gitam university

18:05 - April 29, 2018

విశాఖ : గీతం యూనివర్శటీ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష గ్యాట్‌ ఫలితాలను వైస్‌ ఛాన్సలర్‌ ఎమ్‌.ఎస్‌ ప్రసాదరావు విడుదల చేశారు. మే 16 నుంచి మూడు రాష్ట్రాల్లోని క్యాంపస్‌లలో అడ్మిషన్‌ కౌన్సిలింగ్‌ జరగనుందని తెలిపారు. హైదరాబాద్‌ గీతం క్యాంపస్‌లో ఈ ఏడాది నుంచి కొత్తగా బిఆర్క్‌ కోర్సు ప్రారంభిస్తున్నామని, విశాఖ క్యాంపస్‌లో ఎమ్‌ఆర్క్‌ కోర్సులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. మొదటి పది ర్యాంకర్లకు ఫీజులో పూర్తి రాయితీ.. తరువాతి 90 ర్యాంకర్లకు 50 శాతం ఫీజు రాయితీ ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దేశంలో 11 యూనివర్శటీలకు మాత్రమే ఉన్న స్వయం ప్రతిపత్తి హోదా ఇప్పుడు గీతంకు రావడం గర్వకారణమని తెలిపారు. దీని ద్వారా సొంత కోర్సుల నిర్వహణ, ఫారెన్‌ ఫ్యాకల్టీని నియమించుకోవడంలో వెసులుబాటు కలుగుతుందని ఎమ్‌.ఎస్ ప్రసాదరావు అన్నారు.

 

19:30 - February 26, 2018
19:33 - February 25, 2018
19:40 - November 18, 2017
21:30 - November 14, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 123 విద్యాసంస్థలు యూనివర్సిటీ ట్యాగ్‌లైన్‌ను కోల్పోయాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి. విశాఖకు చెందిన గీతం, గుంటూరుకు చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌, తిరుపతికి చెందిన రాష్ట్రీయ సాంస్క్రీట్‌ విద్యాపీఠ్‌, అనంతపురంకు చెందిన శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌, గుంటూరుకు చెందిన విజ్ఞాన్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సైన్స్‌ టెక్నాలజీ రీసెర్చ్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు. వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఉన్నాయి. ఈ విద్యాసంస్థలు కొత్త పేరు కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని యూజీసీ ఆదేశించింది. 

20:34 - November 8, 2017

విశాఖ : విద్యాకుసుమాలను పట్టభద్రులుగా తీర్చిదిద్దుతోన్న గీతం యూనివర్సిటీ 8వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. భారతప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్‌ అశుతోష్‌ శర్మ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్నాతకోత్సవం సందర్భంగా 1500 మంది విద్యార్థులకు స్నాతకోత్తర డిగ్రీలను, బంగారు పతకాలను, 27 మంది రీసెర్చి స్కాలర్లకు పిహెచ్‌డీ పట్టాలను ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు. 
గీతం విశ్వవిద్యాలయంలో పండగ వాతావరణం 
గీతం విశ్వవిద్యాలయం 8వ స్నాతకోత్సవంలో భాగంగా విశ్వవిద్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు, విద్యార్థులతో గీతం యూనివర్సిటీ కళకళలాడింది. ఈ సందర్బంగా  ప్రోపెసర్ అశుతోష్ శర్మ గీతం చాన్సలర్‌కు గౌరవ డాక్టరెట్ అందించారు. వారితో పాటు టాటా మెమోరియల్ హాస్పటల్ డైరక్టర్ డాక్టర్ రాజేంద్రఅచ్చుత్ బద్వేకు డాక్టర్ ఆఫ్ సైన్స్‌, ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావుకు డాక్టర్ ఆఫ్ లెటర్స్‌ను గీతం చాన్సలర్ అందించారు.
గీతం యూనివర్సిటీకి నాక్‌ ఏ+ గ్రేడ్‌ 
గీతం యూనివర్సిటీకి నాక్‌ ఏ+ గ్రేడ్‌ రావడంతో పాటుగా దేశంలోనే తొలిసారిగా ఫిన్‌టెక్‌ అకాడమీని గీతంలో ప్రారంభించామని విసి తెలిపారు. దాంతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. దాదాపు 15వేల పై చిలుకు విద్యార్థులు, 11 వందల మంది పరిశోధక విద్యార్థులు గీతంలో విద్యాభ్యాసం చేస్తున్నట్లు వెల్లడించారు. బోధనతో పాటుగా పరిశోధనలను ప్రోత్సహించేవిధంగా 150కి పైగా భారీ పరిశోధనా ప్రాజెక్టులను గీతం చేపట్టడం విశేషమని తెలిపారు. స్థానిక పరిశ్రమలకు కన్సల్టెన్సీ సేవలను సైతం అందిస్తూ గీతం తన ప్రత్యేకతను చాటుతోందన్నారు. 
విద్యార్థులంతా దేశ ప్రతిష్టకు నడుం బిగించాలని : అశుతోష్ శర్మ
పట్టభద్రులవుతున్న విద్యార్థులంతా దేశ ప్రతిష్టకు నడుం బిగించాలని సూచించారు ప్రొఫెసర్‌ అశుతోష్‌ శర్మ. రక్షణ పరిజ్ఞానం, సమాజహితానికి వినియోగిస్తున్న తీరు, స్వావలంబన, మేకిన్‌ ఇండియాల ఆవశ్యత, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నాణ్యమైన విద్య వంటి అంశాలను వివరించారు. ప్రపంచంలో మొదటి 5 సైంటిఫిక్‌ పవర్‌ దేశాలలో భారత్‌ను ఒకటిగా చేసేందుకు ప్రభుత్వం సైన్స్‌, టెక్నాలజీ ఇన్నోవేషన్‌ విధానాన్ని అమలులోకి తీసుకువస్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలను ఆకర్శించేందుకు వజ్ర పేరిట కొత్త పథకాన్ని ప్రవేశ పెడుతుందన్నారు. చంద్రయాన్‌, మంగళయాన్‌ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు.  
సత్కారం అందుకోవడం ఆనందంగా ఉంది : గొల్లపూడి 
గాంధీ పేరుమీద నెలకొల్పి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న విశ్వవిద్యాలయం నుండి సత్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు గొల్లపూడి మారుతీరావు. గాంధీజీ పేరుమీద నెలకొల్పి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న విశ్వవిద్యాలయం నుంచి ఈ సత్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశానికే పేరు తెచ్చిన అబ్దుల్‌ కలాం గురించి ప్రస్తావించారు. ప్రతి ఒక్క విద్యార్థి మరో అబ్దుల్‌ కలాంలా కావాలన్నారు. పరిశోధనలతో పాటు విలువలు కూడిన విద్య అవసరం అన్నారు. గీతం నుండి డిలిట్‌ అందుకోవడంతో తాను కూడా డాక్టర్‌ అయ్యాను అని చమత్కరించారు. 
ప్రోత్సహించేందుకు కృషి : రాజేంద్రఅచ్యుత్‌ బద్వే 
విద్యార్థులలో అంతర్గతంగా ఉన్న చిన్న చిన్న ఆలోచనలను వెలికి తీసి ప్రోత్సహించేందుకు కృషి చేయాలన్నారు డాక్టర్‌ రాజేంద్రఅచ్యుత్‌ బద్వే. అలాంటి విద్యార్థులే రాబోయే రోజులలో మేధావులుగా తయారవుతారని తెలిపారు. ప్రస్తుత ప్రపంచంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి పథంలో ఉందని, ఇంట్లో కూర్చొని ముబైల్‌ ద్వారా ప్రపంచంలోని విశేషాలను వీక్షిస్తున్నామన్నారు. ఒక్కో రంగంలో ఒక్కోవిధంగా నూతన ఒరవడి వస్తోందని, అకడమిక్‌ ప్రాముఖ్యతతో పాటు నైతిక విలువలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులలో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించడానికి కృషి చేస్తుందని తెలిపారు. 
డాక్టరేట్ అందుకోవడం ఆనందంగా ఉంది : పద్మ 
గీతం విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు బెస్ట్ రీసర్చర్ పద్మ. గీతం ప్రతి సంవత్సరం బెస్ట్ రీసర్చ్‌ అవార్డు ప్రకటిస్తుందని, ఈ సారి ఇంటర్‌ నేషనల్‌ బిజినెస్‌లో పరిశోధనకు గాను తనకు ఈ అవార్డు రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 
అనుభవాలు పంచుకున్నారు 
వివిధ విభాగాల్లో డిగ్రీలు అందుకున్న విద్యార్థులు యూనివర్సిటీలో తమ అనుభవాలను పంచుకున్నారు. గీతం లాటి డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో తాము డిగ్రీ పొందడం అదృష్టంగా ఉందన్నారు. వర్సిటీని వదిలి వెళ్లడం బాధగా ఉన్నా మంచి ఉద్యోగంతో బయటకు వెళ్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. మొత్తం మీద 8వ స్నాతకోత్తర వేడుక పండుగ వాతావరణాన్ని తలపించింది. విద్యార్థుల కేరింతలతో, ప్రముఖుల ఉపన్యాసాలతో కార్యక్రమం ఘనంగా ముగిసింది. 

 

10:17 - April 9, 2017

మెదక్ : గీతం యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాలేజీలో ఎలాంటి సౌకర్యాలు లేవని..విద్యార్థులకు సరైన సెక్యూర్టీ లేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సుహాస్ అనే విద్యార్థి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సెల్ ఫోన్ దొంగించాడని తోటి విద్యార్థి కాలేజీ ప్రిన్స్ పాల్ కు సుహాస్ పై ఫిర్యాదు చేశాడు. దీనితో ప్రిన్స్ పాల్ సుహాస్ కు కౌన్సెలింగ్ ఇచ్చారు. తీవ్రమనస్థాపానికి గురైన అతడు గదిలో ఉరి వేసుకున్నాడు. ఈ ఘటన ఈనెల 6వ తేదీన జరిగింది. ఇది గమనించిన ఇతరులు అతడిని పటన్ చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. వివాదానికి కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని కాలేజీ యాజమాన్యం పేర్కొంటోంది. ఈ మధ్యకాలంలో డల్ గా ఉన్నాడని..చదువులో వెనుకబడడంతో మార్కులు కూడా తక్కువగా వస్తున్నాయని అతడి తల్లిదండ్రులకు తెలియచేయడం జరిగిందని తెలిపింది. సుహాస్ తల్లిదండ్రులు..కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సరైన సెక్యూర్టీ లేకపోతే ఎలా అని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. యూనివర్సిటీలో అసలు మెంటెనెన్స్ లేదని, తల్లిదండ్రులకు క్షోభ పెట్టారని వాపోయారు.

19:41 - December 9, 2016

సంగారెడ్డి : సాంకేతిక, వైద్య పరమైన విజ్ఞానాన్ని విద్యార్ధుల్లో పెంపోందించేందుకు విజ్ఞాన ప్రదర్శనలు దోహదపడుతాయని హెచ్‌సీయూ వీసీ అప్పారావు అన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ హౌజ్‌ అండ్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ ఎగ్జిబిషన్‌లో యూనివర్సిటీ పరిధిలోని పాఠశాల విద్యార్ధులు భారీగా హజరయ్యారు. సాంకేతిక, వైద్య పరమైన పరిజ్ఞానానికి చెందిన 140 రకాల ప్రదర్శనలు విద్యార్ధులను అకట్టుకున్నాయి. 

 

20:22 - March 12, 2016

హైదరాబాద్ : వైజాగ్‌లో గత నెల 12న ఆత్మహత్య చేసుకున్న గీతం యూనివర్శిటీ విద్యార్థిని శ్రీయ మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించారు. హైదరాబాద్‌లోని అమ్ముగూడా స్మశాన వాటిలో శ్రీయ మృతదేహాన్ని బయటకు తీసి మల్కజ్‌గిరి తహసీల్దార్‌ సమక్షంలో శవపంచనామా చేశారు. శ్రీయ మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు రీపోస్ట్‌మార్టమ్‌ నిర్వహించారు. ఇరు రాష్ట్రాల మెడికల్‌ డైరెక్టర్ల సమక్షంలో మృతదేహాం నుంచి నమూనాలు సేకరించి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. 

18:59 - November 14, 2015

హైదరాబాద్ : గీతం విశ్వవిద్యాలయంలో పలు కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ప్రవేశ పరీక్ష గ్యాట్‌-2016 నోటిఫికేషన్‌ విడుదలైంది. గీతం యూనివర్సిటీకి చెందిన వైజాగ్‌, హైదరాబాద్‌, బెంగుళూరు క్యాంపస్ లకు సంబంధించిన ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ జీ.సుబ్రహ్మణ్యం తెలిపారు. దరఖాస్తులను దేశవ్యాప్తంగా ఉన్న యూనియన్‌ బ్యాంకు, ఇండియన్‌ బ్యాంక్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌లలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 19 నుంచి మే8 వరకు ప్రవేశ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 44 పరీక్షా కేంద్రాల్లో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు చెప్పారు.

 

Don't Miss

Subscribe to RSS - gitam university