Governor Narasimhan speech

19:21 - March 6, 2018

ఢిల్లీ : ఏపీకి కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది. గతంలో ప్రకటించిన ప్యాకేజీ మాత్రమే ఇవ్వగలమని తెలిపింది. సెంటిమెంట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేమన్న కేంద్రం... పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం కుదరదని కూడా స్పష్టం చేసింది. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల విషయంలో ఒక్క రూపాయికి కూడా లెక్క చెప్పలేదన్నారు. 

17:41 - March 5, 2018

గుంటూరు : ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించారు. విభజనతో అన్ని విధాల నష్టపోయిన ఏపీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేశారు. కష్టాల్లో ఉన్న ఏపీ ప్రజలను న్యాయం చేయాలని కోరారు. 
తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. విభజనతో ఏపీ ఆర్థికంగా నష్టపోయిన అంశాన్ని గవర్నర్‌ నరసింహన్‌  ప్రస్తావించారు. ప్రధానంగా ఆదాయం కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు.
హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే : గవర్నర్ 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వే జోన్‌, ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరత నివారించామని చెప్పిన గవర్నర్‌... అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమాన ప్రధాన్యత ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పెట్టుబడులకు ఏపీకి గమ్యస్థానంగా మారుస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. రాజధాని అమరావతిని 45 వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న విషయాన్ని గుర్తు చేసిన గవర్నర్‌ నరసింహన్‌, మౌలిక సదుపాయాల కల్పనకు  10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రజల కలలు సాకామయ్యే వరకు ప్రభుత్వం  విశ్రమింబోదని చెప్పి ప్రసంగాన్ని ముగించారు. 
ఈనెల 28 వరకు అసెంబ్లీ సమావేశాలు
గవర్నర్‌ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడ్డాక స్పీకర్‌ కోడెల అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈనెల 28 వరకు సభ నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 17 రోజుల పాటు బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. ఈనెల 6, 7 తేదీల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారు.  మార్చి 8న ఉదయం 11.30 గంటలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2018-19 వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఈనెల 9 నుంచి 11 వరకు తిరిగి 17, 18, 24, 25 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. మార్చి 12 నుంచి 15 వరకు బడ్జెట్‌పై చర్చిస్తారు. 16 నుంచి 27 వరకు శాఖలవారీ పద్దులపై చర్చ చేపడతారు. 28న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత సభ నిరవధిక వాయిడా పడుతుంది. ఈ మేరకు బీఏసీలో  షెడ్యూలు ఖరారు చేశారు. 
 

 

10:44 - March 5, 2018

విజయవాడ : నూతన భవనాల్లో రెండోసారి బడ్జెట్ సమావేశాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రసంగంలో విభజన సమస్యలు..ఇబ్బందులు..కేంద్రం హామీలు..హోదా ఉండడం గమనార్హం. విభజన అనంతరం ఏపీ ప్రస్తుతం కొలుకోంటోందని, విభజనతో ఏపీ రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు. విభజన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. భౌగోళిక ప్రదేశం ఆధారంగా ఇరు రాష్ట్రాలకు ఆస్తులు పంచారని, జనాభా ప్రాతిపదికన అప్పులను పంచారని గుర్తు చేశారు. రెవెన్యూ లోటు, తక్కువ ఆదాయంతో కష్టాలు మరింత పెరిగాయని, 56 శాతం ఉన్న జనాభాకు 46 శాతం రాబడి ఇవ్వడం అన్యాయమన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని, అమరావతికి ఆర్థిక సహాయం, జాతీయ ప్రాముఖ్యత గల సంస్థలు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు.

విభజన చట్టంలోని హామీలన్నీ కేంద్రం అమలు చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హామీల అమలు కోసం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఏపీ ప్రజలు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నారు. చట్టంలో ఇచ్చిన హామీ ప్రతిదీ అమలయ్యేవరకు తమ ప్రభుత్వం వెనుకడగు వేయదని, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకెళుతున్నట్లు తెలిపారు. రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పాటుతో ఆర్థిక కేంద్రాన్ని కోల్పోవడం జరిగిందని, విభజన హామీల అమలు కోసం మూడున్నరేళ్లుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా..రైల్వే జోన్ హామీలు అమలు కావాల్సి ఉందన్నారు.

కేంద్ర నిధులతో గ్రే హౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాల్సి ఉందని, ఆటో మొబైల్ కేంద్రంగా అనంతపురం అభివృద్ధి చెందుతోందని, ఎలక్ట్రానిక్ హాబ్ గా చిత్తూరు జిల్లా అభివృద్ధి చెందుతోందన్నారు. వెనుకబడిన జిల్లాలో ఆర్థిక సాయం 9, 10 షెడ్యూల్ సంస్థలను విభజించాల్సి ఉందన్నారు.

రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేయగలిగామని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత శాంతి భద్రతలపై దృష్టి సారించడం జరిగిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు వ్యవస్థ ఆధునీకరణ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని పూర్తిగా అణిచివేయడం జరిగిందని, పోలీసులు కనబడకుండా పోలీసింగ్ కనబడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు.

యువతకు ఉపాధి కల్పన ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. క్రీడాకారులు అంతర్జాతీయంగా ఎదిగేందుకు ప్రోత్సాహిస్తామని, అభివృద్ధి ఫలాలు ప్రతొక్కరికీ చేరేందుకు నిర్విరామంగా కృషి చేస్తామని, 2029 నాటికి రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు. వృద్ధి గమనాన్ని సుస్థిర పరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విత్తనాలు అందిస్తామన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపు..పన్ను విధింపు విషయాల్లో తేడాలను పరిష్కరించాలన్నారు. విశాఖ - విజయవాడ మెట్రో రైలు రోడ్డు అనుసంధానం కావాల్సి ఉందన్నారు. పూర్తి ప్రసంగం వినాలంటే వీడియో క్లిక్ చేయండి.

19:57 - December 19, 2017

హైదరాబాద్ : భాషా అభివృద్ధికి మీడియా పాత్ర కీలకమని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొని, ఆయన మాట్లాడారు. గవర్నర్ తెలుగులో ప్రసంగించి అందరినీ అలరించారు. భాషా రక్షణ కోసం కృషి కుటుంబం నుంచే మొదలు కావాలన్నారు. పిల్లల పుట్టిన రోజు వేడుకల్లో వారికి తెలుగు పుస్తకం బహుమతి ఇవ్వాలని సూచించారు. తెలుగు మహాసభలను వియవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

 

21:44 - September 13, 2017

వరంగల్‌ : జిల్లాలో టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య రైతు సమన్వయ సమితి చిచ్చు పెట్టింది. హన్మకొండలో సర్క్యూట్‌ హౌస్‌ వద్ద టీఆర్ ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ను అడ్డుకున్నారు. తన అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూ నిజమైన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే తీరుపై మంత్రి కడియంకు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. రైతు సమన్వయ సమితుల్లో తమకు అవకాశం ఇవ్వడంలేదని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

 

Don't Miss

Subscribe to RSS - Governor Narasimhan speech