Hyderabad City Police

19:51 - August 25, 2018

హైదరాబాద్‌ : నగర షీ టీమ్స్‌ భరోసా కేంద్రంలో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. షీ టీమ్స్‌ కాపాడిన మహిళలు, విద్యార్థులకు నగరవాసులు రాఖీలు కట్టారు. మహిళలు, విద్యార్థినుల భద్రతకు నగర పోలీసులు భరోసా ఇస్తున్నారంటున్న షీ టీమ్స్‌ అదనపు కమిషనర్‌ షికా గోయల్‌తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మహిళలు, బాలికలు స్వేచ్ఛగా తిరిగేలా ధైర్యం కల్పిస్తున్నామని చెప్పారు. మహిళలను ఎవరైనా వేధిస్తుంటే షీ టీమ్స్‌కు ఫోన్‌ చేయొచ్చని తెలిపారు. 

19:47 - August 25, 2018

హైదరాబాద్ : రాఖీ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌ షీ టీమ్స్‌, లీడ్‌ లైఫ్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రక్షా బంధన్‌ వేడుకలు జరిగాయి. నగరంలోని పలు కాలేజీలకు చెందిన విద్యార్థినులు, షీ టీమ్స్‌ కాపాడిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగర పోలీపు కమిషనర్‌ అంజీనీకుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంజనీకుమార్‌తోపాటు షీటీమ్స్‌ అదనుపు పోలీసు కమిషనర్‌ షికా గోయల్‌ రాఖీలు కట్టారు. అన్నా చెల్లళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్‌ ప్రధాన్యతను వివరించారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కోరారు. షీటీమ్స్‌ సేవలను విద్యార్థినులు ప్రశంసించారు. 

10:57 - August 24, 2018

రంగారెడ్డి : మానవత్వం మంటగలిసిపోతుంది. వావివరసలు లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. రక్షించే తండ్రే భక్షించాడు. కాపాడాల్సిన తండ్రే కాటేశాడు. కన్నతండ్రే కామాంధుడయ్యాడు. స్వంత కూతుళ్లపై కన్నేశాడు. జిల్లాలోని శంషాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఏడాదిగా ఇద్దరు కూతుళ్లపై తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. హైమద్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న తండ్రి రాజ్‌బహదూర్‌.. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తల్లి చెబుతోంది. దీనిపై ఎయిర్‌పోర్ట్‌ పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

13:01 - August 21, 2018

హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్టు చేశారు. కమిషనర్ ఆఫీసు ముందు దీక్ష చేసేందుకు రాజాసింగ్ సిద్ధమయ్యారు. ఆవులు, దూడలను వధించడం ఆపాలన్నారు మా కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తేయాలి రాజాసింగ్ కమిషనర్ ఆఫీసు ముందు దీక్షకు బయల్దేరిన రాజాసింగ్ అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

17:10 - August 18, 2018

హైదరాబాద్ : నగరంలో మరో డ్రగ్స్ రాకెట్  కలకలం సృష్టించింది. పబ్స్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇమ్మనియేల్‌ను ఎక్సైజ్‌ శాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

21:25 - August 17, 2018

హైదరాబాద్ : నగర శివారు రాజేంద్రనగర్‌లో జరిగిన హత్య, దోపిడీ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇది తెలిసినవారి పనేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి కోసమే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. ఈ కేసును చేధించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
హత్య, దోపిడీ కేసు 
హైదరాబాద్‌ శివారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఉప్పర్‌పల్లి సిరిమల్లె కాలనీలో జరిగిన హత్య, దోపిడీ కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు... ఇది తెలిసివారి పనేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 
50తులాల బంగారం, రూ.50 లక్షలు దోపిడీ 
హత్యకు గురైన రాజేంద్రకుమార్‌ అగర్వాల్,  తారామణి హైదరాబాద్‌ బేగంబజార్‌లో హోల్‌సేల్‌ కిరాణ దుకాణం నిర్వహించేవారు. వృద్ధాప్యం, ఆపై అనారోగ్యంతో షాపు నిర్వహణ బాధ్యతలను చిన్న కుమారుడు రోహిత్‌కు అప్పగించారు. ఇంటికే పరిమితమైన రాజేంద్రకుమార్‌ అగర్వాల్‌, తారామణిని ముగ్గురు దుండగులు చేతులు, కాళ్లు కట్టివేసి, మూతికి ప్లాస్టర్‌ వేసి దోపిడికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న 50 తులాల బంగారం, 50 లక్షల నగదు దోచుకెళ్లారని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తమాతో బాధపడుతున్న రాజేంద్రకుమార్‌ అగర్వాల్‌ మూతికి ప్లాస్టర్‌ వేయడంతో ఉపిరాడక మృతిచెంది ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇది తెలిసినవారి పనేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
పక్కా ప్రణాళికతో దోపిడీకి పాల్పడ్డారా ? 
ఓ భూమి కొనుగోలు కోసం అగర్వాల్‌ దంపతులు 50 లక్షల నగదు సిద్ధం చేసుకున్నారు. దీనికి సంబంధించిన భేటీ శుక్రవారం జరగాల్సి ఉంది. అయితే అగర్వాల్‌ దంపతులు డబ్బు దాచిన విషయం దోపిడీ దొంగలకు ఎలా తెలిసిందన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. పక్కా ప్రణాళికలతో దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారా... లేక తెలిసినవారే సుపారీ ఇచ్చి దొంగతనానికి పాల్పడే విధంగా చేశారా.. అన్న కోణంలో  కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమావేశాన్ని అగర్వాల్‌ నివాసంలోనే ఏర్పాటు చేయడానికి గల కారణాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. యాభై లక్షల రూపాయల డబ్బు దాచిన విషయం అగ్వర్వాల్‌ దంపతులకు మాత్రమే తెలుసు. కుమారుడు డబ్బు కోసం వేధించడం, ఇంతలోనే హత్య జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కట్టేసిన చేతులను ఎలా విడిపించారు ?  
వృద్ధ దంపతులు ఉంటున్న ఇంట్లోకి దుండగులు ప్రవేశించాలంటే తలుపులు లేదా కిటికీలు బద్దలు కొట్టాలి. ఇంటికి తాళంవేసి ఉంటే పగులగొట్టాలి. కానీ అలాంటిదేమీ లేకుండా ఇతరులు ఇంట్లోకి ప్రవేశించడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగర్వాల్‌ హత్య జరిగిన సమయంలో హతుడి భార్య తారామణి మెడలోని బంగారం, చేతికి ఉన్న బంగారు గాజులు అలాగే ఉన్నాయి. దొంగలైతే తారామణి ఒంటిపై ఉన్న నగలును ఎందుకు దోచుకోలేదన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎలాంటి పెనుగులాట జరగలేదు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దోపిడీ దొంగలైతే అడ్డొచ్చిన వారిని హత్య చేసి  తమపని పూర్తి చేసుకుంటారు. కానీ అలాంటిదేమీ జరగకపోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధ దంపతుల చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడితే.. చోరీ తర్వాత చేతులు ఎలా విడిపించారన్న అంశంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఈ కేసును తర్వలోనే చేధిస్తామని సైబరాబాద్‌ పోలీసులు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ చెబుతున్నారు. దర్యాప్తు కొలిక్కి వస్తేకానీ... ఈ కేసులో మిస్టరీ వీడే అవకాశం లేదు. త్వరలోనే అన్ని వాస్తవాలూ వెలుగు చూస్తాయని పోలీసులు చెబుతున్నారు. 

 

13:17 - July 21, 2018

హైదరాబాద్ : సివిల్ వివాదంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు జోక్యం చేసుకని వేధిస్తున్నారంటూ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్..డీజీపీ..సీపీలకు ఫిర్యాదు చేశారు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని, నోట్ల రద్దు చేసినప్పుడు ఓ వ్యక్తి వద్ద కోటి 65 లక్షలు తీసుకోవడం జరిగిందన్నారు. రూ. 88 లక్షలు వడ్డీ చెల్లించడం జరిగిందని, కానీ ఇంకా డబ్బులు కావాలంటూ వేధింపులు చేయడం ప్రారంభించారన్నారు. ఇతనికి ఐపీఎస్ ఆఫీసర్స్ తో మంచి సంబంధాలున్నాయని..టాస్క్ ఫోర్స్ పోలీసులతో వేధింపులు చేపడుతున్నాడని పేర్కొన్నారు. స్కూల్ నుండి తన కుమార్తెను దింపి వస్తుండగా కిడ్నాప్ చేశారని, రూ. 75 లక్షలు ఇవ్వాలని లేనిపక్షంలో కేసులు బనాయిస్తామని టాస్క్ ఫోర్స్ పోలీసులు వేధించారని ఆరోపించారు. దీనిపై తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:34 - July 11, 2018

హైదరాబాద్ : పరిపూర్ణానంద స్వామిపై బహిష్కరణ వేటు పడింది. పరిపూర్ణానందకు పోలీసులు హైదరాబాద్ నగర బహిష్కరణ విధించారు. పోలీసులు ఆరు నెలలపాటు నగర బహిష్కరణ విధించారు. మూడు రోజుల గృహనిర్బంధం అనంతరం పోలీసులు పరిపూర్ణానందను నగరం నుంచి తరలించారు. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున పరిపూర్ణానందను తరలించారు. ప్రత్యేక వాహనంలో ఓఆర్ ఆర్ మీదుగా ఆయన్ను తరలించారు. పరిపూర్ణానంద స్వస్థలం కాకినాడకు తరలించినట్టు సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

19:37 - July 10, 2018

హైదరాబాద్ : కత్తి మహేష్‌పై విధించిన నగర బహిష్కరణను డీజీపీ వెంటనే ఎత్తివేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ డిమాండ్‌ చేశారు. ఇది నగర బహిష్కరణ కాదని.. కుల బహిష్కరణగానే తాము భావిస్తున్నామన్నారు. కత్తి మహేష్‌ వ్యాఖ్యలు భావ ప్రకటన స్వేచ్చను అధిగమించినట్లయితే... దళిత, గిరిజనులను అవమానిస్తూ వ్యాఖ్యానించిన వారిపై డీజీపీ చర్యలు తీసుకోగలరా ? అని మందకృష్ణ ప్రశ్నించారు. ఇక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కోసం ఆగస్టు 8న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో సింహగర్జన నిర్వహించనున్నట్లు మందకృష్ణ తెలిపారు. 

12:02 - July 10, 2018

హైదరాబాద్‌ : నగరంలో పరిపూర్ణానంద స్వామి గృహనిర్భందం కొనసాగుతూనే ఉంది. నిన్నటి పరిణామాల తర్వాత పోలీసు బందోబస్తును ఇంకా పెంచారు. పరిపూర్ణానంద ఇంటి పరిసరాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మీడియాపై కూడా ఆంక్షలు అమలు చేస్తున్నారు. బారికేడ్లు దాటి లోపలికి వస్తే.. అరెస్టు చేస్తామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నిన్నటి పరిణామాల నేపథ్యంలో పరిపూర్ణానంద సహా పాతిక మందిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - Hyderabad City Police