human body

12:21 - September 21, 2017

చాలా మంది ముఖం మీద కనపరిచే శ్రద్ధ మెడమీద చూపించరు. మెడ నల్లగా ఉన్నా, ఆపరిశుభ్రంగా ఉన్నా పట్టించుకోరు. ముఖం అందంగా ఉంటే చాలు అని అనుకుంటారు. మెడ శుభ్రం విషయంలో నిర్లక్ష్యంగా ఉండడంతో సమస్య తీవ్రతరమౌతుంది. దీనితో ఇతర మందులు..బ్యూటీషియన్స్ ను సంప్రదిస్తుంటారు. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు..

మెడ మడతలలో మురికి చేరి ఉంటుంది కదా. ఈ మురికి వదిలించుకోవడానికి చాలా సార్లు సబ్బు పెడుతుంటారు. కొద్దిగా పెరుగు తీసుకుని అందులో బియ్యం పిండి వేసి ఆ మిశ్రమాన్ని మెడకు అప్లై చేయండి. అనంతరం గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి.

బేకింగ్ సోడాను నీటిలో మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను మీ మెడ మీద అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత దీన్ని శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్ తో మెడను శుభ్రం చేసుకుంటే మెడ సౌందర్యం అద్భుతంగా మెరుగుపడుతుంది.

మెడ మీద నలుపును నివారించుకోవడం కోసం నిమ్మరసానికి కొద్దిగా పంచదార మిక్స్ చేసి,దీన్ని మెడచుట్టు అప్లై చేసి 15నిముషాల తర్వాత స్ర్కబ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

16:08 - July 17, 2017

చిలకడ దుపం..ఈ దుంపలకు ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. వీటిని మొరంగడ్డ, కందగడ్డ, స్వీట్ పొటాటో అని కూడా అంటారు. పిండి పదార్థాలను, చక్కెరలను కలిగి ఉండే ఈ ఆహార పదార్థం రుచిని కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ ఉండవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చిలగడ దుంపలో శరీరానికి కావల్సిన పోషకపదార్థాలను అందించడంలోనే కాదు, వివిధ రకాలుగా శరీరంలో చేరిన విషపదార్థాలను తొలగించడంలో చిలకడ దుంపలకు ప్రత్యేక స్థానం ఉంది. చిలకడదుంపను తినటానికి ఇష్టపడని వారు ఉండరు అనే చెప్పాలి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, కూరగా వండుకునో.. రకరకాలుగా వీటిని తినొచ్చు. ఇక చిలుగడదుంపలో కార్టినాయిడ్స్‌ మరియు పాలీఫినాల్స్‌ వంటి ఫైటో రసాయనాలు ఉన్నాయి. దుంపలో లభించే పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై ఆధారపడి ఉంటుంది . ఎదిగే పిల్లలకు స్వీట్‌ పొటాటోను ఉడికించి తినిపించడం వల్ల శరీరంలో ఉన్న విషరసాయనాలు సులభంగా బయటకు పంపిస్తుంది. అనేక ఖనిజ లవణాలతో పాటు దుంపలలో పిండి పదార్థాలు(కార్బోహైడ్రేటులు), విటమిన్‌లు(బి,సి,ఇ) ఉన్నాయి.

షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది...

బంగాళాదుంప, కందగడ్డల్లో కన్నా చిలగడదుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువ. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలోని షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది

దండిగా విటమిన్ బీ-6

చిలగడదుంపల్లో విటమిన్‌ బీ6 దండిగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్‌ బీ6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి.

అధికంగా పొటాషియం...

ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి, నీటి మోతాదును నియంత్రిస్తూ అధిక రక్తపోటును తగ్గించటంలో పొటాషియం కీలకపాత్ర పోషిస్తుంది. చిలగడదుంపల్లో పొటాషియం మోతాదూ అధికంగానే ఉంటుంది.

అధికంగా మాంగనీసు

పిండి పదార్థాల జీవక్రియల్లో చాలా కీలమైన మాంగనీసు కూడా వీటిల్లో అధికం. అందువల్ల ఇవి రక్తంలో గ్లూకోజు మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడతాయి. మ్యాంగనీస్ ఎముకల బలానికి బాగా సహాయపడుతుంది.

అధికంగా విటమిన్ ఇ

విటమిన్‌ ఈ మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది. వయస్సు మీద పడనియ్యకుండా చేసి, ముడతలను అడ్డుకుంటుంది.

07:02 - January 9, 2016

సాధారణంగా ఎండకు భయపడి చాలామంది బయటకెళ్ళాలంటే గొడుగుని తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. అది ఏ కాలమైనా సరే. కొద్దిగా ఎండను కూడా తమ శరీరంపై పడనివ్వరు. దాంతో వారి శరీరానికి విటమిన్‌ డి లోపిస్తుంది. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలైనా సూర్యరశ్మి శరీరానికి తగిలేట్లు చూసుకోవాలి. అలా చేయకపోతే శరీరానికి అవసరమైన డి విటమిన్‌ అందదు. మన శరీరానికి విటమిన్‌ డి చాలా ముఖ్యం. మన దేశంలో 90 శాతం మందికి డి విటమిన్‌ లోపం ఉంది. దాంతో ఎముకల బలానికి విటమిన్‌ డి ఆహారాలు వాడుతుంటారు. డి విటమిన్‌ అనేది శరీరానికి కాల్షియం గ్రహించే శక్తినిస్తుంది. సూర్యకాంతి పడక, డి విటమిన్‌ తయారుకాక పోతే శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఫలితంగా శరీరం దృఢత్వాన్ని కోల్పోతుంది. శరీరంలో కాల్షియంకీ భారీకాయానికీ సంబంధముంది. భారీకాయం కలవారు కాల్షియం లోపం కలిగి ఉంటారు. ఏసీ ఉన్న ఆఫీసుల్లో పనిచేసే వారు ఊబకాయం బారినపడటానికి, వివిధ రకాల అనారోగ్యాల బారిన పడటానికి కారణం వారికి ఎండ తగలక పోవడమే. శరీరం మీద ఎంతగా ఎండ పడితే ఆరోగ్యాన్ని అంతగా పొందవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడు జీవశక్తికి నిధినిక్షేపం. అందుకే సూర్యకాంతికి దూరమైనవారు తేజో హీనులు, రోగగ్రస్తులవుతారు. మరి శరీరం మీద తగినంత ఎండ పడటం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
సూర్యరశ్మి వల్ల మరో ఆరోగ్య ప్రయోజనం.. ఉదయం సూర్యోదయం అయ్యే సమయంలో సూర్యరశ్మిలో ఉండటం వల్ల శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో సరిపడా విటమిన్‌ డి ఉన్నట్లైతే అది కొన్ని ప్రమాదకరమైన జబ్బులు అంటే హార్ట్‌ డిసీజ్‌, క్యాన్సర్‌ వంటి వాటిని రక్షణ కలిగిస్తుంది. కాబట్టి ఈ నేచురల్‌ విటమిన్‌ డి ని సన్‌లైట్‌ నుండి పొందవచ్చు.
విటమిన్‌ డి లోపం వల్ల పెద్దపేగు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, ప్రొస్టేటు గ్రంధి క్యాన్సర్‌, క్లోమం క్యాన్సర్ల ముప్పు పెరుగుతోందని అధ్యయనాల్లో కూడా నిరూపణ అయ్యింది. కాబట్టి శరీరంలో విటమిన్‌ డి స్థాయిలు సంపూర్ణంగా ఉండేలా చూసుకోవాలి. 

10:28 - December 15, 2015

మన శరీరంలో పేరుకుపోయే కొవ్వును కరిగించడం ఎలా..? అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. చాలా మంది కొవ్వు కరిగించాలంటే క్లిష్టమైన ఎక్సర్‌సైజులు చేయాలనుకుంటారు. కానీ, ఆహార అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే కొవ్వును కరిగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొవ్వు కరిగించే ఆహారపదార్థాలు..
పండ్లు..
మనం రోజూ తీసుకునే అనేక పండ్లలో కొవ్వును కరిగించే లక్షణాలున్నాయి. రక్తంలోని కొలెస్ట్రాల్‌ నిల్వల్ని తగ్గించడంలో ఆపిల్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్‌ని ఇది తగ్గిస్తుంది. ఇందులో ఎక్కువగా ఉండే మాలిక్‌ ఆమ్లం శరీరంలోని కొవ్వులను కరిగిస్తుంది. ద్రాక్షపండ్ల లోని ఎక్కువగా ఉండే పొటా షియం, బ్లాక్‌ బెర్రీ లోని పెక్టిన్‌ కొలెస్ట్రాల్‌ కరిగిస్తాయి. అంతే కాదు..జామపండ్లలోని విటమిన్‌ సి, భాస్వరం, నికోటిన్‌ ఆమ్లం శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచి, కొలెస్ట్రాల్‌ తగ్గిస్తాయి.
కూరగాయలు..
బీన్స్ లోని లేసిథిన్‌ కొలెస్ట్రాల్‌ కరిగిపోయేలా చేస్తుంది. పొటాషియం, రాగి, భాస్వరం, మాంగనీసు ఫోలిక్‌ ఆమ్లాలు వంకాయలో ఉండే ఆంతో సైనిన్స్, టానిన్స్, గుమ్మడిలో ఎక్కువగా ఉంటే పీచు, కొలెస్ట్రాల్‌ నిల్వల్ని బాగా తగ్గిస్తాయి. పుట్టగొడుగులలోని విటమిన్స్ బి, సి కాల్షియం, మినరల్స్ కొలెస్ట్రాల్‌ నిల్వలు తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. మొక్కజోన్నలలో ఉండే లినోలికాసిడ్‌, ఫోలికాసిడ్‌, విటమిన్‌ ఇ, బి1,బి6, నియాసిన్‌, రిబోఫ్లావిన్‌, బాదంలోని ఒలియిక్‌ ఆమ్లం చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

 

Don't Miss

Subscribe to RSS - human body