gujarat

08:36 - January 30, 2018

ఢిల్లీ : గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడులను నియంత్రించడంలో విఫలమయ్యాయని పేర్కొంటూ రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై సెప్టెంబర్‌ 3వ తేదీలోగా స్పందించాలని కోర్టు ఆదేశించింది. తుషార్ గాంధీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ పిటిషన్‌ ఆధారంగానే గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన గోరక్షణ పేరిట జరుగుతున్న దాడులను ఆపాలని... ప్రతిజిల్లా నోడల్‌ అధికారిని ఏర్పాటు చేయాలని 26 రాష్ట్రాలను కోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశించినప్పటికీ దాడులు కొనసాగుతున్నాయంటూ ఇటీవల జరిగిన ఏడు ఘటనలను పిటిషన్‌లో పేర్కొన్నారు. 

22:16 - January 7, 2018

హైదరాబాద్ : వ్యవసాయ ఉత్పత్తులపై రైతులకు ప్రభుత్వాల నుంచి అందుతున్న కనీస మద్ధతు ధరలపై అధ్యయనం చేయాలని మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, గుజరాత్ హర్యానా తదితర రాష్ట్రాలలో పర్యటించి.. విధివిధానాలు, అక్కడ అవలంబిస్తున్న పద్దతులు పరిశీలించాలన్నారు. ఈ నెల 13వ తేదిలోగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.

తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పనితీరుపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర రైతులకు మెరుగైన సేవలందించేందుకు మార్కెటింగ్‌ శాఖ అధికారుల బృందం.. మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, గుజరాత్ హర్యానా రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలన్నారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త విధానాలు ప్రవేశ పెట్టేందుకు వీలుగా ఈ నెల 13లోగా  అధికారుల బృందం నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. 

కూరగాయల విక్రయ కేంద్రాలను జీహెచ్ ఎంసీ సమీకృత మార్కెట్లతో పాటు అనువైన మెట్రో రైల్వే స్టేషన్లలోనూ త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. విక్రయ కేంద్రాలలో సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, బియ్యం అమ్మే రైతులను ప్రోత్సహించాలని మంత్రి ఆదేశించారు. మొత్తం 330 నాబార్డు గోదాముల్లో మిగతా 18 గోదాముల నిర్మాణం,  ఈఏడాది మార్చిలోగా ఎట్టి పరిస్తితులలోను పూర్తి చేయాలన్నారు. గోదాముల నిర్మాణాలు పూర్తయిన వెంటనే సంబంధిత మార్కెట్ కమిటీలకు అప్పగించాలని ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వ మోడల్ చట్టం ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా వ్యాపారస్థులు, కమిషన్ ఏజెంట్లకు కొత్తగా జారీ చేసే లైసెన్సుల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. బ్యాంక్ పూచికత్తు విషయంలో అవగాహన కల్పించి నూతన లైసెన్సులు జారీ చేయాలన్నారు. గ్రామపంచాయితీల్లో నిర్వహించే పశువుల మార్కెట్లలో ఏడాదికి కోట్ల ఆదాయం వస్తుంటే..మార్కెట్ కమిటీల్లో తక్కువ రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2018 మార్చిలోగా అన్ని పశువుల మార్కెట్లను ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీ చేయించాలని ఆదేశించారు. మార్కెట్ ఫీజ్ వసూలు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెటింగ్ శాఖలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.

14:42 - December 30, 2017

గుజరాత్ : కొత్తగా ఏర్పాటైన గుజరాత్‌ కాబినెట్‌లో అప్పుడే విభేదాలు పొడసూపాయి. మొన్నటివరకు మంత్రివర్గంలో నెంబర్‌ టూగా వెలుగొందిన డిప్యూటి సిఎం నితిన్‌ పటేల్‌కు కీలక శాఖలు దక్కకపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఆర్థిక శాఖ, పట్టాణాభివృద్ధి, పెట్రోలియం శాఖలు దక్కకపోవడంతో నితిన్‌ ఇంతవరకు బాధ్యతలు స్వీకరించలేదు. ఆర్థిక శాఖను సౌరభ్‌ పటేల్‌కు అప్పగించగా, పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖలను సీఎం రూపానీ తనవద్దే అట్టిపెట్టుకున్నారు. నితిన్‌ పటేల్‌కు రోడ్లు, భవనాలు, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, నర్మదా-కల్పసర్‌ ప్రాజెక్టు శాఖలను కేటాయించారు. దీన్ని అవమానంగా భావిస్తున్న నితిన్‌ పటేల్ అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు 48 గంటల అల్టిమేటం ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కాబినెట్‌లో కలహాల నేపథ్యంలో నితిన్‌ పటేల్‌ బిజెపిని వదిలి కాంగ్రెస్‌లో చేరాలని హార్దిక్‌ పటేల్‌ సలహా ఇచ్చారు.

12:01 - December 26, 2017

ఆహ్మదాబాద్ : గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం మరోసారి కొలువుతీరింది. ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానీ ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని సచివాలయం మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుజరాత్‌ గవర్నర్‌ ఓపీ కోహ్లీ... విజయ్‌ రూపానీతో ప్రామాణం చేయించారు. ఉపముఖ్యమంత్రిగా నితిన్‌ పటేల్‌ ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, పార్టీ అగ్రనేత అద్వానీ, మాజీ ముఖ్యమంత్రులు ఆనందీబెన్‌ పటేల్‌, కేశూభాయ్‌ పటేల్‌, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రూపానీ, నితిన్‌ పటేల్‌తోపాటు మరో 18 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఈ నెలలో రెండు విడదలుగా జరిగిన ఎన్నికల్లో 98 సీట్లతో బీజేపీ విజయం సాధించింది. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరడం వరుసగా ఇది ఆరోసారి. విజయ్‌ రూపానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి. 

21:51 - December 23, 2017

గుజరాత్ : అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రాహుల్‌ సోమ్‌నాథ్ ఆలయంలో శివుడికి పూజలు చేశారు. ఉదయం కేశోడ్ విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఆయన రోడ్డు మార్గం ద్వారా సోమ్‌నాథ్‌కు వెళ్లారు. రాహుల్ సోమనాథుడికి పట్టువస్ర్తాలను సమర్పించారు. గుజరాత్‌ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో రాహుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 79 స్థానాలు గెలుచుకోవడంతో రాహుల్‌ కార్యకర్తల్లో మానసిక స్థయిర్యాన్ని పెంపొందించేందుకు యత్నిస్తున్నారు. తన పర్యటనకు ముందు రాహుల్‌ బిజెపిని మళ్లీ టార్గెట్‌ చేశారు. బిజెపి అబద్ధాల పార్టీగా ట్వీట్‌ చేశారు.   

 

21:58 - December 19, 2017

ఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల్లో ప్రధాని మోదీ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై చేసిన విమర్శలు పార్లమెంట్‌ను కుదిపేశాయి. మన్మోహన్‌కు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. మన్మోహన్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యలను తప్పుబడుతూ కాంగ్రెస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసింది. 
వాడి వేడిగా ప్రారంభమైన సమావేశాలు  
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడవరోజు కూడా వాడి వేడిగా ప్రారంభమయ్యాయి. గుజరాత్‌ ఎన్నికల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోది చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభ అట్టుడుకింది. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్... దీనిపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్‌ డిమాండ్‌ను స్పీకర్‌ సుమిత్రా మహాజన్ తోసిపుచ్చారు. ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చించడం కుదరదని ఆమె స్పష్టం చేశారు. విపక్షాల గందరగోళం మధ్యే లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు.
కాంగ్రెస్‌ వాకౌట్‌ 
ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేసిన నేపథ్యంలో దీనిపై చర్చ అనవసరమని, సభను సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి అనంతకుమార్‌ కాంగ్రెస్‌ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై జీరో అవర్‌లో చర్చకు అనుమతించాలని కాంగ్రెస్‌ పట్టుబట్టింది. ఆ పార్టీ నేత మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పీకర్‌ అనుమతించక పోవడంతో సభ నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది. మరోవైపు లోక్‌సభలో ఆర్జేడి చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌కు జడ్‌ ప్లస్‌ భద్రతను తగ్గించడంపై ఆ పార్టీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లాలుకు ఏదైనా జరిగితే ప్రధాని మోది బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్జేడి హెచ్చరించింది. ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుపై చర్చించాలని టిఎంసి సభలో పట్టుబట్టింది.

 

20:54 - December 19, 2017

గెలవటమైతే గెలిచారు.. కానీ, గెలిచిన ఆనందం లేకుండా పోతున్న తరుణం.. మసకబారుతున్న ప్రభ.. వరుసగా తగ్గుతున్న సీట్లు..ఓట్ల శాతం.. క్రమంగా లైట్ తీసుకుంటున్న గుజరాత్ ప్రజలు.. గుజరాత్ మోడల్ అంటూ ఊదరగొడుతున్న మాటల్లో డొల్లతనం.. ఆఖరికి మతం, జాతీయత లాంటి ఎమోషనల్ ఎలిమెంట్స్ వాడితే తప్ప ప్రయోజనం సాధించలేనితనం.. ముగ్గురు యువకులను చూసి వణికిపోయిన పరిస్థితి. ఇవన్నీ చూస్తే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ .. గెలిచిందా? ఓడిందా అనే సందేహం రాకమానదు. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. 
బీజేపీది ప్రగల్భాలే.. 
బీజెపీది ప్రగల్భాలే తప్ప.. వాస్తవంలో అంత లేదని గణాంకాలు చెప్తున్నాయి. మరోపక్క యువరక్తం గుజరాత్ లో చూపిన దూకుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ మారుతున్న పరిణామాలను, రాజకీయాలను స్పష్టం చేస్తోంది.  గుజరాత్ ప్రజలు మత సామరస్యాన్ని, లౌకిక రాజకీయాలను కోరుతున్నారని ఇదే పాఠాన్ని అసెంబ్లీ ఎన్నికల ద్వారా నేర్పారని అర్ధమవుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:41 - December 19, 2017

ఆహ్మాదాబాద్ : గుజరాత్‌ ఎన్నికల్లో కొన్ని జిల్లాల ఓటర్లు బీజేపీకి షాక్ ఇచ్చారు.. నాలుగు జిల్లాల్లో బీజేపీకి గట్టి దెబ్బే తగిలింది. అక్కడ బీజేపీ ఖాతాకు తెరవలేని పరిస్థితి ఎదురైంది. అమ్రేలీ, నర్మద, డాంగ్స్, తాపి జిల్లాల్లో అధికార పార్టీ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. ఆనంద్‌ జిల్లాలో ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్‌పార్టీ ఐదు స్థానాలను దక్కించుకుంది. బీజేపీ కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది.పోరుబందర్‌ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ చెరొక్క స్థానం గెలుచుకున్నాయి.. ఏడు జిల్లాల్లో బీజేపీ , కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. బనస్కంత , కచ్, బతాద్‌, ద్వారకా, ఖేడా, మహిసాగర్, సంబర్కంత, జిల్లాల్లో రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అన్న రీతిలో స్థానాలు గెలిచాయి. వెయ్యిలోపు ఓట్లతో ఏడుగురు బీజేపీ అభ్యర్థులు గెలిచారు.

ప్రతి సారీ బీజేపీ సీట్లు కోల్పోతూనే
గుజరాత్‌ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రతి సారీ బీజేపీ సీట్లు కోల్పోతూనే వస్తోంది. గత నాలుగు ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లను పరిశీలిస్తే.. తడవతడవకూ తగ్గుతూ వచ్చాయి. 2002లో 182 అసెంబ్లీ స్థానాలకు గాను 127 సీట్లను దక్కించుకోగా.. 2007లో 117, 2012లో 115, 2017లో 99కి పడిపోతూ వచ్చాయి. ఈ సారి ఐతే మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువైంది. 2002లో కాంగ్రెస్‌ 51, 2007లో 59, 2012లో 61, 2017లో 80 స్థానాలు సాధించుకుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఓట్ల శాతం తగ్గుముఖం పట్టింది. 2014 పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి బీజేపీ ఓటు శాతం దిగజారింది. 2014లో గుజరాత్‌లో బీజేపీకి 59. 1 ఓట్లు రాగా.. 26 పార్లమెంట్ స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు లాక్కున్నాయి. ఈ ఎన్నికల్లో గుజరాత్‌లో 49. 1శాతం, హిమాచల్‌లో 48. 8 శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. గుజరాత్‌లో నాలుగు శాతం, హిమాచల్‌లో ఐదు శాతం ఓట్లు తగ్గిపోయాయి.

పటీదార్‌ అనామత్‌నేత హార్దిక్‌ పటేల్
ఈ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని ప్రతి తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌వల్లే గుజరాత్‌లో బీజేపీ గెలిచిందని పటీదార్‌ అనామత్‌నేత హార్దిక్‌ పటేల్ విమర్శించారు. సూరత్, రాజ్‌కోట్‌, అహ్మాదాబాద్‌, ప్రాంతాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని ఆయన ఆరోపించారు.. ఫలితాల వెల్లడికి ముందురోజు కూడా హార్దిక్‌ ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేశారు. డబ్బు పంపిణీ, ఏవీఎంలు హ్యాకింగ్‌ చేసి బీజేపీ గెలిచిందని దుయ్యబట్టారు.ప్రజాస్వామ్య దేశంలో ఓటు ఎవరికి వేశామో అది వారికే వెళ్ళిందా లేదా అన్నదానిపైన నా ఆందోళనంతా అని హార్దిక్‌ అన్నారు. బనాస్కాంత జిల్లా వాడ్గామ్‌ నియోజకవర్గం నుంచి దళిత ఉద్యమనేత జిగ్నేష్‌ మెవానీ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి విజయ్‌ కుమార్‌ హర్ఖా భాయ్‌ని 18,150 ఓట్లతో మట్టికరిపించారు. మెవానీకి కాంగ్రెస్, ఆప్‌ పార్టీ మద్ధతునివ్వగా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు.. విజయాన్ని అందించిన ప్రజలకు మెవానీ కృతజ్ఞతలు తెలిపారు. అసలు పోరాటం ఇప్పుడే మొదలైందని.. బీజేపీకి వ్యతిరేకంగా సర్వశక్తులూ ఒడ్డి పోరాడానని చెప్పారు. గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీది అనైతిక విజయమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. అక్రమాలకు పాల్పడిన బీజేపీ గెలిచినా ఓడినట్లేనని అంటున్నారు. ఢీ అంటే ఢీ అన్నరీతిలో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్‌ ఓడి గెలిచిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఏకపక్షంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తే 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఇంటికి పంపడం ఖాయన్న సంకేతాలను ఓటర్లు స్పష్టంగా తేల్చారు.

18:18 - December 18, 2017

ఢిల్లీ : ఎన్నికల్లో ఓడిపోయినా గుజరాత్ అభివృద్ధిపై ప్రశ్నిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. పాటీదారులు..రైతుల సమస్యలపై పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు పెద్దనేతలు ఓడిపోవడం బాధ కలిగినా ఆ పార్టీ నేతల వల్లే గుజరాత్ రాష్ట్రంలో పార్టీ శక్తివంతంగా ఎదిగిందన్నారు. గుజరాత్ రాష్ట్రానికి చెందని ఆరుగురు మంత్రులు ఓడిపోయారని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి మోడీ సొంతూరు బీజేపీ పరాజయం చెందిందని, గుజరాత్ లో బీజేపీ మెజార్టీ మూడంకెల నుండి రెండంకెలకు పడిపోయిందన్నారు.

 

16:57 - December 18, 2017

ఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఈవీఎంల టాంపరింగ్‌కు పాల్పడిందని పాటీదార్‌ సామాజిక ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ ఆరోపించారు. ఎవరికి అనుమానం రానివిధంగా టాంపరింగ్‌ జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి ఎలాంటి చాణక్య రణనీతి చూపలేదని...కేవలం డబ్బులు వెదజల్లి గెలుపొందిందని హార్దిక్‌ విమర్శించారు. బిజెపికి వ్యతిరేకంగా పాటీదార్‌ రిజర్వేషన్ల డిమాండ్‌తో పాటు రైతులు, నిరుద్యోగం తదితర సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - gujarat