Guntur

08:06 - February 21, 2018

గుంటూరు : రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైందని ఏపీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అన్యాయం చేసింది కదా.. బీజేపీ అయినా న్యాయం చేస్తుంది అనుకుంటే ఆ పార్టీ కూడా అలానే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిలోని ప్రజాదర్బారు హాల్లో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రంతో పోరాడుతూనే రాష్ట్రాభివృద్ధి కోసం కసిగా పనిచేయాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలకు ప్రతి విమర్శ పార్టీ అజెండా కాదని చంద్రబాబు అన్నారు. అవిశ్వాస తీర్మానానికి 54మంది మద్దతు కావాలన్న ఆయన... కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ స్పష్టంగా ఉన్నప్పుడు అవిశ్వాసం పెడితే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరతాయా అని ప్రశ్నించారు. అన్ని పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచితే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విభజన హామీల అమలు కోసం అఖిలపక్ష సమావేశం కాదు.. అఖిలసంఘాలతో సంప్రదింపులు జరుపుతానని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో రెండు పార్టీలే ఉన్నాయని.... అందులో ఓ పార్టీ అసెంబ్లీకి రావడం లేదని సీఎం అన్నారు. అందుకే అఖిలసంఘాలతో సంప్రదింపులు జరుపుతామన్నారు.

14వ ఆర్థిక సంఘం చెప్పిందని..
ప్రత్యేక హోదా ప్రయోజనాలను ఏ పేరుతో ఇచ్చినా అవన్నీ రాష్ట్రానికి దక్కించుకోవటమే టీడీపీ అజెండా అని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని.. అందుకే ప్యాకేజీకి ఒప్పుకున్నామని చంద్రబాబు చెప్పారు. హోదా.. ప్యాకేజీ ఏ పేరుతో ఇచ్చినా ఫర్వాలేదని.. హోదాలో ఉన్న ప్రయోజనాలు రాష్ట్రానికి దక్కాల్సిందేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండా అన్న ఆయన.... వైసీపీ రోజుకో మాట మాట్లాడుతోందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టగానే బాగుందని ముందుగా పొగిడింది వైసీపీనేనని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎక్కడా రాజీపడలేదన్నారు.

జగన్‌ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం
ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ను సృష్టించి జగన్‌ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి ఎలాగైనా న్యాయం జరగకూడదనే దుర్భుద్దితోనే జగన్ రాజీనామాల డ్రామా ఆడుతున్నారని ఆక్షేపించారు. అవి ఇచ్చాం.. ఇవి ఇచ్చాం అంటూ బీజేపీ కూడా ప్రకటనలు చేస్తోందని.. బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కావాల్సినవి అడగకుండా టీడీపీని ప్రశ్నించడమేమిటని చంద్రబాబు తప్పుబట్టారు. మూడేళ్లుగా కేంద్రం నుంచి అంతగా సాయం అందకపోయినా ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి సాధించామన్నారు. మనం కష్టపడుతున్నాం కదా అని సాయం చేయమని కేంద్రం భావిస్తే కుదరదని... మనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకూ పోరాడాల్సిందేనని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 

18:05 - February 15, 2018

గుంటూరు : ప్రభుత్వ ఆసపత్రిలో దారుణం జరిగింది. వైద్యులు సెల్ ఫోన్ వెలుగులో శస్త్ర చికిత్స చేశారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి కామినేని విచారణకు ఆదేశించారు. ఆయన డీఎంఈకి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరింతా సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:18 - February 15, 2018
18:47 - February 13, 2018

గుంటూరు : విలువలతో కూడిన విద్య సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అన్నారు. విద్యార్థులు కష్టపడికాకుండా.. ఇష్టపడి చదవాలన్నారు. అనుకున్నది సాధించనంత మాత్రానా ఎవరూ కుంగిపోకూడదని చెప్పారు. జీవితాన్ని ఎవరూ అర్ధాంతరంగా ముగించవద్దన్నారు. గుంటూరులోని శ్రీవైష్ణవి అభ్యాస్‌ విద్యాసంస్థల వార్షికోత్స వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోడెల.... విద్యార్థి భవిష్యత్‌కు ఇంటర్‌ విద్య ఎంతో కీలకమన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌...విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా చదవాలని సూచించారు. అనంతరం ఓ పాటపాడి అలరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

06:42 - February 13, 2018

హైదరాబాద్ : శివనామ స్మరణతో శైవక్షేత్రాలన్నీ మార్మోగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు.. అన్ని శైవక్షేత్రాలూ.. శివజాగరణకు సమాయత్తమయ్యాయి. ఉదయం నుంచే భక్తుల ఆలయాలకు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శైవక్షేత్రాలూ.. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, వేములవాడ తదితర ప్రసిద్ధ క్షేత్రాలన్నీ భక్తజన సందోహంగా మారాయి. శివభక్తులు పంచాక్షరీ మంత్రాలతో.. ఆయా క్షేత్రాలు మార్మోగి పోతున్నాయి.
కోటప్పకొండ...పశ్చిమగోదావరి..వేములవాడ తదితర జిల్లాల్లో శివరాత్రి ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే వీడియో చూడండి.

06:33 - February 13, 2018

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. శివనామ స్మరణతో శైవక్షేత్రాలన్నీ మార్మోగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు.. అన్ని శైవక్షేత్రాలూ.. శివజాగరణకు సమాయత్తమయ్యాయి. ఉదయం నుంచే భక్తుల ఆలయాలకు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శైవక్షేత్రాలూ.. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, వేములవాడ తదితర ప్రసిద్ధ క్షేత్రాలన్నీ భక్తజన సందోహంగా మారాయి. శివభక్తులు పంచాక్షరీ మంత్రాలతో.. ఆయా క్షేత్రాలు మార్మోగి పోతున్నాయి.

విష్ణు, బ్రహ్మల మధ్య తలెత్తిన ఆధిపత్య తగవును పరిష్కరించే క్రమంలో.. శివుడు లింగరూపంలో అవతరించాడన్నది భక్తుల విశ్వాసం. లింగోద్భవం జరిగిన మాఘ బహుళ చతుర్దశి రోజున.. మహాశివరాత్రి జరుపుకోవడం ఆనవాయితీ. భక్తులు, పగలంతా ఉపవసించి, రాత్రంతా జాగరణ చేసి.. శివధ్యానంలో మునిగితేలుతుంటారు.

శివుడి సన్నిధిలో జాగరణ చేయాలని ఎక్కువమంది భక్తులు భావిస్తారు. అందుకే.. ముఖ్యమైన శైవక్షేత్రాలకు తరలివెళుతుంటారు. ఈ నేపథ్యంలో చారిత్రిక, పౌరాణిక ప్రాధాన్యత ఉన్న ఆలయాలన్నీ శివభక్తుల కోసం సన్నద్ధమయ్యాయి. ఆలయాల నిర్వాహకులు కూడా భక్తులకు ఎలాంటి ఇక్కట్లూ రాకుండా అన్ని ఏర్పాట్లూ చేశారు. 

19:30 - February 11, 2018

గుంటూరు : అయేషా మీరా హత్య కేసును సిట్ పునర్ విచారిస్తోంది. అందులో భాగంగా సిట్ అధికారులు తెనాలికి వెళ్లారు. అక్కడ నివాసం ఉంటున్న అయేషా మీరా తల్లిదండ్రులను డీఐజీ శ్రీకాంత్ బృందం కలిసింది. సుమారు మూడు గంటల పాటు సిట్ అధికారులు పలు వివరాలు సేకరించారు. అనంతరం ఆయేషా మీరా తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. తమ కూతురి హత్యపై తొలి నుండి జరిగిన విషయాలన్నీ సిట్ అధికారులు అడిగి తెలుసుకున్నారని, హాస్టల్ వార్డెన్ ను విచారిస్తే చాలా విషయాలు తెలుస్తాయని అధికారులకు తెలియచేసినట్లు అయేషా తల్లి తెలిపారు. గతంలోలాగా అమాయకుడిని బలి చేయొద్దని వేడుకున్నట్లు, అధికారులకు నిబద్ధత ఉంటే తమకు న్యాయం చేస్తారన్నారు. గతంలో ఈ కేసులో సత్యంబాబుపై కేసు నమోదు చేయగా ఆయనపై వచ్చిన ఆరోపణలను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. 

07:56 - February 8, 2018

గుంటూరు : ఇవాళ రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు పిలుపునిచ్చాయి.  తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు లెఫ్ట్‌పార్టీల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విభజన చట్టంలో హామీలను నెరవేర్చకుండా కేంద్రం మెలికలు పెడుతోందని.. కమ్యూనిస్ట్‌పార్టీలు మండి పడుతున్నాయి. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ..  మోదీ స్కార్‌ నుంచి నిధులు రాబట్టడంలో విఫలం అయిందని లెఫ్ట్‌పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసరగా ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చాయి. అయితే అర్ధరాత్రి నుంచే ఎక్కడి కక్కడ వామపక్షాల నేతలను ముందుస్తుగా అరెస్టు చేస్తున్నారు. మరో వైపు వామపక్షాల బంద్‌కు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, వైసీపీ అధ్యక్షడు జగన్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏపీకి నష్టం చేకూర్చే విధంగా బడ్జెట్ ఉందన్నారు. బడ్జెట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మరిన్నివివరాలను వీడియోలో చూద్దాం.. 

 

09:36 - February 5, 2018

గుంటూరు : టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్న నిర్వహించారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వారు సుదీర్ఘంగా చర్చించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.  

08:25 - February 5, 2018

గుంటూరు: నర్సారావుపేటలోని నుదురుపాడు వద్ద కారులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. వెంటన అప్రమత్తమై కారులోంచి బయటకు దూకారు. దీంతో ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదు. బెంగళూరు నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Pages

Don't Miss

Subscribe to RSS - Guntur