Grama Panchayat

06:58 - August 3, 2018

హైదరాబాద్ : గ్రామీణ తెలంగాణలో నూతన శకం ఆరంభమైంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏకకాలంలో 4 వేల 3 వందల 83 కొత్త పంచాయతీలు నేటి నుంచి ఉనికిలోకి వచ్చాయి. పాత పంచాయతీలతో పాటు నూతన పంచాయతీలలో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. ఇంతకాలం ఒక ఊరికి అనుబంధంగా ఉన్న శివారు పల్లెలు, తండాలు, గూడేలకు ఇప్పుడు స్వతంత్ర హోదా దక్కింది. కొత్త పంచాయితీల ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునివ్వటంతో పలు ప్రాంతాల్లోని గ్రామ పంచాయితీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక కొత్త మున్సిపాలటీలు కూడా నేటి నుంచి ఉనికిలో వచ్చాయి. తమ గ్రామాలను మున్సిపాలిటీలో కలవద్దంటూ పలు ప్రాంతాల్లో గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

గ్రామీణ తెలంగాణలో నూతన శకం ఆరంభమైంది. కొత్తగా 4,383 గ్రామ పంచాయితీలు గురువారం నుంచి ఉనికిలోకి వచ్చాయి. పాత పంచాయతీలతో పాటు నూతన పంచాయతీలలో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. ఇంతకాలం ఒక ఊరికి అనుబంధంగా ఉన్న శివారు పల్లెలు, తండాలు, గూడేలకు ఇప్పుడు స్వతంత్ర హోదా దక్కింది. కొత్త పంచాయితీల ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునివ్వటంతో పలు ప్రాంతాల్లోని గ్రామ పంచాయితీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లా అంథోల్‌, పుల్కల్ టేక్మాల్‌ మండలాల్లోని నూతన పంచాయితీలను స్థానిక ఎమ్మెల్యే బాబుమోహన్‌ ప్రారంభించారు. పుల్కాల్‌ మండలంలోని తడ్‌దాన్‌పల్లి, గొంగళూర్ తండాల్లో పంచాయితీ భవనాలను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, అమీన్‌పూర్ మండలాల్లోని నూతన పంచాయితీలను మెదక్ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి ప్రారంభించారు. దీంతో దాయర, అయిలాపూర్‌ తండా, పటేల్‌గూడ గ్రామాలు నూతన పంచాయితీలుగా ఏర్పాటు అయ్యాయి. గ్రామాలు పంచాయితీలుగా ఏర్పడటం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలంలోని జక్కాపూర్‌, మల్లూర్‌ తండాల నూతన గ్రామ పంచాయితీలను ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే ప్రారంభించారు. అలాగే గోర్గల్‌, మంగ్లూర్‌, బ్రహ్మణపల్లిల పంచాయితీ భవనాలను సీడీసీ చైర్మన్‌ పట్లోళ్ల దుర్గారెడ్డి ప్రారంభించారు.

ఖమ్మం మండలంలోని నూతన పంచాయితీలను ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. కొత్త పంచాయితీలుగా గ్రామాలు ఏర్పాడటం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. వరంగల్‌ జిల్లా వర్దన్నపేట మండలంలోని ఏబి తండా గ్రామస్థులు ఆందోళనక దిగారు. నూతన పంచాయితీగా గ్రామాన్ని ఏర్పాటు చేసినప్పటికీ భవనాన్ని వేరే తండాలో ఏర్పాటు చేయటం పట్ల ఆగ్రహించిన గ్రామస్థులు ధర్నాకు దిగారు.

ఇక కొత్త పంచాయితీలతో పాటు కొత్త మున్సిపాలటీలు కూడా గురువారం నుంచి ఉనికిలో వచ్చాయి. అయితే తమ గ్రామాలను మున్సిపాలిటీలో కలవద్దంటూ పలు ప్రాంతాల్లో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని కలపవద్దంటూ బ్రహ్మణపల్లి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.

అటు నిజామాబాద్‌ జిల్లా మామిడిపల్లి గ్రామస్థులు.. తమ గ్రామాన్ని ఆర్మూర్‌ మున్సిపాలిటీలో కలపవద్దంటూ ఆందోళనకు దిగారు. భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం మామిడిపల్లి చౌరస్తా వద్ద రాస్తారోకోకు చేశారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపటం వల్ల తాము నష్టపోతామని గ్రామస్థులు తెలిపారు.

20:40 - August 2, 2018

సంగారెడ్డి : జిల్లాలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయితీల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. తండాలను కూడా గ్రామ పంచాయితీ హోదాను కల్పించడంతో పండుగ వాతావరణం వచ్చిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయితీలతో పాలన మరింత మెరుగవుతుందంటున్న జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. సంగారెడ్డి జిల్లాకు కొత్తగా 190 గ్రామ పంచాయితీలు వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు. సుమారు 90 తండాలకు గ్రామ పంచాయితీలు వచ్చాయన్నారు.

 

19:50 - April 16, 2018

నిర్మల్‌ : ఖానాపూర్‌ మండలంలోని నడింపల్లి గ్రామాన్ని గ్రామ పంచాయితీగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు నిర్మల్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం ఖానాపూర్‌ ఎంపీడీవోకు వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికైన ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే కోర్టు ద్వారానైనా గ్రామ పంచాయితీని సాధించుకుంటామని గ్రామస్థులు స్పష్టం చేశారు. చిన్న చిన్న తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం తమ గ్రామాన్ని చిన్న చూపు చూస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

08:11 - February 5, 2018

హైదరాబాద్ : కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ముసాయిదా బిల్లు పురోగతి, నూతన గ్రామ, నగర పంచాయతీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త పంచాయతీలకు నిధులు కేటాయింపు, ఆర్థిక సంఘం నిధుల విడుదల, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, ఆస్తి పన్ను వసూలు ద్వారా వచ్చే నిధులు తదితర అంశాలపై కేసీఆర్‌ అధికారులతో చర్చించారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటయ్యే పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు ఎలా పొందాలో అధ్యయనం చేయాలని అధికారుల దృష్టికి తెచ్చారు.

వచ్చే నెల 11న పాస్ బుక్ లు
వచ్చే నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాపు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో వీటి ముద్రణను వేగవంతం చేయలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. త్వరతగతిన అనుకున్న సమయానికి పూర్తయ్యేటట్టు చూడాలిన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి, కళ్లద్దాలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ విషయంలో ఇసక్తి ఉన్న ప్రభుత్వేతర సంస్థల సహకారాన్ని తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

అటవీ భూములను రక్షణ
రోజు రోజుకు శరవేగంగా అభివృద్ధిపథంలో పయనిస్తూ, భౌగోళికంగా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ నగరాన్ని అన్ని విధాల కాపాడుకోవాల్సిన అవసరాన్ని కేసీఆర్ అధికారుల దృష్టికి తెచ్చారు. నగరానికి అన్ని వైపుల 50 నుంచి 60 కి.మీ.పరిధిలో లక్షన్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ భూములను రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో ఫారెస్ట్‌ బ్లాక్‌లను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధిచేసి, కేబీఆర్‌ పార్క్‌ తరహాలో వాక్‌ వేని నిర్మించాలని కేసీఆర్‌ ఆదేశించారు. సేవ్‌ హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేపట్టాలని కోరారు. 

19:00 - January 5, 2018

కడప : జిల్లాలోని వేంపల్లి మండలంలో పంచాయితీ కాంట్రాక్టర్‌ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. ఆరునెలలుగా వేతనాలు చెల్లించడం లేదని 70 మంది కార్మికులు వేంపల్లి పంచాయితీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆందోళన చేస్తున్న కార్మికులపై వేంపల్లి సర్పంచ్‌ విష్టువర్దన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ ఈవో నాగభూషణం రెడ్డి కలగజేసుకొని కార్మికులతో మాట్లాడి నాలుగు నెలల వేతనానికి సంబంధించి చెక్కును కార్మికులకు అందజేశారు. త్వరలోనే వేతనాలు అందేలా చేస్తామని హామీ ఇవ్వడంతో సిబ్బంది ఆందోళనను విరమించారు. 

 

13:27 - August 24, 2017

నిజామాబాద్ : మనిషి.. మానవత్వాన్ని మరచి నేర ప్రవృత్తిని పెంచుకుంటున్న కాలమిది. రకరకాల నేరగాళ్లను నియంత్రించేందుకు.. నవీన వ్యవస్థలను రూపొందించుకుంటోన్న తరుణమిది. ఇలాంటి రోజుల్లోనూ.. ఓ గ్రామం అహింసా పరమో ధర్మః అంటూ ప్రవచిస్తోంది.. అదే ధర్మాన్ని అక్షరాలా పాటించి చూపుతోంది. ఫలితంగా.. మూడు దశాబ్దాలుగా పోలీసు కేసన్నదే ఎరుగని గ్రామంగా భాసిల్లుతోంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది..? తెలుసుకోవాలనుకుంటున్నారా..? వాచ్‌ దిస్‌ స్టోరీ  
డికంపల్లి...ఆదర్శ గ్రామం 
ఈ ఊరందరిదీ ఒకే గొంతు...ఊరుమ్మడిగా నిర్దేశించుకున్న స్వీయ క్రమశిక్షణ....అహింస, అన్యాయం, అక్రమాలకు అందనంత దూరం.. ఆగ్రామం. నిజామాబాద్ జిల్లా మాక్లురు మండలంలోని డికంపల్లి.. ఐకమత్యంలో.. సాటి గ్రామాలకు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈర్ష్యాద్వేషాలకు ఈ గ్రామం వ్యతిరేకం. జగమంత కుటుంబం మనది అంటూ ఐక్యతారాగం పాడుతోంది. ఇక్కడి ప్రజలు ప్రతిపనిలోనూ క్రమశిక్షణ పాటిస్తారు. ఫలితంగా.. ఈ గ్రామంలోని ప్రజలు... ముప్పై ఏళ్ల కాలంలో ఎన్నడూ పోలీసు స్టేషన్‌  ముఖం చూడాల్సిన అవసరం రాలేదు. 
గ్రామ జనాభా 2 వేలపై చిలుకు 
డికంపల్లి గ్రామ జనాభా 2 వేలపై చిలుకు మాత్రమే.. ఓటర్ల సంఖ్య 1600 మాత్రమే. 70 శాతం మంది వ్యవసాయంపై  ఆధారపడి జీవిస్తున్నారు. ఉదయం 6 గంటలకే పొలాల దగ్గరికి వెళ్తారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి 10 గంటల వరకు గ్రామానికి చేరుకుంటారు. ఇంటిపనులు ముగించుకుని.. సాయంత్రం కాగానే స్వాధ్యాయ కేంద్రానికి వెళతారు. ఇక్కడ తమలోని సేవాతత్పరతను, ఆధ్యాత్మిక చింతనను.. సామాజిక స్పృహను ఇక్కడే ఇనుమడింప చేసుకుంటారు. 
డికంపల్లిలో సర్వమత సామరస్యం 
డికంపల్లి గ్రామం సర్వమత సామరస్యాన్ని పాటిస్తోంది. అన్ని పండగలు శాంతియుతంగా ఐకమత్యంగా జరుపుకుంటారు. రెండు వేల మంది జీవిస్తున్న ఈ గ్రామంలో పరస్పర గొడవలు, చిన్నపాటి తగాదాలు ఉండకుండా ఉంటాయా..? కచ్చితంగా ఉంటాయి. అయితే.. ఎలాంటి గొడవలు జరిగినా ప్రజలంతా ఊరినడిబొడ్డున ఉన్న చెట్టు  వద్దే ఆ తగాదాలను పరిష్కరించుకుంటారు. ఎలాంటి సమస్యనైనా సమావేశంలోని తీర్మానాల ద్వారానే సర్దుబాటు చేస్తారు. 
ఠాణాలో ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాకపోవడం గమనార్హం 
డికంపల్లి మాక్లురు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. 30 ఏళ్లుగా గ్రామం నుంచి ఎలాంటి ఫిర్యాదులు ఠాణాలో నమోదు కాకపోవడం గమనార్హం. తాము అధికంగా విశ్వసించేది  భూతల్లినని..ప్రశాంతంగా ఉండేందుకు స్వాద్యాయ కేంద్రానికి వెళ్లడం వల్ల కోపతాపాలకు తావుండని స్థానికులు అంటున్నారు. మనిషి తలుచుకుంటే అసాధ్యమనేది లేదు. ఐక్యంగా ముందడుగు వేయాలి.  కలిసి కదిలితే ఏదైనా సాధ్యమే అని డికంపల్లి గ్రామం ఇస్తున్న సందేశమిదే. 

 

15:34 - July 19, 2017

వరంగల్ : గ్రామంలో ఏ సంఘటన జరిగినా ముందుగా గ్రామ పంచాయితీ గుర్తొస్తుంది. గ్రామ పంచాయితీ అధికారులు సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తారు. కానీ అలాంటి గ్రామ పంచాయితీకి ఓ చోట తాళం పడింది. వరంగల్ రూరల్ జిల్లా, వర్ధన్నపేట మండలంలో గ్రామపంచాయితీకి తాళం పడింది. పంచాయితీ భవన నిర్మాణ నిధులు రాలేదని గ్రామ ఉప సర్పంచ్‌ మరియు వార్డు సభ్యులు కలిసి తాళం వేశారు.

2013 లో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా గ్రామ పంచాయితీ భవనం మంజూరైందని గ్రామ ఉప సర్పంచ్‌ తెలిపారు. నిధులు సకాలంలో రాకపోవడంతో గ్రామపంచాయితీకి సంబంధించిన పాలక వర్గ సభ్యులంతా కలిసి.. కొంత మొత్తంలో డబ్బులు జమ చేశారు. భవన నిర్మాణాన్ని పూర్తి చేసి నాలుగు ఏళ్లు గడుస్తున్నాయి. తమకు ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ముట్టలేదని.. అందుకే గ్రామ పంచాయితీకి తాళం వేశామని వార్డు సభ్యులు అంటున్నారు. కేవలం సంబంధిత ఏఈ అధికారి నిర్లక్ష్య వైఖరికి తామంతా బలి కావాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రావాల్సిన గ్రామ పంచాయితీ బిల్లును త్వరగా రప్పించాలని కోరుతున్నారు.

బిల్లులు వచ్చేంత వరకూ భవనాన్ని గ్రామ పంచాయితీ కోసం వాడేది లేదని వీళ్లు తేల్చి చెబుతున్నారు.

13:50 - October 26, 2016

రంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర పదోరోజుకు చేరింది.. ఇవాళ బాచుపల్లి, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి, పోరళ్ల, కోళ్లపడ్కల్‌, గాంధీనగర్‌తండా, దుబ్బచర్ల, మన్సాన్‌పల్లి క్రాస్‌రోడ్‌లో పాదయాత్ర కొనసాగుతోంది... మరిన్ని సమాచారానికి వీడియో చూడండి..

19:37 - August 12, 2015

తెలంగాణలో గ్రామ పంచాయితీ సిబ్బంది సమస్యకు ఇంకా పరిష్కారం లభించలేదు. వీరు సమ్మెకు దిగి 43 రోజులు దాటినా, సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఉత్సాహం చూపడం లేదు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మికులు నిర్వహించిన చలో హైదరాబాద్ విజయవంతమైంది. ఈ అంశంపై టెన్ టివిలో నిర్వహించిన చర్చా వేదికలో ఆర్. సుధా భాస్కర్ (సీఐటీయూ జాతీయ కార్యదర్శి), సోలిపేట రామచంద్రారెడ్డి (మాజీ ఎంపీ), సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

17:01 - August 12, 2015

హైదరాబాద్ : తమ సమస్యలు తీర్చాలని గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న ఆందోళనలు 43వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తుండడం పట్ల కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో బుధవారం చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు. ఇందిరాపార్కు వద్ద జరిగిన సభకు కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈసందర్భంగా సీఐటీయూ నేత సాయిబాబా టెన్ టివితో మాట్లాడారు. కొత్త తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కరిస్తారని, పర్మినెంట్ చేస్తారని, కనీస వేతనాలు ఇస్తారని కార్మికులు ఆశించారని తెలిపారు. కానీ ఆశలు నెరవేరలేదన్నారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరు సబబు కాదన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతుంటే ప్రభుత్వం పారిపోతోందాన్నరు. 

Don't Miss

Subscribe to RSS - Grama Panchayat