వ్యవసాయం చేస్తున్నారనే నెపంతో వారిపై విచక్షణారహితంగా దాడులు చేశారు. మహిళలని చూడకుండా జుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ లాక్కెళ్లి చెట్టుకు కట్టేశారు. మహిళలపై మగపోలీసులు దాడికి పాల్పడ్డారు. గిరిజనుల ఆవాసాలు కూల్చివేసి పంటపొలాలు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన గిరిజనులపై లాఠీఛార్జ్ చేశారు. మహిళలను కూడా చూడకుండా... తీవ్రంగా కొట్టారు.  గిరిజనులను చెట్లకు కట్టేసి వారి సామాన్లను వేరే చోటుకు తరలించారు. మహిళలపై తీవ్రమైన పదజాలంతో దుర్భాషలాడారు. వస్తు సామాగ్రిని తరలిస్తుండగా అడ్డుకున్న మహిళలను చెట్టుకు కట్టేశారు. రేషన్ బియ్యాన్ని వెదజల్లారు. వస్తు సామాగ్రిని ధ్వసం చేశారు. 

సీపీఎం జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి
'గుత్తికోయలపై పోలీసుల దాడులు అమానుషం, దుర్మార్గం. అటవికదాడి, దుర్మార్గమైన చర్య. చట్ట విరుద్ధంగా గిరిజనుల ఇళ్లను కూలగొట్టారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించారు. దాడికి పాల్పడిన అధికారులు, పోలీసులుపై చర్యలు తీసుకోవాలి. గిరిజనులను వారి ఆవాసాల్లో ఉంచాలి. లేకపోతే యావత్తు మంది గిరిజనులను సమీకరించి, పోరాటం చేస్తామని' హెచ్చరించారు. 
గిరిజన సంఘం నేత..బండారి రవికుమార్ 
ఆదివాసీలపై దాడులు జరిగాయి. అటవీప్రాంతానికి సరిహద్దులు లేవు. కేసీఆర్ ప్రభుత్వం భరితెగించింది. ఆదివాసీ వ్యతిరేక ప్రభుత్వం ముద్రవేసుకుంటుంది. సీఎం ఆదేశాలతోనే పోలీసులు ఇలాంటి దాడులు చేస్తున్నారు. పోరాటాలు, ఉద్యమాలను ఉధృతం చేస్తాం. ప్రభుత్వం, పోలీసులు తగిన మూల్యం చెల్లించక తప్పదు అని అన్నారు. 
గిరిజన సంఘం నేత... ధర్మనాయక్ 
'తెలంగాణ వచ్చిన తర్వాత గిరిజనులపై దాడులు పెరిగాయి. ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా..అన్న అనుమానం కలుగుతుంది. ఈ దాడిని టీఆర్ ఎస్ ప్రభుత్వ దాడిగా చూడాలి. ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా గతంతో గిరిజనులపై దాడలు జరిగాయి. హరితహారం పేరుతో ప్రభుత్వం బూటకం చేస్తోంది. అటవీసంపదను దోచుకోవాలని చూస్తున్నారు. పెట్టుబడిదారులకు దారాధత్తం చేయాలని చూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని
అమలు చేయడం లేదు. గిరిజనులపై దాడులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని' హెచ్చరించారు.

 

16:49 - August 16, 2017

ఖమ్మం : అటవీశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని టీ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  ఈశాఖలో 15 నుంచి 35 ఏళ్లుగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులున్నారన్నారు. వీరందరిచేత ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటోందని విమర్శించారు.  తక్షణమే అటవీశాఖలోని  తాత్కాలిక ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయాలన్నారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు ఓ లేఖరాశారు. రెగ్యులరైజేషన్‌కు ఇబ్బందులు ఉంటే... విద్యుత్‌ ఉద్యోగుల తరహాలో వారందరినీ అటవీశాఖలో విలీనం చేయాలన్నారు. కేసీఆర్‌ దీనిపై స్పందించకుంటే ప్రభుత్వంపై పోరాడుతామని హెచ్చరించారు. 

16:59 - July 27, 2017

విజయవాడ : ఏపీ రాజధానిలో వేలాది ఎకరాల్లోని అటవీ భూములను స్వాధీనం చేసుకునేందుకు.. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. భూముల కోసం కేంద్రానికి నివేదికలు పంపుతున్నా.. వాటిలో లోపాలున్నాయని, సవరించి పంపాలని కేంద్రం ఝలక్‌ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం నివేదికలు తయారు చేయడంలో మల్లగుల్లాలు పడుతోంది. ఏపీ సీఆర్డీఏ క్రీడా పరిధిలోని అటవీ భూములను చేజిక్కించుకునేందుకు.. ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ భూములు ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే ప్రాజెక్ట్‌లతో పాటు భవన సముదాయాలు ఏర్పాటు చేయాలని చూస్తోంది. మొదట 26 అటవీ బ్లాకుల్లోని 12, 376 హెక్టార్ల అటవీ భూమిని డీనోటిఫై చేయాలని ప్రతిపాదించింది. తాజాగా 25 బ్లాకుల్లో 12,444 హెక్టార్లలో భూమిని డీ నోటిఫై చేయాలని కోరుతూ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

12,444 హెక్టార్ల అటవీ భూమి..
రాజధాని మౌలిక సదుపాయాల కోసం 12,444 హెక్టార్ల అటవీ భూమిని డీనోటిఫై చేయించి కేంద్రం నుంచి తీసుకోవాలని ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు రూపొందించింది. అయితే దీనిపై డీపీఆర్‌ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. అటవీ భూముల్లో ఏఏ పథకాలు అమలు చేస్తారు. ఎంతమేరకు భూములను సద్వినియోగం చేసుకుంటారనేది తెలపాలని సూచించింది. అలాగే అక్కడి పరిస్థితులు, పర్యావరణ, జీవవైవిద్య స్థితిగతుల వంటివి కూడా తెలపాలని పేర్కొంది. ప్రభుత్వం కేంద్రానికి పంపే నివేదికల్లో స్పష్టత లేదని.. ముఖ్యంగా డీపీఆర్ లేకుండా ఏ సంస్థలైనా ఎలా ఏర్పాటు చేస్తారని కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇటు ప్రతిపక్షాలు కూడా ఈ విషయమై భగ్గమంటున్నాయి.

నివేదికలు..
ప్రభుత్వం ప్రతిపాదించిన అటవీ భూమిలో ఆయుర్వేద పరిశోధన కేంద్రానికి గుడిమెట్ల బ్లాకులోని 196.37 హెక్టార్లు, కొత్తూరులో సమగ్ర ఆరోగ్య కేంద్రం 194. 76 హెక్టార్లు, వెంకటాయపాలెం బ్లాక్‌లో 1835.32 హెక్టార్లలో సాయుధ బలగాల శిక్షణ కేంద్రం.. ఏర్పాటు చేస్తామని పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఆ బ్లాక్‌లోనే ఏరో స్పేస్ అండ్ గ్రీన్‌ మొబిలిటీ ఇండస్ట్రియల్‌ పార్క్‌ కోసం 792.83, ఇంటిగ్రేటెడ్ కట్ ఫ్లవర్‌ అండ్ స్పైస్ పార్క్ కోసం 218.89, కల్చరల్ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం 1437.52, సమగ్ర మౌలిక వసతులకు 266.28 హెక్టార్లు అవసరమని నివేదికలో పొందుపరచినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివరాలతో మళ్లీ నివేదిక తయారు చేయాలా వద్దా అనే అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. చంద్రగూడెంలో ఐటీ, అనుబంధ పరిశ్రమల కోసం 295.83, దాసులపాలెంలో 546.42, ఇంటర్నేషనల్ కన్వెన్షన్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌కు మెట్లపల్లిలో 128.7, చేనేత, హస్తకళల గ్రామం జంగాల పల్లిలో 209.92, ఉన్నత విద్యా కేంద్రానికి టి. గన్నవరంలో 641.5, జియో మెడికల్ బయో టెక్నాలజీ పరిశోధనలకు తోలుకోడులో 264.36 హెక్టార్లు కావాలని కూడా కేంద్రానికి ప్రభుత్వం వివరించింది. 

18:51 - June 15, 2017

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. 7920 ఎకరాల అటవీభూమిని వాడుకునేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది. ఇవాళ ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర అటవీశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బ్యారేజీలు, టన్నెళ్‌లు, కాల్వలు, మల్లన్నసాగర్‌తోపాటు అన్ని రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన అటవీ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్ర అటవీశాఖ అనుమతులు ఇవ్వడంపట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర నీటిపారుదల, అటవీశాఖ అధికారులను ఆయన అభినందించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - forest department