hospitals

14:41 - October 4, 2018

ఢిల్లీ :  ప్రపంచంలోనే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా పేరొందింది. కాలానుగుణంగా ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేకుండా పోతోంది. పాలకుల అవినీతి,అధికారుల దోపిడీ..చిన్నస్థాయి చిరుద్యోగి నుండి పైస్థాయి అధికారి వరకూ లంచం, లంచం, లంచం. లంచంలేదనిదే ఏపని జరగని పరిస్థితి. అక్కడక్కడా నిజాయితీపరులైన అధికారులున్నా వారిని సక్రమంగా వారి విధులను వారు చేసుకోనివ్వలేని పరిస్థితికి దిగజారిపోతున్న నేపథ్యంలో భారతదేశం అవినీతి దేశంగా మారిపోయింది. ప్రజాస్వామ్య దేశమంటే కేవలం ప్రజల ఓట్లదో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవటమే కాదు..ప్రజలకు అన్ని వసతులు..నీతిగా..నిజాయితీగా..పారదర్శకంగా పాలన అందించాల్సిన పాలకులనుండి అంటెండర్ వరకూ అవినీతి కూపంలో భారత్ కూరుకుపోయింది. ఈ వాస్తవాలు ప్రముఖ  పత్రిక సర్వేలో ఫోర్బ్స్ వెల్లడించింది. కానీ మరోపక్క ప్రదాని మోదిపై ఈ పత్రిక సలు కురిపించింది. 
ఆసియా దేశాల్లో మ‌న భారతదేశం ఎక్కువ శాతం అవినీతి జరుగుతోందని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ట్రాన్స్‌ప‌రెన్సీ ఇంట‌ర్నేష‌న‌ల్ త‌న స‌ర్వే నివేదిక‌లో ఈ అంశాన్ని వెల్ల‌డించింది. అవినీతిని రూపుమాపాల‌ని మోడీ ప్ర‌భుత్వం చేస్తున్న ల‌క్ష్యాల‌ను అందుకోవాలంటే ఇంకా ఆ దేశం చాలా ముందుకు వెళ్లాల్సి ఉంద‌ని ఆ నివేదిక పేర్కొన్న‌ది. ఆసియాలో ఉన్న ఫైవ్ మోస్ట్ క‌ర‌ప్ట్ కంట్రీస్ జాబితాను ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. ఆసియా దేశాల్లో లంచాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఆ నివేదికలో తెలిపింది. భార‌త్ త‌ర్వాత వియ‌త్నాం, థాయ్‌లాండ్, పాకిస్థాన్‌, మ‌య‌న్మార్ దేశాలు ఉన్నాయి. భార‌త్‌లో అవినీతి 69 శాతం ఉందని పేర్కొంది. ఆ త‌ర్వాత వియ‌త్నాంలో 65 శాతం లంచాలు ఇస్తేనే ప‌నులు జరుగుతాయని పేర్కొంది. థాయ్‌లాండ్‌లో41 శాతం, పాకిస్థాన్‌లో 40 శాతం, మయన్మార్‌లో 40 శాతం అవినీతి ఉందని పేర్కొంది. భార‌త్‌లో స్కూళ్లు, హాస్పిట‌ళ్లు, ఐడీ డాక్యుమెంట్లు, పోలీసులు, సేవ‌ల రంగాల్లో లంచం మ‌రీ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఆ నివేదిక పేర్కొంది. 

20:40 - April 16, 2018

సంగారెడ్డి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన మగ శిశువును బాత్‌రూంలో వదిలి వెళ్లారు. ఆసుపత్రి సిబ్బంది చూసి సూపరింటెండెంట్‌ పద్మజకు తెలిపారు. అప్పటికే శిశువు మరణించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రామచంద్రాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

17:56 - March 14, 2018

మేడ్చల్‌ : జిల్లాలోని కాప్రా పరిధిలోని తులసి ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. గుండెపోటుతో రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన జమాల్‌ అనే వ్యక్తికి ఆరోగ్య శ్రీ కార్డు రాలేదని వైద్యం చేయడానికి నిరాకరించారు డాక్టర్లు. దీంతో  వైద్యం అందక జమాల్‌ ఆస్పత్రిలోనే మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జమాల్‌ మృతి చెందాడని బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. కోపంతో ఆస్పత్రిలోని అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 

 

07:07 - January 4, 2018

భారతీయ వైద్య మండలి స్థానంలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ తీసుకొచ్చేందుకు కేంద్రం పార్లమెంట్‌లో తీసుకొచ్చిన బిల్లుపై వైద్యులనుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమతోంది. ఇది పేషంట్‌ వ్యతిరేకమైన బిల్లని దీనివల్ల వైద్య విధానానికి ప్రమాదం ఏర్పడుతుందని వారు ఆరోపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇది వైద్య వృత్తికి ప్రయోజనకరమైనదని చెప్తుంది. మరి ఈ బిల్లును వైద్యులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్న అంశంపై టెన్ టివి జనపథంలో జూనియర్‌ వైద్యుల సంఘం నాయకులు శ్రీనివాస్‌, అభిలాష్ లు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:39 - December 9, 2017

హైదరాబాద్ : మీరు పిల్లల్ని స్కూల్స్‌కు పంపుతున్నారా.. చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్తున్నారా... బడా షాపింగ్‌ మాల్‌లో షాపింగ్‌ చేస్తున్నారా.. అయితే మీరు కొంత జాగ్రతగా ఉండాల్సిందే... ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్‌లో చాలామంది ఫైర్‌ సేప్టీ నిబంధనలు పాటించడంలేదు. దీంతో ఏదైనా జరగరానిది జరిగితే.. అంతే సంగతులు.. తాజాగా నగరంలోని చాలా భవనాలు ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని అధికారుల తనిఖీల్లో బయటపడింది. 

హైదరాబాద్‌ నగరంలో హస్పిటల్స్‌, స్కూల్స్‌, షాపింగ్‌ మాల్స్‌లు ఫైర్‌ సేప్టీ నిబంధనలు తుంగలో తొక్కుతున్నాయి. స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్‌ను ఏర్పాటు చేయాలంటే.. ఖచ్చితంగా ఫైర్‌ డిపార్టుమెంట్ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిపికెట్‌ తీసుకోవాలి. కొందరు నిబంధనలు పాటిస్తుండగా.. మరికొన్ని స్కూల్స్‌, హస్పిటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌లకు ఎన్‌ఒసీ ఉన్నా కానీ ఫైర్‌సేప్టీ వైలేషన్స్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఫైర్‌ సేప్టీ పాటించని స్కూల్స్‌, హస్పిటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌లో పొరపాటున అగ్ని ప్రమాదం జరిగితే.. ఆ నష్టం ఎంతో దారుణంగా ఉంటుంది.  

ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో అగ్నిమాపక అధికారులు తనీఖీలు చేపట్టగా అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 130 స్కూల్స్‌, హాస్పిటల్స్‌  ఫైర్‌ నిబంధనలు పాటించడంలేదని తేలింది. దీంతో అధికారులు మొత్తం 82 హస్పిటల్స్‌, విద్యా సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌ యాజమానులపై కేసులు నమోదుచేసి.. జరిమానాలు కూడా విధించారు. 

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 72 హాస్పిటల్స్‌కు ఫైర్ డిపార్టుమెంట్‌ ఎన్‌ఒసీ జారి చేసింది. అందులో ఫైర్‌ సేప్టీ నిబంధనలు పాటించని 21 హాస్పిటల్స్‌కు విచారణ నోటీసులు జారీ చేశారు అధికారులు. అలాగే ఆకస్మిక తనీఖీలు చేప్పటినప్పుడు 16 హాస్పిటల్స్‌ కనీసం ఫైర్‌ రూల్స్‌ కూడా పాటించడంలేదని తేలింది. ఇక ఐదు హాస్పిటల్స్‌ అయితే ప్రతిరోజు ఫైర్‌ సేప్టీ సరిగా ఉందా లేదా అనేది కూడా చెక్‌ చేసుకోవడం లేదు. మూడు హాస్పిటల్స్‌లకు కోర్టు జరిమానాలు కూడా విధించాయి. అలాగే 18 హాస్పిటల్స్‌లపై అధికారులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఒక హాస్పిటల్స్‌ కాదు.... చాలా స్కూల్స్‌ కూడా ఫైర్‌ సేప్టీ నిబంధనలు పాటించడంలేదు. అంతేకాదు... చాలా హాస్పిటల్స్‌, స్కూల్స్‌లకు ఫైర్‌ డిపార్టుమెంట్‌ నుంచి కనీసం ఎన్‌ఒసీ కూడా లేదని అధికారులు గుర్తించారు. షాపింగ్‌ మాల్స్‌, స్కూల్స్‌, హాస్పిటల్స్‌ ఖచ్చితంగా ఫైర్‌ విభాగం నుంచి ఎన్‌ఒసీ తీసుకోవాలి. రెగ్యూలర్‌గా ఫైర్‌ సేప్టీ చెక్‌ చేసుకుని నిబంధనలు పాటించాలి. లేకుంటే కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో అగ్నిమాపక వ్యవస్థపై అవగాహన కలిగేలా  ప్రతి శుక్రవారం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తోంది ఫైర్‌ డిపార్టుమెంట్‌. అగ్నిమాపక ప్రమాదాలను ఎలా నియంత్రించాలనే దానిపై అవగాహన కల్పించటానికి పాఠశాలలు, కళాశాలతోపాటు హాస్పిటల్స్‌లో ప్రతి శుక్రవారం డ్రిల్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

 

 

18:26 - December 3, 2017

గుంటూరు : ప్రపంచంలోనే అత్యున్నత సాంకేతికతతో క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుంటూ ఓమెగా ఆసుపత్రి ఎండీ నాగకిశోర్ పేర్కొన్నారు. నగరంలో 110 పడకల ఆసుపత్రిలో పెట్ స్కాన్, లీనియర్ యాక్సిలేటర్, డిజిటల్ మామోగ్రఫీ, ఎంఆర్ఐ పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో అన్ని విభాగాలను ఒక్కచోట చేర్చి సర్జికల్, మెడికల్ అంకాలజిస్టుల పర్యవేక్షణలో అత్తుమ శిక్షణ అందించడం జరుగుతోందని, క్యాన్సర్ చికత్సలో రెండో స్థానంలో ఓమెగా ఉందని ఆసుపత్రి సీఈవో శ్రీధర్ పేర్కొన్నారు. 

14:38 - October 23, 2017

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సెక్యూర్టీ గార్డు, ఆయమ్మ, రైటర్ తదితర ఉద్యోగాలు ఇప్పిస్తామని కేటుగాళ్లు మోసగానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో పనిచేసే హెల్త్ ఇన్స్ పెక్టర్ రవికి మధ్యవర్తుల ద్వారా లక్షల రూపాయలు చెల్లించామని బాధితులు పేర్కొంటున్నారు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో వారంతా గాంధీ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మధ్యవర్తులు లావణ్య..కరుణాకర్ దంపతులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

16:27 - August 21, 2017

కృష్ణా : ఇప్పటి వరకు దొంగలు, బ్లేడ్‌ బ్యాచ్‌ల అరాచకాలతో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్న విజయవాడ వాసులను మరో సమస్య వేధిస్తోంది. బెజవాడలో విషజ్వరాలు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. కాలనీలకు కాలనీలు విషజ్వరాలతో అల్లాడుతున్నాయి. విజయవాడలో రోజురోజుకీ సమస్యలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. రోజూ కష్టపడితే గాని పూట గడవని పరిస్థితిలో ఉన్న ప్రజలను కరకట్ట ప్రాంతాల నుండి సొంత ఇళ్లు ఇస్తామని రాజరాజేశ్వరీపేటకు తరలించారు అధికారులు. సొంత ఇంట్లో సంతోషంగా బతకొచ్చని కలలుగన్న వారికి అడుగడుగునా సమస్యలు సుడిగుండంలా మారాయి. ఆ ప్రాంతం మాస్‌ కల్చర్‌గా మారడం, గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌, మందుబాబుల వీరంగాలతో కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పుడు కొత్తగా మరో సమస్య వచ్చిపడింది. వర్షాకాలం కావడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దీంతో విషజ్వరాలు ప్రబలి ప్రజలు మృత్యవాత పడుతున్నారు. తినడానికే పూట గడవని పరిస్థితిలో ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరగలేక, సర్కారీ మందులతో సరిపెట్టుకుంటున్నారు. అధికారులు సందర్శకుల్లా కాలనీలో తచ్చాడటం తప్పితే ఆపద సమయాల్లో కాలనీ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. పారిశుద్ద్య కార్మికులు అక్కడక్కడ బ్లీచింగ్‌ వేసి చేతులు దులుపుకుంటున్నారు.

చిన్నపిల్లలు అంతుచిక్కని జ్వరాలతో బాధపడుతున్నారు. గతంలో కూడా చాలా మంది చిన్నారులు జ్వరాలతో మృతి చెందినా అధికారుల తీరు మాత్రం మారలేదు. ఇదే కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనారోగ్యంతో మృతి చెందారు. ధనుంజయ, సోనియా దంపతులకు ఉన్న నలుగురు కుమారుల్లో విషజ్వరాల బారిన పడి చనిపోయారు. ఇప్పుడు యశ్వంత్‌ అనే మూడేళ్ల కుమారుడు కూడా జ్వరంతోనే చనిపోవడంతో ఆకుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇది ఒక యశ్వంత్‌ కుటుంబ సభ్యుల రోదనలే కావు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఇదే పరిస్థితి. రోడ్లపై పేరుకుపోయిన చెత్త తీయకపోవడం, శానిటేషన్‌ అధ్వాన్నంగా మారినా పట్టించుకోకపోవడం, జ్వరాలతో అల్లాడుతున్నా ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి గాని, ప్రజాప్రతినిధి గాని స్పందించలేదు.

న్యూ రాజరాజేశ్వరీ పేటలో విషజ్వరాలు ప్రబలుతున్నా అటు అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించడలేదని సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని అంటున్నారు. చనిపోయిన బాలుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిచాలన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాజరాజేశ్వరీపేటలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

16:22 - August 20, 2017

కృష్ణా : విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో విషాదం నెలకొంది. విష జ్వరాల బారినపడి యశ్వంత్‌ అనే మూడేళ్ల బాలుడు చనిపోవడం స్థానికుల హృదయాలను కలచివేస్తోంది. ఐదు రోజులుగా యశ్వంత్‌ జ్వరంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు ప్రైవేట్‌ ఆస్పత్రిలో చూపించారు. అయితే రాత్రి ఒక్కసారిగా జ్వరం పెరగడంతో బాలుడు చనిపోయాడు.  సీపీఎం నేతలు తల్లిదండ్రులను ఓదార్చారు. అనంతరం బాలుడి మృతదేహంతో ఆందోళనకు దిగారు. దోమలు విజృంభిస్తున్నాయని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని సీపీఎం నేత సీహెచ్‌ బాబూరావు ఆరోపించారు. చిన్నారి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించి... అతడి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూడండి. 

 

19:05 - July 8, 2017

అనంతపురం : అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో మంత్రి పరిటాల సునీత తనిఖీ చేపట్టారు. చంటిబిడ్డలతో ఆస్పత్రులకు వచ్చి ఇబ్బందులు పడుతున్న బాలింతలకు అవసరమైన మౌళిక సదుపాయాలు వెంటనే కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - hospitals