Grama darshini Program

08:15 - August 10, 2018

విశాఖ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీల అమల్లో విఫలమైన బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు శపథం చేశారు. విభజన హామీలు అమలు చేసే వరకు ప్రధాని మోదీ నేత్వత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ధర్మపోరాటం ఆగదన్నారు. గిరిజనులందరికీ యాభై ఏళ్లకే పెన్షన్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి విధాన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా పాడేరులో జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దితోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు... గిరిజనులకు ప్రస్తుతం ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను 75 యూనిట్ల నుంచి వంద యూనిట్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. 
పాడేరులో పర్యటించిన చంద్రబాబు 
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గంలో పర్యటించారు. చింతలవీధి పంచాయతీ అడారిమెట్టలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో గర్భిణిలకు శ్రీమంతాలు నిర్వహించి, చంటిపిల్లలకు అన్నప్రాసన చేశారు. అక్కడే అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. పాఠశాలలో డిజిటల్‌ తరగతులకు శ్రీకారం చుట్టారు. అడారిమెట్ట గ్రామ సభలో పెన్షన్లు, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుక వంటి పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 
ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు
పాడేరు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లోనూ చంద్రబాబు పాల్గొన్నారు. ఆరువేల మందికిపైగా గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ.... గిరిజనుల కోసం అన్నీ చేస్తున్న మంచి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. బీజేపీ మెడలు వంచి హక్కులు సాధించుకుంటామన్నారు. యాభై ఏళ్ల వయసు నిండిన గిరిజనులందరికీ పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పాడేరు సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించిన కొందరు యువకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
రాష్ట్ర ప్రభుత్వ పండుగగా మోదుకొండమ్మ జాతర 
విశాఖ మన్యంలో గిరిజనులు జరుపుకునే మోదుకొండమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా చంద్రబాబు ప్రకటించారు. సభా వేదికపై గిరిజనులు బహుకరించిన సంప్రదాయ టోపీని ధరించారు.  ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులతో మంజూరు చేసిన ఇన్నోకార్లు, జీపులను లబ్దిదారులకు చంద్రబాబు పంపిణీ చేశారు. విలువిద్యలో ప్రతిభ కనబరచిన గిరిజన విద్యార్థులకు ఆర్చరీ పరికరాలు ఆందచేశారు. గిరిజన బాలికలతో కలిసి థింసా నృత్యం చేశారు. ఆ తర్వాత పాడేరు నుంచి అమరావతి బయలుదేరి వెళ్లారు.
 

 

06:48 - August 9, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజనుల అభ్యన్నతికి పాటుపడుతోంది. గిరిజనుల విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమానికి పెద్దపీఠ వేస్తోంది. వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు నాలుగేళ్లుగా అనేక కార్యక్రమాలను చేపడుతోంది. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా.... ఏపీలో గిరిజనుల అభ్యున్నతిపై కథనం...
గిరిజన అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీఠ 
తెలుగుదేశం ప్రభుత్వం గిరిజన అభ్యున్నతికి పెద్దపీఠ వేస్తోంది. గిరిజనుల విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వారి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తోంది. గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచేందుకు గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేసింది.  ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆదివాసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి వారిని అన్ని రంగాల్లో ఆదుకుంటోంది. గిరిజన యువతలో స్కిల్స్‌ డెవలప్‌చేస్తూ వారిని ఉపాధిరంగంలో ప్రోత్సహిస్తోంది.
గిరిపుత్రులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక
ఏపీలోని 35 జాతుల్లో 5.53శాతంగా ఉన్న గిరిపుత్రులను అన్నివిధాలా ఆదుకునేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికనూ అమలు చేస్తోంది. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా సీఎం చంద్రబాబు  2018-19కిగాను 2129.13 కోట్లను కేటాయించారు. సబ్‌ప్లాన్‌ కింద 2018-19కిగానూ 4,176.60 కోట్ల నిధులు కేటాయించింది. ఈ స్థాయిలో భారీగా నిధులు మంజూరు చేసి గిరిజన ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటోంది.  విద్య ద్వారానే సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని భావించిన ప్రభుత్వం.... గురుకుల విద్యా వ్యవస్థ కింద 174 విద్యాసంస్థలను ఆదివాసీ విద్యార్థుల కోసం నడుపుతోంది. మరో 80 గిరిజన హాస్టళ్లను కొత్తగా కన్వర్ట్ చేసి వాటిని కూడా ప్రభుత్వం గురుకులాల నియంత్రణ కిందకు తీసుకువచ్చి గిరిజన యువతకు విద్యను అందుబాటులోకి తెచ్చింది.
గిరిజనుల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత 
విద్య తర్వాత ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యానికి అధికా ప్రాధాన్యత ఇస్తోంది. పాత పద్దతులకు స్వస్తి చెప్పి సరికొత్త ఆవిష్కరణలను టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. గిరిజన ప్రాంతాల్లో అధునాతన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చింది.  160 పీహెచ్‌సీలు, 249 సీహెచ్‌సీలు, 270 ఏహెచ్‌ల్లో మందులను అందుబాటులో ఉంచేందుకు  ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పీహెచ్‌సీల్లో 7 నుంచి 11 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ సంఖ్యను 23కు పెంచారు. 15 చంద్రన్న సంచార చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం గిరిజనుల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుతుండడంతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి
 

 

06:42 - August 9, 2018

విశాఖ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖ జిల్లా పాడేరులో పర్యటిస్తారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆదివాసీ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతారు. మరోవైపు బాక్సైట్‌ అంశంతోపాటు గిరిజన యూనివర్సిటీ, గిరిజన స్పెషల్‌ డీఎస్సీ, బోయా వాల్మీకి కులాలను ఎస్టీలను చేర్చే అంశంపై సీఎంకు నిరసన తెలపాలని గిరిజన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటన సాఫీగా సాగుతుందా లేక ఆదివాసీలు అడ్డుకుంటారా అన్న ఉత్కంఠ నెలకొంది.
పాడేరులో పర్యటించనున్న చంద్రబాబు 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన పాడేరులో పర్యటిస్తారు. ఈ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేశారు. చంద్రబాబు ప్రత్యేక విమానం ద్వారా విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి పాడేరుకు హెలికాప్టర్‌ ద్వారా వెళ్తారు.  పాడేరు మండలం అడారిమెట్టలో నిర్వహించే గ్రామదర్శి  కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అడారిమెట్ట, చింతలవీధి పరిధిలోని 8 గ్రామాల ప్రజలతో చంద్రబాబు ముచ్చటిస్తారు. గ్రామదర్శి కార్యక్రమంతోపాటు గ్రామ వికాసం కార్యక్రమంలోనూ పాల్గొంటారు. మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతం కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ప్రతీవాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌తోపాటుగా... పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ఏర్పాట్లను పరిశీలించారు.
చంద్రబాబు పాడేరు టూర్‌కు సమస్యలు స్వాగతం 
చంద్రబాబు పాడేరు టూర్‌కు అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా బాక్సైట్‌ గనులకు సంబంధించి జీవో నంబర్‌ 97పై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చెయ్యకపోవడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నాల్కో సంస్థకు బాక్సైట్‌ను అప్పగించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అందుకే జీవో నంబర్‌ 97ను రద్దు చెయ్యకుండా ఉంచిందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో గిరిజన యూనివర్సిటీతోపాటుగా స్పెషల్‌ డీఎస్సీ అంశంపైనా గిరిజన నిరుద్యోగ యువత ఎదురు చూస్తోంది. అటవీ హక్కుల చట్టం అమలు గురించి కూడా సీఎం ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.  ఇక బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాల్లో చేర్చొద్దని ఇక్కడి గిరిజనులు తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు. ఆదివాసీ సమస్యలపై చంద్రబాబును నిలదీయాలని గిరిజన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. నల్లజెండాలతో నిరసన తెలపాలని కోరారు. మొత్తానికి చంద్రబాబు పాడేరు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. 

 

19:23 - August 3, 2018

కృష్ణా : బీజేపీ, ఎన్ డీఏలను ఓడిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. మనకు రావాల్సిన హక్కుల కోసం బీజేపీ, ఎన్ డీఏలను ఓడించే కేంద్రంలో మనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. ఆ రెండింటిని ప్రజల్లో దోషిగా నిలబెడతామని చెప్పారు. 25 పార్లమెంట్ స్థానాలు గెలిస్తే ఎవరిని ప్రధాని చేయాలో నిర్ధేశించే స్థాయికి ఎదుగుతామన్నారు. అన్యాయం చేసిన వ్యక్తికి గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. పార్లమెంట్ లో, ఢిల్లీలో, గల్లీలో పోరాటం చేయాలన్నారు. అభివృద్ధి అగిపోతే దెబ్బతింటామని చెప్పారు. ప్రతి గ్రామం స్మార్ట్ గ్రామంగా తయారు కావాలన్నారు. సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని.. నూతన ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుడతామని తెలిపారు. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పశువులకు ఆస్పత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే 1100 నెంబర్ కు కాల్ చేసి చెప్పండి అన్నారు. అందరికీ సహకరించి, సుపరిపాలనకు నాంది పలకాలని కోరారు. సమర్థవంతంగా పని చేసి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వాలని చెప్పారు. నీతి నిజాయితీగా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేయాలన్నారు. 

 

19:00 - August 3, 2018

కృష్ణా : బీజేపీ, మోడీకి భయపడబోమని సీఎం చంద్రబాబు అన్నారు. బీజేపీ, మోడీలకు భయపడి రాజీనామాలు చేయలేదని స్పష్టం చేశారు. హక్కులు సాధించే వరకు కేంద్రంపై రాజీలేని పోరాటాలు చేస్తామన్నారు. జిల్లాలోని విసస్నపేటలో నిర్వహించిన ఐదో గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కేంద్రం నమ్మక ద్రోహం చేసిందని..కుట్ర రాజకీయాలు చేశారని మండిపడ్డారు. వైసీపీ వెంట వెళితే..'కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే' అని' ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మార్చారని..రూటే మార్చేశారని అన్నారు. సింగపూర్ గవర్నమెంట్ దేశంలో ఒక్క ఏపీని మాత్రమే నమ్మి సహకరిస్తున్నారని అన్నారు. ఒక్క పైసా తీసుకోకుండా రాజధాని అమరావతికి డిజైన్ ఇచ్చారని తెలిపారు.
ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం అండ
ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. 100 రోజలు ఉపాధి హామీ పనిని 120 రోజులకు కన్సిడర్ చేశామని తెలిపారు. టీడీపీ పేదల ప్రభుత్వమని..ఉపాధి కల్పిస్తామన్నారు. సులభతర పద్ధతులలో అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ప్రజలకు అండగా ఉందామని... మనవతా దృక్పథంతో ముందుకు పోదామని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం టీమ్ గా పని చేసి అభివృద్ధి సాధించడం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ఏపీకి న్యాయం జరగాలన్నారు. మాయ మాటలు చెప్పి మభ్య పెట్టారని మండిపడ్డారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లాలన్నారు. చెప్పిన మాటలను కేంద్రం పెడచెవిన పెట్టారు...అప్పుడు కేంద్రం, ఎన్ డీఏ నుంచి బయటికి వచ్చామని చెప్పారు. అనంతరం కేంద్రంపై టీడీపీ ఎంపీలు ఢిల్లీని గడగడలాడించారని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా, విభజన హామీలపై పార్లమెంట్ లో మోడీని ఎంపీ కేశినేని నాని నిలదీశారని తెలిపారు. రాజకీయంతో రాష్ట్రాన్ని విభజించారని... తాను సీఎం అయిన మూడు నెలలకే హుదూద్ తుపాన్ వచ్చిందన్నారు.
నదులు అనుసంధానం
నదులు అనుసంధానం, వర్షపు నీటిని భూగర్భ జలాలు మార్చడం ద్వారా పైరర్లు కాపాడుకోగలిగామన్నారు. నదుల అనుసంధానం చేసి నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు నీటిని అందించామని తెలిపారు. ఎక్కడ ఇబ్బంది, ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ టీడీపీ ఉంటుందని హామీ ఇచ్చారు. సంపద రావాలంటే కష్టపడాలని సూచించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని తెలిపారు. దీనికి యంత్రాంగం సహకారం ఎంతో ఉందన్నారు. 

16:01 - August 3, 2018

గుంటూరు : గ్రామాలలో అమలవుతున్న సంక్షేమ పథకాల పనితీరును ప్రభుత్వం గ్రామదర్శిని ద్వారా తెలుసుకుంటుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వటంతో టీడీపీ మేనిఫెస్టో 99 శాతం పూర్తయిందని డొక్కా తెలిపారు. బీజేపీ నేత సోము వీర్రాజు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. ఈ ఆరోపణలు ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధి నిరోధకునిగా సోమువీర్రాజు వ్యవహరిస్తున్నారని.. వ్యవహారశైలి మార్చుకోవాలని డొక్కా సూచించారు. 

 

21:13 - August 1, 2018

అనంతపురం : అభివృద్ధి నిరోధక వైసీపీ, జనసేన, బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ మూడు పార్టీల నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. సహాయ నిరాకరణతో ప్రధాని మోదీ ఏపీకి అన్యాయం చేస్తుంటే... కేసులతో వైసీపీ ప్రగతికి అవరోధంగా మారిందని విమర్శించారు. అసత్య ఆరోపణలతో జనసేన ప్రజలను రెచ్చగొడుతోందని అనంతపురం జిల్లా పేరూరు గ్రామదర్శిని సభలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. రామగిరి మండలం పేరూరులో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరూరు ప్రాజెక్టుకు నీరు తరలించే కాల్వ నిర్మాణానికి భూమి పూజ చేసిన చంద్రబాబు.. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. చంద్రన్న బీమా పథకం కింద చెక్‌లు అందచేశారు. వివిధ పథకాల కింది  లబ్ధిదారులకు ఆస్తులను పంపిణీ చేశారు. 

పేరూరు గ్రామదర్శిని సభలో ప్రసంగించిన చంద్రబాబు... ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్‌పై విరుచుకుపడ్డారు. అవినీతిపరుల ఆస్తులు జప్తు చేస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రధాని... ఇప్పుడు వైసీపీ వంటి అవినీతి పార్టీలకు అండగా నిలుస్తున్నారని విరుచుకుపడ్డారు. 

విభజనతో నష్టపోయిన ఏపీని అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇచ్చిన మోదీ... ఇప్పుడు అడ్డం తిరిగడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో మహిళలు, మైనారిటీలు సహా ఏ వర్గానికి రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ లబ్ధి కోసమే అసోంలో జాతీయ పౌర రిజిస్టర్‌ నుంచి 40 లక్షల మంది పేర్లు తొలగించారని విమర్శించారు. 

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడమని అడిగితే ప్రధాని మోదీ బెదిరింపులకు దిగుతున్నారని చంద్రబాబు విమర్శించారు. హుందాగా ప్రవర్తించాల్సిన మోదీ... స్థాయి మరిచి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో పలు గ్రామాలకు రోడ్లు, ఎన్టీఆర్‌ ఇళ్లు చంద్రబాబు మంజూరు చేశారు. 

 

19:33 - August 1, 2018

ఢిల్లీ : విభజన హామీలు.. ముఖ్యంగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం.. తెలుగుదేశం నేతలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. పార్లమెంటు లోపలా, బయటా ఆందోళనలు సాగిస్తూనే.. రాష్ట్రపతి దృష్టికీ ఈ అంశాన్ని తీసుకు వెళ్లారు. ఇంకోవైపు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీతోనూ టీడీపీ నేతలు భేటీ అయి.. తమ డిమాండ్‌కు మద్దతును సమీకరించారు. 

విభజన హామీల సాధన దిశగా.. తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటివరకు పార్లమెంటు ప్రాంగణంతో పాటు ఉభయసభల్లో ఆందోళన కొనసాగిస్తున్న ఆ పార్టీ ఎంపీలు తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. సుజనాచౌదరి నేతృత్వంలోని బృందం.. రాష్ట్రపతిని కలిసి.. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకునేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్కు కర్మాగారం ఆంధ్రుల మనోభావాలకు చెందిన అంశం కాబట్టి ఆ హామీ నెరవేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో.. టీడీపీ ఎంపీలు.. కేంద్ర ఉక్కు శాఖమంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌నూ కలిశారు. కడప జిల్లా నాయకులతో కలిసి.. టీడీపీ ఎంపీలు.. కేంద్ర మంత్రిని కలిశౄరు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

అటు పార్లమెంటు ప్రాంగణంలో.. బుధవారం కూడా టీడీపీ ఎంపీలు ఆందోళనను కొనసాగించారు. పార్లమెంటు గాంధీ విగ్రహం దగ్గర ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మరోవైపు.. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ ప్రజాకవి వేషధారణలో మోదీ వైఖరిపై మండిపడ్డారు. మాటలగారడీ.. వినయం పేరడీతో మోదీ ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ఇంకోవైపు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీతోనూ.. టీడపీ ఎంపీలు సుజనాచౌదరి, కేశినేని నాని భేటీ అయ్యారు. పార్లమెంటులో ఆమెను కలిసి.. తమ ఆందోళనకు మద్దతును కోరారు. 

17:39 - August 1, 2018

అనంతపురం : కేంద్ర ప్రభుత్వాన్ని మార్చి హక్కులు కాపాడుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపిచ్చారు. బీజేపీ పాలనలో దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఆడపిల్లలు, మైనారిటీలకు భద్రత లేదన్నారు. స్వాతంత్ర్యం పోరాటం సమయంలో బ్రిటీష్ వారికి సహకరించి...పోరాటానికి ద్రోహం చేసిన వారు.. ఇప్పుడు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలను ప్రధాని మోడీ బెదిరించారని అన్నారు. ఎన్నికల మందు మోడీ బాగా మాటలు చెప్పారని తెలిపారు. ప్రతి ఒక్కరి అకౌంట్ లో డబ్బులు వేస్తానని... విదేశాల్లోని నల్లధనం వెనక్కి తెస్తానన్నారు. కానీ అవేమీ జరగలేదని విమర్శించారు. బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు లేకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం మన లక్ష్యం అన్నారు. కేంద్రంపై పోరాడి హక్కులు సాధించుకుంటామని చెప్పారు.  

 

17:24 - August 1, 2018

అనంతపురం : 'నాది రైట్ టర్న్... మీది యూటర్న్' అని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ ట్రాప్ లో తాను పడలేదని...వైసీపీ అవినీతి కుడితిలో బీజేపీ, ఎన్ డీఏ ప్రభుత్వం పడిందన్నారు. తనకు మెచూరిటీ లేదని మోడీ అంటున్నారు..ఆయనకు మెచ్యూరిటీ ఉన్నట్లు అని అన్నారు. ఉందాతనం కోల్పోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అందరికంటే ముందుగా తాను ముఖ్యమంత్రి అయ్యానని.. తనకు రాజకీయాలు నేర్పిస్తున్నారని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో గ్రామదర్శిని కార్యక్రమంలో సీఎం పాల్గొని, మాట్లాడారు. నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. బిందు, తుంపర సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కమ్యూనిటీ డ్రిప్ ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో ఒక నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తానని తెలిపారు. అనంతపురం వెనుకబడిన జిల్లా అని.. జిల్లాలో అందరూ పేదవారు ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీకి అనంతపురం ప్రజలు మొదటి నుంచి బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు. జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నానని అన్నారు. 87 శాతం మైక్రో ఇరిగేషన్ చేశామని.. ఈ సం. 100 శాతానికి చేరాలన్నారు. జిల్లాకు సెంట్రల్, ఎనర్జీ యూనివర్సిటీలను ఇచ్చామని తెలిపారు. ఆరు నెలల్లో గొల్లపల్లికి నీరు తీసుకొచ్చామని తెలిపారు. రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. పరిటాల రవీంద్ర కాలువగా నామకరణం చేశామని తెలిపారు. అనంతపురం జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం వస్తుందన్నారు. జిల్లాలో మరో ఎయిర్ పోర్టును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
వైసీపీ కేసులు మీకు కనపడడం లేదా..? 
'వైసీపీ కేసులు మీకు కనపడడం లేదా..'? అని ప్రధాని మోడీని చంద్రబాబు నిలదీశారు. 'ఏ1, ఏ2 లను మీ ఆఫీస్ లో కూర్చోపెట్టుకుని.. అవినీతిని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు' అని ప్రశ్నించారు. 'వారికి రాజకీయం కావాలి...మనకు ప్రజా హితం కావాలి' అని పేర్కొన్నారు. కొంతమంది ఢిల్లీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. కేసులు, జైలు భయంతోని వైసీపీ కేంద్రానికి ఊడిగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హోదా, విభజన హామీలపై పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు నిలదీస్తుంటే వైసీపీ, జనసేన అడ్రస్ లేదని విమర్శించారు. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో తనకు తెలుసు...సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని అన్నారు. రాజ్యసభలో ఒక్క బీజేపీ తప్ప అందరూ కేంద్రాన్ని నిలదీశారని చెప్పారు. బీజేపీ అధికారం, మంద బలం ఉందని ముందుకెళ్తోందన్నారు. మెజారిటీ కంటే మొరాలిటీయే గెలుస్తుందన్నారు. అంతిమ విజయం టీడీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా సాధిస్తామని చెప్పారు.  

 

 

Pages

Don't Miss

Subscribe to RSS - Grama darshini Program