heavy rains

09:07 - October 20, 2017

విశాఖ : బంగాళఖాతంలో ఏర్పాడిన వాయుగుండం పారాద్వీప్ చాంద్ బాలీ వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో ఒడిశాలో పలుచోట్ల, ఉత్తరకొస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయిని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండడంతో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

08:06 - October 20, 2017
12:01 - October 18, 2017

నల్గొండ : నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 561 అడుగుల మార్కును దాటింది. ఎగువ నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో.. ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పై నుంచి ఇలానే వరద ఉధృతి కొనసాగితే గరిష్ట నీటి మట్టం 590 అడుగులకు చేరనుంది. సాగర్‌కు వరద ఉధృతిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:43 - October 17, 2017

నల్గొండ : తెలుగు రాష్ట్రాల వరప్రదాయినీ నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రస్తుత నీటి మట్టం 556 అడుగులకు చేరింది. ఎగువ నుండి 2 లక్షల 66వేల 288 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతోంది. గంటగంటకు సాగర్‌లో నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరికొద్ది రోజుల్లో జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులకు చేరుకునే అవకాశాలున్నాయి. 

19:54 - October 14, 2017

హైదరాబాద్ : జీడిమెట్ల పరిధిలోని మధుసూదన్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఓపెన్ నాలాలు ఉప్పొంగి ప్రవహించాయి. ఈ నాలాలో కొట్టుకుపోయి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకెళితే.. ఓ యువకుడు ఓపెన్‌ నాలాలో చిక్కుకుపోయాడు. ఇది గమనించిన స్థానికులు... యువకుడిని కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఓ తాడు సహాయంతో అతన్ని బయటకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే తాడు తెగిపోవడంతో ఆ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. అలా కొట్టుకుపోయిన యువకుడు.. కిలోమీటర్ దూరంలోని గణేష్‌నగర్‌లో మృతదేహమై కనిపించాడు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ నాలా గురించి ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మద్యం మత్తులో నాలాలో పడిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:12 - October 14, 2017

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వరద ప్రవాహం అధికమవడంతో శ్రీశైలంలో ఏడు గేట్లు  పది అడుగుల మేర ఎత్తి .. నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి 2లక్షల 33వేల 989 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం ఆనకట్ట స్పిల్‌వే ద్వారా లక్షా 67వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. దీంతో శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. సాగర్‌కు 73వేల 921 క్యూసెక్కుల వరదనీరు విడుదల అవుతోంది. మరోవైపు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు 11వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 24వేల క్యూసెక్కులు, హంద్రీనీవా ప్రాజెక్టుకు 1688 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884.40 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 211.95 టీఎంసీలుగా నమోదైంది.

 

20:42 - October 13, 2017

హైదరాబాద్‌ : నగరంలో మళ్లీ వర్షం దంచి కొడుతుంది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మాదాపూర్‌ నుంచి మియాపూర్ వరకు, ఉప్పల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. 

 

20:05 - October 13, 2017

కర్నూలు : జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో.. మరో గేటు ఎత్తి నీటిని వదిలారు. 6, 7, 8 గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు.  ప్రాజెక్ట్‌ నీటి మట్టం ప్రస్తుతం 884.4 అడుగులకు చేరుకుంది. ఇన్‌ ఫ్లో ఒక లక్ష  76 వేల 909 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ ఫ్లో లక్షా 44 వేల 9 వందల 48 క్యూసెక్కులు ఉంది.  

 

16:21 - October 13, 2017

నల్గొండ : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటోంది. శ్రీశైలం నుంచి నీరు వదలడంతో.. సాగర్‌ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలంప్రాజెక్టు నుంచి లక్షా ముప్పైవేల క్యూసెక్కుల నీరు వస్తోంది.  సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుతం  532.60 అడుగులకు చేరుకుంది.  జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 173 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ  ప్రాంతాల నుంచి ప్రవాహం కొనసాగితో మరికొద్ది రోజుల్లో సాగర్‌ నిండుకుండలా మారుతుందని ఇరిగేషన్‌ అధికారులు  అంటున్నారు. ప్రాజెక్టుకు జలకళ వస్తుండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

 

08:16 - October 12, 2017

 

హైదరాబాద్ : 15 రోజులుగా హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రోజూ పలు ప్రాంతాల్లో 6 నుంచి 13 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. దీంతో సిటీలో ఉన్న చెరువులు నిండకుండలా మారాయి. సిటీలో 185 చెరువులు ఉండగా.. వాటిలో 119 చెరువుల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. 26 చెరువులు పూర్తి స్ధాయిలో ఎఫ్టీఎల్‌కు చేరుకున్నాయి. 23 చెరువుల్లో 75 శాతం నీరు రాగా.. 17 చెరువుల్లో 50 శాతం వరకూ వరద నీరు వచ్చి చేరింది.

నాలా వ్యవస్థ సక్రమంగా ఉండకపోవడమే...
ఇక అన్ని చెరువులు నీటితో నిండి పోవ‌డంతో చిన్న పాటి వ‌ర్షం వ‌చ్చినా చెరువుల చుట్టుపక్కల ఉండే కాలనీలు, బస్తీల్లోకి వేగంగా నీరు వచ్చి చేరుతోంది. అందుకు ప్రధాన సమస్య నాలా వ్యవస్థ సక్రమంగా ఉండకపోవడమే. సిటీలోని చెరువుల పరిసర ప్రాంతాల్లో నివాసాలు ఉండేవారు రోజుల తరబడి నీటిలో ఉండాల్సిన పరిస్థితి ఎదురౌతోంది. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా రామంతపూర్ పెద్ద చెరువు, మ‌ల్కాజ్ గిరి బండ‌చెరువు, మీరాలం ట్యాంక్, బోర‌బండ సున్నం చెరువు, మీయాపూర్ దీప్తి శ్రీనగర్ ప‌టేల్ చెరువుతో పాటు ప‌లు చెరువులు నిండిపోయి కాలనీల్లోకి పడ్డాయి. దాంతో జనం నానా ఇబ్బందులు పడ్డారు.

ఎఫ్టీఎల్ ప‌రిథిలోకి నిర్మాణాలు..
ఇక కొన్ని చోట్ల ఎఫ్టీఎల్ ప‌రిథిలోకి నిర్మాణాలు రావ‌డంతో కాల‌నీల్లోకి వ‌ర‌ద నీరు భారీగా వచ్చి చేరింది. నాలాలు, చెరువుల నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రామాంతపూర్ బండ చెరువు వద్ద ఎఫ్టీఎల్ నిర్ధారణపై అధికారులు అలసత్వం వహించిన కారణంగా అక్కడి ప్రజలంతా 10 రోజులపాటు మురుగునీటిలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు కబ్జాలు.. మరోవైపు సివరేజ్ సిస్టమ్ సరిగా లేక చెరువులు సిటీని ముంచెత్తాయి. చెరువులను రక్షించకపోతే ఎలాంటి దుస్థితి ఏర్పడుతుందో ఈ ఏడాది కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఇప్పటికైనా పాలకులు చెరువులు, కాల్వలపై దృష్టి సారించకపోతే.. ఏటా ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని జనం పెదవి విరుస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - heavy rains