health tips

13:22 - May 22, 2017

జీలకర్ర..వంటల్లో వాడుతుంటారు..పోపు పెట్టే సమయంలో ఆవాలతో పాటు జీలకర్రను ఉపయోగిస్తుంటారు. రుచిని..వాసన అందించే ఈ జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్రతో తయారు చేసిన నీటిని ఉదయాన్నే సేవించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. పరగడుపున తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. పాత్రలో గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి మరికొంత సేపు మరిగించాలి. అనంతరం ఈ నీటిని వడగట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఉదయాన్నే పరగడుపున తాగేయాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. జీర్ణక్రియ ప్రక్రియ మెరుగవుతుంది. కడుపులో ఉన్న పరుగులు చనిపోతాయి. డయాబెటిక్ పేషెంట్లకు జీలకర్ర నీరు మంచి ఔషధం. రోజు తాగితే రక్తంలోని షుగర్ స్థాయిలు తగ్గుతాయి. ఆకలి సరిగ్గా లేని వారు ఈ నీటిని తాగే ఫలితం ఉంటుంది.

09:23 - May 22, 2017

సౌందర్యాన్ని ఇనుమడింప చేసుకోవాలని పలువురు మహిళలు బ్యూటీషియన్లను ఆశ్రయిస్తుంటారు. పలు మాస్క్ లు వేసుకుని అందాన్ని ద్విగుణీకృతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. పండ్లు..కూరగాయాలతో మాస్క్ లు తయారు చేస్తుండడం తెలిసిందే. పచ్చి కొబ్బరితో కూడా మాస్క్ లు తయారు చేస్తుంటారు. ఈ మాస్క్ ను వేసుకోవడం ద్వారా చర్మం మృదువుగా..తాజాగా కనిపిస్తుంది.
ఎండకాలంలో వేడిమి నుండి తప్పించుకోవడానికి కొబ్బరి మాస్క్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. పచ్చి కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముఖానికి పది నిమిషాలు పట్టించిన అనంతరం కడుక్కోవాలి.
ఒక కప్పు కొబ్బరి నీళ్లలో ఒక చెంచా కొబ్బరి పాలు, దోసకాయ జ్యూస్, రెండు లేదా మూడు చుక్కల కలబంద రసంతో ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి కాటన్ క్లాత్ తో ముఖానికి పెట్టుకోవాలి. పది నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి.
టమాట గుజ్జులో రెండు చెంచాల కొబ్బరి పాలు..సగం కప్పు కొబ్బరి నూనెను వేసి బాగా కలుపుకోవాలి. ముఖానికి..మెడకు పది నిమిషాలు పట్టించిన అనంతరం చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఫలితం కనబడుతుంది. ట్రై చేసి చూడండి.

08:45 - May 22, 2017

అధిక బరువుతో చాలా మంది బాధ పడుతుంటారు. బరువు తగ్గడం కోసం వ్యాయామాలు..హెల్త్ ఇనిస్టిట్యూట్స్ దగ్గరకు పరుగెడుతుంటారు. కానీ తినే ఆహారంలో మార్పులు చేసుకోరు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే కాకుండా కొన్ని రకాల పండ్లు తింటే బరువు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

క్యారెట్ : బీటా కెరోటిన్స్..ఫైబర్ లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోకి ఫ్రీ రాడికల్స్ ను విడుదల చేస్తాయి.
పాలకూర : ఇందులో న్యూట్రిన్లు సమృద్ధిగా లభిస్తాయనే సంగతి తెలిసిందే. విటమిన్స్..ఐరన్ లు పుష్కలంగా లభిస్తుండడంతో శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.
ఆపిల్ : ఈ పండును రోజు తీసుకుంటే వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సినవసరం ఉండదు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
స్టాబెర్రీ : ఎక్కువ శాతం న్యూట్రీన్లు ఉంటాయి. మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.
క్యాప్సికం : విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీర బరువును అదుపులో ఉంచుతుంది. ఇది వ్యాధి నిరోధకతను పెంచడంతో పాటు శరీర బరువును అదుపులో ఉంచుతుంది.

15:06 - May 19, 2017

పలు రకాల కూరగాయల్లో వివిధ పోషకాలు లభ్యమౌతుంటాయన్న సంగతి తెలిసిందే. అందులో బీన్స్ కూడా ఒకటి. బీన్స్ తినడం ఎంతో మంచిదని..ఎముకలు ధృడంగా ఉండేందుకు దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. బీన్స్ లో విటమిన్ బీ 6, థయామిన్‌, విటమిన్‌ సి లభిస్తాయి. దీనితో బీన్స్ తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎముకలకు బలం చేకూరుతుంది. రక్త ప్రసరణను మెరుగు పరుసాతయి..మధుమేహం దరిచేరదు..రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది..జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..వాయు సంబంధిత రోగాలను దూరం చేస్తుంది..ఇలా ఎన్నో లాభాలున్నాయి. బీన్స్‌లో పీచు, విటమిన్‌ ఎ, బి, కె, ఫోలేట్‌, మెగ్నీషియం వంటివి ఉంటాయి. మధుమేహ సమస్య ఉన్నవారు రోజుకు ఒక కప్పు బీన్స్‌ తీసుకుంటే వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చు.

12:25 - May 17, 2017

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పలు రకాల ఆకు కూరల్లో వివిధ పోషకాలు లభ్యమౌతుంటాయి. అలాంటి ఆకు కూరల్లో పొన్నంగంటి కూడా ఒకటి. ఇందులో విటమిన్ ఏ, బి 6, సి, ఫొలేట్, రైబో ఫ్లెవిన్, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఆహారంలో దీనిని భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కంటి చూపుకు ఎంతో దోహదం చేస్తుంటుంది. గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయనే సంగతి తెలిసిందే. పొన్నగంటి ఆకులను ఓ
గ్లాస్‌ నీటిలో ఉడికించి, మిరియాల పొడిని కలుపుకొని తాగితే ఆ సమస్య నుండి దూరం కావచ్చు.
శరీరానికి మేలు చేయడంతో పాటు పొన్నగంటి కూరను తీసుకోవడం ద్వారా శరీర ఛాయను మెరుగుపరుచుకోవచ్చు.
పొన్నగంటి కూరలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ..ఆస్టియో పోరోసిస్ ను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకులో లభించే నూనె పదార్థాలు రక్తపోటును తగ్గించి, గుండె సమస్యలను అదుపులో ఉంచుతాయి.
బరువు పెరగాలనుకునే వారు కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు.

12:10 - May 10, 2017
10:12 - May 2, 2017

చర్మంపై పలువురికి దద్దుర్లు బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ట్రీట్ మెంట్స్ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటారు. కానీ తాత్కాలికంగా సమస్య పరిష్కారమౌతుంది. ఇంటి వద్దనే కొన్నింటిని ఉపయోగించి ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

పెట్రోలియం జెల్లి : దురద..మంటల నుండి ఇది ఉపశమనం కలిగిస్తుంది. కొద్దిగా జెల్లీ తీసుకుని ప్రభావిత ప్రాంతాల్లో రాయాలి. ఓ గంట అనంతరం దానిపై ఐస్ ప్యాక్ ను ఉంచాలి.
అరటి తొక్క : ఈ తొక్క వల్ల సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది. అరటితొక్కలను ఫ్రిజ్ లో రెండు గంటల పాటు ఉంచండి. అనంతరం దద్దుర్లు వచ్చిన ప్రాంతంపై తొక్కలతో రాసుకోవాలి. అర గంట అనంతరం కడుక్కొవాలి.
వేప ఆకు : ఒక లీటర్ నీళ్లలో పది నుండి పన్నెండు వేపాకులు వేయాలి. పదిహేను నిమిషాల పాటు ఉడికించిన అనంతరం స్నానానికి ఉపయోగించే నీటతిలో ఈ నీళ్లను కలుపుకోవాలి. ఈ నీళ్లతో స్నానం చేయడం వల్ల దద్దుర్లు మాయమయ్యే అవకాశం ఉంది.
కొత్తిమీర : యాంటి ఇరిటెంట్ గా..యాంటీ ఇన్ ఫ్లమేటరీగా..యాంటీ సెప్టిక్ గా కొత్తిమీర పనిచేస్తుంది. కొత్తిమీర ఆకులను మెత్తని ముద్దలా చేసుకుని దానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని దద్దుర్లు వచ్చిన ప్రాంతంలో రాయాలి. అర గంట అనంతరం కడిగేసుకోవాలి.

10:42 - April 29, 2017

సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది.

అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల గుజ్జు వేసి రోజుకు మూడు లేక నాలుగు సార్లు ఇచ్చినా ఫలితముంటుంది. వీటి గుజ్జును పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది.

సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. ఆహారం తీసుకునే ముందు గ్లాసు నీళ్లలో సబ్జా గింజలను వేసుకుని తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల తక్కువగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇది డైటింగ్ చేసే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. సబ్జా గింజల నుంచి అందే కెలొరీలు కూడా చాలా తక్కువ.

సబ్జా గింజలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయడంలో సాయపడతాయి. గ్లాసు నీళ్లలో నాలుగు చెంచాల సబ్జా గింజలను వేసి నానబెట్టాలి. అరగంట తర్వాత గ్లాసు పచ్చిపాలలో వేసుకుని, కొన్నిచుక్కల వెనిల్లా కలిపి తాగాలి. ఇది టైప్2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనాన్నిస్తుంది. సబ్జా గింజల పాలను కాఫీ, టీలకు బదులు తీసుకుంటే కడుపు ఉబ్బరం, కడుపులో మంట తగ్గుతాయి.

మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింప చేసే విటమిన్ ‘ఇ’ కూడా ఇందులో లభిస్తుంది. ఈ సబ్జా గింజల్లో ఔషధగుణాలు బోలెడు ఉంటాయి. పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారిస్తాయి. కేవలం శరీరం లోపలి భాగాన్నే కాక బయట భాగాన్ని కూడా కాపాడటంలో ఇవి బాగా పనిచేస్తాయి.

ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకోవడం వల్ల అవి త్వరగా తగ్గుతాయి. తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగండి, సమస్య తగ్గడంతో పాటు మానసికంగా ప్రశాంతత కూడా ల‌భిస్తుంది.

వీటిలో విటమిన్లూ, పోషకాలూ, ఇనుమూ ఎక్కువగా ఉంటాయి. చిన్న కప్పు సబ్జా గింజలను తరచూ తీసుకోవడం వల్ల కావాల్సినంత ఇనుమూ, పోషకాలూ శరీరానికి అందుతాయి. రోగ నిరోధక శక్తి సొంతమవుతుంది.

క్రీడాకారులకు ఎక్కువగా ఆడటం వల్ల శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు. అందుకే ఈ విత్తనాలను రోజూ తీసుకుంటే శరీరంలో తేమను పోనీకుండా నిలిపి ఉంచుతాయి. గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలు పీడిస్తున్న‌ప్పుడు ఈ గింజల్ని నీళ్లలో నానబెట్టి నేరుగా తినేయండి. ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి.

సబ్జా గింజల‌ను రోజూ తీసుకోవడం వల్ల బీపీ నెమ్మదిగా అదుపులోకి వస్తుంది. వీటిలో ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఒమెగా-3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయోటిక్‌లా కూడా పనిచేస్తాయి. ఈ గింజలు కేవలం నీటితోనే కాక మజ్జిగ, కొబ్బరినీళ్లతో పాటు ఇతర పండ్ల రసాలతో కూడా ఈ గింజల్ని కలిపి తీసుకోవచ్చు. ఇవి చర్మ సమస్యల్ని అరికట్టడంలోనూ బాగా సహకరిస్తాయి.

రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలో,శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జ గింజలు ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది.

12:16 - April 23, 2017

నిమ్మరసం..ఇందులో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు..యాంటీ బాక్టీరియల్..యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీంరలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ 'సి' లభ్యం కావడం వల్ల చర్మం..దంత సమస్యలు తగ్గుతాయి. నీటిలో నిమ్మరసం కలుపుకుంటే అనారోగ్య సమస్యలు ఏర్పడవని పేర్కొంటున్నారు.

  • నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు తెల్లగా..ధృడంగా మారుతాయి. చిగుళ్ల నొప్పి కూడా తగ్గుతుంది.
  • జీర్ణ సంబంధ వ్యాధులు ఉంటే అవి తగ్గుముఖం పడుతాయి. గ్యాస్..అజీర్ణం..మలబద్ధకం..అసిడిటీ సమస్యలు దూరమౌతాయి.
  • వేసవి కాలంలో ఎదురయ్యే డీ హైడ్రేషన్ నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరం చల్లగా ఉంటుంది.
  • దగ్గు..జలుబు వంటి శ్వాస కోశ వ్యాధులు నమమౌతాయి.
  • చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధికంగా బరువు ఉంటే తగ్గే అవకాశం ఉంది.
  • డయాబెటీస్ ఉన్న వారికి నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.
  • డిప్రెషన్..ఆందోళన..ఒత్తిడి వంటివి తగ్గుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
16:21 - April 22, 2017

ఆకుకూరలు..ఆరోగ్యానికి ఎంతో మంచిది..నిత్య ఆహారంలో ఆకు కూరలను భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగుంటాయి. ఆకుకూరల్లో పాలకూర ఒకటి. మహిళలకు పాలకూర వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. మహిళలు తప్పనిసరిగా పాలకూరను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్లోరిన్, ప్రోటీన్లు, విటమిన్ ఏ, సిలు, ఖనిజ లవణాలు, కాల్షియంలు లభిస్తాయి.
దీనిని తినడం వల్ల రక్తహీనతకు చెక్ పడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
దాంతో పాటు అధిక రక్తపోటును తగ్గించి, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
పాలకూర రసాన్ని తాగడం వల్ల జుట్టు అందంగా ఉంటుంది. జుట్టు ధృడంగా, పొడవుగా పెరుగుతుంది. వెంట్రుకలకు అవసరమైన పోషకాలు ఇందులో లభిస్తాయి.
శరీరానికి అవసరమైన ఐరన్‌ను పుష్కలంగా అందిస్తుంది. కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది.

Pages

Don't Miss

Subscribe to RSS - health tips