Hero Prabhas

13:15 - April 13, 2018

ఢిల్లీ : ప్రతిష్టాత్మక 65వ జాతీయ అవార్డుల ప్రకటన కాసేపటి క్రితం వెలువడింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ కార్యక్రమం జరుగుతోంది. 2017లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వచ్చిన చిత్రాలను పరిగణలోకి తీసుకుని అవార్డులను ప్రకటిస్తున్నారు.

 • ఉత్తమ నటి : శ్రీదేవి (మామ్)
 • ఉత్తమ తెలుగు చిత్రం : ఘాజీ
 • ఉత్తమ హిందీ చిత్రం : న్యూటన్
 • ఉత్తమ మలయాళీ చిత్రం : టేకాఫ్
 • ఉత్తమ తమిళ చిత్రం : టు లెట్
 • ఉత్తమ మరాఠీ చిత్రం : కచ్చా నింబూ
 • ఉత్తమ కన్నడ చిత్రం : హెబ్బెట్టు రామక్క
 • ఉత్తమ బెంగాలీ చిత్రం : మయురాక్షి
 • ఉత్తమ యాక్షన్ చిత్రం : బాహుబలి 2
 • ఉత్తమ సంగీత దర్శకుడు : ఏ.ఆర్.రెహమాన్ (మామ్), (కాట్రు వెలియిదామ్)
 • ఉత్తమ కొరియాగ్రాఫర్ : గణేష్ ఆచార్య (టాయ్ లెట్, ఏక్ ప్రేమ్ కథా)
 • ఉత్తమ దర్శకుడు : జయరాజ్ (మలయాళ చిత్రం భయానకం)
 • ఉత్తమ సహాయ నటుడు : ఫహాద్ ఫాసిల్ (తొండిముత్తలం ద్రిసాక్షియుం)
 • బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. 
13:33 - December 30, 2017

బాహుబలి సినిమా తర్వాత దేశంలోనే ప్రముఖ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో ప్రభాస్. ఆయన తర్వాత మూవీ సాహో బాహుబలి తర్వాత ప్రభాస్ అదే రేంజ్ మూవీని అభిమానులు ఆశిస్తున్నారు. సాహో ఎలాగైనా హిట్టు చేయాలని దర్శకుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమై కొన్ని నెలలు గడుస్తోంది. కానీ షూటింగ్ చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. వచ్చే వారంలో దుబాయ్ లో ప్రభాస్ తో ఫైటింగ్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫైట్స్ కోసం ప్రభాస్ గత కొన్ని రోజులుగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు.  

10:19 - August 2, 2017

'భళీ..భళీ రా...భళీ..సాహోరో బాహుబలి' అనిపించుకున్న టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' తన తాజా చిత్రం 'సాహో'పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. యాక్షన్ చిత్రమా..సైన్స్ ఫిక్షన్..సోషియో ఫాంటసీ నేపథ్యంలో చిత్రం ఉంటుందా అని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. కానీ ఈ సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రం తెలియరావడం లేదు. 'సాహో' చిత్రాన్ని మాత్రం హాలీవుడ్ రేంజ్ కు తగ్గట్టు రూపొందించనున్నారని టాక్.

'బాహుబలి'..'బాహుబలి-2' సినిమాల అనంతరం సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రంలో నటించేందుకు 'ప్రభాస్' అంగీకరించారు. 'రన్ రాజా రన్' చిత్రం అనంతరం సుజీత్ చేస్తున్న సినిమా ఇదే. చిత్ర షూటింగ్ కంటే ముందుగానే చిత్రా టీజర్ విడుదల చేయడం గమనార్హం. చిత్ర హీరోయిన్స్..విలన్స్..ఇతరత్రా పాత్రలు ఎవరు పోషిస్తున్నారనే దానిపై క్లారిటీ రావడం లేదు. దాదాపు రూ. 150 కోట్లతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

'సాహో' పక్కా యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ గా సినిమా ఉంటుందని..హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని 'ప్రభాస్' పేర్కొన్నట్లు తెలుస్తోంది. సాహో కోసం బరువు తగ్గిపోయి స్టైలిష్ గా కనిపించబోతున్నాడు. ఇటీవలే 'ప్రభాస్' కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ దుబాయిలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'ప్రభాస్' కు విలన్ గా బాలీవుడ్ నటుడు 'నీల్ నితిన్ ముఖేష్' నటించనున్నట్లు తెలుస్తోంది. మరి 'ప్రభాస్' ఎలా మురిపిస్తాడో వెయిట్ అండ్ సీ...

13:25 - January 20, 2017

ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి 2' సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టిన 'రాజమౌళి' ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. 'బాహుబలి' తొలి భాగం బిజినెస్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు సెకెండ్ పార్ట్ 'బాహుబలి2' అంతకు మించిన సంచనాలను సృష్టించేలా కనిపిస్తోంది. మొదటి పార్ట్ ఊహాలకు కందని స్థాయిలో సక్సెస్ కావడంతో, ఈ ద్వితీయ భాగానికి విపరీతమైన హైప్ క్రియేట్ అవుతోంది. సినిమాకు సంబంధించిన విశేషాలను 'రాజమౌళి' ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి కూడా రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో తనదైన స్టైల్లో ఒక్కొక్కటిగా ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా కౌంట్ డౌన్ ప్రారంభమైందని ట్వీట్ చేశారు. 100డేస్ టు బాహుబలి 2 అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. జైపూర్‌లో జరగబోయే ఓ లిటరేచర్ ఫెస్టివల్లో తమ నవలని తొలిసారి రిలీజ్ చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్ లు ప్రధాన పాత్రలు పోషించారు. 

12:05 - January 6, 2017

సినీ నటుడు 'ప్రభాస్' ను విడుదల చేశారు. ఆయన ఏం నేరం చేశాడని విడుదల చేశారు ? అని అనుకుంటున్నారా అదే కాదు. ఆయన్ను రిలీజ్ చేసింది 'రాజమౌళి'. ఇప్పటికే అర్థం అయ్యిదనుకుంటాం...అవును గత కొన్ని సంవత్సరాలుగా 'ప్రభాస్' ఒకే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'బాహుబలి' టాలీవుడ్ పవర్ ఏంటో ప్రపంచానికి యావత్తు తెలియచేసింది. దీనికి సీక్వెల్ గా 'బాహుబలి -2’ షూటింగ్ కొనసాగుతోంది. దాదాపు షూటింగ్ నాలుగేళ్లుగా కొనసాగుతోంది. ఈ ఒక్క సినిమాకే 'ప్రభాస్' పరిమితమయ్యాడు. 'ప్రభాస్' కనిపించే షూటింగ్ పూర్తవడంతో ఆయన్ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని 'బాహుబలి' సోషల్ మీడియా పేజ్ లో అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులందరూ 'బాహుబలి'తో పాటు వేరే సినిమాల్లో కూడా నటించారు. కానీ ప్రభాస్ మాత్రం మరో సినిమా అంగకీరించకుండా 'బాహుబలి'కే పరిమితమయిన సంగతి తెలిసిందే. భారీగా కండలు, పొడవాటి జుట్టుతో 'ప్రభాస్' మారిపోయినట్లు తెలుస్తోంది. కానీ ఆయన ఫొటోలు మాత్రం బయటకు విడుదల కావడం లేదు. ఇప్పుడు 'బాహుబలి -2' కూడా పూర్తవ్వటంతో 'ప్రభాస్' ఇక నార్మల్ లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. దీనిపై 'రాజమౌళి' కూడా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘థాంక్యూ డార్లింగ్' అంటూ ట్వీట్ చేశారు.

Don't Miss

Subscribe to RSS - Hero Prabhas