GHMC commissioner

16:14 - February 2, 2018

హైదరాబాద్ : జీవించడం ప్రతీ పౌరుడి హక్కు.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని హరించే అధికారం ఎవరికి లేదు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచి వారి జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కానీ మనిషి మనుగడనే ప్రశ్నార్థకంగా చేసే విధంగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వాలు పెట్టుబడిదారులకూ పారిశ్రామికవేత్తలకు ఇక్కడి వనరులను, సంపదలను, భూమిని అప్పనంగా అప్పగిస్తున్నారు. మానవ జాతి మనుగడనే శూన్యంలోకి నెడుతూ జీవించే హక్కును నిలువెల్లా కాలరాస్తున్నారు. ఒక ప్రయివేటు సంస్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. అవును.. హైదరాబాద్‌ శివారు.. జవహర్‌నగర్‌ పరిసర ప్రాంతపు దయనీయ స్థితి ఇది.ఇది నగరాన్ని అనుకుని ఉన్న జవహర్ నగరంలో ఉన్న డంపింగ్ యార్డు. గ్రేటర్ హైదారాబాద్ తో పాటు చుట్టు పక్కల నుంచి నిత్యం ఇక్కడకు 4వేల మెట్రిక్ టన్నుల చెత్తను తరలిస్తారు. ఇక్కడికి చేర్చిన చెత్త నుంచి తడి పొడి చెత్తను వేరు చేసి ఈ వ్యర్ధాల నుంచి రసాయ ఎరువులను సైతం తయారు చేస్తారు. ఈ యార్డు నిర్వాహణను హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ రాంకీ సంస్థకు అప్పగించింది.

2009లో ఒప్పందం..
2009లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతంలో చెత్త రీసైకిలింగ్ చేసేందుకు 25 ఏండ్ల పాటు రాంకీ ఎన్విరో సంస్థకు అనుమతులు ఇచ్చారు. దీని కోసం 361 ఎకరాల భూమిని కేటాయించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన చెత్తను యార్డుకు తీసుకువచ్చిన తర్వాత వ్యర్థాలను గ్రేడింగ్ చేసి ఒక వరస చెత్త మరో వరస మట్టి పోసి లేయర్‌లుగా చేయాలి. ఇలా చేస్తేనే కాలుష్యాన్ని నివారించవచ్చు. ఎరువులు తయారు చేయవచ్చు. కానీ రాంకీ సంస్థ తన లాభాపేక్షతో నిబంధనలకు నీళ్లొదిలింది. శాస్త్రీయ పద్ధతిలో చెత్తను రీసైకిల్ చేయాల్సి ఉండగా ఖర్చును తప్పించుకునేందుకు అవకతవకలకు పాల్పడుతోంది రాంకీ సంస్థ. అన్ని రకాల చెత్తను ఒకే చోట కలిపి డంప్ చేస్తుండటంతో అందులోని వ్యర్థాలలో రసాయన క్రియలు జరిగి ప్రమాదకర వాయువులు వెలువడుతున్నాయి. చెత్తలోని రసాయనాలు భూమిలోకి ఇంకడంతో భూగర్భ జలాలు కలుషితం అయ్యాయి. బోర్లలో నుండి వచ్చిన నీరు కూడా నురగతో కూడిన దుర్గంధాన్ని వెదజల్లుతోంది. మనిషి జీవనానికి కీలకమైన గాలి డంపింగ్ యార్డు నుండి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం వరకు కలుషితం అయింది. ఇక్కడి గాలిలో ప్రమాదకర విషవాయులు ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ గాలి పీల్చడం వల్ల ఇక్కడకు సమీపంలో ఉన్న ప్రజలకు టీబీ, ఉబ్బసం , చర్మ వ్యాధులు.. మహిళలకు గర్భస్రావాలు కావడం నిత్యకృత్యమయ్యాయి. పుట్టే పిల్లలు అంగవికలురుగా పుడుతున్నారు.

గొలుసుకట్టు చెరువులు
ఈ డంపింగ్ యార్డు రాకముందు ఇక్కడి చెరువులు జలసిరితో, మత్స్య సంపదతో కళకళలాడేవి. రైతులు రెండు పంటలూ పండించుకునే వారు. కొండలతో నిండిన కీసర ప్రాంతం నుండి వాగులు వంకల ద్వారా వచ్చే నీటి ఆధారంగా గొలుసు కట్టు చెరువులు శతాబ్దాల క్రితమే నిర్మించారు. కీసరలో మొదలయ్యే గొలుసుకట్టు చెరువులు శామీర్ పేట, కాప్రా, ఘట్‌కేసర్, అల్వాల్ మండలాల పరిధిలో సాగు, తాగునీరందించేవి. చెత్త డంపింగ్ యార్డు రావడం వల్ల కాప్రా ప్రాంతం నుండి అల్వాల్ వరకూ పదుల సంఖ్యలో చెరువులు, కుంటలు పూర్తిగా కాలుష్య కాసారాలుగా మారాయి. చెత్త నుండి వచ్చే ద్రవ వ్యర్ధాలతో చెరువులు పూర్తిగా పాడయ్యాయి. ఆయా చెరువుల్లో జీవజాలం మనుగడ సాగించడం లేదు. కనీసం గడ్డి కూడా మొలవని పరిస్థితి నెలకొందంటే కాలుష్య స్థాయి ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.  జవహర్‌నగర్ వాసివర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ చుట్టు పక్కల ఉండాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. చెత్త డంపింగ్ యార్డు కారణంగా భూగర్బంలో నీరు పూర్తిగా కలుషితం అవుతుంది. డంపింగ్ యార్డులో గుట్టలమీద చెత్త గుట్టలుగుట్టలుగా నిల్వచేయడంతో మరో వైపు వర్షపు నీటితో చుట్టు పక్కల సుమారు 20కిలో మీటర్ల ప్రాంతం భూగర్బం జలం పూర్తిగా విషతుల్యం.. బోర్లు, బావులలోని నీరు పూర్తి ఎరుపు, నలుపు రంగులో దర్శనం ఇస్తుంది. ఈనీరు తాగితే ప్రాణాంత వ్యాధుల బారిన పడాల్సిందే. 

09:37 - January 27, 2018

హైదరాబాద్ : స్వచ్‌సర్వేక్షణ్‌ సర్వేలో అగ్రస్థానం కోసం జీహెచ్‌ఎంసీ వేగంగా అడుగులు వేస్తోంది. పారిశుద్యం పట్ల పౌరుల్లో చైతన్య కలిగించేందుకు ప్రచార కార్యక్రమాలను  చేపట్టింది. దీనిల్లో భాగంగా గచ్చిబౌలీస్టేడియం వద్ద సైకిర్యాలీని జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టారు. ఈ ర్యాలీలో ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

 

18:01 - January 4, 2018

కరీంనగర్ : జిల్లా హుజురాబాద్‌లో జమ్మికుంట మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పింగళి రమేష్‌ టెన్‌టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ... సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని పింగళి రమేశ్‌ అన్నారు. టెన్‌టీవీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులతోపాటు కార్మికులు పాల్గొన్నారు.

18:00 - January 4, 2018

జగిత్యాలం : తాజా సమాచారాన్ని అందించడంలో 10టీవీ ముందంజలో ఉంటుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అనంత శర్మ అన్నారు. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీ చేతుల మీదుగా 10టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. భవిష్యత్తులో కూడా మరింత సమాచారాన్ని అందిస్తు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటుందని ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు టీవీ సూర్యం అన్నారు. కార్యక్రమంలో టీమాస్‌ కన్వినర్‌ నక్క విజయ్‌, తదితరులు పాల్గొన్నారు.

06:10 - January 4, 2018

హైదరాబాద్ : మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, శిల్పారామం మార్గంలో పూర్తైన అండర్ పాస్ నిర్మాణాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసివుద్దీన్, కమిషనర్ జనార్ధన్ రెడ్డి..మంత్రులు మహేందర్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు. SRDP ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నిర్మాణానికి 12 నెలల సమయం ఉన్నా.. 9 నెలలకే పూర్తి చేసిన సందర్భంగా అధికారులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు రహదారుల్లో ఎలివేటెడ్ కారిడార్లు, స్కైవేల నిర్మాణానికి సంబంధించి భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

11:42 - January 3, 2018

హైదరాబాద్ : శిల్పారామం నుంచి అయ్యప్ప సొసైటీ వరకు 450 మీటర్ల అండర్ పాస్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని, కేటీఆర్, మహేందర్ రెడ్డి , ఎమ్మెల్యేలు, జీహెచ్ ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

11:17 - January 3, 2018

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ టెన్ టీవీ క్యాలెండర్ అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్ టీవీ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో ముందుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరెటర్లు, టెన్ టీవీ రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.

11:23 - November 12, 2017
08:19 - October 30, 2017

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎంటమాలజీ విభాగంలో వెలుగుచూసిన అక్రమాలు మరువక ముందే.. మరో స్కామ్ వెలుగుచూసింది. ఎంటమాలజీ విభాగంలోని అధికారుల అవినీతి, వారి నిర్లక్ష్యం...తెలుసుకోవాలంటే చదవండి..హైదరాబాద్‌ నగరంలో ఓ వైపు మూసీనది, వందలాది చెరువులు.. మరోవైపు నాళాలు భరించలేనంత మురికిగా మారిపోయాయి. ఇవి దోమల పెరుగుదలకు ప్రధాన కేంద్రంగా మారాయి. సిటీలో దోమల నివారణకు జీహెచ్‌ఎంసీలో ఎంటమాలజీ విభాగం పని చేస్తోంది. ఉన్నతాధికారులతో పాటు రెండు వేల మందికి పైగా సిబ్బంది దోమల ఉత్పత్తిని నివారించడానికి పని చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీ యేటా బల్దియా కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేస్తోంది.

ఇదంతా బాగానే ఉన్నా కొంతమంది అధికారుల అవినీతి వల్ల దోమల నివారణ జరగడం లేదు. దీంతో నగరంలో దోమలు విజృంభిస్తున్నాయి. ప్రజలు మలేరియా, డెంగీలాంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడుతున్నారు. అయితే దోమల నివారణ విభాగాన్ని సక్రమంగా నడిపించాల్సిన సీనియర్ ఎంటమాలజిస్టులు... ఇంతవరకు ఉద్యోగాలను అమ్ముకోవటం మొదలు అందివచ్చిన అన్ని అక్రమాలు చేస్తున్నారు. నార్త్‌ జోన్‌లో ఉద్యోగాలను అమ్ముకుంటూ సీనియర్ విజయ్‌కుమార్‌ అడ్డంగా దొరికిపోయారు.

ఇక సౌత్ జోన్‌లో మలేరియా విభాగంలో ఒక్కొక్కరి పనులు ఒక్కోలా ఉన్నాయి. దోమల నివారణకు చేసే ఫాగింగ్ చేయకుండానే చేసినట్లుగా రికార్డుల్లో చూపుతున్నారు. పార్కింగ్ చేసిన తరువాత స్థానికుల నుండి సంతకాలు, ఫోన్‌నంబర్లు సేకరించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ బుక్‌లో సంతకాలు కానీ ఫోన్‌ నంబర్లు కానీ కనిపించవు. వర్షాకాలంలో కూడా ఫాగింగ్ జరిగినట్లు ఎలా బిల్లులు పెట్టారంటే తెల్ల మొహమేస్తున్నారు.


ఇక ఫాగింగ్ మిషన్లకు ఉపయోగించే డీజిల్ విషయంలో అధికారుల చేతివాటం మామూలుగా లేదు. ప్రతీ రోజు వందలాది లీటర్ల డీజిల్ తీసుకుంటూ ఫాగింగ్ చేయడంలో అలసత్వం చూపిస్తున్నారు. సెలవులు, వర్షం పడుతున్న రోజుల్లో కూడా పని చేసినట్లుగా డీజిల్, మందులు నొక్కేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే రోజూ రిజిస్టర్‌లో చేయాల్సిన సంతకాలు కూడా చేయడం లేదు. రెండు నెలలుగా సంతకం చేయని అధికారిని మీరే సంతకం చేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తే సౌత్ జోన్‌ సీనియర్‌ ఎంటమాలజిస్ట్ శ్రీనివాస్‌ ఏం మాట్లాడుతున్నాడో వీడియోలో చూడండి. బల్దియాలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా... ఉన్నతాధికారులు మాత్రం ఇంతవరకు వీటిపై దృష్టిపెట్టక పోవడం విశేషం. 

12:00 - October 28, 2017

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎట్టకేలకు మేల్కొంది. నగరంలో నాలాల విస్తరణకు శ్రీకారం చుట్టింది. నాలాల అక్రమ కట్టడాలపై దృష్టి సారించి వాటిని కూల్చివేయడానికి రంగం సిద్ధం చేసింది. శనివారం అక్రమ కట్టడాలను మున్సిపల్ సిబ్బంది కూల్చివేస్తోంది. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ నాలాలపై కీలకంగా ఉన్న క్రిటికల్ బాటిల్ నెక్ లను అధికారులు తొలగించే పనిలో పడ్డారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - GHMC commissioner