gannavaram

18:11 - June 2, 2018

కరీంనగర్ : ఇద్దరు ఆడపిల్లలు పుట్టడమే ఆమే చేసిన నేరం..దీనికి తోడు వరకట్న వేధింపులు...దీనితో ఆ మహిళ బతుకుపై విరక్తి చెందింది. బలవన్మరణానికి పాల్పడింది. అత్తింటివారి వేధింపుల వల్లే స్వప్న మృతి చెందిందని, ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని గుండ్లపల్లి వాసులు, కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన పోలీసులు 24గంటల్లోగా భర్త శ్రీపాల్ రెడ్డి, అత్త, మామలను అరెస్టు చేస్తామని చెప్పారు. కానీ రోజులు గడుస్తున్నా న్యాయం జరగకపోయేసరికి స్వప్న బంధువులు అత్తింటి ముందు ఆందోళన చేపట్టారు. పరారీలో ఉన్న అత్తింటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారా ? పిల్లలకు ఏ విధంగా న్యాయం చేస్తారో చూడాలి. 

22:02 - November 11, 2017

కృష్ణా : జిల్లాలోని వీరులపాడు మండలం పొన్నవరంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి పర్యటించారు. పొన్నవరాన్ని ఆయన దత్తత తీసుకున్న నేపథ్యంలో గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పొన్నవరం గ్రామాన్ని మోడల్ గ్రామంగా అభివృద్ధి చేస్తానని సుజనాచౌదరి హామీ ఇచ్చారు. 

 

20:38 - November 10, 2017

కృష్ణా : గన్నవరంలోని ఎన్ టీటీఎఫ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధి అదృశ్యమయ్యాడు. యార్లగడ్డ వెంకట సాయితేజ అనే విద్యార్ధి ఈ నెల 4వ తేదీన అదృశ్యమయ్యాడని విద్యార్ధి తండ్రి తెలిపారు. ఇదే కళాశాలలో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. విద్యార్ధి స్వగ్రామం పామర్రు మండలం కురుమద్దాలి అని తెలిసింది. విద్యార్ధి అదృశ్యమయిన విషయాన్ని కాలేజ్‌ యాజమాన్యం ఆలస్యంగా తెలియచేయడంతో విద్యార్ధి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై కుమారుడి అదృశ్యంపై గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 

16:42 - October 12, 2017

కృష్ణా : జిల్లాలోని గన్నవరం పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గన్నవరం మండలం ముస్తాబాద్‌, ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి, చిన్నఅవుటపల్లిలో భూమి కంపించింది. అటు గన్నవరం ఎయిర్ పోర్ట్‌లోనూ స్వల్పంగా భూమి కంపించింది. దీంతో అధికారులు భయంతో పరుగులు తీశారు. గన్నవరంలో మూడురోజుల్లో భూమి కంపించండం ఇది రెండోసారి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

06:36 - June 26, 2017

కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌కే తలమానికంగా మారిన గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఇక అంతర్జాతీయ ఖ్యాతిని అందుకోనుంది. దేశ, విదేశీ విమానాలరాకపోకలతో కళకళలాడనుంది. ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఏపీ ప్రజలు అశలు నెరవేరబోతున్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్ర హోదా లభించింది. దీంతో ఈ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ స్థాయికి ఎగబాకింది. దేశంలోనే ఆక్యుపెన్సీపరంగా దూసుకుపోవడంతో ఈ ఖ్యాతిని త్వరితగతిన అందుకోగలిగింది.

అగ్రదేశాలకు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు

అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభించడంతో త్వరలోనే ఈ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా అగ్రదేశాలైన అమెరికా, దుబాయ్‌, సింగపూర్‌, మలేషియా వంటి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలుత దుబాయ్‌కి విమాన సర్వీసులు నడపాలని భావిస్తున్నారు. ఈ మేరకు దుబాయ్‌కు చెందిన ఎమిరైట్స్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్ధతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సర్వీస్‌ ప్రారంభమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు నేరుగా విమాన ప్రయాణం సులభతరంకానుంది.

విదేశాలకు వెళ్లే ప్రయాణీకులకు తప్పనున్న పడిగాపులు

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ మీదుగా విదేశాలకు వెళ్తున్న ప్రయాణీకులకు ఇక నుంచి పడిగాపులు తప్పనున్నాయి. ప్రస్తుతం విదేశీ విమాన సర్వీసుల కోసం బోయింగ్‌ 737-800, ఎయిర్‌బస్‌ 319,320,321 విమాన రాకపోకలు సాగించేందుకు ఎయిర్‌పోర్టు రన్‌వే అనువుగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచే విమాన సర్వీసులను ప్రారంభించాలనే లక్ష్యంగా పౌర విమానశాఖ పలు విమాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే విజయవాడలో జరిగిన సివిల్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌లో సింగపూర్‌, దుబాయ్‌కు చెందిన విమాన సంస్థలతో డీల్‌ కుదుర్చుకున్నారు.

రూ. 162 కోట్లతో ట్రాన్సిట్‌ టెర్మినల్ నిర్మాణం

గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇప్పటికే 162 కోట్ల రూపాయలతో ట్రాన్సిట్‌ టెర్మినల్‌ను ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. భారీ విమాన రాకపోకలు సాగించేందుకు వీలుగా మరో 100 కోట్లతో పనులు చేపట్టారు. తొలి విడత విస్తరణ పనుల్లో భాగంగా ప్రస్తుతం 2,286 మీటర్ల పొడవు ఉన్న రన్‌వేను 3,360 మీటర్లకు పెంచుతున్నారు. మొత్తానికి గన్నవరం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా దక్కడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

08:19 - February 20, 2017

కృష్ణా : గన్నవరంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలనువ వీడియోలో చూద్దాం...

18:40 - January 27, 2017

కృష్ణా: గన్నవరం ఎయిర్ట్ లో 5గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.వీరు కాశ్మీర్ కు చెందిన జావిద్, అహ్మదార్, అమీరాహ్ పాల్, పవాలాహ్ బట్, బషీర్ అహ్మద్ గా గుర్తించారు. గన్నవరం ఎయిర్ పోర్టులో బాండ్, డాగ్ స్వ్కాడ్ తనిఖీలు చేపట్టారు.

14:53 - December 17, 2016

కృష్ణా : గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ డేవిడ్‌రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుషోత్తపట్నం సమీపంలోని పంటపొలాల్లో ఆయన రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సమస్యలు, అధికారుల వేధింపులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన మృతదేహం వద్ద సూసైడ్‌లెటర్ దొరికిందని..దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతామని పోలీసు అధికారులు చెబుతున్నారు. 

12:44 - October 22, 2016

విజయవాడ : దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్ధలు నివ్వెర పోయేలా విజయవాడ ఎయిర్‌ పోర్టు రికార్డులు సృష్టిస్తోంది. ఏపీకి తలమానికంగా మారిన గన్నవరం విమానాశ్రయానికి ఏటేటా ఊహించని విధంగా ప్రయాణికుల రద్దీ పెరిగిపోతోంది. దీంతో ఈ ఎయిర్‌ పోర్టు అంతర్జాతీయ స్థాయికి చేరిపోయింది.

2015-16లో 4.04 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు
విభజనకు ముందు అంతంత మాత్రంగా ఉన్న సర్వీసులు.. ఇప్పుడు ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా మారింది. ఆపరేషన్స్‌, ఫ్లైట్‌ మూవ్‌ మెంట్స్‌ లో సగటున 72 శాతానికి పైగా వృద్దిని సాధించింది. 2015-16లో 4లక్షల 4వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే.. 2016-17లో ఇప్పటివరకే 6లక్షల 46 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. దీంతో ఎయిర్‌ పోర్టు అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసే దిశగా సర్కార్‌ అడుగులు వేస్తోంది.

రూ.137కోట్లతో అంతర్జాతీయ స్థాయి టెర్మినల్‌ భవన నిర్మాణం
ప్రస్తుతం 137 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయి టెర్మినల్‌ భవనం నిర్మాణం జోరుగా సాగుతోంది. ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2015 లో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 3వేల 332 విమాన సర్వీసులు నడిచాయి. 2016లో ఇదే సమయంలో 5వేల 764 విమాన సర్వీసులు నడిచాయి. గతేడాదికంటే ప్రస్తుతం 72. 99 శాతం సర్వీసులు పెరిగాయి. గత మూడు నెలల్లోనే 3వేల 57 విమాన సర్వీసులు నడవటం విశేషం..

ఇన్వెస్టర్స్‌, ఫారిన్‌ డెలిగేట్స్‌ టీమ్‌ భారీ స్థాయిలో రాకపోకలు
దేశ, విదేశాలకు ఉద్యోగ రిత్యా వెళ్లేవారు, ఉన్నత చదువుల కోసం ఆయా దేశాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి హైదరాబాద్‌, ఢిల్లీ అక్కడి నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, లండన్‌, తదితర దేశాలకు యువత అధిక సంఖ్యలో వెళ్తోంది. ఇంతే కాకుండా బిజినెస్‌ పీపుల్స్‌, పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ ఇన్వెస్టర్స్‌, ఫారిన్‌ డెలిగేట్స్‌ టీమ్‌ భారీ స్థాయిలో రాకపోకలు సాగిస్తుండటంతో ఎయిర్‌ పోర్టు వృద్ధి అంతకంతకు పెరుగుతోంది.

నవంబర్‌ నుంచి రోజు రాత్రి 8: 30 గంటలకు ఎయిరిండియా ఫ్లైట్‌
ముఖ్యంగా ఇతర విమానాశ్రయాలతో కనెక్టివిటీ బాగా పెరిగింది. కిందటేడాది లేని రూట్లలో కూడా ఈ ఏడాది విమానాలు నడుస్తున్నాయి. మరోవైపు రాత్రి పూట విమాన సర్వీసులు నడవటం కూడా ప్లస్‌ గా మారనుంది. నవంబర్‌ నుంచి ఎయిరిండియా ఫ్లైట్‌ రాత్రి 8గంటల 30 నిమిషాలకు ప్రతి రోజూ విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్లనుంది.

రద్దీ పెరగటంతో మర్ని సర్వీసుల యోచన
ప్రయాణికుల రద్దీ పెరగటంతో మరిన్ని సర్వీసులు పెంచే యోచనలో ఎయిర్‌ పోర్టు అధికారులు ఉన్నారు. మొత్తం మీద వైజాగ్‌ ఎయిర్‌ పోర్టు తరహాలో గన్నవరం విమానాశ్రయానికి కూడా విమాన సర్వీసులు పెరగనున్నాయి. 

15:29 - October 20, 2016

కృష్ణా : గన్నవరం మండలం ముస్తాబాద్‌లో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిరాతకంగా ప్రవర్తించాడు. ఒక్కరోజు స్కూల్‌కు రాలేదని పదో తరగతి విద్యార్థిని తనూజను హెడ్‌మాస్టర్‌ ఆలపాటి వెంకటేశ్వరరావు తలపై కొట్టాడు. దీంతో తనూజ అస్వస్థతకు గురైంది. నిన్న ప్రాథమిక వైద్యం చేయించి ఇంటికి పంపించారు. మళ్లీ ఈరోజు స్కూల్‌కు వచ్చిన తనూజ అస్వస్థతకు గురైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వెంకటేశ్వరరావు పరారీలో ఉన్నాడు. 

Pages

Don't Miss

Subscribe to RSS - gannavaram