home remedies

15:56 - August 2, 2018

అధిక బరువు తగ్గేంచుకునేందుకు మన చాలా చిట్కాలు పాటిస్తుంటాం. బరువు తగ్గించుకునేందుకు ఎవరు ఏ చిట్కా చెబితే అది పాటిస్తుంటాం. ఏ ఫుడ్ తినమని ప్రిఫర్ చేస్తే అవే తింటుంటాం. ఉదయాన్నే గోరు వెచ్చటి నీటితో తేనెను కలిపి తీసుకుంటే..ఇంకొందరు అన్నం తినడం మానేసి కేవలం పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటుంటారు. అయితే కేవలం పండ్లను జ్యూస్ లుగా మార్చి ఎక్కువ ద్రవంగా తయారు చేసిన వాటిని తాగినంత మాత్రాన బరువు తగ్గొచ్చా? అన్న ప్రశ్నకు డైటీషియన్లు అడిగితే కాదనే సమాధానమిస్తున్నారు. దీనివల్ల బరువు తగ్గకపోగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ద్రవ పదార్ధాలతో ఆరోగ్యంపై ప్రభావం..
ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏక్టివ్ గా పనిచేసేందుకు అవసరమైన శక్తి 'ఘన ఆహారం' వల్లే లభిస్తుందన్నది నిపుణులు చెబుతుఆన్నారు. అంతేతప్ప కేవలం జ్యూస్ లు, ఇతర ద్రవ పదార్ధాల వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందకుంటాపోతాయంటున్నారు. అలా చేస్తే సాయంత్రం అయ్యేసరికి అలసిపోయి నీరసించిపోతారట. అంతేకాదు ఇలా చేస్తే దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం వుంటుందంటున్నారు.

ఘనాహారంతోనే ప్రొటీన్లు, మిటమిన్లు..
ఆరోగ్యంగా ఉండేందుకు శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు, కార్పొహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా అవసరం. ఇవి ద్రవ పదార్ధాలలో అంటే పండ్ల రసాలలో లభించవు. దీంతో బీపీ తో పాటు షుగర్ స్థాయిలో పలు మార్పులు చోటుచేసుకుని జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం వంటి అనర్ధాలు జరుగుతాయట.

ఇరిటేషన్స్ తో వచ్చే ప్రమాదం..
కేవలం ఆరోగ్యమే కాకుండా..వ్యక్తిగత, వృత్తి జీవితం కూడా దీనివల్ల తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఎందుకంటే ద్రవాహారం తీసుకున్నవారిలో శరీరానికి తగిన శక్తి లభించక అలసట వచ్చేస్తుంది. దీంతో ఏ పని మీదా దృష్టి పెట్టలేకపోవడం, ప్రతి చిన్నవిషయానికి కోపంతో గట్టిగా అరవడం వంటి ఇరిటేషన్స్ కు గురై బీపీ వచ్చే ప్రమాదం వుంటుంది. దీంతో ఉద్యోగుల్లో తీటో ఉద్యోగస్తులతోను, యాజమాన్యంతోను మనస్పర్థలు వచ్చి వృత్తిపరమైన జీవితం దెబ్బతింటుంది. రోజుకు 2,500 కేలరీల ఘనాహారం తీసుకోవాలని నిపుణులు సలహా.

శరీరానికి సమతుల ఆహారం...వ్యాయామం
మన శరీరానికి రోజుకు సగటున 2,500 కేలరీల శక్తి అవసరం పడుతుంది. అయితే ఈ జ్యూస్ లతో కేవలం 800 నుంచి 1200 కేలరీలు మాత్రమే లభిస్తాయి. తగినన్ని కేలరీలు లభించకుంటే శరీరంలో జీవక్రియ నెమ్మదించడం ద్వారా నిస్తేజం అలవడిపోతుంది. జ్యూస్ ల ద్వారా బరువు తగ్గుతారనటానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డైటీషియన్లు చెబుతున్నారు. ఆకుకూరలు, పండ్లు, పీచు పదార్థాలు సమపాళ్లలో తింటూ తగిన వ్యాయామం చేయడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. పైగా ఈ విధానంలో ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని నిపుణులు హామీ ఇస్తున్నారు.

13:27 - February 15, 2018

ఇంట్లో వంటిల్లు అత్యంత కీలకం. ఈ గదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది. లేనిపక్షంలో అనారోగ్యాలు దరి చేసే అవకాశం ఉంది. వంటింట్లో బొద్దింకలు మాయమవ్వాలంటే కొద్దిగా బేరిక్ పౌడర్ ను వంటింటి మూలలో ఉంచాలి. ఉడికించిన బంగాళాదుంపలను ఎగ్ స్లైసర్ తో కోస్తే ముక్కలు చక్కగా వస్తాయి. పుదీనా పచ్చడి చేసే సమయంలో కొద్దిగా పెరుగు కలిపితే రంగు..రుచి బాగుంటాయి. మెక్రో ఓవెన్ లో దుర్వాసన రాకుండా బేకింగ్ సోడా ముంచిన స్పాంజిని వాడి చూడండి. 

13:25 - February 15, 2018

ఉల్లిపాయలను మెత్తగా నూరి ఆ ముద్దను నుదుటి మీద పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల తలనొప్ని నుండి ఉపశమనం పొందుతారు.

ఇంగువ జీర్ణశక్తికి ఎంతగానే ఉపయోగపడుతుంది. భోజనం చేసిన అనంతరం చిటికెడు ఇంగువ..చిటికెడు ఉప్పును మజ్జిగలో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆహారం జీర్ణమవుతుంది.

కొద్ది నిమ్మరసంలో కాస్త అల్లం రసం కలుపుకుని తాగి చూడండి. ఇలా చేయడం వల్ల దగ్గు నుండి ఉపశమనం పొందుతుంది. ఇలా రోజుకి రెండు..మూడు సార్లు తాగితే ఫలితం ఉంటుంది.

అల్లం ముక్కను నిప్పులో మీద కాల్చి తింటే వికారం తగ్గే అవకాశం ఉంది. 

08:23 - November 10, 2017

తామర సమస్య ఎదుర్కొంటున్న వారు వేపాకు రసం కొబ్బరి నూనెలో వేడి చేసి రాయాలి.

వెల్లుల్లిపాయ, ఉప్పు కలిపి నూరాలి. ఈ ముద్దను కట్టుకొంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి.

గొంతు బొంగురుగా ఉన్న సమయంలో మిర్యాలపొడిని వేడి వేడి పాలలో వేసి తాగాలి.

గొంతు నొప్పి ఉంటే మిర్యాల పొడి..శొంఠి చూర్ణాన్ని తేనెలో కలుపుకుని తీసుకోవాలి. జ్వరంతో బాధ పడుతున్న వారు పైనాపిల్ రసంలో కాస్త తేనె కలుపుకుని తాగాలి.

అరకప్పు పైనాపిల్ రసంలో టీ స్పూన్ ఉసిరి గింజలు..నేరేడు గింజల పొడి కలిపి తీసుకుంటే మధుమేహం తగ్గుతుంది.

కడుపునొప్పి..దగ్గు ఉంటే వాము చక్కటి పరిష్కారం చూపుతుంది. వాములో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

బెల్లంతో శొంఠి పొడి కలిపి భోజనానికి ముందు తింటే అజీర్ణం పోతుంది.

ఉప్పు నీళ్లు తాగినా అజీర్ణం దూరమౌతుంది.

ఎర్రకణాల సంఖ్య పెరగాలంటే చిలకడదుంప తీసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి.

బార్లీ నీళ్లు తాగితే కడుపులో మంట..అసిడిటీ..మలబద్దకం వంటి సమస్యలు దూరమౌతాయి.

బార్లీ నీళ్లు తీసుకొంటే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. 

13:24 - July 31, 2017

గొంతులో గర..గర.. హాయిగా నిద్రపోతున్న వేళ దగ్గు వస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. చిరాకు తెప్పించడమే కాకుండా రాత్రంతా నిద్ర లేకుండా చేస్తుంది. దీనితో తరచూ వైద్యులు దగ్గరకు పరుగెడుతూ వారు ఇచ్చిన మందులను వేసుకుంటుంటారు. తాగే నీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇంట్లోనో దొరికే వస్తువులతో దగ్గుకు చెక్ పెట్టవచ్చు. పావు కప్పు గ్లిజరిన్ లో పావు కప్పు తేనె కలపండి. అందులోనే పావు కప్పు నిమ్మసరం కూడా కలిపేయండి. అన్నింటినీ బాగా కలిపిన అనంతరం ఈ మిశ్రమాన్ని ఒక జార్ లో నిల్వ ఉంచుకోవాలి. ఒక టీ స్పూన్ మోతాదులో రోజంతా తరచూ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దగ్గు సమస్య త్వరగా తగ్గే అవకాశాలున్నాయి. 

16:11 - July 20, 2017

వంట గది..మహిళలు ఎక్కువ సమయం ఇక్కడనే కేటాయిస్తుంటారు. ఉదయం..మధ్యాహ్నం..రాత్రి సమయాల్లో ఇంటి వారికి కావాల్సిన వంటకాలు మహిళలు చేస్తుంటారు. వంట చేసే సమయాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంటారు. వంట గది శుభ్రంగా ఉంచుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు. వంటగది..వంటల్లో నెలకొనే సమస్యల పరిష్కారానికి కొన్ని చిట్కాలు...

 • వంటగదిలో బొద్దింకలు..చీమలు ఎక్కువగా తిరుగుతూ ఇబ్బందులు పెడుతుంటాయి. బిర్యానీ ఆకును పొడి చేసి బొద్దింకలు తిరిగే చోట చల్లి చూడండి.
 • ఒక దోసకాయను ముక్కలుగా తిరిగి చీమలు తిరిగే చోట పెట్టి చూడండి.
 • వంట చేసే సమయాల్లో చేతులు మరకలవుతుంటాయి. మరకలు కాకుండా ఉండాలంటే ఆలుగడ్డ ముక్కలతో రుద్దాలి.
 • చెక్కతో చేసిన వంట సామాగ్రీ వాసన వస్తుంటాయి. ఇలా రాకుండా ఉండాలంటే వెనిగర్ కలిపిన నీటిలో వాటిని ఉంచాలి.
 • చపాతిలు మృదువుగా రావాలంటే పిండి కలిపే సమయంలో ఉడికిన బంగాళ దుంప కలపండి.
 • చపాతి పిండిలో పాలు లేదా గోరువెచ్చని నీళ్లు కలిపి ఓ అరగంట..గంట పాటు నాననబెడితే చపాతీలు మృదువుగా వస్తాయి.
 • కూరల్లో మసాలా ఎక్కువైతే రెండు లేదా మూడు టమాటాలను ఉడికించి అందులో కలపండి. మసాలా ఘాటు తగ్గి మంచి రుచిగా వుంటుంది.
 • పచ్చి బటానీలు రంగు మారకుండా ఉండాలంటే వాటిని ఉడికించే సమయంలో చిటికెడు పంచదార వేయాలి.
 • కూరలో ఉప్పు ఎక్కువయిందనుకోండి అందులో కొద్దిగా బియ్యం పిండి కలపాలి.
 • దోశల పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండి కలిపి వేసుకుంటే దోశలు రుచిగా వస్తాయి.
 • రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దితే కొత్త వాటిలా మెరిసిపోతాయి.
 • పెనం నల్లగా తయ్యరైతే దానిమీద సబ్బునీళ్ళు పోసి సన్నటి సెగ మీద ఉంచి చల్లారాక రుద్దితే శుభ్రపడుతుంది.
 • పచ్చి మిర్చికి గాట్లు పెడితే నూనెలో వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి.
15:53 - July 12, 2017

కొంతమంది కడుపు ఉబ్బరంగా ఉండడం అనిపిస్తుంటుంది. ఈ సమయాల్లో ఏవో మందులు వేసుకుని సరిపుచ్చుకుంటుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే కడుపు ఉబ్బరం సమస్య నుండి బయటపడొచ్చు.
పిప్పళ్లు బాగా దంచి చూర్ణం వేసి దానిలో అరస్పూన్ చూర్ణానికి ఒక స్పూన్ నూనె కలిపి రోజు మూడు పూటలా వాడాలి.
జీలకర్రను నీటిలో వేసి రసం తీయాలి. ఆ రసాన్ని ప్రతి రోజూ మూడుపూటలా ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి.
మారేడు ఆకుల రసం రెండు స్పూన్ల తీసుకోవాలి. అందులో నాలుగు మిరియాలు చూర్ణం వేసి కలిపి తాగితే సమస్య తీరుతుంది.
పసుపు కొమ్మును ఒక కప్పు పాలలో వేసి దానిని బాగా మరగపెట్టాలి. దీనిని చల్లార్చి వడగట్టి ఆ పాలను ఉదయం..సాయంత్రం తాగాలి.
ఒక గ్లాసు పాలు తీసుకుని అందులో కొంచెం నేల ఉసిరి ఆకులు వేసి బాగా మరిగించాలి. ఆ పాలను వడగట్టి తాగాలి.
పచ్చి కాకరకాయ రసం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక స్పూన్‌ చొప్పున తీసుకోవాలి.

15:59 - June 20, 2016

చర్మ సమస్యలు..ఈ సమస్య పరిష్కారం కోసం డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తుంటారు. చర్మతత్వాన్ని బట్టి వాడాల్సిన ఉత్పత్తుల కోసం మార్కెట్లో వచ్చే వాటిని కొంటూ ప్రయోగాలు చేస్తుంటారు. దీనివల్ల ఉన్న సమస్య పోకుండా ఇతర సమస్యలకు వస్తుంటాయి. ఇలా ఖర్చు చేయబోయే ముందు ఇంటిలోనే దొరికే వస్తువులతో చర్మ సమస్యలు దూరం చేసుకోవచ్చు. అవేంటేమిటో చూద్దాం..
చర్మం నిర్జీవంగా ఉందా ? అయితే బొప్పాయి గుజ్జు, కమలాఫల రసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకోవాలి.
జిడ్డు చర్మం గల వారు సెనగపిండి, చిటికెడు పసుపు, నిమ్మరసం మిశ్రమాలను కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేయాలి. అలాగు తేనె, నిమ్మరసం కలిపిన నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఓట్స్, నీళ్లు కలిపి నలుగుపిండిలా తయారు చేసి వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు పట్టడం తగ్గుతుంది.
ఇక పొడి, సాధారణ చర్మతత్వం గల వారు ఓట్స్, బాదం, పాలమీగడలు కలుపుకోవాలి. దీనిని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల పాటు అలా వదిలేయాలి. తరువాత తక్కువ గాఢత కలిగిన ఫేస్ వాష్ తో ముఖం కడుక్కోవాలి. 

07:21 - January 9, 2016

ఆధునిక జీవన శైలి కారణంగా చాలామందికి ఒత్తుగా ఉండే జుట్టు ఊడిపోయి, మాడు పల్చబడిపోతోంది. దానికి తోడు కొన్ని అపోహల కారణంగా ఉన్న జుట్టును కాస్తా పోగొట్టుకొని బట్టతలతో దర్శనమిస్తుంటారు. జుట్టుకు సంబంధించిన కొన్ని అపోహలు ఏమిటో ఒకసారి చూద్దాం..
చన్నీటి స్నానం చేస్తే జుట్టు మెరుస్తుందని కొందరు రోజూ చన్నీటి స్నానం చేస్తుంటారు. కానీ తరచూ చన్నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తే మంచిది.
జట్టు దృఢంగా ఉండాలంటే ఎప్పుడూ ఒకే షాంపూ వాడకూడదని చాలామంది అనుకుంటుంటారు. నెలకోసారి షాంపూలను మార్చుతుంటారు. కానీ ఇందులో నిజం లేదు. జుట్టు ఆరోగ్యానికి ఇలా షాంపూలను మార్చుకోవడంతో ఎలాంటి సంబంధం ఉండదు. నిజానికి జుట్టు తత్వాన్ని బట్టి ఒకే షాంపూను వాడితే సరిపోతుంది.
ఎంత నురుగ వస్తే అంత మంచిదని, తలకు కనీసం రెండుసార్లు షాంపూ వాడాలని కొందరు అపోహపడుతుంటారు. ఇందులోనూ నిజం లేదు. జుట్టుకున్న మురికి ఒదిలిపోయిందని అనుకుంటే ఒక్కసారి షాంపూను వాడేసి, వదిలేస్తే సరిపోతుంది. నురగ బాగా రావాలని ఎక్కువ సార్లు షాంపూను తలకు పట్టిస్తే జుట్టుకు సమస్య తెచ్చిపెడుతుంది. షాంపూల్లో రసాయనాలు ఉండటం వల్ల జుట్టు పాడయ్యే అవకాశాలు లేకపోలేదు. అవకాశం ఉన్నంత వరకూ షాంపూలకు దూరంగా ఉండాలి.
ప్రకృతిలో దొరికే సహజమైన కుంకుడు, శీకాకాయ రసం తలస్నానానికి వాడటం ఉత్తమం.

09:30 - November 13, 2015

ప్రకృతి అందించిన ఆరోగ్యవరాలు… ఆకుకూరలు. ఇవి చేసే అద్భుతాలు అంతాయింతా కాదు. శరీరానికి కావలసిన అనేక రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లను అందిస్తూ… నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఈ కోవకు చెందిందే పుదీనా. ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన వాసనతో ఉంటుంది. ప్రయోగానంతరం చల్లదనాన్ని ప్రసాదిస్తుంది. దీని శాస్త్రీయనామం మిన్‌థా లామియేసి. ఇది మెంథా స్పైకాటా జాతికి చెందిన మొక్క. సంస్కృతంలో పూతిహ అంటారు. పూతి అంటే వాసన చూసేది అని అర్ధం. తెలుగులో పుదీనా అనీ, ఇంగ్లీష్‌లో మింట్‌ అని, లాటిన్‌లో మెంతా పైపరేటా అనీ పిలుస్తారు. మంచి వన్నె గల ఆకుపచ్చని రంగులో ఉండి, సంవత్సరమంతా ఆకుపచ్చ గానే ఉంటుంది.

ఆరోగ్యానికి ఇలా.....

పుదీనా ఆకుల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచే విన్తమిన్ ఎ , విటమిన్ సి గుణాలు అధికం. పొట్ట నొప్పిని తగ్గించి జీర్ణ వ్యవస్ధను మెరుగుపరుస్తుంది. పుదీనా చాయ్ తాగితే, మలబద్ధకం పోయి, పొట్ట శుభ్రపడటం, చర్మ సంబంధితమొటిమలు నివారించబడతాయి. పుదీనా ఆకులు చర్మానికి చల్లదనాన్నిచ్చి, చర్మ మంటలను పోగొడతాయి. పుదీనా శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది. పుదీనా ఆకులను పేస్ట్ చేసి వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. చెడుశ్వాస నివారించబడుతుంది. పుదీనా శరీర రక్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న పుదీనా ఆకు ఆరోగ్యం బాగుండాలంటే తప్పక మన వంటకాలలోచేర్చాలి.

Don't Miss

Subscribe to RSS - home remedies