Health Benefits

12:16 - April 23, 2017

నిమ్మరసం..ఇందులో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు..యాంటీ బాక్టీరియల్..యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీంరలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ 'సి' లభ్యం కావడం వల్ల చర్మం..దంత సమస్యలు తగ్గుతాయి. నీటిలో నిమ్మరసం కలుపుకుంటే అనారోగ్య సమస్యలు ఏర్పడవని పేర్కొంటున్నారు.

 • నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు తెల్లగా..ధృడంగా మారుతాయి. చిగుళ్ల నొప్పి కూడా తగ్గుతుంది.
 • జీర్ణ సంబంధ వ్యాధులు ఉంటే అవి తగ్గుముఖం పడుతాయి. గ్యాస్..అజీర్ణం..మలబద్ధకం..అసిడిటీ సమస్యలు దూరమౌతాయి.
 • వేసవి కాలంలో ఎదురయ్యే డీ హైడ్రేషన్ నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరం చల్లగా ఉంటుంది.
 • దగ్గు..జలుబు వంటి శ్వాస కోశ వ్యాధులు నమమౌతాయి.
 • చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధికంగా బరువు ఉంటే తగ్గే అవకాశం ఉంది.
 • డయాబెటీస్ ఉన్న వారికి నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.
 • డిప్రెషన్..ఆందోళన..ఒత్తిడి వంటివి తగ్గుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
11:22 - April 21, 2017

ఎండకాలం అనగానే చెమట సమస్య ఏర్పడుతుంది. కొంతమంది ఈ సమస్య నుండి బయట పడాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరికీ చెమటతో పాటు శరీరం మొత్తం దుర్వాసన కూడా వస్తుంటుంది. మరి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి ? కొన్ని చిట్కాలు..

 • ద్రాక్ష పండ్లు తినాలి. నిత్యం తగినంత మోతాదులో కొన్ని ద్రాక్ష పండ్లను తిన్నా అధిక చెమట సమస్య తగ్గిపోతుంది.
 • రెండు టీ స్పూన్ల వెనిగర్, ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు భోజనానికి ఒక గంట ముందు తాగాలి.
 • టీ ట్రీ ఆయిల్ ను కొద్దిగా తీసుకుని చెమట వచ్చే ప్రదేశాల్లో రాయాలి.
 • ఒక టేబుల్ స్పూన్ ఉప్పు..నిమ్మ రసాలను బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీర భాగాలపై రాసుకుంటే చెమట సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది.
13:31 - April 18, 2017

పెరుగు..ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలంలో చాలా ఉపయోగకరం. పెరుగును అందంగా కూడా ఉపయోగించుకోవచ్చు.
మజ్జిగలో పలుచటి బట్టను ముంచి ఆ బట్టను ముఖం మీద వేసుకోవాలి. ఇలా పది నిమిషాలకి నాలుగైదు సార్లు చేయాలి. అనంతరం శుభ్రమైన పొడిబట్టతో తుడుచుకోవాలి. తరువాత గోరువెచ్చటి నీళ్లలో బట్టను ముంచి తుడుచుకోవాలి. ఇలా రాత్రి పడుకునే ముందు చేస్తే చర్మం బాగుంటుంది.
మెటిమలు ఎక్కువగా ఉన్నవారుర పెరుగులో శనగపిండిని కలపాలి. ఈ ముద్దను ముఖానికి రాసుకుని ఆరిన తరువాత నీళ్లతో కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి.
ముల్లంగి రసంలో మజ్జిగ కలిపి పట్టించి గంటసేపటి అనంతరం కడుక్కోవాలి.
బాదం నూనె, ఒక స్పూన్ మజ్జిగ కలిపి ముఖానికి..మెడకు..శరీరానికి స్నానం చేసే ముందు పట్టించాలి. అరగంట అనంతరం బట్టతో తుడుచుకుని స్నానం చేయాలి. తలకు పెరుగును బాగా పట్టించి మర్దన చేసి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గే అవకాశం ఉంది.

21:20 - April 12, 2017
09:06 - April 9, 2017

ఆహారంలో అల్లం..దాల్చినలు ఉపయోగిస్తుంటారు. ఇవి ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కొంతమంది వీటిని అంతగా ఉపయోగించారు. మరి అల్లం..దాల్చినలతో ఎలాంటి ఉపయోగాలున్నాయో చదవండి...
దాల్చిన చెక్కలో శక్తివంతమైన పోషకాలున్నాయి. మెదడు పనితీరును చురుగ్గా మారుస్తుంది. దాల్చిన చెక్క పొడి చేసుకుంటే ఆరు నెలల పాటు ఉంటుంది. మామాలు టీలోనూ కొద్దిగా కలుపుకుంటే ఆరోగ్యానికి మేలు. దీనిని తరచూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వాపూ..మంట..అలెర్జీతో పాటు ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది.
అల్లం తీసుకోవడం వల్ల జలుబు..అలర్జీల వంటివి తగ్గుతాయి. హృదయానికి రక్త ప్రసరణ సక్రమంగా అందుతుంది. నెలసరి సమయంలో కడుపునొప్పితో బాధ పడుతున్న వారు కప్పు అల్లం చారులో చెంచా తేనె వేసి తాగితే ఫలితం ఉంటుంది. జీర్ణాశయానాఇ్న శుభ్రం చేసి అరుగుదల పెంచుతుంది. శాస్వకోశ సంబంధ సమస్యలున్న వారు అల్లంచారు తీసుకుంటే మంచిది.

13:56 - April 3, 2017

చిట్టి రాగులు తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. క్యాల్షియం..ఐరన్ వంటి పోషకాలు ఇందులో దండిగా లభిస్తాయి. మధుమేహులకు..పూబకాయలకు రాగులు మంచిగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. శరీరానికి అవసరమైన ట్రిప్టోథాన్, వాలైన్, మెధియోనైన్, ఐసోల్యూసిస్, ధ్రియోనైన్ వంటి ఆమైనా ఆమ్లాలు కూడా ఉంటాయి.

 • మధుమేహం నియంత్రణకు రాగుల్లోని ఫైటో కెమికల్స్ జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. రక్తంలో గ్లూకోజు స్థాయిలు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడుతాయి.
 • కొలెస్ట్రాల్ తగ్గేందుకు, కొవ్వును నిర్మూలిస్తుంది. థ్రియోనైన్ అమైనో ఆమ్లమైతే కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా చూస్తుంది.
 • రాగుల్లోని ఐరన్ రక్తహీనత తగ్గడానికి దోహదం చేస్తుంది.
 • క్యాల్షియం దండిగా ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి.
 • అధిక బరువు తగ్గడానికి రాగుల్లోనిక ట్రిప్టోధాన్ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది.
 • ట్రిప్టోధాన్ అమైనో ఆమ్లం శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి వంటి సమస్యల నివారణకు చక్కగా ఉపయోగపడుతుంది.
 • వయస్సుతో పాటు వచ్చే సమస్యలు...త్వరగా వృద్ధాప్యం రాకుండా చూసుకోవచ్చు.
13:51 - April 3, 2017

క్యాల్షియం..ఇది ఎముకలు..దంతాలు పటుత్వంగా ఉండటానికి ఉపయోగ పడుతుంది. రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల క్యాల్షియం తీసుకోవడం అవసరమని వైద్యులు చెబుతుంటారు. ప్రధానంగా పాలు, పాల పదార్థాల నుండి లభిస్తుందనే సంగతి తెలిసిందే. ఇవి ఇష్టం లేని వారు ఏం చేయాలి ? ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకుంటే సరిపోతుంది. అవేంటో చూద్దామా..

 • బెండకాయ : బెండకాయలను ఒక కప్పు తీసుకోవడం వల్ల 82 మి.గ్రాముల క్యాల్షియం అందుతుంది. వీటిల్లో విటమిన్ బీ6, ఫోలైట్ వంటివి కూడా ఉంటాయి.
 • సారడైన్ చేపలు : మెదడు, నాడీ వ్యవస్థల ఆరోగ్యానికి కీలకమైన విటమిన్ బీ 12 అందిస్తుంది. క్యాల్షియం ఎముకల్లోకి ప్రవేశించడానికి విటమిన్ డి సైతం వీటిల్లో ఉంటుంది.
 • నారింజ : రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఒక పెద్ద నారింజ పండు తీసుకుంటే 74 మి.గ్రా. క్యాల్షియం అందుతుంది.
 • అంజీర : ఎండిన అంజీర పండ్లను అరకప్ర్పు తీసుకుంటే 121 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. పోటాషియం, పీచు లభిస్తుంది. మెగ్నీషియమూ వీటితో లభిస్తుంది.
13:47 - March 22, 2017

ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకు ఏదో ఒక పనిలో బిజీ బిజీగా గడుపుతూ ఉండేస్తుంటాం. ముఖ్యంగా మహిళలు ఇంటి పని..బయటపనితో ఉక్కిరిబిక్కిరవుతుంటారు. పనుల విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే పని తొందరగా అయిపోతుంది. వంటింట్లో సామాగ్రీ విషయంలో కొన్ని చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలు..మీ కోసం...

 • వంటింట్లో నూనె ఒలికిపోయిందా ? వెంటనే ఆ ప్రాంతంలతో మైదా పిండి చల్లాలి.
 • క్యాబేజీ ఉడికించే సమయంలో వాసన వస్తోందా ? వాసన పోవాలంటే చిన్న అల్లం ముక్క వేసి చూడండి.
 • కత్తిపీటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది.
 • ఇంగువ నిల్వ చేసే డబ్బాలో ఒక పచ్చిమిరపకాయ వేయడం వల్ల తాజాగా ఉంటుంది.
 • గుడ్లు ఉడకబెట్టేటపుడు కొంచెం ఉప్పువేసి ఉడకనిస్తే పెంకులు త్వరగా ఊడిపోతాయి.
 • వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ఒక స్పూను పాలు వేసి చూడండి.
 • కిచెన్ ను ఎంత కడిగినా ఈగలు పోకపోతే పసుపు నీటితో శుభ్రం చేసి చూడండి.
 • పకోడీలు వేసేటపుడు పిండిలో కొంచెం సోడా కలిపితే లావుగా అవుతాకయి.
 • పట్టుచీరలు ఉతికేటప్పుడు బకెట్‌లో కొంచెం నిమ్మరసం వేయడంవల్ల రంగు పోవు.
12:21 - March 14, 2017

ఎండకాలం వచ్చేసింది. చాలా మంది ఈ కాలంలో డీ హైడ్రేషన్ బాధ పడుతుంటారు. దీని నుండి తప్పించుకోవాలంటే 'కీర' తీసుకోవడం మేలు. ఎందుకంటే ఇది దాహం తీరుస్తుంది. కీరదోసలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో తేమ శాతం పెరిగి వేడి తగ్గుతుంది. కీరదోస రసంలో పోటాషియా, మెగ్నీషియం, సోడియం ఎక్కువగా ఉంటాయి. కీరను తినడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఎముకలని ధృడంగా ఉంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యర్థాలను బయటకు పంపే శక్తి ఉంది. ఖనిజ లవణాలు ఉదర సంబంధిత వ్యాధులతో కీర పోరాడుతుంది. అజీర్తి లేకుండా చేయడం..శరీరంలో కొత్త కణాల వృద్ధికి తోడ్పడుతాయి. బరువు తగ్గాలనుకొనే వారు ఉదయం అల్పాహారంతో పాటు కొన్ని కీరదోస ముక్కల్ని తీసుకుంటే తక్కువ కెలొరీలు ఎక్కువ శక్తి అందుతాయి. 

14:57 - March 12, 2017

మిరియాలు..అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఇంగువ వంటి వాటిని ఆహార పదార్థాల తయారీలో తప్పనిసరిగా ఉపయోగించాలి. వీటిని తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్ వంటి ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు.
గ్లాసు గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకోని తాగడం వల్ల జలుబు, గొంతునొప్పి వంటి రాకుండా ఉంటాయి.
క్రమం తప్పకుండా నూనెతో శరీరాన్ని మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
ఫైబర్ తో పాటు పోషకాలు అధికంగా లభించే పాలకూర, మెంతికూర, అరటికాయ, సోరకాయ వంటి వాటిని తీసుకోవడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి దోహద పడుతాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - Health Benefits