home minister

16:53 - September 14, 2018

న్యూఢిల్లీ:  ఓ యవతిని జుట్టుపట్టుకొని నిర్దాక్షణ్యంగా కాలుతో తంతున్న యువకుడి వీడియో వైరల్ అవ్వడంతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఆ యువకుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా శుక్రవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.

ఆదేశాల మేరకు ఓ పోలీసు ఆఫీసరు కొడుకు రోహిత్ సింగ్ తోమర్ ను పోలీసులు అరెస్టుచేసారు. వీడియోలో రోహిత్ ఆ యువతిని లాగుతూ.. కాలుతో తంతూ విచక్షణారహితంగా కొట్టడం రికార్డయ్యింది. ఆ యువతి కొట్టవద్దని వేడుకొంటున్నా వినకుండా చెంపమీద కొడుతూ లాక్కెళ్లుతున్న దృశ్యాలు చూపరులకు ఆగ్రహాన్ని తెప్పించాయి.

ఢిల్లీ ఉత్తమ్ నగర్ లోని ఓ ప్రయివేటు ఆఫీసులోకి ఈ నెల 2న చొరబడ్డ నిందితుడు యువతిని హింసించడం వీడియోలో చిత్రీకరించారు. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అయ్యింది.  ఆ యువతి శుక్రవారం పోలీసుస్టేషన్ కు వెళ్లి తనను బలత్కరించాడని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ వీడియో తన దృష్టికి రావడంతో వెంటనే తాను ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్ తో మాట్లాడి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్టు రాజనాథ్ సింగ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే..ఈ వీడియోను స్వయంగా నిందితుడే తన కాబోయే భార్యకు పంపినట్లు తెలుస్తోంది. ఆమె వివాహానికి సుముఖంగా లేకపోవడంతో ఈ దాడికి దిగి ఆ వీడియోను ఆమెకే పంపాడని.. ఆమె ఈ  వీడియోను ట్విట్టర్ లో పోస్టుచేసి అతని బండారం బయటపెట్టాలని యత్నించింది.  అయితే... తాను వీడియో చూసిన తర్వాతే తన వివాహం రద్దు చేసుకున్నట్టు పోలీసులకు ఆమె తెలిపింది.

బాధితురాలు ఈ రోజు పోలీసు స్టేషన్ కు స్వయంగా వెళ్ళి రోహిత్ తనను అతని స్నేహితుని ఆఫీసుకు రమ్మని అక్కడ తనపై అఘాయిత్యం చేశాడని ఆరోపించింది. పొలీసులకు ఫిర్యాదు చేస్తాననడంతో తనను హింసించాడని బాధితురాలు వివరించింది.

07:03 - August 3, 2018

ఢిల్లీ : ఎస్‌సి ఎస్‌టి యాక్ట్‌ సవరణ బిల్లుపై లోక్‌సభలో రగడ జరిగింది. గత నాలుగు నెలలుగా ఈ బిల్లుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ ఎందుకు తీసుకురాలేదని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ బిల్లును రేపే ప్రవేశపెట్టండి...అందరం కలిసి బిల్లును పాస్‌ చేయిద్దామని ఖర్గే అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి బిల్లుకు మోది క్యాబినెట్‌ బుధవారమే ఆమోదం తెలిపిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెడతామని హోంమంత్రి పేర్కొన్నారు. 

20:46 - April 16, 2018

హైదరాబాద్ : మక్కామసీదు కేసులో తీర్పు ఇచ్చిన జడ్జి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపారు. 

 

14:32 - December 27, 2017
16:11 - December 15, 2017

కరీంనగర్ : జిల్లా కేంద్రంలో ఓ పోలీస్ అధికారి ఓవరాక్షన్ చేశాడు. డ్యూటీ అనంతరం సిబ్బంది ఆ అధికారి వేధిస్తున్నాడు. స్థానికి టై టౌన్ పోలీస్ స్టేషన్ చేస్తున్న కానిస్టేబుల్ తిరుపతి డ్యూటీ అయ్యాక ఇంటికెళ్లాడు కానీ అదే స్టేషన్ లో ఏఎస్ఐ గా చేస్తున్న పాషా ఉన్నపళంగా స్టేషన్ రావాలని హుకుం జారీ చేయడంతో తిరుపతి లూంగీతోనే పోలీస్ స్టేషన్ వచ్చారు. పాషాపై కిందిస్థాయి సిబ్బంది వేధిస్తున్నారని ఆరోపణాలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

07:51 - July 16, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రు ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప అన్నారు. గరగపర్రులో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. గరగర్రులో మంత్రి పర్యటించారు. అక్కడ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. కొందరు కావాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని అలాంటి వారి మాటలు నమ్మవద్దని చినరాజప్ప చెప్పారు. ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తామని చినరాజప్ప హామీ ఇచ్చారు. 

 

09:43 - July 11, 2017

హైదరాబాద్ : హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. పోతురాజులతో కలిసి చిందేశారు. సికింద్రాబాద్ ఆదయ్య నగర్‌ నుంచి మంత్రి తలసాని కుటుంబ సభ్యులు.. ఫలహార బండి ఏర్పాటు చేయడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. ఫలహార బండి కార్యక్రమంలో మంత్రులు నాయిని, మహేందర్‌ రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రత్యేక పూజకు హాజరయ్యారు. ప్రత్యేక లైటింగ్‌తో పాటు విభిన్న రూపాల దేవతా ప్రతిమలు ఆకర్షణగా నిలిచాయి. ఉదయం వరకు ఫలహార బండి ఊరేగింపు కొనసాగింది. మంత్రి తలసానితో పాటు ఆయన కుమారుడు సాయి వెంట ఉండి.. బండి వద్ద ఎటువంటి సంఘటనలు జరగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

 

15:58 - July 8, 2017

గుంటూరు : ఎమ్మార్పీఎస్ ఆందోళన ఘటనలో ఎంతమంది ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు ఏపీ డీజీపి నండూరి సాంబశివరావు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఎమ్మార్పీఎస్ కురుక్షేత్ర సభ విధ్వంస ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు డిజిపి సాంబశివరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సభ నిర్వహణకు అనుమతి లేకపోయినా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు చేసిన ఆందోళనపై చంద్రబాబు సీరియస్ అయినట్లు డిజిపి చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేశామని ..శాంతి భద్రతల విషయంలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని డిజిపి సాంబశివరావు అన్నారు. 

15:17 - July 7, 2017

హైదరాబాద్‌ : నగరంలో బోనాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బోనాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు మంత్రులు, కార్పొరేటర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి గుడికి ప్రభుత్వ నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కార్పొరేటర్లకు సూచించారు. రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి గుడికి నిధులను కేటాయిస్తామని తెలిపారు. బోనాల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.

 

14:48 - June 3, 2017

ఢిల్లీ : జమ్మూక‌శ్మీర్‌లో శాంతి భద్రతల ప‌రిస్థితి మెరుగైందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ తర్వాత కశ్మీర్‌లోకి ఉగ్రవాద చొరబాట్లు 45 శాతం తగ్గినట్లు ఆయన వెల్లడించారు. కేంద్రంలో మోది ప్రభుత్వం అధికారం చేపట్టి మూడేళ్లు అయిన సందర్భంగా హోంశాఖ పనితీరుపై రాజ్‌నాథ్‌సింగ్‌ మీడియాతో మాట్లాడారు. 2014-2017 మ‌ధ్య క‌శ్మీర్‌లో సుమారు 368 మంది ఉగ్రవాదుల‌ను భద్రతాదళాలు హ‌త‌మార్చినట్లు ఆయ‌న చెప్పారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుకూలంగా పనిచేస్తున్న 90 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. భార‌త్‌లో ముస్లింల జ‌నాభా ఎక్కువే ఉన్నా, ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ మాత్రం దేశంలో త‌మ ప‌ట్టును సాధించ‌లేక‌పోయింద‌న్నారు. వామ‌ప‌క్ష తీవ్రవాదుల‌ను కూడా 60 శాతం నిర్మూలించిన‌ట్లు...మావోయిస్టుల హింసాత్మక ఘటనలు 25 శాతం తగ్గినట్లు హోంమంత్రి తెలిపారు. దేశ భద్రతలో చాలా మార్పు వచ్చిందన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - home minister