health

15:23 - January 23, 2018
20:47 - October 8, 2017

ముంబై : మహారాష్ట్రలోని యావత్మాల్‌ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. నెలరోజుల వ్యవధిలో 20 మంది రైతులు మృతిచెందారు. 700 మంది ఆస్పత్రిపాలయ్యారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన క్రిమిసంహారక మందులు చల్లే యంత్రాల వినియోగం రైతులకు అర్థంకాలేదు. దీంతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వాటిని వినియోగించారు. దీంతో వందలాది రైతులు క్రిమిసంహారకాల ప్రభావానికి గురయ్యారు. నెల రోజుల వ్యవధిలోనే 20 మంది రైతులు చనిపోయారు. 700 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో 25మంది కంటిచూపు కోల్పోయారు. క్రిమిసంహారక ముందులు చల్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకపోవడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మందులు చల్లే పరికరాల్లో కొత్త మోడళ్లు రావడం.. వాటిపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం కూడా ఓ కారణమేనని నిపుణులు చెబుతున్నారు.

12:38 - September 22, 2017

ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు పెద్దలు...అసలు టైం దొరకడం లేదు..ఇంకా ఆరోగ్యంపై శ్రద్ధా అని కొందరు పెదవివిరుస్తుంటారు. కానీ ఎన్ని పనులున్నా కొద్దిసేపైనా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తుంటారు. కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడిన సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ సమస్యలు తీరే అవకాశం ఉంది.

వాంతులు అదే పనిగా అవుతుంటే దానిమ్మ గింజలను చప్పరించి చూడండి. స్థూలకాయం ఎంతకు తక్కువ కాకపోతే..పది గ్రాముల మిరియాలు..అంతే చొప్పున శొంఠి..నాలుగు కట్టల పుదీనా తీసుకుని వీటన్నింటినీ మెత్తగా నూరుకోవాలి. చిన్న సైజు ట్యాబెట్ల ఆకారంలో చేసుకని ఎండలో ఆరబెట్టాలి. ఎండిన తరువాత రోజుకు ట్యాబెట్లు తీసుకుని చూడండి. రక్తహీనతో బాధ పడుతున్న వారు మూడు నెలల పాటు క్రమం తప్పకుండా మెంతికూర తినాలి. కీళ్ల నొప్పులున్న వారు ఉసిరికాయ రసంలో కొద్దిగా చక్కెర వేసి కొద్ది కొద్దిగా రెండు పూజటలు తీసుకుని చూడండి. ఇలాంటి కొన్ని చిట్కాలు పాటిస్తే మేలు. 

19:44 - August 31, 2017
13:35 - August 30, 2017

హైపర్ టెన్షన్...చెప్పాలంటే బీపీ.. ఈ బీపీతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఇందుకు పెద్దగా భయపడాల్సినవసరం లేదని.. చిట్కాలు పాటిస్తే సరిపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు.

ధ్యానం..శ్వాసక్రియను క్రమబద్ధం చేసి చూడండి. ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు.

కాఫీ అలవాటు ఉన్న వారు ఎక్కువ సార్లు తీసుకోకండి. ఒక కప్పుకు మించకుండా కాఫీ తాగే అలవాటు చేసుకోండి

నువ్వుల నూనె వంటల్లో వాడటం అలవాటు చేసుకోండి. ఈ నూనె వాడిన వారిలో బీపీ తగ్గినట్లు పరిశోధనల్లో వెల్లడైనట్లు తెలుస్తోంది.

చేపలు అధికంగా తీసుకోండి. చేపల్లో ఉండే మాంసకృత్తులు, ఒమేగా-3, ఫ్యాటీ ఆమ్లాలు రక్తనాళాలను చక్కగా వ్యాకోచింపచేస్తాయి.

ఇక పొగతాగే వారిలో రక్తపోటు అధికంగా పెరుగుతుందనే విషయం తెలిసిందే. ఈ అలవాటును తగ్గించుకుంటూ మానేసే విధంగా ప్రయత్నించండి. 

13:26 - August 26, 2017

విజయవాడ : కేంద్రం పేల్చిన జీఎస్టీ బాంబు..పేద, మధ్య తరగతి వర్గాలను అతలాకుతలం చేస్తోంది. అత్తెసరు జీతాలు, పూటగడవని దుస్థితిలో జీవితాలు నెట్టుకొస్తున్న బడుగుజీవులపై జీఎస్టీ గుదిబండగా మారుతోంది. నిత్యావసరాలపైనే కాకుండా వైద్య సేవలు, మందులపై జీఎస్టీ విధించడంతో...వారి పరిస్థితి మూలిగే నక్కమీద రోకలి పోటు చందంగా మారింది.

మందులపై 5 నుంచి 28 శాతం
ఔషధాలపై జిఎస్టీ విధించడంతో..సామాన్య రోగుల పరిస్థితి వర్ణానతీతంగా మారింది. మందులకు సంబంధించి నాలుగు రకాలుగా జీఎస్టీని అమలు చేస్తోంది కేంద్రం. ఆయా మందులపై 5 నుంచి 28 శాతం వసూలు చేస్తోంది. ప్రధానమైన మందులపై 28 శాతం పన్ను విధిస్తుండటంతో..పేద వర్గాలు మందులు కొనలేక, మంచంపైనే యాతన పడుతున్నారు. దీర్ఘకాలిక జబ్బులైన క్యాన్సర్, ఎయిడ్స్, టీబి, సుగర్, బిపి తదితర జబ్బులతో పాటు, అత్యవసర మందులపై 28 శాతం జీఎస్టీ భారం పడుతోంది. ఇవే కాక ల్యాబ్‌ కిట్లు, రక్త పరీక్షలు, వైద్య పరికరాలు జిఎస్టీ పరిధిలోకి రావడం...సామాన్య రోగులకు పెనుభారంగా మారిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలిక మందులు వాడుతున్న రోగులు..మధ్యలో వాటిని ఆపేస్తే వ్యాధి నిరోధకత తగ్గి కొత్త జబ్బులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

జీఎస్టీని మినహాయించాలి
మరోవైపు వైద్యరంగంపై జిఎస్టీని మినహాయించాలని ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యాలు కోరుతున్నాయి. జీఎస్టీ అమలుతో ఆసుపత్రుల నిర్వాహణ భారం మరింత పెరిగిపోయిందని వాపోతున్నారు. జీఎస్టీ బాదుడుతో ఆస్పత్రులు చెల్లించే పన్నులు

రోగుల నుంచే వసూలు చేయడంతో వారిపై అధిక భారం పడుతుందని చెబుతున్నారు. ఆమ్‌ ఆద్మీ సర్కార్‌గా చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం.. పేద రోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైద్యరంగంపై జీఎస్టీని తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 

11:25 - July 20, 2017

కాకరకాయ జాతికి చెందినదే ఆకాకరకాయ. దీనిని అడవి కాకరకాయ, లేదా బోడ కాకరకాలు అంటారు. కాకరకాయల మాదిరిగా పొడుగ్గా కాకుండా రౌండ్ గా ఉండి..చిన్న చిన్న బొడిపలుంటాయి. అయితే దీని ఖరీదు కాస్త ఎక్కువనే చెప్పాలి. ఇవి సెప్టెబంర్ మాసంలో ఎక్కువగా దొరకుతాయి. ఈ సీజన్ లో మాత్రం కేజీ 80 రూపాయలు దొరికే అవకాశం ఉంటుంది.

ఆ కాకరకాయను ఆహారంలో తీసుకోవం వలన మధుమేహం , గుండె జబ్బులతో పాటు అధిక బరువు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు అని చెబుతుంటారు.

ఆకాకరకాయలో చాలా తక్కువ సంఖ్యలో కేలరీస్ ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు తోడ్పడతాయి. ఇది శరీరంలో ఏర్పడ్డ వ్యర్థాలను బయటకు పంపడంతో పాటు మలబద్ధక సమస్యను తగ్గిస్తాయి.

మధుమేహంతో బాధపడేవారి పాలిట ఆకాకరకాయ గొప్పవరం. ఎందుకంటే ఇది రక్తంలోని చక్కెరస్థాయిలను తగ్గించే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు తరచుగా దీనిని ఆహారంలో తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.

దీనిలో ఉండే యాంటీ కేన్సర్ గుణాలు శరీరంలోని కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా నివారిస్తాయి. శరీరంలో ఏర్పడ్డ కణితులను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. శరీరంలోని ఇన్ ఫెక్షన్లతో పోరాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యానిస్తాయి. ఇందులో ఉంటే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

ఇందులో ఉండే పొలేట్ అనే పోషకాలు శరీరంలో కొత్త కణాల వృద్ధికి మరియు గర్బస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పతుంది. అందువల్ల గర్భంతో ఉన్న మహిళలు ఆకాకరకా ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఇందులో ఉండే ఫూటో న్యూట్రియంట్లు కాలేయం, కండడరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి.

మూత్రపిండాల సమస్యలున్న వారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచింది. ఆకాకరకాయ గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

16:00 - June 29, 2017

వానాకాలం వచ్చేసింది. వానాకాలంతో పాటు అంటురోగాలు కూడా వచ్చేస్తుంటాయి. వైరల్ ఫీవర్..ఎలర్జీలు ఈ కాలంలోనే అధికంగా వస్తుంటాయి. మరి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈకాలంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగడం మేలు. అల్లం..లెమన్..హెర్బల్ టీలను తాగడం మంచిది. ఆకుకూరలు..ఎలాంటి కూరగాయాలైనా శుభ్రంగా కడుక్కొని వాడడం బాగుంటుంది. ఉప్పు నీళ్లతో కూరగాయాలను కడగడం శ్రేయస్కరం. పండ్లు, జ్యూసులు తాగేటప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం. ఉడికించిన కూరగాయాలు..తాజా పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం. త్వరగా జీర్ణమయ్యే సూపులు..ఇతరత్రా ఆహార పదార్థాలను భుజించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. దోమలు, ఈగల నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేపాకు, కర్పూరం, లవంగాలను ఇంటి మూలల్లో ఉంచడం వల్ల ఈ సమస్య నుండి దూరం కావచ్చు. అనారోగ్యాలు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి ఆయన సూచనలు..జాగ్రత్తలు పాటించాలి.  

15:58 - June 29, 2017

కాకరకాయ..కూరగాయాల్లో ఒక రకం. దీనితో వంటలతో పాటు అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేగాకుండా మంచి ఔషధం కూడా పనిచేస్తుంది. కరివేపాకును పొడి చేసుకోవాలి..అలాగే కాకరకాయను పేస్ట్‌గా చేసుకుని ఈ రెండూ మిశ్రమాలను కలుపుకుని చర్మంపై రాసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే దురద తగ్గిపోతుంది. కాకరకాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మొటిమలను నివారిస్తుంది. కాకరకాయను మెత్తగా పేస్టు చేసుకోవాలి. అనంతరం ఈ పేస్టుకు జాజికాయ పొడి..ఒక స్పూన్ పెరుగు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు ఒకసారి చేయడం వల్ల మొటిమలు, మచ్చలు పోతాయి. అంతేగాకుండా ప్రకాశవంతమైన చర్మం వస్తుంది. 

11:57 - June 27, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని ఏజెన్సీలో విషజ్వరాల మరణమృదం మోగుతోంది. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని వై. రామవరం మండలం చాపరాయిలో విషజ్వరాలతో నెల రోజుల వ్యవధిలో 16 మంది మృత్యువాత పడ్డారు. కలుషితనీరు, ఆహారం, పారిశుధ్యలోపం  ఇందుకు కారణమని చెబుతున్నారు. మన్యంలో ప్రాణనష్టం జరిగిన తర్వాత ప్రభుత్వం హడావుడి చేస్తోంది. అధికారులు, మంత్రులు ఒక్కసారిగా చాపరాయి వైపు పరుగులు తీస్తున్నారు. బాధితులను పరామర్శిస్తూ, ఓదారుస్తున్నారు. రక్షిత మంచినీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యమే చాపరాయి మరణాలకు కారణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం విషజ్వరాలతోనే మరణాలు సంభవించాయని చెబుతోంది. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - health