government hospital

20:12 - November 26, 2017

తూర్పుగోదావరి : మూడు రోజుల క్రితం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అపహరణకు గురైన శిశువు ఆచూకీని పోలీసులు గుర్తించారు. శిశువును అపహరించిన మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ ఆ శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. మూడు రోజుల క్రితం ముఖానికి ముసుగు ధరించి వచ్చిన ఓ మహిళ ప్రసూతి ఆస్పతి వార్డులో ఉన్న గంటా లక్ష్మి అనే బాలింత నుంచి ఒక్కరోజు వయసున్న ఆడశిశువును వ్యాక్సిన్‌ కోసమని నమ్మబలికి వెంట తీసుకు వెళ్లింది. చిన్నారి అమ్మమ్మ వెళ్లినా.. ఆమె కళ్లుగప్పి..శిశువును ఆగంతకురాలు అపహరించింది. సీసీ పుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితురాలిని ఐ.పోలవరంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

15:07 - November 26, 2017

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ గురైన పసికందు ఆచూకీ లభ్యమైంది. శిశువును ఐ.పోలవరం మండలం ఇరగవరంలో పోలీసులు గుర్తించారు. శిశువును తల్లిదండ్రులకు అప్పగించేందుకు కాకినాడకు తరలించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:27 - November 23, 2017

పశ్చిమగోదావరి : జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌ ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్రమాత్రలు మింగి డాక్టర్‌ విజయనిర్మల ఆత్మహత్యకు పాల్పడింది. మూడు రోజుల క్రితం ఆంబులెన్స్‌లో ఆక్సీజన్ అయిపోయి పసికందు మృతి చెందంతో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి వైద్యులను హెచ్చరించారు. దీంతో మనస్తాపం చెందిన నిర్మల ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే నిర్మల ప్రతిరోజు విజయవాడ నుండి విధులకు హాజరవుతున్నారని, అందుకే ఆస్పత్రి ఉన్నతాధికారులు తరచూ వేధిస్తున్నారని విజయ నిర్మల తల్లి చెబుతున్నారు. 

15:53 - November 22, 2017

తూర్పుగోదావరి : కూనవరం ప్రభుత్వాసుపత్రిలో కరెంటు లేక రోగులు నానా అవస్థలు పడ్డారు. కరెంటు లేదని చెప్పినా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఓ బాలింత పేర్కొంది. మూడు రోజుల పసికందుతో లక్ష్మీ అనే బాలింత జాగారం చెప్పడం కలకలం రేగుతోంది. ఇంటికి పంపించేందుకు వాహనం లేకపోవడంతో ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ కరెంటు లేకపోవడం వల్ల ఆమె కొవ్వొత్తి వెలుగులోనే ఉండాల్సి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి. 

06:49 - November 21, 2017

పశ్చిమగోదావరి : ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆక్సిజన్‌ అందక చిన్నారి మృత్యువాతపడింది. నిన్న పుట్టిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో... ఏలూరు నుంచి విజయవాడకు అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. అయితే.. మార్గమధ్యలో అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ అయిపోయింది. దీనిని ముందే సిబ్బంది గమనించకపోవడంతో... తిరిగి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి బయల్దేరారు. అయితే.. చిన్నారి ఆస్పత్రికి చేరుకునే లోపే చనిపోయింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై చిన్నారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 

 

17:36 - November 15, 2017

వరంగల్ : సీకే ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ శిశువు మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆందోళన చేస్తుండడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆసుపత్రిలో శివనగర్ గ్రామానికి చెందిన యమున శిశువుకు జన్మనిచ్చింది. కానీ ఐసీయూలో శిశువు మృతి చెందింది. వైద్యుల సరిగ్గా చూడకపోవడం వల్లే శిశువు మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కువ జరుగుతున్నాయని చెబుతున్నారే కానీ...వైద్యులు సరియైన విధంగా స్పందించడం లేదని బంధువులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. 

12:08 - October 25, 2017

హైదరాబాద్ : నీలోఫర్ లో కిడ్నాప్ కు గురైన పసికందు ఘటన విషాదంతో ముగిసింది. పసికందు చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు. ఆదివారం నీలోఫర్ నుండి మంజుల పసికందును కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కిడ్నాప్ చేసిన మంజుల...ఆమె భర్త కుమార్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పసికందు మృతి చెందాడని తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. నీలోఫర్ ఆసుపత్రి యాజమాన్యం ఇందుకు కారణమంటూ దుమ్మెత్తిపోశారు.
ప్లేట్ల బురుజు ఆసుపత్రి వద్ద కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. నీలోఫర్ ఆసుపత్రి యాజమాన్యం వల్లే పసికందు చనిపోయిందని, ఎలాంటి భద్రత లేదన్నారు. ఇదిలా ఉంటే మృతి చెందిన పసికందు తల్లిదండ్రులను నాగర్ కర్నూలు కు పోలీసులు తరలించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:50 - October 17, 2017

కర్నూలు : ఆపదలో వచ్చిన వారికి సరైన వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోని ఘటన కర్నూలు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. చేసేదేమీ లేక ఎమ్మిగనూరు నుంచి వచ్చిన గర్భిణిని మహాలక్ష్మి ఆరు బయటే నొప్పులతో అవస్థలు పడింది. అయినా వైద్య సిబ్బందిలో మార్పు రాలేదు. అయితే.. 10టీవీకి సమాచారం అందించడంతో... అక్కడికి చేరుకుంది. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మహాలక్ష్మిని ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యమందించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:18 - September 11, 2017

ఖమ్మం : ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది.. వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతో... ప్రసవ వేదనతో వచ్చిన గర్భిణీ బల్లపైనే ప్రసవించింది.. బల్లపైనుంచి కిందపడిన శిశువు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణకు ఆదేశించారు.
వైద్యుల నిర్లక్ష్యం..శిశువు మృతి 
ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ గర్భిణీకి అంతులేని శోకం మిగిల్చింది... ఖమ్మం జిల్లా పల్లెగూడెంకు చెందిన నాగమణి నిండు గర్భిణి... ప్రసవ వేదనతో ఉన్న ఆమె... భర్త రాజయ్యతో కలిసి శనివారం రాత్రి ఆస్పత్రికి వచ్చింది.. నెలలు నిండలేదని చెప్పిన వైద్యులు... ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. వరండాలో విశ్రాంతి తీసుకోమని చెప్పారు.. నొప్పులు తీవ్రమై ఆమె బల్లపైనే ప్రసవించింది... బల్లపైనుంచి జారిపడి శిశువు మృత్యువాత పడ్డాడు.. 
బిడ్డ మృతితో దంపతులు కన్నీరుమున్నీరు
బిడ్డ మృతితో రాజయ్య దంపతులు కన్నీరుమున్నీరయ్యారు.. వైద్యుల నిర్లక్ష్యంవల్లే పసికందు మృతి చెందాడంటూ ఆందోళనకు దిగారు.. వీరికి మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి.. శిశువు మృతికి బాధ్యులైన డాక్టర్లపై చర్య తీసుకోవాలంటూ ఐద్వా ఆధ్వర్యంలో ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు.. అటు శిశువు మృతి విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఘటనపై పూర్తి వివరాలతో తనకు నివేదిక అందించాలని ఆదేశించారు.. మంత్రి ఆదేశాలతో కదిలిన వైద్యులు... ఈ ఘటనలో డాక్టర్ల తప్పేమీ లేదన్నట్లుగా నివేదిక మార్చారంటూ ఆరోపణలొస్తున్నాయి.. గర్భంలోనే శిశువు మృతి చెందిందంటూ డాక్టర్లు చెబుతున్నారు. శిశువు మృతి ఘటన సర్కారు ఆస్పత్రుల్లో వైద్యం పరిస్థితిని మరోసారి కళ్లకు కట్టింది.. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది.. 

17:54 - September 10, 2017

ఖమ్మం : ప్రభుత్వాస్పత్రిలో శిశువు మృతి కేసునుంచి తప్పించుకునేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు.. శిశువు బల్లపైనుంచి పడిపోలేదని కడుపులోనే మృతి చెందాడంటూ తప్పుడు నివేదిక తయారు చేశారు.. మరోవైపు శిశువు మృతిపై డ్యూటీ డాక్టర్‌, ఆర్ఎంవో శోభాదేవి విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - government hospital