harish rao

06:31 - February 15, 2018

హైదరాబాద్ : గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం గట్టిగా పోరాటం చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరగనున్న సమావేశానికి మంత్రి హరీష్‌రావు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం, తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏపీ చేసే ప్రతిపాదనలు ఎలా తిప్పి కొట్టాలనే అనే అంశాలపై జలసౌధలో ఇరిగేషన్‌ శాఖ అధికారులతో హరీష్‌రావు సుదీర్ఘంగా చర్చించారు. కృష్ణాలో తెలంగాణ వాటాగా 575 టీఎంసీల నీటి కేటాయింపునకు డిమాండ్‌ చేయాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ వల్ల కలిగే ముంపు సమస్యలపైనా సమీక్షించారు. 

15:10 - January 22, 2018

ఆదిలాబాద్‌ : జిల్లాలోని బాసర క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడుతోంది. వసంత పంచమి సందర్భంగా పలువురు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మావారిని దర్శించుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

17:45 - January 5, 2018

హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో కొంత ఊరట లభించింది. పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై 6 వారాల పాటు హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై మళ్లీ వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని డిసెంబర్‌లో కేంద్రం రద్దు చేసినట్లు ఆగస్టు 31 న హోంశాఖ తీర్పు ఇవ్వగా చెన్నమనేని రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. సంవత్సరం పాటు భారత్‌లో ఉండాలనే నిబంధనను రమేశ్‌ పాటించనందున పౌరసత్వం రద్దు చేస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. దీనిపై చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

17:38 - January 3, 2018

నిజామాబాద్ : జిల్లా రెంజల్‌ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకిన సంఘటన జరిగింది. ఏడో తరగతి చదువుతున్న శ్వేత క్రిస్మస్‌కు ఇంటికి వెళ్లి వచ్చినప్పటి నుంచి మళ్లీ ఇంటికి వెళ్తానని.. ఉపాధ్యాయులకు చెప్పింది. అయితే... సంక్రాంతి సెలవులకు పంపిస్తామని చెప్పారు. ఇంతలోనే శ్వేత మొదటి అంతస్తుపైకి వెళ్లి కిందకు దూకేసింది. వెంటనే శ్వేతను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో శ్వేత కాలుకు గాయమైంది. 

17:36 - January 3, 2018

పెద్దపల్లి : ఎస్‌ఆర్ఎస్పీ అధికారుల తీరు పై పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కార్యలయంలో సిఇ శంకర్‌తో తన నియోజక వర్గం పెద్దపల్లికి ఎందుకు కేటాయించిన నీటిని విడుదల చేయడం లేదంటూ ఆయన వాగ్వాదానికి దిగారు. నియోజక వర్గంలో రైతాంగం నీరందక పంట నష్ట పోతున్నారని మండిపడ్డారు. అధికారులు పోంతన లేని సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే అసహనానికి గురయ్యారు. తన నియోజక వర్గం పై ఎందుకు చిన్న చూపు చూస్తున్నరంటు అధికారులను ప్రశ్నించాడు. ఈ రోజు ఉదయం మంత్రి ఈటెల రాజేందర్‌, రసమయి బాల కిషన్‌లు హుజురాబాద్‌, మానకోండుర్‌ నియోజక వర్గాలకు లోయర్‌ మానేరు డ్యామ్ నుంచి కాకతీయ కెనాల్‌ ద్వార నీటిని విడుదల చేశారు. అవి వారి స్వంత నియోజక వర్గల కావడంతో.. పెద్దపల్లి ఎమ్మెల్యే నా నియోజకవర్గం పరిస్థితి ఏంటనే రీతిలో అధికారులతో గోడవకు దిగారు. మొత్తానికి అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య నీటి యుద్దం ఆరంభం అయినట్లు ఈ రోజు ఘటనలతో అర్థం అవుతుంది.

17:35 - January 3, 2018

నల్లగొండ : చెరువులు బోరు బావుల కింద సాగు చేస్తున్న రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నీటి సామర్థ్యం తగ్గిన మిర్యాలగూడ మండలం రుద్రారం చెరువును ఆయన పరిశీలించారు. ప్రభుత్వం 24గంటల కరెంట్‌ ఇవ్వడం మూలాన.. వాగులు వంకల పరిధిలో ఉన్నా రైతులు పెద్ద మొత్తంలో మోటార్లు బిగించి నీటిని తొడుకోవడంతో చెరువుల్లోకి సరిపడ నీరు రాక భూగర్భ జలాలు అడుగంటుతున్నాయన్నారు. చెరువులోకి నీరు చేరకపోవడంతో సాగు విషయంలో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగర్‌ కెనాల్‌ నీటితో మొదటగా పైన ఉన్నా చెరువులు నింపి అ నీటిని రుద్రారం చెరువుకు మళ్లించాలని జూలకంటి డిమాండ్‌ చేశారు.

17:34 - January 3, 2018

కరీంనగర్ : లోయర్‌ మానేరు డ్యామ్‌ చివరి ఆయకట్టు రైతాంగానికి సాగునీరిచ్చి ఆదుకుంటామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ లోయర్‌ మానేరు డ్యామ్ నుంచి కాకతీయ కాలువకు ఆయన ఎంపి వినోద్‌ కుమార్‌తో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా జలాశయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దిగువకు నీటిని విడుదల చేశారు. ఆన్‌ ఆఫ్‌ సిస్టమ్‌ ద్వారా వారం రోజుల పాటు హుజురాబాద్‌, మానకోండుర్‌, వరంగల్ రైతంగానికి సాగు నీరందించనున్నట్టు తెలిపారు. పరస్పర సహకారం..సమన్వయంతో నీటిని వాడుకోవాలని రైతులకు ఆయన సూచించారు.

17:33 - January 3, 2018

వరంగల్ : విద్యావ్యవస్థను బలపర్చడం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని.. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని.. కస్తూర్భాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్ధినులకు ఆరోగ్య పరిశుభ్రతా కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థినులు ఆరోగ్యంగా ఉండటానికి 15 కోట్ల రూపాయలతో హెల్త్&కాస్మొటిక్ కిట్లను ఇస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి 3 నెలలకోసారి బాలికలకు సరిపడా కాస్ట్యూమ్‌ కిట్లను ప్రభుత్వం తరపున అందిస్తామని కడియం శ్రీహరి తెలిపారు.

17:32 - January 3, 2018

హైదరాబాద్ : నగరంలో జీహెచ్‌ఎంసీ సమగ్ర రోడ్డు అభివృద్ధి పథకంలో మొదటి అండర్‌ పాస్‌ను ఈ రోజు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 25వేల కోట్లతో సిటీలోని 50జంక్షన్‌లలో స్కైవేలు, ఫ్లై ఓవర్‌లు, గ్రేడ్‌ సపరేటర్లు నిర్మించాలని ప్లాన్‌ చేసింది బల్దియా. మొదటి దశలో మూడు వేల కోట్లతో పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభం కాగా మాదాపూర్‌-శిల్పారామం భూగర్భ మార్గంలో రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. సిటీలో ట్రాఫిక్‌ కష్టాలను అధిగమించేందుకు ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో వేగం పెంచుతామంటున్న జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు.

21:35 - December 1, 2017

హైదరాబాద్ : ఇప్పటి వరకూ కోటి 35 లక్షల భూ రికార్డులను ప్రక్షాళన చేశామని సీఎస్‌ ఎస్పీ సింగ్‌ చెప్పారు. 91 శాతం క్లియర్‌ చేశామని... మిగతావి అసైన్డ్‌, కోర్టు వివాదాల్లో ఉన్నాయని చెప్పారు. రెవెన్యూ అధికారులతో సీఎస్‌ భేటి అయి.. భూ సమగ్ర సర్వేపై చర్చించారు. ఈ డిసెంబర్‌లో మొత్తం పూర్తి చేస్తామని సీఎస్‌ చెప్పారు. జనవరి 1 నాటికి పాస్ పుస్తకాలు పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ఈ బేటీలో రెవెన్యూ అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎస్‌కి వివరించారు.  

Pages

Don't Miss

Subscribe to RSS - harish rao