hero sunil

21:47 - September 15, 2017

కమెడియన్ నుండి హీరోగా మారి రెండు హిట్స్ కొట్టిన సునిల్ ఆ తరువాత మాత్రం వరుస డిసాస్టర్స్ తో ఆడియన్స్ ను నిరాశ పరిచాడు అందుకే ఈ సారి తన మూసా కామెడీకి బిన్నంగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసే క్రాంతి మాధవ్ తో కలిసి ఉంగరాల రాంబాబు సినిమా చేశాడు. ట్రైలర్ తో కాస్తా ఆసక్తిని రేకెత్తించిన ఉంగరాల రాంబాబు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా హీరోగా సునిల్ కి మరో సక్సెస్ ను అందించిందా లేదా.. క్రాంతి మాధవ్ చేసిన ఈ డిఫ్రెంట్ మూవీ ప్రేక్షకులను నవ్వించిందా.. లేదా అనేది చూద్దాం..
కథ...      
కథ విషయానికి వస్తే వందల కోట్ల జంమిందారు మనవడు అయిన రాంబాబు చిన్న తనం నుండి తాత పెంపకంలో గారాబంగా పెరుగుతాడు.. ఆ తరువాత తాత చనిపోవడంతో ఆయన చేసిన అప్పులకు ఆస్తంతా కోల్పోయి రోడ్డున పడతాడు ఆ స్టేజ్ లో బాదం బాబ ఇచ్చిన సలహాతో అనుకోకుండా కోటీశ్వరుడు అవుతాడు.. అదే టైంలో సావిత్రితో ప్రేమలో పడతాడు.. కాని ఆమె కేరళాకు చెందిన కమ్యూనిస్ట్ నాయకుడు నాయర్ కూతురు కావడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్ళి చేసుకోమంటుంది.. దాంతో కేరళా వెళ్ళిన రాంబాబు నాయర్ ను ఎలా కన్విన్స్ చేశాడు. నాయర్ పెట్టిన ట్విస్ట్ లు ఎలా పాస్ అయ్యాడు.. చివరికి తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే.. 
నటీనటులు
నటీనటుల విషయానికి వస్తే తన డైలాగ్ డెలివరీతో బాడీ లాంగ్వేజ్ తో కితకితలు పెటే సత్తా ఉన్న సునిల్ ఈ సారి కొంచెం డిఫెరంట్ గా ట్రై చేశాడు.. సెంటి మెంట్ వాల్యూస్ ఉన్న కథను ఎంచుకుని తనలోని మరో కోణాని ఆవిష్కరించాలని చూశాడు.. తనకు అలవాటు అయిన కామెడీని పర్వాలేదు అనిపించేలా చేసిన సునిల్ మిగతా విషయాల్లో మాత్రం బాగా తడబడ్డాడు.. మళ్లీ కమెడియన్ గా టర్న్ తీసుకోవాలి అని డిసైడ్ అవ్వడంతో ఫిట్ నెస్ ను కూడా పక్కన పెట్టాడు..  డాన్స్ లుతో మాత్రం ఎప్పటి లాగానే మెప్పించగలిగాడు. ఇక హీరోయిన్ మీరా  జార్జ్ డీసెంట్ లుక్స్ తో చూడటానికి బాగుంది ఆమె పాత్రకి సరైన వెయిట్ లేకపోవడంతో ఆమె నటించడానికి కూడా పెద్దగా స్కోప్ దక్కలేదు.. సినిమా మెత్తాన్ని డామినేట్ చేసి కాస్తో కూస్తో పర్వాలేదు అనిపించాడు టాలెంటెడ్ యాక్టర్ ప్రకాశ్ రాజ్.. కమ్యూనిస్ట్ గా ఆయన క్యారక్టరైజేషన్, ఆయన పలికిన డైలాగ్స్ బాగానే కుదిరాయి.. ఇక వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి నవ్వించడానికి బాగా కష్టపడ్డారు కాని అది కొంత వరకు మాత్రమే వర్కౌట్ అయింది. మిగతా నటీనటులు అంతా తమ పాత్ర పరిది మేరకు నటించారు.. 
ఇక టెక్నీషియన్స్ 
ఇక టెక్నీషియన్స్ విషయానకి వస్తే స్టోరీ స్క్రీన్ ప్లే డైరక్ష అని క్రాంతి మాధవ్ పేరు పడగానే ఒక మంచి ఎంటర్ టైనర్, మెసేజ్ ఓరియంటడ్  మూవీని ఆశిస్తారు అంతా.. కాని కథ దగ్గర నుండి   స్క్రీన్ ప్లే దగ్గర నుండి డైరక్షన్ వరకు ఏ ఒక్క విభాగంలో తన ముద్ర చూపించుకోలేక పోయాడు క్రాంతి మాధవ్. పది నిమిషాలకొక కొత్త ఎలిమెంట్ సినిమాలోకి వచ్చినప్పటికి ఏది కూడా కథతో కలిసి నడవలేదు.. పైగా అనుకున్నంత రేంజ్ లో కామెడీ వర్కౌట్ అవ్వకపోవడంతో భారంగా నడిచింది సినిమా. ఇటు సునిల్  సినిమా లాగా, అటు క్రాంతి మాధవ్ సినిమా లాగా కాకుండా అస్త వ్యస్తంగా తయారు అయ్యింది.. సెకండ్ ఆఫ్ లో కూడా.. ప్రకాశ్ రాజ్ క్యారక్టర్ లో సరైన బ్యాలస్స్ కుదరకపోవడంతో కథ పూర్తిగా సైడ్ ట్రాక్ అయ్యి.. పాత చింతకాయ పచ్చడిలా మారింది ఈ ఉంగరాల రాంబాబు.. సర్వేశ్ మురారి సినిమాటోగ్రాఫీ పర్వాలేదు అనిపించింది. ఎప్పుడూ ట్రెండీ మ్యూజిక్ అందించే జిబ్రాన్ మనసు పెట్టి సినిమాను చేయలేదు అనే రేంజ్ లో ఉంది మ్యూజిక్ .ఆర్ ఆర్ పెద్ద మైనస్. ప్రొడక్షన్ వాల్యూస్ చెత్తగా ఉన్నాయి. 
 
ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే, రొటీన్ కథతో, అసలు ఆకట్టుకోలేని స్క్రీన్ ప్లే తో ఏ మాత్రం ఇంప్రస్ చేయని డైలాగ్స్ తో అదో రకం సినిమాలా తయారయ్యింది ఉంగరాల రాంబాబు.. అయితే కమ్యూనిజం, హ్యూమనిజం అనే పదాలకు క్రాంతి మాధవ్ ఇచ్చిన డెఫెనిషన్స్ , మరికొన్ని ఫీల్ గుడ్ సీన్స్ మినహాయిస్తే.. ఈ రాంబాబును భరించడం కష్టం.. 
ప్లస్ పాయింట్స్
సునిల్, ప్రకాశ్ రాజ్  నటన
సినిమాటోగ్రాఫీ
మైనస్ పాయింట్స్
నిర్మాణ విలువలు 
ఓల్డ్ ఫార్మెట్ కథ
స్క్రీన్ ప్లే
డెప్త్ లేని డైలాగ్స్ 
వర్కౌట్ అవ్వని కామెడీ..

రేటింగ్ 1/5

20:14 - September 13, 2017

హీరో సునీల్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడారు. ఉంగరాల రాంబాబు సినిమా విశేషాలను వివరించారు. తన సినీ కెరీర్ పై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:01 - March 24, 2016

సునీల్‌ హీరోగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో నిర్మాత పరుచూరి కిరీటి ఓ సినిమాను రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి సునీల్‌ మాట్లాడుతూ, ''మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' నాకు బాగా నచ్చిన చిత్రాల్లో ఒకటి. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన క్రాంతి మాధవ్‌ మరో మంచి కథను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ కథను తయారు చేశారు. ఇందులో నా క్యారెక్టరైజేషన్‌ను విభిన్నంగా మలిచారు. భారీ చిత్రాల్ని నిర్మించిన పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని అన్ని కమర్షియల్‌ హంగులతో నిర్మించేందుకు సన్నాహాలు చేయటం చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు. 'పాత్రను ప్రేమిస్తే సునీల్‌ ఎంత కష్టపడతారో మనకు తెలిసిందే. చాలా రోజులుగా ఆయనతో సినిమా చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. క్రాంతి మాధవ్‌ చెప్పిన కథ అద్భుతంగా ఉంది. సునీల్‌కిది కరెక్ట్‌ స్క్రిప్ట్‌ అనిపించింది. ఇందులోని ప్రతీ పాత్రకు ప్రాధాన్యం ఉండేలా తీర్చిదిద్దారు. పూర్తి కమర్షియల్‌ వాల్యూస్‌తో మంచి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతోంది. మా బ్యానర్‌ నుంచి మరో సూపర్‌ హిట్‌ చిత్రం చేస్తున్నామని ధీమాగా చెప్పగలుగుతున్నాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని నిర్మాత తెలిపారు.

 

17:23 - March 22, 2016

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా త్వరలో వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కబోతుందని టాక్. అయితే హీరోగా మారిన స్టార్ కమెడియన్ సునీల్ తిరిగి ఈ చిత్రంలో కమెడియన్ గా కనిపిస్తారట. అది కూడా ప్రత్యేకించి మెగాస్టార్ అభ్యర్థన మేరకు. చిరు స్వయంగా పిలిచి మరీ సునీల్ ను తన 150వ సినిమాలో కమెడియన్ నటించమని అడిగారని సమాచారం. మొదటి నుంచి చిరంజీవికి ఫ్యాన్ అయిన సునీల్.. 'అన్నయ్య' అడగ్గానే నవ్వుతూ ఓకే చెప్పేశారట. ఇదే నిజమైతే తిరిగి మనం సునీల్ కామెడీ టైమింగ్ కి కనెక్ట్ అవడం గ్యారెంటీ. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు.

07:38 - January 6, 2016

'నిక్కి గాల్రాని' 'సునీల్' హీరో హీరోయిన్లుగా వాసు వర్మ దర్శకత్వంలో 'దిల్‌' రాజు నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణాష్టమి'. త్వరలో ఆడియో విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత 'దిల్‌' రాజు మాట్లాడుతూ, 'మా బ్యానర్‌లో వస్తోన్న మరో చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం. రాజమండ్రిలో 9న ఆడియోను, ఫిబ్రవరి మొదటి వారంలో సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం' అని అన్నారు. 'అమెరికా నుంచి వచ్చిన ఓ కుర్రాడు ఇండియాలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనేది చిత్ర కథాంశం. ఉన్నతమైన సాంకేతిక విలువలతో కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రంగా 'కృష్ణాష్టమి'ని తెరకెక్కించాం' అని దర్శకుడు తెలిపారు.

Don't Miss

Subscribe to RSS - hero sunil