Himachal Pradesh Elections

07:21 - October 13, 2017

 

ప్రజాస్వామ్యాన్ని అపహస్యపాలు చేయడం చాలా దారుణమని, దేశవ్యాప్తంగా జీఎస్టీ సమస్య ఉంటే కేవలం గుజరాత్ కు సంబంధించిన కొన్నింటికి మాత్రమే మినహాయింపు ఇచ్చారని, రాజకీయా పార్టీలు తమ స్వర్థం కోసం స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ ను వాడుకుంటున్నారని, ఎన్నికల సంఘం అధికారులు నైతిక బాధ్యతలతో ఉండాలని ప్రముఖ విశ్లేషకులు వీరయ్య అన్నారు. ఏ రాజకీయా పార్టీ అయిన ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉంటాయని, ఎన్నికల కమిషన్ హిమచల్ ప్రదేశ్ కు తేదీ ప్రకటించిందని, కానీ దాని ఫలితం రాకముందే గుజరాత్ ఎన్నికలు జరుపుతుందాని, ఎన్నికల కమిషన్ ఎప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తోందని బీజేపీ నాయకురాలు మాధవి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

21:51 - October 12, 2017

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. అక్టోబర్‌ 16న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు తెలిపింది. నవంబర్ 9న హిమాచల్ అసెంబ్లీకి ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 68 అసెంబ్లీ స్ధానాలకు ఒకే దశలో పోలింగ్‌ జరుగుతుందని పేర్కొంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న జరుగుతుంది. అదేరోజు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 49 లక్షల మంది ఓటర్లున్న హిమాచల్‌లో మొత్తం 7521 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఈవీఎంలతో పాటు వీవీపాట్‌ యంత్రాలు ఉపయోగిస్తామని సీఈసీ అచల్‌ కుమార్‌ జ్యోతి చెప్పారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో  నేటి నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు. అభ్యర్థులు భారీ స్ధాయిలో ఓటర్లకు పంపే ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ మెసేజ్‌లనూ  ఎన్నికల ప్రచార వ్యయం కింద పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక కారణం వల్ల గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ పెండింగ్‌లో పెట్టింది. ఆ రాష్ట్రంలో డిసెంబర్‌ 18లోపు ఎన్నికలు జరుగుతాయని తెలిపింది.

 

16:21 - October 12, 2017
15:27 - October 12, 2017

ఢిల్లీ : గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన సాయంత్రం 4 గంటలకు వెలువడనుంది. ఎన్నికల ప్రకటన వెలువడక ముందే ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఇప్పటికే వేడెక్కెంది. కాంగ్రెస్‌, బిజెపిల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 36, బిజెపి 26 స్థానాలు గెలుచుకున్నాయి. హిమాచల్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సీనియర్ నేత వీరభద్రసింగ్‌ ఆరుసార్లు పనిచేశారు. హిమాచల్‌ అసెంబ్లీకి నవంబర్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశముంది. గుజరాత్‌లో 1998 నుంచి వరుసగా బిజెపి అధికారంలో ఉంది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌లో ఎన్నికలు జరిగనున్నట్లు సంకేతాలున్నాయి.

 

18:12 - April 13, 2017

హైదరాబాద్ : కులీకుతుబ్‌షాల పాలనలో హిందూ, ముస్లీంలకు సమాన అవకాశాలు లభించాయని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారు. హైదరాబాద్‌లోని జాతీయ ఉర్దూ యూనివర్సిటీలో మహ్మద్‌ కులీకుతుబ్‌ షా స్మారకోపన్యాసంలో ఆయన మాట్లాడారు. ప్రజలందరూ ఉమ్మడి సంస్కృతి, సంప్రదాయాలను ఆచరించడంలో స్వేచ్ఛను అనుభవించారని తెలిపారు. పాలకులు, పాలితులకు మధ్య మతం, భాషా, సాంస్కృతిక అంశాల్లో స్నేహ పూరిత వాతారణమే ఉండేదన్నారు.  కార్యక్రమంలో గవర్నర్‌ నర్సింహన్‌ కూడా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఉపరాష్ట్రపతి ఢిల్లీ తిరిగి వెళ్లారు.

16:43 - April 13, 2017

ఢిల్లీ : ఇటీవల 8 రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఉప ఎన్నికలో ఆప్ డిపాజిట్ కోల్పోయింది. ఢిల్లీ రాజౌరి గార్డెన్‌ నియోజకవర్గంలోఆప్‌కు డిపాజిట్‌ కూడా దక్కలేదు. బిజెపి అభ్యర్థి మన్‌జిందర్‌ సింగ్‌ సిర్‌సా విజయం సాధించారు. కాంగ్రెస్‌ రెండోస్థానంలో నిలవగా, ఆప్‌ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు.  తమ అభ్యర్థి ప్రజలకు దూరం కావడం వల్లే ఓటమి చెందారని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా చెప్పారు. కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్‌ మోదీ హవాకు బ్రేక్‌ వేసింది.

 

Don't Miss

Subscribe to RSS - Himachal Pradesh Elections