governor narasimhan

17:35 - November 8, 2017
11:41 - October 15, 2017
09:11 - October 15, 2017

హైదరాబాద్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ పురస్కరించుకొని నగరంలోని నెక్లెస్ రోడ్డు లో 3కె, 5కె రన్ నిర్వహించారు. రన్ ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ, సీపీ, పలువురు పోలీస్ ఉన్నతధికారులు పాల్గొన్నారు.

18:37 - September 25, 2017

మహబూబ్ నగర్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనకు రైతులందరూ సహకరించాలని గవర్నర్ నరసింహన్ కోరారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా నాగసాలలో నిర్వహించిన భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. భూరికార్డుల ప్రక్షాళనను గవర్నర్ ప్రత్యక్షంగా పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అధికారులు రైతుల ఇంటికి వచ్చి భూ ప్రక్షాళన చేపడతారని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. రైతుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టకొని ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. 

21:47 - September 13, 2017

హైదరాబాద్ : టీడీపీ.. కాంగ్రెస్‌..! ఈ రెండు పార్టీలూ మొన్నటి వరకూ వైరిపక్షాలు. కానీ ఇప్పుడు ఈ రెండు పార్టీలూ తెలంగాణలో ఐక్యతారాగాన్ని ఆలపిస్తున్నాయి. సమస్య ఏదైనా.. విడివిడిగానో... ఐక్యంగానో ప్రభుత్వ తీరును ఎండగుడుతోన్న టీడీపీ, కాంగ్రెస్‌లు, ఇప్పుడు ఎన్నికల్లోనూ ఐక్యంగా బరిలోకి దిగాలని నిర్ణయించాయి. రానున్న సింగరేణి ఎన్నికల్లో దీనికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించాయి. 

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలు ఐక్యతారాగం అందుకున్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు, అదే కాంగ్రెస్‌తో జతకలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు.. ఈ రెండు పక్షాలూ తమ సిద్ధాంతాలను సైతం పక్కనబెట్టి ఏకమవుతున్న పరిస్థితి తెలంగాణలో ఆవిష్కృతమవుతోంది. 

తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో అవ‌క‌త‌వ‌కల్ని ఎండగట్టేందుకు.. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు ఐక్యంగా ముందుకు సాగుతున్నాయి. కొంతకాలంగా వివిధ సమస్యలపై ఈ రెండు పక్షాలూ ఉమ్మడి ఆందోళనల్లో పాల్గొన్నాయి. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ, మియాపూర్ భూస్కాం ఆరోప‌ణ‌లు, నేరెళ్ళలో ద‌ళితుల‌పై దాడి పైనా ఒకే వాణిని వినిపించిన విపక్షాలు.. కొన్ని సందర్భాల్లో ఒకే ఉద్యమ వేదికనూ పంచుకున్నాయి. తాజాగా, రైతు సమన్వయ సమితులపైనా కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఐక్యగళాన్ని వినిపిస్తున్నాయి.  

సమగ్ర భూ సర్వే కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 39కి వ్యతిరేకంగా.. ఈ రెండు పక్షాలు ఐక్యంగా ఉద్యమిస్తున్నాయి. సీపీఐ, టీజేఏసీ నేతలను కూడా కలుపుకుని.. బుధవారం, జీవో 39 రద్దు కోసం గవర్నర్‌ నరసింహన్‌ను కలిశాయి. జీవో నెంబర్‌ 39ను రద్దు చేసేలా చొరవ తీసుకోవాలంటూ ఈ పార్టీల నేతలు గవర్నర్‌కు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు.  

సమస్యలపై ఐక్య పోరాటమే కాదు.. కలిసికట్టుగా ఎన్నికలను ఎదుర్కొనే దిశగానూ టీడీపీ, కాంగ్రెస్‌లు సాగుతున్నాయి. సింగరేణి ఎన్నికల్లో.. టిఆర్ఎస్ అనుబంధ యూనియ‌న్‌ను ఓడించడమే లక్ష్యంగా ఉమ్మడి అభ్యర్థులను నిలపాలని నిర్ణయించాయి. సింగ‌రేణిలో వార‌స‌త్వ ఉద్యోగాలు ఇస్తామన్న సర్కారు.... మాట తప్పిందన్న ఆరోపణలతో.. సింగరేణి కార్మికుల మనసు చూరగొనే ప్రయత్నం చేస్తున్నాయి. వారసత్వ ఉద్యోగాల క్రమబద్దీకరణకు జీవో ఇచ్చిన ప్రభుత్వం... మళ్లీ జాగృతి నాయకుడితో దానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్‌ వేయించిందని ఆరోపిస్తున్నాయి. మొత్తానికి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటినుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.. గులాబీ బాస్‌ను ఢీకొట్టాలన్న  వీరి ఐక్యతారాగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో వేచిచూడాలి.. 

21:44 - September 13, 2017

వరంగల్‌ : జిల్లాలో టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య రైతు సమన్వయ సమితి చిచ్చు పెట్టింది. హన్మకొండలో సర్క్యూట్‌ హౌస్‌ వద్ద టీఆర్ ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ను అడ్డుకున్నారు. తన అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూ నిజమైన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే తీరుపై మంత్రి కడియంకు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. రైతు సమన్వయ సమితుల్లో తమకు అవకాశం ఇవ్వడంలేదని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

 

16:23 - September 13, 2017

హైదరాబాద్ : అఖిల పక్షం నేతలు గవర్నర్ నరసింహన్ కలిశారు. జీవో నంబర్ 39 రద్దు చేయాలని  విజ్ఞప్తి చేశారు. జీవో నంబర్ 39 టీఆర్‌ఎస్ పార్టీ రాజకీయ అవసరాలకు తప్ప రైతులకు ఏ మాత్రం ఉపయోగపడదని అఖిల పక్షం నేతలు ఆరోపించారు. రైతులను తీవ్ర నష్టపరిచే జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకునే దిశగా చర్యలు చేపట్టాలని గవర్నర్‌ను కోరారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు నేతలు చెప్పారు. 

 

15:51 - September 13, 2017

హైదరాబాద్ : గవర్నర్‌ను తన కుమారుడి పెళ్లికి.. మంత్రి పరిటాల సునీత ఆహ్వానించారు. అక్టోబర్‌ 1న తన కుమారుడి పెళ్లి జరగనున్నట్లు ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్‌ను, మంత్రులు, ఎమ్మెల్యేలు, తమ పార్టీకి చెందినవాళ్లను.. అందరినీ ఆహ్వానించనున్నట్లు సునీత చెప్పారు. ప్రజలందరూ తన కుమారుడు శ్రీరామ్‌కు ఆశీస్సులు అందించాలని కోరారు. 

 

09:56 - September 4, 2017

హైదరాబాద్ : మానవాళికి ప్రధాన శత్రువుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు పిలుపు ఇచ్చారు. ఇందుకోసం అన్ని దేశాలు ఏకంకావడంతోపాటు  కఠిన చట్టాలు రూపొందించాలని కోరారు. హైదరాబాద్‌ సమీపంలోని నల్సార్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్జాతీయ సంస్థ 78వ సమావేశాలకు వెంకయ్యనాయుడు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. అరవై దేశాలకు చెందిన న్యాయనిపుణులు పాల్గొన్న ఈ భేటీలో ఉగ్రవాదం ప్రపంచానికి ముప్పుగా పరిణమించింది ఆందోళన వ్యక్తం  చేశారు. 

21:39 - August 23, 2017

హైదరాబాద్ : వైద్య పరీక్షల నిమిత్తం గవర్నర్‌ నరసింహన్‌ సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. కొద్దికాలంగా కాల్లో ఏర్పడిన కంతితో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ చేయించుకున్నారు. సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పడంతో... త్వరలోనే సర్జరీ చేయించుకుంటానని వారికి తెలిపారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఓ సామాన్యుడులా గవర్నర్‌ ఆస్పత్రికి రావడంతో...గాంధీ సిబ్బంది ఆశ్చర్యపోయారు.

Pages

Don't Miss

Subscribe to RSS - governor narasimhan